ఫైర్‌బ్రాండ్‌ల నెలవుగా మారిన కృష్ణాజిల్లా ?

Publish Date:Jul 30, 2012

Advertisement

రాజకీయాల్లో ఒకరిని ఒకరు విమర్శించుకోవటం పరిపాటే. ఈ విమర్శల్లో రాటుదేలిన కృష్ణాజిల్లా నేతలు వార్తల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అటువంటి వారి కోవలో ఎక్కువకాలం రాజ్యమేలినది ఎంపి లగడపాటి రాజగోపాల్‌. ఈయన మాట్లాడటమే ఎదుటివారిని కదిలించేసి వారి నుంచి ఊహించని రియాక్షన్‌ కూడా వచ్చేస్తుంటుంది. ఆఖరికి ఈయన తీసుకునే నిర్ణయాలు కూడా ఎదుటివారిని తక్కువ చేయాలనే కసిగా ఉంటాయని ప్రచారం. ఈయన్ని దూషించని తెలంగాణా నేత లేరంటే అతిశయోక్తి కాదు.


 

 ఫైర్‌బ్రాండ్‌గా ఈయన తరువాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమ కూడా జాబితాలో చేరారు. ఉమ ఇటీవలే గుడివాడ ఎమ్మెల్యే ఆళ్ల నానిని టిడిపి సస్పెండ్‌ చేసినప్పుడు ఉమ భయంకరంగా ఫైర్‌ అయ్యారు. అయితే గురవింద గింజ సామెతలా తన తమ్ముడు టిడిపిని కాదని వై.కా.పా.లో చేరిన విషయాన్ని మరిచారు. అప్పుడు నాని ఆయనకు ఆ విషయాన్ని గుర్తిచేశారు. దీంతో తప్పనిసరిగా తగ్గాల్సివచ్చింది.

 


తరువాత తాజాగా ఉమ ఎంపి లగడపాటిని అసమర్థుడంటూ ఫైరయ్యారు. నీటివిడుదల విషయంలో కృష్ణా రైతాంగానికి జరిగిన అన్యాయం గురించి పోరాటం చేస్తామంటూనే ఉమ తన మాటల తూటాలను లగడపాటికి ఎక్కుపెట్టారు. విజయవాడ నగరాభివృద్థి  చేసానంటూ లగడపాటి వొట్టి కోతలు కోస్తున్నారని ఉమ అన్నారు. రైల్వేలో తీరని అన్యాయం జరిగిందని, దీనికి లగడపాటి వైఖరే కారణమని ధ్వజమెత్తారు. ఇలా కృష్ణాజిల్లాలో ఇద్దరు ఫైర్‌బ్రాండ్‌లు తలపడుతున్నారు. ఎంపి లగడపాటి దీనిపై ఎలా రియాక్టు అవుతారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By
en-us Political News

  
అవసరానికి ఆదుకుంటుందనే నమ్మకంతో ఓ వ్యక్తి ర్యాపిడో పార్సిల్ సేవలను ఆశ్రయించాడు.
బిగ్ బ్రదర్ ఆఫీసులో రియల్టర్‌కు ప్రత్యేక ఛాంబర్.. ఒక్క బిల్డర్ కోసం వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తారా?
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయక యువతులను లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్న మరో అక్రమ ఫెర్టిలిటీ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు.  
.గరల్స్ హాస్టల్ ముసుగులో నిర్వహిస్తున్న అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. పక్కాగా అందిన సమాచారంతో హైదరాబాద్ ప్రకాశ్ నగర్ లో అమినీత గరల్స్ హాస్టల్ పై దాడి చేయడంలో అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ గుట్టు రట్లైంది.
పలు ప్రాంతాలలో ఇప్పటికే  రోజూవారీ సరఫరా  నిలిపివేశారు. రోజు విడిచి రోజు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ముందు ముందు ఇది రెండు రోజులు, మూడు రోజులు. వారం రోజులకు కూడా పెరిగే అవకాశం ఉందని జలమండలి అధికారులే ఆఫ్ ది రికార్డ్ చెడుతున్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.