కాంగ్రెస్‌లో ఎవడిగోల వాడిదే

Publish Date:Jul 30, 2012

Advertisement

 రాష్ట్రంలో కాంగ్రెస్‌ నాయకులంతా అంతా ఒకటిగా ఉండాల్సిన సమయంలో ఎవరి దారి వారిది అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శ్రీకాకుళం ఇందిరమ్మబాటలో ఉన్నారు. దేవాదాయ శాఖమంత్రి రామచంద్రయ్య కాపు సంఘంలో మాట్లాడుతూ కాబోయే సిఎం మన చిరంజీవే త్వరలో ప్రజాభీష్టం నెరవేరుతుందంటారు. ఈలోపు గాంధీ భవన్‌లో  వి. హనుమంతరావు మౌనదీక్షను ప్రారంభించి మేధోమధనం జరగాలని కోరారు.


 

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ మొన్న తూర్పుగోదావరి సక్సెస్‌ఫుల్‌గా  ఇందిరమ్మ బాట పూర్తి చేసి ప్రస్తుతం శ్రీకాకుళంలో పర్యటన చేస్తున్నారు. దానిలో భాగంగానే రోజూ సెక్రటేరియట్‌లోబోరు కొడుతుందని సభాలలో మీద మేకలను పట్టుకొని ఫోటోలు తీయించుకొని పోలాలకెళ్లి నాట్లువేసే ట్రాక్టరు ఎక్కి కాసేపు స్టీరింగు తిప్పి సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో పడుకొని, సహపంక్తి భోజనాలు చేస్తూ పిల్లలతో క్రికెట్‌ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు. అసలు చేయవలసిన నిత్యావసర ధరల కళ్లేనికి ఏంచేస్తున్నారో ఇప్పటికీ ఏం తేల్చలేదు.


 అయినా అఫీసులో కూర్చుని ప్రజారంజకంగా పాలన చేయమని అధికారం ఇస్తే మందిమార్బలం వెంటేసుకొని ఊళ్లూళ్లూ తిరుగుతూ కబుర్లుచెబుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారు.అంతేకాకుండా అధికార పార్టీకి  ప్రతిపక్షానికి తేడా లేకుండా చేస్తున్నారు మన ముఖ్యమంత్రి. ఈలోపు దేవాదాయశాఖమంత్రి రామచంద్రయ్య త్వరలో మనకు చిరంజీవి ముఖ్యమంత్రికాబోతున్నారు అని మరొక అసమ్మదీయ ప్రయత్నానికి తెరలేపారు. మేధోమధనం జరపాల్సిందే అంటూ విహనుమంతరావు  తన నిరసనను మౌనదీక్షద్వారా గాంధీభవన్‌లో సంచలనం చేశారు. కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపాలంటే వారితో మీటింగులు జరపాల్సిందే అని దీని ద్వారా కాంగ్రెస్‌పార్టీలో ఉన్న జగన్‌ కోవర్టులను తొలగించాలని ఆయన డిమాండ్‌చేశారు.



 సీనియర్లు కె కేశవరావు, డియల్‌ రవీంద్ర వంటి వారు ఆయనకు మద్దతు తెలిపారు. విహెచ్‌ మౌనదీక్ష పార్టీకి కీడు చేస్తుందని ముఖ్యమంత్రి అనునాయులు అధిష్టానికి ఆఘమేఘాల మీద లేఖలు పంపారు.అధిష్టానం ఆదేశంతో ఉపముఖ్యమంత్రి రాజనర్శింహ  విహెచ్చ్‌నుబుజ్జగించి మౌనదీక్షనుండి విరమింప చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీకు ఒక సినిమా పేరు గుర్తుకొస్తుంది కదా అదే ఎవడి గోల వాడిది కదా

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అవసరానికి ఆదుకుంటుందనే నమ్మకంతో ఓ వ్యక్తి ర్యాపిడో పార్సిల్ సేవలను ఆశ్రయించాడు.
బిగ్ బ్రదర్ ఆఫీసులో రియల్టర్‌కు ప్రత్యేక ఛాంబర్.. ఒక్క బిల్డర్ కోసం వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తారా?
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయక యువతులను లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్న మరో అక్రమ ఫెర్టిలిటీ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు.  
.గరల్స్ హాస్టల్ ముసుగులో నిర్వహిస్తున్న అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. పక్కాగా అందిన సమాచారంతో హైదరాబాద్ ప్రకాశ్ నగర్ లో అమినీత గరల్స్ హాస్టల్ పై దాడి చేయడంలో అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ గుట్టు రట్లైంది.
పలు ప్రాంతాలలో ఇప్పటికే  రోజూవారీ సరఫరా  నిలిపివేశారు. రోజు విడిచి రోజు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ముందు ముందు ఇది రెండు రోజులు, మూడు రోజులు. వారం రోజులకు కూడా పెరిగే అవకాశం ఉందని జలమండలి అధికారులే ఆఫ్ ది రికార్డ్ చెడుతున్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.