అన్నది నా తల్లిని.. నీ తల్లిని కాదు..హరీశ్‌రావుపై స్పీకర్ ప్రసాద్ ఫైర్..!

Publish Date:Sep 8, 2026

Advertisement

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యలపై తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లిపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ హరీశ్‌రావును ప్రశ్నించారు. ‘‘అన్నది నా తల్లిని.. నీ తల్లిని కాదు’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఆవేశం తనకు ఉండాలని, బీఆర్‌ఎస్‌ నేతలకు కాదని వ్యాఖ్యానించారు. సభలో మహిళా సభ్యులకు తాను, సభ గౌరవం ఇస్తామని స్పీకర్‌ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డితో పాటు కోవా లక్ష్మిపై తనకు గౌరవం ఉందన్నారు. వారికి జరిగిన అసౌకర్యంపై నివేదిక కోరినట్లు తెలిపారు. నివేదిక అందిన వెంటనే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హరీశ్‌రావుకు సమాధానం ఇచ్చారు.

అంతకుముందు హరీశ్‌రావు సభలో ఆవేశంగా మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై దాడి జరిగినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు తీసుకో లేదని ఆరోపించారు. ముగ్గురు బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలపై కేసులు పెట్టారని పేర్కొన్నారు. గౌరవ సభ కాస్తా కౌరవ సభగా మారిందంటూ మండిపడ్డారు.

దీనిపై స్పందించిన స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌.. ‘‘మీరు చెబితే నేను వినట్లేదా? నేను మాట్లాడుతుంటే మీకెందుకంత ఆవేశం.? మీకు కాదు.. ఆవేశం నాకు ఉండాలి. మీ తల్లిని అనలేదు.. నా తల్లిని అన్నారు’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. సభలో మహిళా సభ్యుల గౌరవానికి ఎలాంటి భంగం కలగ కుండా చూస్తామని స్పష్టం చేశారు.

సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలకు సంబంధించిన ఘటనపై నివేదిక ఇవ్వాలని ఇప్పటికే ఆదేశించినట్లు స్పీకర్‌ తెలిపారు. నివేదిక అందిన తర్వాత దాని ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సభా వ్యవహారా ల్లో నిబంధనలకు అనుగు ణంగానే నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎదుట నిన్న చోటుచేసుకున్న పరిణా మాల నేపథ్యంలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం కలిసి పరామర్శించారు. స్పీకర్‌ ఛాంబర్‌లో ఆయనను కలిసిన సీఎం, నిన్నటి ఘటనలపై విచారం వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యు లైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

 

 

 

(Speaker Prasad fires on Harish Rao, Telangana Legislature, Sabitha Indra Reddy, Sunitha Lakshma Reddy, KTR, KCR, BRS Party, CM Revanth reddy, Deputy cm bhatti, Telugu One, Telugu News) 

By
en-us Political News

  
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
మంచి భర్త.. చక్కని సంసారం.. ఆ ప్రేమకు గుర్తుగా ఓ చిన్నారి.. ఇలా సంతోషంగా సాగుతున్న ఆ కుటుంబంలో ఓ చిన్న అపార్థం తీవ్ర విషాదాన్ని నింపింది.
12 మంది అనుమానిత వ్యక్తులపై పోలీసుల ఫోకస్..!
గజ్వేల్‌లో కాంగ్రెస్–బీఆర్‌ఎస్‌ నేతల మధ్య ఘర్షణ..!
కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు   కేసీఆర్ ఫాంహౌస్‌ను ముట్టడికి పిలుపు నిచ్చారు. ఆ పిలుపుమేరకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్నారు.
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య దాదాపు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. నినాదాలతో సభ మార్మోగింది. ఈ నేపథ్యంలో సభను స్పీకర్ పావుగంట సేపు వాయిదా వేశారు.
 తాను స్పీకర్ ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడానంటూ వచ్చిన ఆరోపణలను తాతా మధు ఖండించారు.  తాను స్పీకర్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తన మాటలను అధికార కాంగ్రెస్ పార్టీ వక్రీకరిస్తోందని  ఆరోపించారు.
ఈ వివాదం మరింత ముదిరిపోవడంతో, సీఎం కార్యాలయం తాతా మధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అధికారికంగా విడుదల చేసింది. 
ప్రతిపక్ష గొంతును నొక్కేసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం   భౌతిక దాడులు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.   ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్ష నాయకుల పట్ల పోలీసులు   దురుసుగా, అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ  విధానాలపై  పోరుబాటకు కేసీఆర్ పిలుపు ఇచ్చారు. పార్టీ నేతలు ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలకు సిద్ధం కావాలన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు.  ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు,  రైతాంగ సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. 
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న  వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని   పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి  రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.