'చిట్టి పొట్టి' గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్!

భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ పై భాస్కర్ యాదవ్ దాసరి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం 'చిట్టి పొట్టి' (Chitti Potti). రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అన్న చెల్లెలి అనుబంధంతో నడిచే ఈ సినిమాలో భావోద్వేగాలు, తెలుగుదనం, అనురాగాలు, ఆప్యాయతలు ఉంటాయి. మూడు తరాలలో చెల్లెలుగా, మేనత్తలుగా, బామ్మగా ... ఒక అడబిడ్డకి పుట్టింటి పైన ఉన్న ప్రేమ, మమకారం ను తెలిపే చిత్రం. ప్రతి ఇంట్లో ఉండే ఆడపిల్ల విలువ తెలియజేసే సినిమా ఇది అని చిత్ర బృందం తెలిపింది.

చిట్టి పొట్టి టైటిల్ మరియు మోషన్ పోస్టర్ కు చక్కటి ఆదరణ లభించింది. అలాగే ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర గ్లింప్స్ కు విశేష ఆదరణ లభిస్తోంది. సోషల్ మీడియాలో గ్లిమ్స్ లోని డైలాగ్స్ వైరల్ అవ్వడం విశేషం. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని దర్శక నిర్మాత భాస్కర్ యాదవ్ దాసరి తెలిపారు.

కాంతమ్మ, ఆచారి, హర్ష, సతీష్, రామకృష్ణ, సరళ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీ వెంకట్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మల్హర్బట్ జోషి, ఎడిటర్ గా బాలకృష్ణ బోయ వ్యవహరిస్తున్నారు.