అహం రీబూట్ మూవీ రివ్యూ

 


మూవీ : అహం రీబూట్
నటీనటులు : సుమంత్
ఎడిటింగ్: మురళీకృష్ణ మన్యం
మ్యూజిక్: శ్రీరామ్ మద్దూరి
సినిమాటోగ్రఫీ: వరుణ్ అంకర్ల
నిర్మాతలు: రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు
దర్శకత్వం: ప్రశాంత్ సాగర్
ఓటీటీ : ఆహా


కథ: 

నిల‌య్ (సుమంత్‌) ఓ రేడియో జాకీ. ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌గా గొప్ప పేరు తెచ్చుకోవాల‌ని క‌ల‌లు క‌న్న అత‌డి జీవితాన్ని ఓ యాక్సిడెంట్ మార్చేస్తుంది. ఆట‌కు అత‌డిని దూరం చేస్తుంది. అదే యాక్సిడెంట్ లో నిల‌య్ కార‌ణంగా ఓ అమ్మాయి కూడా చ‌నిపోతుంది. ఆ గిల్టీ ఫీలింగ్ ఎప్పటికీ తనని వెంబడిస్తుంది. ఆ బాధ నుంచి దూరం అయ్యేందుకు రేడియో జాకీ జాబ్‌లో జాయిన్ అవుతాడు. రోజు అత‌డి రేడియో స్టేష‌న్‌కు ఓ అమ్మాయి కాల్ చేస్తుంది. త‌న‌ను ఎవ‌రో కిడ్నాప్ చేసి చీక‌టి రూమ్‌లో బంధించార‌ని చెబుతుంది. తొలుత ఫ్రాంక్ కాల్ అని భావించిన నిల‌య్ ఆమె మాట‌ల‌ను న‌మ్మ‌డు. ఆ అమ్మాయితో జ‌రుగుతోన్న క‌న్వ‌ర్జేష‌న్‌ను లైవ్‌లో పెట్టేస్తాడు. నిల‌య్‌తో ఆ అమ్మాయి మాట్లాడిన‌ మాట‌లు విన్న పోలీసులు ఆమె నిజంగానే కిడ్నాప్ అయ్యింద‌ని ఫిక్స‌వుతారు. ఆ యువ‌తి నుంచి వివ‌రాలు సేక‌రించే బాధ్య‌త‌ను నిల‌య్‌కు అప్ప‌గిస్తారు. ఇంతకీ ఆమెను ఎవ‌రు కిడ్నాప్ చేశారు? ఎక్క‌డ ఉంచార‌నే స‌మాచారాన్ని నిల‌య్ ఎలా సేక‌రించాడు? ఆమెను నిల‌య్ స‌హాయంతో పోలీసులు సేవ్ చేశారా? నిల‌య్ కార‌ణంగా యాక్సిడెంట్‌లో చ‌నిపోయిన అమ్మాయి ఎవ‌రన్నదే మిగతా కథ.

విశ్లేషణ:

సోలో క్యారెక్టర్ తో ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి. హలో మీరా, ఎలోన్, రారా పెనిమిటి లాంటి సినిమాల్లో సింగిల్ క్యారెక్టర్ తో చాలా కష్టంగా గడిచింది. ఈ అహం రీబూట్ కూడా ఒక వీడియో చూడకుండా ఆడియో లాగా వినేయొచ్చు. ఇక సింగిల్ క్యారెక్టర్ కాకుండా మిగిలిన క్యారెక్టర్స్ ని పెట్టి ఇదే థ్రిల్లర్ ని కొనసాగిస్తూ తీస్తే అప్పుడు బాగుండేది. 

సింగిల్ క్యారెక్ట‌ర్ తో థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియ‌న్స్‌ కొంతవరకు ఉంటుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ మరియు క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ బాగున్నాయి. సీన్ కి తగ్గట్టుగా చాలా వేరియేషన్స్ ప్రదర్శించాడు సుమంత్. కొంతవరకు తన యాక్టింగ్ తో నెట్టుకొచ్చాడు హీరో‌.

సినిమా మొత్తంలో కొన్ని కీలక సన్నివేశాలు కూడా ఆకర్షణను పెంచగా, చాలా సన్నివేశాలు చాలా రెగ్యులర్ గా సాగాయి. సపోర్టింగ్ రోల్స్ లేకుండా సినిమా మొత్తం సింగిల్ క్యారెక్టర్ అంటే చూసే ఆడియన్స్ కి కష్టమే.. అందులోను గంటన్నర పాటు ఒకే క్యారెక్టర్ ని చూడటం అంటే సాహసమనే చెప్పాలి. ఈ లోటు సినిమాలో బాగా కనిపించింది. సింగిల్ క్యారెక్ట‌ర్‌తో తెర‌కెక్కిన ప్ర‌యోగాత్మ‌క సినిమాగా ఈ సినిమాకి గుర్తింపు అయితే వస్తుంది గానీ పెద్దగా ఆసక్తికరంగా అనిపించదు.

త‌ప్పు చేశాన‌ని ప‌శ్చాత్తాపంతో ర‌గిలిపోతున్న ఓ ఆర్జే, ఆ అప‌రాధ భావం నుంచి బ‌య‌ట‌ప‌డి ఎలా కొత్త జీవితాన్ని మొద‌లుపెట్టాడు అనే కోణం ఆకట్టుకున్నప్పటికీ, ఆ కోణాన్ని ఆవిష్కరించిన విధానం మాత్రం ఆసక్తికరంగా లేదు. స్క్రిప్టు ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది. ఎడిటింగ్ పర్వాలేదు. మ్యూజిక్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు: 

ఒకే ఒక పాత్రలో సుమంత్ తన నటనతో సినిమా మొత్తం చేయడం అంటే కత్తి మీద సాము లాంటిది‌. అతని నటన ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. 

ఫైనల్ గా : అక్కడక్కడ థ్రిల్ ని పంచే ఈ మూవీని ఓ సారి చూసేయొచ్చు. 


రేటింగ్ :  2.25 / 5

✍️. దాసరి మల్లేశ్