తెలంగాణలో పరిశ్రమలకు పవర్ హాలిడే ఇచ్చారు

 

కరెంటు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాల్లో బుధవారం నుంచి పవర్ హాలిడే ప్రకటించింది. బుధవారం నుంచి వారానికి రెండు రోజులపాటు విద్యుత్ కోతలు విధించనున్నట్టు ట్రాన్స్ కో ఏడీఈ మంగళవారం నాడు ప్రకటించారు. ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో సోమ, మంగళవారాల్లో కరెంట్ కోతలు విధించనున్నారు. పటాన్‌‌చెరు, పాశమైలారం పారిశ్రామికవాడల్లో బుధ, గురువారాల్లో కరెంటు కోతలు విధించనున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయం కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని పారిశ్రామిక వాడల్లో రెండు రోజులపాటు ఉత్పత్తి ఆగిపోతుంది.