ఐఏఎస్ లకు హైకోర్టులో ఎదురుదెబ్బ

ఏపీ పునర్విభజనలో భాగంగా తెలంగాణలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్‌లను కేంద్రం ఏపీకి కేటాయించిన విషయం తెలిసిందే. ఈనెల 9న డివోపిటీ ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీచేసింది.అయితే, తాము తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, ఆమ్రపాలి, రొనాల్డ్ రాస్, సృజనలు క్యాట్‌ను ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి ఊరట దక్కలేదు. డివోపిటీ ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. 

దీంతో  వీరంతా బుధవారం (అక్టోబర్ 16) హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. క్యాట్ తీర్పు పై స్టే ఇవ్వాలని, తెలంగాణలోనే తమను కొనసాగించే విధంగా చూడాలని ఐఏఎస్ అధికారులు తమ పిటిషన్ లో పేర్కొన్నారు.  అధికారులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.ఐఏఎస్‌లు వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు క్యాట్ ఆదేశాలపై స్టే ఇవ్వలేమని స్పస్టం చేసింది. డీపీవోటి ఆదేశాల మేరకు వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది.