జయలలితకు బెయిల్ అసలు ఎందుకివ్వాలి?

 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్టు మొదట్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలు విని ఆమె అభిమానులు పండుగ చేసుకున్నారు. అయితే జయలలితకు కర్నాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయనట్టు తాజాగా తెలిసింది. అక్రమాస్తుల కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న జయలలిత తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆస్తులు సంపాదించారని సీబీఐ కోర్టు న్యాయమూర్తి జాన్ మైకేల్ డి కున్హా చేసిన వ్యాఖ్యలతో కర్ణాటక హైకోర్టు ఏకీభవించింది. అయితే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ మంజూరైనట్టు ఎలక్ట్రానిక్ మీడియా హడావిడిగా కథనాలు ప్రసారం చేసింది. అయితే ఆమెకు షరతులతో కూడా బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అక్రమ ఆస్తుల కేసులో జయలలితకు పడిన శిక్షను రద్దు చేసేందుకు ఎలాంటి ఆధారం లేదని కర్నాటక హైకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో సీబీఐ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా భవానీ సింగ్ వాదించగా, జయలలిత తరపున సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ వాదించారు. జయకు బెయిల్ రాలేదని తాజా వార్త రావడంతో ఆమె అభిమానులు శోకాలు పెడుతున్నారు.