ఫాహద్ పై సుమోటో కేసు..జిల్లా వైద్యాధికారి బీనా కుమారి సీరియస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun)హీరోగా వచ్చిన పుష్ప తో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించిన మలయాళ  నటుడు ఫాహద్ ఫాజిల్( fahadh faasil)నిజానికి  2002 లోనే కైయితుం దూరత్ అనే మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు.హీరోగా మంచి చిత్రాలే చేసాడు.  ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులని  కూడా అందుకున్నాడు. లేటెస్ట్ గా అయన కి సంబంధించిన ఒక న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

ఫాహద్ పై కేరళ మానవహక్కుల సంఘం సుమోటో కేసు నమోదు చేసింది. ఆయన ప్రస్తుతం పింకెలి అనే మూవీ చేస్తున్నాడు. తాజాగా  అంగమలై లోని  ఎర్నాకులం ప్రభుత్వ ఆసుపత్రిలో షూటింగ్  జరిగింది. రాత్రంతా షూటింగ్ జరగడంతో అందులో ఉన్న రోగులంతా చాలా  ఇబ్బంది పడ్డారు. పైగా షూటింగ్ జరుగుతున్నంత సేపు లోపలికి ఎవరని   అనుమతించలేదు. దీంతో అత్యవసర సేవలకి అంతరాయం కలిగింది. ఈ కారణం తోనే సుమోటో కేసు నమోదు అయ్యింది. ఈ విషయంపై జిల్లా వైద్యాధికారి బీనా కుమారి సీరియస్ గా ఉన్నాడు. ఏడు రోజుల్లో పూర్తి విషయం పై వివరణ ఇవ్వాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించాడు.  పర్మిషన్ లేకుండా  షూటింగ్ చేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.

ఫాహద్ రీసెంట్ గా ఆవేశం అనే మూవీతో సోలో హీరోగా భారీ హిట్ ని అందుకున్నాడు. తెలుగులో  డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక  పుష్ప 1 లో కాసేపే మెరిసినా కూడా పార్ట్ 2 లో తన నట విశ్వరూపం చూపించబోతున్నాడని చిత్ర యూనిట్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. నిర్మాతగానూ అద్భుతమైన చిత్రాల్ని నిర్మిస్తు భారీ విజయాల్ని అందుకుంటున్నాడు. ఇటీవల రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించిన ప్రేమలు ఫాహద్ నిర్మించినదే.