హరిహరవీరమల్లు ఓటిటి హక్కులని గౌరవిస్తాం.. ఇరవై ఐదు రోజులని పవన్ మాటిచ్చాడు 

ఓరి సాంబో రాసుకోరా.. ఆ తర్వాత సెంటన్స్ ని కంప్లీట్ చెయ్యకపోయినా అర్దమవుతుంది. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (pawan kalyan)డైలాగ్ అని. ఇప్పుడు ఆ సాంబ ప్లేస్ లో పవన్ ఫ్యాన్స్ చేరారు.  పవన్ తరుపున మేము చెప్తున్నాం రాసుకోండి.

పవన్ అప్ కమింగ్ మూవీస్ లో హరిహరవీరమల్లు (hari hara veeramallu)కూడా ఒకటి. పవన్ నటిస్తున్న మొట్టమొదటి  చారిత్రాత్మక మూవీ. దీంతో  అభిమానుల్లో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని నెలల క్రితం విడుదలైన టీజర్ తో ఆ అంచనాలు ఆకాశాన్ని అంటాయి. పవన్ తో ఖుషి, బంగారం వంటి సినిమాలని  నిర్మించిన ఏఎం రత్నం (am rathnam)నిర్మాత.  తాజాగా ఈయన ప్రేక్షకులతో వీరమల్లు విషయాలని పంచుకున్నాడు. ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు పవన్ వర్క్ చేస్తే సినిమా కంప్లీట్ అవుతుంది. పొలిటికల్ గా  ఉన్న బిజీని దృష్టిలో పెట్టుకొని అగస్ట్  మొదటి వారంలో పవన్ డేట్స్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పాడు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవ్వడంతో పవన్ ఫ్యాన్స్ లో సరికొత్త జోష్ వచ్చినట్లయింది. పైగా ఇంకో సంతోషకరమైన న్యూస్ ఏంటంటే  డిసెంబర్‌లో రిలీజ్ కి   ప్లాన్ చేస్తున్నామని కూడా చెప్పాడు.
 
ఇక వీరమల్లు  ఓటిటి  రైట్స్ ని  ఇచ్చేటప్పుడే ఒప్పందం ప్రకారం అక్టోబర్ లోనే విడుదల చేస్తామని సదరు సంస్థకు మాటిచ్చారు. కానీ కుదరలేదు. దీని పై కూడా ఏ ఎం రత్నం వివరణ ఇచ్చాడు. ఓటిటి హక్కులని  అమెజాన్ ప్రైమ్ కి ఇచ్చామని, వాళ్ళని ఇంకాస్త సమయం  అడిగి డిసెంబర్ లో పక్కాగా విడుదల చేస్తామని  చెప్పాడు. సో ఈ ఇయర్ లోనే వీరమల్లు సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టడం ఖాయం. ఈ ప్రెస్టేజియస్ట్ మూవీకి  జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. క్రిష్ ప్లేస్ లో వచ్చాడనే విషయం అందరకి తెలిసిందే.