టేపుల డీకోడింగ్ ప్రారంభించిన ఫోరెన్సిక్ ల్యాబ్

నోటుకు ఓటు కేసులో ఎన్నో పరిణామాలు చోటుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఎన్నో ఆధారాలు సేకరించారు తెలంగాణ ఏసీబీ అధికారులు. మరోవైపు ఆంధ్రాప్రభుత్వం కూడా తమ ఫోన్లు ట్యాపింగ్ జరిగాయన్న వ్యవహారంపై ఆధారాల కోసం ప్రయత్నిస్త్తోంది. ఇదిలా ఉండగా ఈకేసులో ఎంతో కీలకమైన స్టీఫెన్ సన్ వాంగ్మూలం కూడా ఏసీబీ కోర్టులో నమోదుచేసుకున్నారు. ఆ వాంగ్మూలం శుక్రవారం మధ్యాహ్నం కోర్టుకు కూడా వచ్చింది. ఈ కేసులో భాగంగా రేవంత్ రెడ్డి అరెస్ట్ అప్పుడు తీసిన ఆడియో, వీడియో రికార్డింగులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే.

 

ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన మొత్తం 14 ఆడియో, వీడియో టేపులను డీకోడింగ్ చేసే కీలక ప్రక్రియను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ప్రారంభించింది. ఇప్పుడు ఆడియో, వీడియో టేపులను విడిగా కాపీచేసి వాటిలోని నిజనిజాలు తెలుసుకునేందుకు సిద్ధమయింది. దీనికోసం ప్రత్యేకంగా మూడు బృందాలను ఏర్పాటు చేయగా.. ఈ బృందాలు ఇప్పటికే వాటిని డీకోడింగ్ చేసే పనిని మొదలుపెట్టేశాయి.