హిందీ డైరెక్టర్స్ తెలుగు డైరెక్టర్స్ ని చూసి నేర్చుకోండి

ఒకప్పుడు బాలీవుడ్ సినిమా ప్రేక్షకులకి, మేకర్స్ కి సౌత్ సినిమాలంటే చిన్నచూపు ఉండేది. అందులోను ప్రత్యేకించి తెలుగు సినిమాలంటే కొంచం ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఇందుకు అనేక కారణాలున్నా కూడా   లోకల్ స్టాండెడ్ తో  తెరకెక్కిస్తారనేది వాళ్ళ ప్రధాన నమ్మకం.  ఇప్పుడు ఆ నమ్మకానికి బీటలు వాలింది. వాలడమే  కాదు  ఎప్పుడెప్పుడు తెలుగు సినిమా విడుదల అవుతుందా అని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.

ఎస్.. తెలుగు సినిమా కోసం ఇప్పుడు బాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తుంది. ఒకప్పుడు  బాలీవుడ్ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎదురుచూసేవారు. మూస పద్దతిలో కాకుండా కథ, కధనాలు, టేకింగ్ రెగ్యులర్ చిత్రాలకి బిన్నంగా ఉంటాయని నమ్మే వారు. నమ్మకానికి తగ్గట్టే సినిమాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో మన దర్శకులు చేరారు. బాహుబలి(baahubali)తో   ఆర్ఆర్ఆర్ (rrr) తో జక్కన్న అందుకు బీజం వేసాడు. ఆ రెండు చిత్రాలు బాలీవుడ్ లో ఎంత సంచలన విజయం సాధించాయంటే, చాలా వరకు  ఒరిజినల్ బాలీవుడ్ చిత్రాల కలెక్షన్స్ ని దాటాయి. మేకింగ్, టెక్నాలజీ, నిర్మాణ విలువల్లో కూడా సరికొత్త  ఆవిష్కరణలకి తెరతీసింది.  ఆస్కార్ ని కూడా కొల్లగొట్టి ఇండియా సినిమా అంటే తెలుగు సినిమా కూడా అని నిరూపించింది.  సందీప్ రెడ్డి వంగా కూడా రీసెంట్ గా యానిమల్ (animal)తో రికార్డులు సృష్టించాడు.అప్పటి వరకు వరుస ప్లాప్ ల్లో ఉన్న రణబీర్ ని అంతకు ముందెప్పుడూ ఏ డైరెక్టర్ కూడా ప్రెజెంట్ చెయ్యని విధంగా చేసి బాలీవుడ్ మతుల్ని షాక్ చేసాడు. సందీప్ టేకింగ్ ని చెక్ చెయ్యడానికి ఒకటికి రెండు సార్లు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు.  అంతకు ముందుకు షాహిద్ కపూర్ తో  కబీర్ సింగ్ తోనే  బాలీవుడ్ తన వైపు చూసేలా చేసుకున్నాడు. అంటే కాదు వాళ్ళ అభిమాన దర్శకుడు గా కూడా మారాడు.  బాలీవుడ్  క్రిటిక్స్  పొగడ్తల వర్షం కూడా  కురిపిస్తున్నారు. 

ఇక  బాలీవుడ్ ని  లేటెస్ట్ గా ఒక కుదుపు కుదుపుతున్న మూవీ కల్కి 2898 ఏడి(kalki 2898 ad)ప్రెజంట్ అక్కడి పాత చిత్రాల రికార్డుల బూజు దులిపే  దాంట్లో బిజీగా ఉంది. మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఒక కొత్త లోకంలోకి వెళ్తున్నారు. నిజానికి దర్శకుడు   నాగ్ అశ్విన్ (nag ashwin)పేరు మొన్నటిదాకా ముంబై జనాలకు తెలియదు. కానీ నాలుగు రోజులుగా  కల్కి  ప్రభంజనం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ ప్రభంజనం యొక్క రూపం ఎలా ఉందంటే నాగీ గత చిత్రాలైన  మహానటి, ఎవడే సుబ్రహ్మణ్యం లని కూడా ప్రత్యేకంగా చూస్తున్నారు. అదే విధంగా పుష్ప తో సుకుమార్ కూడా మంచి కిక్ ఇచ్చాడు.దీంతో  పుష్ప 2 (pushpa 2)కోసం ఎదురుచూస్తున్నారు .సినిమా వాయిదా పడటంతో మన కంటే బాలీవుడ్ నే ఎక్కువ బాదపడిందని చెప్పవచ్చు. ఇక తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన అట్లీ అయితే   షారుఖ్ ఖాన్ కి జవాన్ రూపంలో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు.బాడీ లాంగ్వేజ్ పరంగా ఒక కొత్త షారుక్ ని పరిచయం చేసాడు. ఇండియా వైడ్ గా అనేక రికార్డులు కూడా  సృష్టించింది. అదే విధంగా  అట్లీ టేకింగ్ కూడా  మంత్ర ముగ్దుల్ని చేసింది..సల్మాన్ ఖాన్ , రజనీకాంత్ ని కలిపి మల్టీస్టారర్ తీసే ప్రయత్నంలో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. దీంతో బాలీవుడ్ ప్రేక్షకులు తమ దర్శకులకి హీరోని ఎలా ఎలివేట్ చెయ్యాలో, సినిమాని ఎలా తెరకెక్కించాలో  తెలుగు దర్శకులని చూసి నేర్చుకోమని సలహాలు ఇస్తున్నారు.