ఢిల్లీ గ్యాంగ్ రేప్....నన్ను ఉరి తీయండి
posted on Dec 20, 2012 11:35AM
ఢిల్లీ లో ఓ మెడికల్ స్టూడెంట్ ను బస్సులో రేప్ చేయడం, ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో, ఇక నియమాలను తీవ్రతరం చేయాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. ఇలాంటివి ఇక ముందెప్పుడూ జరగకుండా చూస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించారు.
ఇక రాజధానిలోని బస్సుల్లో నల్ల అద్దాలు ఉండకూడదు. అలా ఉంటే, ఆ బస్సులను స్వాదీనపరచుకొంటారు. ఢిల్లీ లో రాత్రి పూట నడిచే బస్సుల్లో లైట్ లు వేసి ఉంచాలి. వాటికి ఫిల్మ్ అంటిన్చిఉంటే దానిని వెంటనే తొలగించాలి. బస్సులను వాటి యజమానుల వద్ద ఉంచాలే తప్ప, డ్రైవర్ ల వద్ద ఉంచకూడదు.
మరో వైపు ఈ కేసును ఢిల్లీ హై కోర్టు సుమోటో గా తీసుకొంది. అ ఘటన జరిగిన బస్సు 40 నిమిషాలపాటు రోడ్డు ఫై తిరుగుతున్నా పోలీసుల కన్నేందుకు పడలేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ బస్సు ఐదు చెక్ పోస్టుల నుండి వెళ్ళిందని, అయినా పోలీసుల కళ్ళు ఈ బస్సు ఫై పడలేదని హై కోర్టు వ్యాఖ్యానించింది.
ఈ ఘటనలో పట్టు బడిన ఓ నిందితుడు తాను తీవ్రమైన తప్పు చేస్సానని తనను ఉరి తీయాలని అన్నారు. ఏది ఎలా ఉన్నా, పోలీసులు ఏ స్థాయిలో చర్యలు తీసుకొంటున్నా, ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉండటం విచారకరం.