విదేశాల నుండి భారతదేశానికి వ్యాప్తి చెందినా భారతీయులు టీ, కాఫీలను గుండెల్లో పెట్టుకున్నారు.  అర్థరాత్రి, ఆపరాత్రి అనే తేడా లేకుండా కాఫీ, టీ లకోసం అర్రులు చాచేవారున్నారు. అయితే వీటిలో కెఫిన్ ఆరోగ్యానికి హానికరం. కానీ ఆయుర్వేదం సూచించే హెర్బల్ టీలు ఆరోగ్యానికి ది బెస్ట్ అని చెప్పవచ్చు. పువ్వులతోనూ, ఆకులతోనూ టీలు చేసుకుని వేడివేడిగా సిప్ చేస్తుంటే కలిగే అనుభూతి, ఆ తరువాత శరీరానికి చేకూరే ఓదార్పు మాటల్లో చెప్పలేనిది. పైపెచ్చు వైద్యుల దగ్గలకు వెళ్లి వేలు పోసి ఖర్చుపెట్టి తగ్గించుకునే ఎన్నో జబ్బులు ఈ టీలతో తగ్గుతాయి. ఇలాంటి పువ్వుల టీలలో ప్రసిద్ది చెందినది చమోమిలే టీ. చామంతి పూల టీ నే చమోమిలె టీ అని అంటారు. అసలు టీ వల్ల కలిగే లాభాలేంటి? ఈ టీ కోసం ఉపయోగించే చామంతులేవి? ఈ టీ ఎప్పుడు తాగితే బెస్ట్ ఫలితాలు ఉంటాయి?పూర్తీగా తెలుసుకుంటే..

చామంతి టీ..

చామంతి టీని చామంతి పువ్వులతో తయారుచేస్తారు. బాగా మరిగించిన నీటిని ఒక కప్పులో వేసి అందులో ఎండబెట్టిన చామంతి పువ్వులను వేస్తారు. దానిమీద మూత పెట్టి 3 నుండి 5 నిమిషాలు అలాగే వదిలేస్తారు. ఇలా చేయడం వల్ల ఎండిన పువ్వులలో సారం నీటిలోకి చేరుతుంది. చామంతి పువ్వుల టీ సిద్దమవుతుంది. ఇది అచ్చం గ్రీన్ టీ తయారు విధంలానే ఉంటుంది కాబట్టి దీన్ని చేసుకోవడం సులభం.అయితే దీనికి సాధారణ చామంతులు పనికిరావు.  రెండు ప్రత్యేక రకాల చామంతులు ఈ టీ కోసం వినియోగిస్తారు. జర్మన్ జాతికి చెందిన చామంతి పూలు, రోమన్ జాతికి చెందిన చామంతులు మాత్రమే టీకి పనికొస్తాయి..

ఎప్పుడు తాగాలి?  

చామంతి పువ్వుల టీ తాగడానికి సరైన సమయం రాత్రి. అన్ని టీలు ఉదయం, సాయంత్రం తాగితే ఈ టీ మాత్రం రాత్రి తాగితే మంచి ఫలితాలు ఇస్తుంది.

చామంతి పువ్వుల టీ తాగితే కలిగే ఫలితాలు..

రాత్రి పూట చామంతి పువ్వుల టీ తాగితే నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి సమస్య ఎక్కువ రోజులు కొనసాగితే అది మానసిక ఒత్తిడి, ఆందోళన, హార్మోన్ల అసమతుల్యత, జ్ఞాపకశక్తి మందగించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. గుండె సంబంధ సమస్యలు, హైపర్ టెన్షన్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. వీటన్నింటికి చామంతి పూల టీ చెక్ పెడుతుంది. రాత్రి పడుకునే ముందు ఈ టీ తాగితే మంచిగా నిద్ర పట్టేలా చేస్తుంది.


చామంతి టీలో యాంటీస్పాస్మోడిక్ లక్షణాలు ఉంటాయి. ఇది నొప్పులు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. నొప్పిని ప్రేరేపించే కారకాలు ఉత్పత్తి కాకుండా చేసి నొప్పులలో ఉపశమనం ఇస్తుంది. కడుపునొప్పి, మహిళలలో నెలసరి నొప్పులు, ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల వచ్చే కడుపు నొప్పి వంటి సమస్యలను కూడా పరిష్కరిస్తుంది.

చామంతి టీ కేవలం టీ మాత్రమే కాదు. ఒక మంచి ఔషదం కూడా. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ప్లేవనాయిడ్లు, ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ టీని క్రమం తప్పకుండా తాగుతుంటే హైపర్ టెన్షన్ కాస్తా బలాదూర్ అవుతుంది. రక్తనాళాలు, ధమనులు  పనితీరు సరిగా ఉండేలా చేస్తుంది.

చామంతిలో క్వెర్సెటిన్ లు ఉంటాయి. ఇవి పాలీఫెనాల్ లు. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయల్ గుణాలు  ఉంటాయి. ఇవి ఇమ్యునిటీ పవర్ ను పెంచుతాయి. యాంటీ క్యాన్సర్ ఏజెంట్ గా కూడా పనిచేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కడుపులో మంట, గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం, పొత్తి కడుపు నొప్పి

                                                 *నిశ్శబ్ద.