చలికాలంలో అందరూ చేసే ఈ తప్పు మీరు చేయకండి..!
ప్రతి సీజన్ శారీరంగా కొన్ని సవాళ్లను వెంట బెట్టుకుని వస్తుంది. వేసవి కాలం రాగానే ఎక్కడ వడదెబ్బ కొడుతుందో.. ఎక్కడ శరీరం నీరస పడిపోతుందో అని అల్లాడిపోతారు ప్రజలు. ముఖ్యంగా శరీరానికి తగినంత నీటి అవసరాన్ని తీర్చడానికి నీరు, పండ్ల రసాలు, కొబ్బరినీరు.. నీటి శాతం ఎక్కువ ఉన్న పండ్లు.. ఇలా చాలా తీసుకుంటారు. కానీ చలికాలం దగ్గరకు వచ్చే సరికి సీన్ మారిపోతుంది. నీరు తాగాలన్నా, నీరు అధికంగా ఉన్నపండ్లు తినాలన్నా అస్సలు ఇష్టపడరు. దీని వల్ల కొంప కొల్లేరు అవుతుందని చాలా మంది తెలుసుకోరు. వేసవి కాలంలో కంటే చలికాలంలోనే నీరు తాగడం తగ్గుతుంది. ఇది చాలా ప్రమాదరమైన పరిస్థితి. చలికాలంలో కూడా కనీసం 2 నుండి 3 లీటర్ల నీటిని తప్పనిసరిగా తీసుకోవాలని అంటున్నారు వైద్యులు. చల్లటి వాతావరణంలో కూడా శరీరాన్ని ఎనర్జిటిక్‌గా, హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. శరీరం డీహైడ్రేట్ అయితే.. శరీరం నిర్జలీకరణానికి గురైనప్పుడు మూత్రం ముదురు రంగులో ఉంటుంది. కళ్లు తిరగడం, చర్మం పొడిబారడం, తలనొప్పి, అలసట, బలహీనత, పెదవులు పగిలిపోవడం వంటి కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. వేసవిలో మాత్రమే కాకుండా శీతాకాలంలో కూడా హైడ్రేట్ గా ఉండటం, శరీరానికి శక్తి అధికంగా ఇచ్చే ఆహారాలు తినడం చేయాలి. చలికాలంలోనే కాదు వేసవిలో కూడా గోరువెచ్చని నీటితో రోజును ప్రారంభిస్తే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. అందుకే ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలి. ఇది హైడ్రేటెడ్‌గా అనిపిస్తుంది, శరీరం శక్తితో నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ఇందులో నిమ్మ, పుదీనా, తేనె వంటి సహజసిద్ధమైన పదార్థాలను కలుపుకుని కూడా తాగవచ్చు. హైడ్రేటెడ్ గా ఉండటానికి ఆహారంలో నీరు మాత్రమే కాకుండా నీరు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను కూడా చేర్చుకోవాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో పుచ్చకాయ, దోసకాయ, నారింజ, ఆకుకూరలు టమోటాలు తీసుకోవాలి. డీహైడ్రేషన్‌ను నివారించడానికి ఎల్లప్పుడూ వాటర్ బాటిల్‌ను వెంట ఉంచుకోవాలి. ఎక్కడికైనా బయటకు వెళ్లినా.. బ్యాగ్‌లో లేదా కారులో బాటిల్ ఉంచుకోవాలి. ఇది ఎప్పటికప్పుడు నీరు త్రాగడానికి గుర్తు చేస్తు ఉంటుంది. ప్రతిసారీ నీరు త్రాగడానికి ప్రయత్నించాలి. ఇది కాకుండా వ్యాయామం తర్వాత వాటర్ బాటిల్లో ఎలక్ట్రోలైట్స్ కలిపి తాగడం వల్ల ఎఫెక్టివ్ హైడ్రేషన్ లభిస్తుంది. రాత్రి పడుకునే ముందు కొంచెం నీరు త్రాగాలి. ఇలా చేయడం వల్ల రాత్రంతా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే రాత్రి పడుకునే ముందు ఎక్కువ నీరు త్రాగవద్దు. లేకుంటే నిద్రలో పదేపదే బాత్రూమ్కు వెళ్లవలసి ఉంటుంది, దీని కారణంగా నిద్రకు భంగం కలగవచ్చు. అదే సమయంలో ఆహారం తీసుకునే ముందు 1 గ్లాసు నీరు త్రాగాలి. ఇలా నీరు తాగుతుంటే శరీరం చలికాలంలో కూడా హైడ్రేట్ గా ఉంటుంది. *రూపశ్రీ.
read moreపండ్ల రసాలు తాగేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోకపోతే నష్టపోతారు..!
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివని చెబుతారు. ముఖ్యంగా ఆరోగ్యం బాగాలేనప్పుడు పండ్లు లేదా పండ్ల రసం ఇస్తుంటే చాలా తొందరగా కోలుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. మంచి ఆరోగ్యం కోసం పండ్లు, పండ్ల రసాలు తీసుకోమని వైద్యులు కూడా చెబుతారు. చాలా మంది పండ్ల రసాలు తాగాలని అనిపిస్తే సింపుల్ గా ఫ్రూట్ జ్యూస్ షాప్ కు వెళ్లి తాగేస్తుంటారు. మరికొందరు ఓపికగా ఇంట్లోనే జ్యూస్ చేసుకుంటారు. అయితే జ్యూస్ తాగే ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పండ్ల రసం చాలా వరకు బయట తాగడం చాలామంది అలవాటు. అయితే పండ్ల రసం తాగే దుకాణం శుభ్రతగా ఉందా లేదా గమనించాలి. శుభ్రత లేని చోట పండ్ల రసాలు తాగితే అది అనారోగ్యానికి కారణం అవుతుంది. కేవలం ఆ దుకాణం మాత్రమే కాదు.. చుట్టు ప్రక్కల పరిసరాలు కూడా శుభ్రతగా లేకుంటే ఆ దుకాణాలలో జ్యూస్ లు తాగడం మంచిది కాదు. జ్యూస్ తాగేముందు అక్కడే అప్పటికప్పుడు తాజాగా తయారు చేసిన జ్యూస్ ను మాత్రమే తాగడం మంచిది. ముందే జ్యూస్ జార్ లేదా గిన్నెలలో నిల్వ ఉంచిన జ్యూస్ ను అస్సలు తాగకూడదు. అలాంటి జ్యూస్ లో బ్యాక్టీరియా పెరుగుతుంది. అందుకే ఎప్పుడూ తాజా పండ్ల జ్యూస్ ను మాత్రమే రికమెండ్ చేయాలి. పండ్ల జ్యూస్ లు అమ్మే షాపులలో కొన్నిసార్లు ముందే పండ్లను కట్ చేసి ఉంటారు. అలాంటి పండ్ల నుండి జ్యూస్ ను తయారు చేయించుకోకూడదు. తాజాగా కట్ చేసిన పండ్ల నుండే జ్యూస్ ను చేయించుకోవాలి. ముందే కట్ చేసిన పండ్లలో కొన్ని సార్లు చెడి పోయిన పండ్లను కొంత భాగం కట్ చేసి పెట్టుకుని ఉంటారు. ఇది బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. పండ్ల రసం తయారు చేసేవారు జ్యూస్ మరింత రుచిగా, తాజాగా ఉండటం కోసం జ్యూస్ లో ఏదైనా రసాయనాలు లేదా పౌడర్ లేదా లిక్విడ్స్ మిక్స్ చేస్తుంటారు. కొన్నిసార్లు రంగు కూడా జోడిస్తూ ఉంటారు. అలాంటి చోట జ్యూస్ అస్సలు తాగకూడదు. వాడిపోయిన, పాతబడిన కాయలతో ఫ్రూట్ జ్యూస్ లు తయారు చేసి అమ్ముతుంటారు. అలాంటివి నివారించాలి. వీటిలో నీటి శాతం ఏమీ ఉండదు. పై పెచ్చు కార్బోహేడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. వీటిలో పోషకాలు ఏమీ ఉండవు. ఇవి ఆరోగ్యానికి కూడా మంచివి కావు. *రూపశ్రీ.
read moreచేపల కంటే 10 రెట్ల పోషకాలు ఉన్న గింజలు ఇవి..!
చేపలు చాలా శక్తి వంతమైన ఆహారం. సమతుల ఆహారంలో చేపలకు కూడా స్థానం ఉంది. చేపలను తీసుకుంటే శరీరానికి ప్రోటీన్, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా అందుతాయి. వారంలో కనీసం రెండు సార్లు అయినా చేపలను ఆహారంలో భాగంగా తీసుకోవాలని చెబుతారు. అయితే చేపల కంటే ఎక్కువ పోషకాలు ఉన్న గింజలు ఉన్నాయి. ఈ గింజలను ఆహారంలో తీసుకుంటే చేపల కంటే 10 రెట్ల పోషకాలు లభిస్తాయట. ఇంతకీ ఇవేం గింజలు. వీటి ప్రయోజనాలేంటి తెలుసుకుంటే.. గుమ్మడి.. గుమ్మడి కాయ వినియోగం భారతదేశంలో ఎక్కువ. గుమ్మడి కాయను కట్ చేసిన తరువాత చాలా మంది అందులో విత్తనాలు పడేస్తుంటారు. అయితే గుమ్మడి గింజలు పోషకాల నిధి. గుమ్మడి గింజలను ఆహారంలో తీసుకుంటే చేపల కంటే అధిక శక్తి, శరీరానికి ప్రయోజనాలను చేకూరుస్తాయట. 100 అత్యంత శక్తివంతమైన ఆహారాల జాబితాలో గుమ్మడి గింజలు ఆరవ స్థానం పొందాయి. ఇక ఎంతో మేలు అని చెప్పుకునే చేపలు 77వ స్థానంలో నిలిచాయి. గుమ్మడికాయ గింజలలో పోషకాల విలువ 84 అయితే.. చేపలలో ఎంతో మంచిదని చెప్పుకునే సాల్మన్ చేపల పోషక విలువ 52 మాత్రమే. అందుకే గుమ్మడికాయ గింజలను అస్సలు మిస్ చేసుకోకుండా తినమని చెబుతున్నారు. పోషకాలు.. గుమ్మడికాయ గింజలలో ఐరన్, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రక్తహీనతను తొలగించడంలో సహాయపడతాయి. శరీరంలో ఎముకలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడతాయి. గుమ్మడి గింజలలో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. హార్ట్ బీట్ ను సక్రమంగా ఉంచడంలో సహాయపడుతుంది. గుమ్మడి గింజలలో ఉండే ఒమేగా-3, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు మంటను తగ్గించి, చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి. మంచి కొలెస్ట్రాల్ పెంచడంలో సహాయపడతాయి. గుమ్మడి గింజల్లో ఉండే జింక్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని ఇస్తుంది. విటమిన్ ఇ వాపును తగ్గించడం ద్వారా రోగనిరోధక శక్తిని మరింత పెంచుతుంది. ఇందులో ఉండే కెరోటినాయిడ్స్, విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. మెగ్నీషియం, భాస్వరం, జింక్ ఎముకల సాంద్రతను పెంచడానికి, బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి చాలా అవసరం. ఈ మూడు మూలకాలు గుమ్మడి గింజల్లో మంచి పరిమాణంలో ఉంటాయి. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. గుమ్మడికాయ గింజలు ఇన్సులిన్‌ను మెరుగుపరుస్తాయి. డయాబెటిస్ సమస్యలను నివారిస్తాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే ప్రొటీన్, ఫైబర్ ఆకలిని నియంత్రిస్తాయి, తద్వారా బరువును నియంత్రిస్తాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే 100 గ్రాముల గుమ్మడి గింజల్లో 164 కేలరీలు మాత్రమే ఉంటాయి. అంటే ఇందులో కేలరీలు తక్కువ. *రూపశ్రీ.
read moreవైద్యులు చెప్పిన ఈ సలహాలు పాటిస్తే 50 ఏళ్ల తర్వాత కూడా పూర్తీ ఫిట్ గా ఉంటారు..!
పెరుగుతున్న వయస్సుతో రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం అనేది ఒక సహజంగా జరిగేదే. దీనిని ఇమ్యునోసెన్సెన్స్ అంటారు. 50 తర్వాత దాని ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కారణంగా, శరీరం వైరస్లు, బ్యాక్టీరియాతో పోరాడడంలో విఫలమవుతుంది. ఇది ఫ్లూ, షింగిల్స్, న్యుమోనియా వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించడం ద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవచ్చు. ఇందుకోసం వైద్యులు కొన్ని సలహాలు సూచిస్తున్నారు. వీటిని పాటిస్తే 50 ఏళ్ల తర్వాత కూడా మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవచ్చు. నీరు.. తగినంత నీరు త్రాగడం అనేది చాలామంది పట్టించుకోని విషయం. కానీ ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు నీరు పుష్కలంగా తాగడం చాలా ముఖ్యం. శరీరంలో నీటి శాతం లోపిస్తే శరీరం ఇన్ఫెక్షన్తో పోరాడే సామర్థ్యంపై ప్రతికూల ప్రభావాలను పడతాయి. ఎందుకంటే ఇది రోగనిరోధక కణాల పనితీరును ప్రభావితం చేస్తుంది. శరీరం యొక్క రక్షణ యంత్రాంగాన్ని బలహీనపరుస్తుంది. వయసు పెరిగే కొద్దీ మన దాహం తగ్గుతుంది. డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది. కాబట్టి నీరు, హెర్బల్ టీలు పండ్లు, కూరగాయలతో సహా రోజంతా తగినంత ద్రవ ఆహారాన్ని తీసుకోవాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం ద్వారా పోషకాలను గ్రహించడం, వ్యర్థాలను తొలగించడం, మొత్తం రోగనిరోధక వ్యవస్థ పనితీరులో సహాయపడుతుంది. ఆహారం.. మన రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవడానికి పోషకాహారం చాలా ముఖ్యం. వయసు పెరిగే కొద్దీ మన శరీరం పోషకాలను గ్రహించలేకపోతుంది. కాబట్టి పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, లీన్ ప్రోటీన్లు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. రోగనిరోధక వ్యవస్థకు చాలా ముఖ్యమైన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రోబయోటిక్స్ కూడా సహాయపడతాయి. విటమిన్లు సి, ఇ, జింక్, సెలీనియం వంటి పోషకాలు యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. శరీర కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. వ్యాక్సిన్లు.. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి లేదా పెరుగుతున్న వయస్సుతో సంభవించే ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడానికి వ్యాక్సిన్ అనేది అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. కాలక్రమేణా మన రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని కారణంగా వృద్ధులలో షింగిల్స్, న్యుమోనియా, ఫ్లూ వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. వ్యాక్సిన్లు మన శరీరం ఈ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడే ప్రతిరోధకాలను తయారు చేయడంలో సహాయపడతాయి. ఉదాహరణకు, షింగిల్స్ వ్యాక్సిన్ 50 ఏళ్లు పైబడిన వారికి చాలా ముఖ్యమైనది, ఎందుకంటే చిన్ననాటి చికెన్ పాక్స్ మళ్లీ చురుకుగా మారవచ్చు. ఇది షింగిల్స్ వంటి బాధాకరమైన ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. నిద్ర.. మంచి నిద్ర మన శరీరానికి చాలా ముఖ్యం. ఇది మన శరీరాన్ని రిపేర్ చేయడం మరియు పునరుత్పత్తి చేయడమే కాకుండా, మన రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతుంది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల, మన రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది, దాని కారణంగా మనం వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు గురవుతాము. నిజానికి, నిద్రలో మన శరీరం సైటోకిన్స్ అనే ప్రత్యేకమైన ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది ఇన్ఫెక్షన్ మరియు ఇన్ఫ్లమేషన్తో పోరాడడంలో సహాయపడుతుంది. తక్కువ నిద్ర కారణంగా, సైటోకిన్ల ఉత్పత్తి మందగిస్తుంది, దీని వల్ల వ్యాధులతో పోరాడే మన సామర్థ్యం బలహీనపడుతుందని మీకు చెప్పండి. అందువల్ల, ప్రతి రాత్రి 7-9 గంటలు మంచి నిద్ర పొందాలని లక్ష్యంగా పెట్టుకోవాలి, తద్వారా మన రోగనిరోధక శక్తి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. చురుకుదనం.. వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. వ్యాయామం చేయడం వల్ల బరువు అదుపులో ఉండటమే కాకుండా కండరాలు బలపడతాయి. వ్యాధులతో పోరాడే శక్తి పెరుగుతుంది. నిత్యం వ్యాయామం చేస్తే మన శరీరంలో రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. రక్తంలో మన శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడే కొన్ని ప్రత్యేక కణాలు ఉన్నాయి. రక్త ప్రసరణ మెరుగుపడినప్పుడు ఈ కణాలు శరీరం అంతటా సులభంగా కదలగలవు. ఏదైనా సూక్ష్మక్రిములతో పోరాడటానికి ఇవి సిద్ధంగా ఉంటాయి. వ్యాయామం చేయడం వల్ల మన శరీరంలో వాపులు కూడా తగ్గుతాయి. ఇన్ఫ్లమేషన్ వయసు పెరిగే కొద్దీ వ్యాధులతో పోరాడే మన శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మనం వాపును తగ్గించి ఆరోగ్యంగా ఉండవచ్చు. *రూపశ్రీ.
read moreచలికాలంలో తెల్ల నువ్వులు తింటే ఈ లాభాలు సొంతం..!
సీజన్ ను బట్టి శరీరానికి ఆహారం అందించాలి. అలా అందించినప్పుడే శరీరం వాతావరణానికి తగినట్టు బలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు చలికాలం మొదలైంది. ఈ చలికాలంలో శరీరం వెచ్చగా ఉండాలి. ఇందుకోసం ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అదే విధంగా పోషకాలు అధికంగా ఉన్న ఆహారం కూడా తీసుకోవాలి. ఇలాంటి ఆహారాలలో నువ్వులు ముఖ్యమైనవి. నువ్వులలో రెండు రకాలు ఉంటాయి. వాటిలో తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు రెండూ ఉన్నాయి. కానీ చలికాలంలో తెల్ల నువ్వులు తీసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో తెలుసుకుంటే.. నువ్వులు వేడి గుణం కలిగి ఉంటాయి. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి తెల్ల నువ్వులను తీసుకోవాలి. తెల్ల నువ్వులను రోజూ కనీసం ఒక స్పూన్ మొత్తంలో తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులను తగ్గించడలో ఇది సహాయపడుతుంది. తెల్ల నువ్వులలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ ఉన్న ఆహారం తీసుకుంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. చలికాలంలో జీర్ణక్రియ సహజంగానే నెమ్మదిస్తుంది. ఈ జీర్ణక్రియను ఆరోగ్యంగాను, వేగంగా చేయడంలో తెల్ల నువ్వులు సహాయపడతాయి. దీని కారణంగా మలబద్దకం సమస్య కూడా దరిచేరదు. తెల్ల నువ్వులలో లిగ్నాన్స్, ఫైటూస్టెరాల్స్ ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడాన్ని ఇది తగ్గిస్తుంది. నువ్వులలో కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. నువ్వులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలోనూ, ఆరోగ్య సమస్యలను నివారించడంలోనూ సహాయపడతాయి. చలికాలంలో ఎముకలకు సంబంధించిన సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు పెరుగుతాయి. కానీ తెల్ల నువ్వులు తీసుకోవడం వల్ల ఈ నొప్పులు తగ్గుతాయి. *రూపశ్రీ.
read moreచలికాలంలో బొప్పాయి తింటే ఈ లాభాలన్నీ సొంతం..!
శరీరానికి పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి. ఆరోగ్యం బాగా లేనప్పుడు పండ్లను బాగా తీసుకుంటే తొందరగా అనారోగ్యం నుండి బయటపడతారు. అయితే పండ్లు కూడా సీజన్ ను బట్టి తీసుకుంటే శరీరానికి ఎక్కువ లాభం కలుగుతుంది. ప్రస్తుతం చలికాలం సాగుతున్న తరుణంలో చలికాలంలో బొప్పాయి తింటే మంచిదని అంటున్నారు. బొప్పాయి తింటే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. చలికాలంలో కాస్త వేడి గుణం కలిగిన ఆహారాలు తీసుకోవాలి. దీనివల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. చలి కారణంగా శరీరం డిస్టర్బ్ అవ్వదు. బొప్పాయిలో కూడా వేడి గుణం కలిగి ఉంటుంది. చలికాలంలో వీలైనపుడల్లా బొప్పాయిని తినాలి. చలికాలంలో బొప్పాయిని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బొప్పాయిలో విటమిన్-సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చలికాలంలో వచ్చే సీజన్ సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. దగ్గు, జలుబు, చలికారణంగా ఎదురయ్యే తలనొప్పి, ఫ్లూ వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. బొప్పాయి పండులో ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుంది. అలాగే ఇందులో ఎంజైమ్ లు కూడా అధిక మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. మలబద్దకం, మోషన్ కావడంలో ఇబ్బందులు, అజీర్తి వంటి సమస్యలు బొప్పాయి తినడం వల్ల అధిగమించవచ్చు. బొప్పాయిలో పొటాషియం అధిక మొత్తంలో ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా చేస్తాయి. కఠినమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె యవ్వనంగా ఉండాలన్నా, ఎంత వయసు పెరిగినా ఇంకా యవ్వనంగా ఉన్నవారిలా గుండె పనిచేయాలని కోరుకుంటున్నా బొప్పాయిని తినమని వైద్యులు చెబుతున్నారు. బొప్పాయికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్-సి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. విటమిన్-సి గొప్ప యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి ఇది చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. బొప్పాయిలో ఉండే పోషకాలు చలికాలంలో కూడా చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. కేవలం ఆహారంగానే కాకుండా చర్మ సంరక్షణలో కూడా బొప్పాయిని చేర్చుకోవచ్చు. బొప్పాయి ఫేస్ వాష్, బొప్పాయి ఫేస్ ప్యాక్ ట్రై చేయచ్చు. చలికాలంలో వేడి ఆహారాల మీద అందకీ కన్ను ఉంటుంది. ముఖ్యంగా నూనెలో డీప్ ఫ్రై చేసే పకోడీలు, వడలు, సమోసా వంటి స్నాక్స్ ను ఇష్టపడతారు. వీటి వల్ల బరువు వేగంగా పెరుగుతారు. కానీ బొప్పాయి తీసుకుంటే ఆకలి ఎక్కువగా కాదు. ఎందుకంటే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఇస్తుంది. కాబట్టి దీన్ని తింటే బరువు పెరగకపోవడమే కాకుండా.. బరువు తగ్గడం కూడా సులువు. *రూపశ్రీ.
read moreవాటర్ చెస్ట్ నట్ తిన్నారా? ఇవి తింటే కలిగే లాభాలు ఇవే..!
శరీరానికి ఆహారం చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఆహారంలో పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ వంటివి ఉండాలి. వీటి నుండి విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు అన్నీ శరీరానికి లభిస్తాయి. అయితే సీజన్ అనుగుణంగా లభించే వాటిలో శరీరానికి కావలసిన పోషకాలు, శరీరానికి మేలు చేసే సమ్మేళనాలు మెరుగ్గా ఉంటాయి. అలాంటి వాటిలో వాటర్ చెస్ట్ నట్స్ కూడా ఒకటి. వీటిని తెలుగులో సింగోడ అని అంటారు. ఇవి శీతాకాలంలో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి. ఇవి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. శీతాకాలంలో ఈ వాటర్ చెస్ట్ నట్స్ ను తప్పకుండా తినాలని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఇవి తింటే కలిగే లాబాలు తెలుసుకుంటే.. వాటర్ చెస్ట్ నట్ తింటే రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇది వివిధ రకాల వ్యాధులతో పోరాడటంలో సహాయపడుతుంది. ఏవైనా జబ్బులు వచ్చినప్పుడు ఈ వాటర్ చెస్ట్ నట్స్ ను తింటూ ఉంటే తొందరగా రికవరీ కావచ్చు. చలికాలంలో జీర్ణ వ్యవస్థ నెమ్మదిస్తుంది. దీని కారణంగా ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలు ఏర్పడతాయి. కానీ వాటర్ చెస్ట్ నట్స్ తింటే జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. మలబద్దకం సమస్యలు తగ్గుతాయి. వాటర్ చెస్ట్ నట్స్ లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త పోటును అదుపులో ఉంచుతుంది. దీని కారణంగా చలికాలంలో గుండె సంబంధ వ్యాధుల బారిన పడే అవకాశం తగ్గుతుంది. సాధారణంగా చలికాలంలో శరీరంలో రక్తప్రసరణ తగ్గడం వల్ల గుండె కండరాలు బిగుసుకుపోయినట్టు ఉంటాయి. కానీ ఈ సమస్య తగ్గించడంలో వాటర్ చెస్ట్ నట్స్ సహాయపడతాయి. వాటర్ చెస్ట్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చర్మం మెరుస్తూ ఉండేలా చేయడంలో సహాయపడతాయి. ముఖం మీద మొటిమలను తొలగించడమే కాకుండా కాలుష్యం వల్ల వచ్చే సమస్యల నుండి కూడా ఇవి కాపాడతాయి. అన్నింటి కంటే ముఖ్యంగా వాటర్ చెస్ట్ నట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ శరీరానికి చాలా అవసరం. ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది. ఫలితంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. *రూపశ్రీ.
read moreచలికాలంలో ఈ ఆహారాలను పొరపాటున కూడా తినకూడదు..!
ఆహారమే ఆరోగ్యం అనే మాట వినే ఉంటారు. శరీరానికి శక్తిని ఇచ్చేది ఆహారమే. అయితే ఆరోగ్యానికి ఔషధంలా పని చేసే ఆహారమే అనారోగ్యాన్ని కూడా తెచ్చిపెడుతుంది. దీనికి కారణం సీజన్.. సీజన్ కు తగ్గట్టు ఆహారం తినాలని అంటుంటారు. ఏ కాలంలో పండే కూరగాయలు, పండ్లు ఆ కాలంలో తింటే ఎలాంటి జబ్బులు పెద్దగా ఇబ్బంది పెట్టవు. కానీ నేటి కాలంలో పరిస్థితి వేరుగా ఉంది. ఏ సీజన్ లో అయినా ఎలాంటి ఆహారం అయినా దొరుకుతుంది. కొందరు ఖరీదు ఎక్కువ పెట్టి సీజన్ లో లభించని ఆహారాలు కొని తినడాన్ని గొప్పగా ఫీలవుతారు కూడా. అయితే చలికాలంలో కొన్ని ఆహారాలు తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ ఆహారాలు తినడం వల్ల ఆరోగ్యం పాడయ్యి వ్యాధుల బారిన పడతారట. చాలా వరకు ఏ ఆహారాలు హాని కలిగిస్తాయి అనే విషయం చాలా మందికి తెలియదు. సాధారణ రోజుల్లో ఎంతో ఆరోగ్యం అనుకునే ఆహారాలే ఆ తరువాత హాని కలిగిస్తాయి. చలికాలంలో తినకూడని ఆహారాలేంటో తెలుసుకుంటే.. చలికాలంలో ఐస్ క్రీమ్ తినడం, వర్షం పడుతుండగా ఐస్ క్రీమ్ ఆస్వాదించడం చాలామంది అదేదో గొప్పగా చెబుతారు. కానీ చలికాలంలో చాలావరకు ఐస్ క్రీములు, చల్లని జ్యూసులు తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, ఇతర సీజనల్ సమస్యలు చాలా తొందరగా వస్తాయి. చల్లని వాతావరణంలో వేడిగా ఏదైనా తినాలని అనుకునే చాలామంది నూనెలో వేయించిన ఆహారాలు, కరకరలాడే ఫ్రై లు తినాలని అనుకుంటారు. అలాంటి ఆహారానికే మొగ్గు చూపుతారు. కానీ చలికాలంలో సాధారణంగానే జీర్ణవ్యవస్థ పనితీరు నెమ్మదిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను పాడు చేసి అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు కలిగిస్తుంది. బాగా కారంగా ఉన్న ఆహారం తినడాన్ని ఇష్టపడే వారు అధికం అయ్యారు. కారం తినడం అంటే తమ వ్యక్తిత్వం, శరీరం బాగా బలంగా ఉందని వ్యక్తం చేయడం అనుకుంటారు. దీని కారణంగానే చాలామంది బిరియానీ, మసాలా వంటకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ఇలాంటి ఆహారాలు తినడం వల్ల చలికాలంలో ఎసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. చలికాలంలో జీర్ణ వ్యవస్థ పనితీరు నెమ్మదిగా ఉంటుంది. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకునే ఆహారాలను ఈ కాలంలో తీసుకోకపోవడమే మంచిది. అలాంటి ఆహారాలలో పచ్చి కూరగాయలు కూడా ఒక భాగం. పచ్చి కూరగాయలను తినడం మానుకోవాలి. చక్కెర ఎక్కువగా జోడించిన ఆహారాలు తినడం వల్ల జలుబు, ఫ్లూ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. వీటిని చలికాలంలో వీలైనంత వరకు తగ్గించాలి. *రూపశ్రీ.
read moreవిటమిన్ బి12 లోపాన్ని అధిగమించాలంటే.. ఈ ఆహారాలు తప్పక తినాలి..!
శరీరానికి అన్ని రకాల ప్రోటీన్లు, విటమిన్లు అవసరం అవుతాయి. ఏ ఒక్కటి లోపించినా శరీర పనితీరు దెబ్బతింటుంది. ముఖ్యంగా శరీరంలో కొన్ని రకాల విటమిన్లు లోపించడం వల్ల శరీరానికి చాలా పెద్ద నష్టం వాటిల్లుతుంది. ఈ లోపం దీర్ఘకాలం కొనసాగితే శరీరానికి పూడ్చలేని నష్టం జరుగుతుంది. ముఖ్యంగా చాలా అరుదుగానూ, మాంసాహారంలోనూ లభించే పోషకాల వల్ల శాకాహారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటారు. అలాంటి వాటిలో విటమిన్-బి12 లోపం కూడా ఒకటి. విటమిన్-బి12 మాంసాహారంలోనూ, కొన్ని శాకాహార ఆహారాలలోనూ మాత్రమే లభిస్తుంది. ఈ కారణంగా విటమిన్-బి12 కేసులు శాకాహారులలో ఎక్కువగా ఉంటాయ. అసలు విటమిన్-బి12 లోపిస్తే జరిగేదేంటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ సమస్యను అధిగమించాలంటే ఏ ఆహారం తీసుకోవాలి? పూర్తీగా తెలుసుకుంటే.. లక్షణాలు.. శరీరంలో విటమిన్-బి12 లోపిస్తే కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. వాటిలో అలసట,, బలహీనత, కళ్ళు తిరగడం, జ్ఞాపకశక్తి, రక్తహీనత వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా విటమిన్-బి12 శరీరంలో రోగనిరోధక శక్తిని ఆరోగ్యంగా ఉంచుతుంది, కొత్త ఎర్ర రక్తకణాలు అభివృద్ది చేయడంలో సహాయపడుతుంది. కానీ విటమిన్-బి12 లోపం వల్ల రక్తహీనత ఎక్కువ అవుతుంది. విటమిన్-బి12 భర్తీ కావాలంటే ఏం తినాలంటే.. పాలు, పాల ఉత్పత్తులలో విటమిన్-బి12 పుష్కలంగా ఉంటుంది. మాంసాహారంలో కూడా విటమిన్-బి12 ఉంటుంది. శాకాహారం తీసుకునేవారు విటమిన్-బి12 భర్తీ కావాలంటే పాలు, పాల ఉత్పత్తులు అయిన పాలు, పెరుగు, చీజ్, పనీర్ వంటివి పుష్కలంగా తీసుకోవాలి. మాంసాహారులు అయితే విటమిన్-బి12 లోపాన్ని చాలా తొందరగా అధిగమించడానికి చికెన్, టర్కీ కోడి మొదలైనవి ఆహారంలో తీసుకోవచ్చు. చేపలలో విటమిన్-బి12 సమృద్దిగా ఉంటుంది. చేపలతో చేసిన వంటకాలు తీసుకోవడం వల్ల విటమిన్-బి12 లోపాన్ని అధిగమించవచ్చు. వైద్యుల సూచన మేరకు చేప సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు. గుడ్లలో పెద్ద మొత్తంలో విటమిన్-బి12 ఉంటుంది. రోజూ ఒక ఉడికించిన గుడ్డును తీసుకుంటూ ఉంటే విటమిన్-బి12 లోపాన్ని అధిగమించవచ్చు. లేదంటే గుడ్డుతో ఆరోగ్యకరమైన పద్దతిలో ఆమ్లెట్ వంటి వంటకాలు కూడా తయారుచేసుకుని తినవచ్చు. కానీ ఉడికించిన గుడ్లే శ్రేష్టం. మాంసాహారులు అయితే విటమిన్-బి12 లోపాన్ని అధిగమించడానికి రెడ్ మీట్ కూడా తీసుకోవచ్చు. ఇందులో విటమిన్-బి12 పుష్కలంగా ఉంటుంది. *రూపశ్రీ.
read moreజీవితాంతం అందంగా ఉండేందుకే సేలబ్రేటీలు సరోగసీని అశ్రయిస్తున్నారా ?
ఇటీవలి కాలం లో అటు సాదారణ జంటలు ముఖ్యంగా ఐ టి రంగం లోని వారి వారి ఉద్యోగాల లో ఉన్న ఒత్తిడి కారణంగా సంసార జీవితం పై ఆశక్తి తగ్గడం, వారి వారి జీవన శైలి కారణంగా పిల్లల ను కనే ఆశక్తి లేకపోవడం వల్ల మరోపక్క ఏళ్ళు గడుస్తున్నా పిల్లలు లేకపోవడం తో ఇంటా బయట తీవ్ర అవమానాలు ఎదుర్కోలేక తమ ముఖాన్ని అందరికి చూపించుకోలేక అసలు కొన్ని సందర్భాలలో పెళ్లి పేరంటాలకు సైతం వెళ్లేందుకు ఆశక్తి చూపడం లేదు. ఈక్రమంలో కుటుంబాల మధ్య తీవ్ర బేధాభిప్రాయాలు రావడం సంతానం కలగకపోవడానికి మీరు అంటే మీరు అంటూ చోటు చేసుకుంటున్న పరిణామాలు భార్యా భర్తల మధ్య విభేదాలకు కారణమౌతున్నాయి. ఇది కాస్త ముందుకు వెళ్లి విడాకుల కు దారి తీస్తుంది అని నిపుణులు అంటున్నారు.ఈ పరిణామ క్రమం లో ఇటీవలి కాలం లో సెలబ్రేటీలు సరోగసీ పద్ధతి లో పిల్లలను పుట్టించే పనిలో పడ్డారు.ముందుగా చెప్పుకోవాల్సిన పేర్లలో సన్నీ లియోన్,శిల్పాశేట్టీ, ఖాన్ కుటుంబం అగ్రభాగాన ఉన్నారు. ఇకతెలుగులో మంచు లక్ష్మి కూడా సరోగసి ద్వారా పిల్లలను కనడం తెలిసిన విషయమే ఇందులో అటు విదేశి క్రీడాకారులు కొందరైతే ఇంకొందరు బాలివుడ్ తారలు ఉండడం గమనించవచ్చు.బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా,నికో జోనాస్ తల్లి తండ్రులు కాబోతున్నట్లు ఇంస్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు.సరోగేట్ ద్వారా పిల్లలను స్వాగతిస్తున్నా మని పేర్కొన్నారు.ఇటీవల టాలి వుడ్, కోలివుడ్ నటి నయన తార సరోగసి పద్దతిలో జన్మనివ్వడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవలే వివాహం జరిగి తిరుమల దర్సనంలోను వివాదాస్పదం కావడం అందరికీ తెలిసిందే. ఇంతలోనే సరోగాసీ ద్వారా పిల్లలు కన్న విషయం గుప్పు మనడం తో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.కాగా నయన తార చట్టప్రకారం సరోగసి అమలు చేసారా.? నియమ నిబందనల ప్రకారామే వ్యవహరించారా అన్న అంశం చర్చనీయ అంశం కాగా నాలుగు నెలలోనే కవల పిల్లలకు జన్మనివ్వడం సాధ్యా సాధ్యాల పై నిపుణులను నేటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రియాంకా చోప్రా చెల్లెలు మీరా చోప్రాకు పాప పుట్టిందని తెలిపారు. 12 వారాల క్రితమే సరోగసి ద్వారా జన్మించినట్లు ప్రియాంకా చోప్రా వెల్లడించారు.భారత ప్రభుత్వం సరోగసి తో వ్యాపారం చేయడాన్ని నివారించేందుకు జనవరి 25 న సరోగసి చట్టం 2౦21 ప్రకటీంచింది.తమ అందం కరిగిపోతుందన్న భావనతో ఒకరకంగా స్వార్ధపూరితంగా వ్యవహరిస్తున్నారనడం లో ఎటువంటి సందేహం లేదు. బిడ్డకు జన్మనివ్వడం ఆతరువాత పిల్లలకు పాలు ఇవ్వడం వృత్తిపరంగాతాము అవకాశాలు కోల్పోతామన్న భావన సేలబ్రేటీలలో పేరుకుపోవడం తో సరోగాసి ని అస్రయిస్తున్నరన్నది వాస్తవం. విధం చెడ్డ ఫలం దక్క లేదన్నట్టు సేల్బ్రేటీలు సమాజానికి ఏమి చెప్పదలుచుకున్నారు.సృష్టి కి విరుద్ధంగా వ్యవహరిస్తున్న వీరి ఆలోచన పూర్తిగా విమర్సలకు దారితీస్తోంది. అసలు వీళ్ళు చట్టాన్ని నియమనిభందనలను పాటిస్తున్నారా, చట్ట ప్రకారం వ్యవహరిస్తున్నారా లేదా అన్నది అసలు వీరు సరోగాసికి వెళ్లేందుకు ఎవరు అనుమతించారు వీరి సరోగట్ వివరాలు గోప్యంగా ఉంచినా వ్యాపారాత్మకంగా సరోగాసికి ప్రోత్సాహం కల్పిస్తున్నారా అన్నది మరోప్రశ్న.ఇక సరోగాసిలో వైద్యులు చెపుతున్న వివరాల ప్రకారం శుక్రకణాలు X,Xకలిస్తే ఆడపిల్లని XY. కలిస్తే మగపిల్లవాడని ఒకసరోగట్ కు ఒకరిని మాత్రమే కనాలని నిబంధన ఉన్న కవలలు సాధ్యమా అన్న ప్రశ్నకు గయన కాలజిస్ట్లు లు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. సరోగసి చట్టం 2౦21 యొక్కలక్ష్యం... భారత్ లో సరోగాసి తో వ్యాపారం నివారించడమే లక్ష్యంగా పార్ల మెంట్ రూపొందించింది. మనదేశంలో ఉన్న చట్టం ఏమి చెపుతోంది... ప్రముఖ వైద్య నిపుణులు అంశుమన్ కుమార్ మాట్లాడుతూ సరోగసి వైద్య ప్రక్రియ దంపతులకు సంతానం కలగదో పిల్లలు కావాలని కోరు కుంటారో గర్భసంచిని అద్దెకు తీసుకోవచ్చు.అలా గర్భాన్ని అదీకిచ్చే మహిళను సరోగేట్ అని అంటారు.సంతానం కావాలని కోరుకునే వారిలో శుక్రకణాలను,అండాశయం లోనుండి తీసి ల్యాబ్ లో పరీక్షించిన తరువాత వైద్య ప్రక్రియ ద్వారా వాటిని శంకరం చేస్తారు.వైద్య విధానం ద్వారా మాత్రమే సరోగేట్ గర్భసంచిలో చేరుస్తారు.సరోగేట్ గర్భంలోనే పిండం పెరుగుతుంది.9 నెలల తరువాత జన్మనిస్తుంది ఈసమయంలో సరోగేట్ తో జరిగిన ఒప్పందం ప్రకారంఅయ్యే వైద్య ఖర్చు దంపతులే భరించాలి మనదేశం లో ఉన్న ఆర్ధిక అసమానతలు బలహీనంగా ఉన్న మహిళలు సులభంగా సరోగేట్ తల్లులు లభిస్తూ ఉండడం తో విదేశీయులు,ఆర్ధికంగా బలంగా ఉన్నవారు పిల్లలను కనేందుకు ఈ మార్గం ఎంచుకోవడం ఈ పద్దతిలో పిల్లలను పొందడం సరోగేట్ తల్కికి డబ్బులు ఆశచూపడం చట్టప్రకారం ఇది నిషేదించిన కొన్ని నియమనిబందనల ను రూపొందించి సరోగాసిని నివారించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నం మంచిదే. వ్యాపారాత్మక లాభం తో చేసే సరోగసీ పై నియంత్రణ... డిల్లి హైకోర్ట్ న్యాయవాది కరణ్ సింగ్ మాట్లాడుతూ సరోగసి నియంత్రణ చట్టం రెగ్యు లేషన్ యాక్ట్ 2౦21 ప్రకారం వ్యాపార సంబంధ సరోగాసి ని నిలుపుదలచేసింది.డిసెంబర్ 2౦21 పార్లమెంట్ లో చట్టం ఆమోదించింది. జనవరి 25 2౦ 22 ఈచట్టానికి రాష్ట్రపతి ఆమోదించడం తో న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.చట్టం ప్రకారం సరోగసి నిబంధనలకు లోబడి పరస్పర పరోపకారం తోనే సరోగాసీకి అనుమతిస్తారు.సరోగేట్ తల్లి కి తప్పనిసరిగా దంపతులు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.ఆమెకు ౩6 నెలలు నిండి ఉండాలి. దీనితోపాటు సరోగేట్ తల్లికి అయ్యే వైద్యం ఖర్చు దంపతులె భరించాలి.సరోగేట్ తో మరే ఇతర ఆర్ధిక లబాదేవీలు నిర్వహించారాదని చట్టం లో పేర్కొన్నారు.ఏ క్లినిక్ లో అయితే సరోగాసి చేస్తున్నారో అది తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండడం తప్పనిసరి అని చట్టంలో పేర్కొన్నారు. సరోగసిలో ఎగ్ కుసంబందించి ఎటువంటి లావాదేవీలు నిర్వహించారాదాన్న నిబంధన తప్పనిసరి అని నిబంధనలో స్పష్టం చేసారు. అసలు సరోగేట్ మదర్ ఎవరు అవుతారు?... హైకోర్ట్ న్యాయావాది నవీన్ శార్మ చెప్పిన వివరాల ప్రకారం కొన్ని నిబందనలు చేర్చారు.ఎవరైనా ఒకమహిళ ఒక్కసారి మాత్రమే సరోగేట్ మదర్ గా ఉంటుంది.ముందే ఆమె వివాహిత అయ్యిఉండాలి.అప్పుడే ఆమె సరోగేట్ తల్లికాగలదు. ఆమెకు ఎటువంటి మత్తు పదార్ధాలు తీసుకునే అలవాటు ఉండకూడదు.వైద్య పరంగా ఆమె ఫిట్ గా ఉండాలి.ఒక వేళ సరోగేట్ తల్లికి ఇన్సూరెన్స్ చేయించక పోవడం,వైద్య ఖర్చులు ఇచ్చే నిబంధన ను ఉల్లంఘిస్తే ఆడంపతులకి 1౦ సంవత్చరాల జైలు 1౦ లక్షల జరిమానా ఇవాల్సి ఉంటుందని నిబంధనలో పేర్కొన్నారు. సరోగాసితో అందరూ తల్లి తండ్రులు కాలేరు. డిల్లి హైకోర్ట్ న్యాయవాది రాజీవ్ కుమార్ మాలిక్ మాట్లాడుతూ ఎవరైతే దంపతులు సరోగసి ద్వారా పిల్లలు కావాలని అనుకుంటారో వారికి ముందునుండే పిల్లలు ఉండ కూడదు.వారు వ్యక్తిగతంగా ఎవరినీ దత్తత తీసుకుని ఉండకూడదు.దంపతులలో పురుషుల వయస్సు 26-55 సంవత్సరాల మధ్య ఉండాలని స్త్రీల వయస్సు 2౩-5౦ సంవత్సరాల మధ్యలో ఉండాలి.విడాకులు తీసుకున్న వివాహిత లు, వేరుగా జీవిస్తున్న వారుహోమోసేక్షువల్స్ సరోగాసికి అనుమతిలేదని నిబంధనలో పేర్కొన్నారు.సరోగసిని తప్పుడు పద్దతులలో అనుసరించే వారు నియంత్రిచేందుకు చట్టం అమలు చేస్తున్నారు. చట్టం లో లొసుగులు... సరోగాసి విషయానికి సంబంధించి డాక్టర్ అంశుమన్ మాట్లాడుతూ సరోగాసి ప్రక్రియలో వైద్యనిపునులతో పాటు పిండం తయారి సంక్రమించే పద్ధతి అయ్యే అవకాసం ఉందని నిర్ధారణ కావాలి. అది అదా మగ అని అడగకూడదు. శుక్రకణా లలో 2౩ కన్నా ఎక్కువ ఉంటె ఎక్స్ క్రోమోజోమ్స్ తీసుకోవాలి అండా ణువులు 2౩ ఎక్స్ క్రోమోజోమ్స్ తీసుకోవాలి రెండింటినీ కలిపి ఫలదీకరిస్తే 46 ఎక్స్ కణాలు ఉంటె ఆడపిల్ల పుడుతుందని శుక్ర కణాలు 2౩ కన్నా ఎక్కువ క్రోజోములు తీసుకుంటే వై క్రోమో జోములు కలిస్తే బాలుడు పుడతాడని నిపుణులు అంటున్నారు. దంపతులు వారివద్ద ఉన్న క్రోమోజోముల లభ్యత ఆధారంగా పిల్లలను సరోగాసిద్వారా పుట్టించవచ్చని నిపుణులు పేర్కొన్నారు.ఇందులో ఏ మాత్రం చట్టానికి సడలింపు ఉండరాదని పిల్లల పట్ల లింగ వివక్ష ఉండరాదని లింగనిర్ధారణ పరీక్ష నిషేధం అమలు చేయాలాని చట్టంలో పేర్కొన్నారు.సరోగసి విషయం లో నిపునులమధ్య ఎలాంటి అంతర్గత ఒప్పందాలకు తావు ఈయరాదాని పేర్కొన్నారు. కాగా సరోగాసి ద్వారా పుట్టిన బిడ్డకు రక్షణ సంరక్షణ విధానం లో ఏమాత్రం నిర్లక్ష్యం చూపరాదని ఇందుకోసం సరోగసి చట్టం తో పాటు బాలల సంరక్షణ, దత్తత కార్ నిబంధనల ప్రకారం 2౦15 ప్రకారం అనుసరించాలని తద్వారా బాలిక సంరక్షణ కలిగిస్తుందని అయితే సరోగాసి నిషేదింప బడలేదని సరోగసి ని నియంత్రణ చేసేందుకు చట్టం రూపొందించామని నిపుణులు పేర్కొన్నారు.
read moreచలికాలంలో వెల్లుల్లి ఎందుకు తినాలి? ఈ కారణాలు తెలుసుకోండి!
వెల్లుల్లి వంటింట్లో ఖచ్చితంగా ఉంటుంది. ఏ కొద్దిమందో వెల్లుల్లికి దూరంగా ఉంటారు. ఇది సీజన్ తో సంబంధం లేకుండా వాడుతుంటారు. వెల్లుల్లి లేని వంటను ఇష్టపడని పరిస్థితితో చాలామంది ఉన్నారు. ఇది బలమైన రుచి, ఘాటైన సువాసన కలిగి ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడం. జలుబు, దగ్గును నయం చేయడంలో వెల్లుల్లి అద్భుతాలు చేస్తుంది. శీతాకాలం అంతటా ప్రతిరోజూ దీన్ని తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అనేక ప్రయోజనాలు చేకూరుస్తాయి. వెల్లుల్లిలో మాంగనీస్, పొటాషియం, ఐరన్, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. చలికాలంలో వెల్లుల్లి ఎందుకు తినాలో కింది కారణాల చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. యాంటీఆక్సిడెంట్ & యాంటీ బాక్టీరియల్ లక్షణాలు వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యంగా ఉంచుతాయి. జలుబు, దగ్గు వంటి వ్యాధులను నివారిస్తాయి. వెల్లుల్లిని 'మ్యాజిక్ పదార్ధం'గా పరిగణిస్తారు, ఇది కాలానుగుణ ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో అద్బుతంగా సహాయపడుతుంది. తరచుగా జలుబు, దగ్గు వస్తుంటే వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవడం మంచిది. గుండె ఆరోగ్యం గుండె జబ్బులతో బాధపడే వారికి వెల్లుల్లి ఉపయోగపడుతుంది. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకుంటే స్ట్రోక్, గుండెపోటుతో సహా ఇతర గుండె సంబంధించిన సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకున్నా, రక్తపోటు, కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెరను తగ్గించాలనుకున్నా ప్రతిరోజూ వెల్లుల్లి తినడం మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది వెల్లుల్లిలో సల్ఫర్ తో కూడిన రసాయనాలు, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ వెల్లుల్లి తినడం ద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు. వైరల్ ఇన్పెక్షన్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. వెల్లుల్లిని వివిధ రకాలుగా తినవచ్చు. పచ్చి వెల్లుల్లినే తినాల్సిన అవసరం లేదు. శరీరాన్ని శుద్ది చేస్తుంది ఆరోగ్యకరమైన జీవక్రియ వెల్లుల్లి తినడం ద్వారా సాధ్యమవుతుంది. ఇది శరీరాన్ని శుద్ది చేయడంలో సహాయపడుతుంది. తద్వారా బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రతిరోజూ వెల్లుల్లి తినడం, ముఖ్యంగా చలికాలంలో తినడం వల్ల సహజంగా బరువు-నియంత్రణ సాధ్యమవుతుంది. పచ్చి వెల్లుల్లి రసాన్ని, తేనెను ఉదయాన్నే తీసుకోవడం వల్ల నిస్సందేహంగా బరువు తగ్గుదలలో స్పష్టమైన ఫలితాలు కనిపిస్తాయి. శ్వాసకోశ ఆరోగ్యాన్ని కాపాడుతుంది వెల్లుల్లిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఊపిరితిత్తుల ఆరోగ్యం, శ్వాసక్రియకు తోడ్పడతాయి. ఇవి తరచుగా చల్లని వాతావరణంలో వచ్చే జ్వరం, శ్వాసనాళాలు, ముక్కుల రద్దీ, గొంతు నొప్పి ద్వారా కలిగే సమస్యలు. వీటికి వెల్లుల్లి చెక్ పెడుతుంది. జీర్ణక్రియ మెరుగుపరుస్తంది ఆహారం మెరుగ్గా జీర్ణం కావడానికి, పోషకాలను గ్రహించడానికి, జీర్ణ రసాలు, ఎంజైమ్‌ల సంశ్లేషణ చాలా అవసరం. ఈ సంశ్లేషణ పెంచడంలో వెల్లుల్లి సహాయపడుతుంది. శరీరం ఆహారం నుండి తగినంత పోషకాలను స్వీకరించడంలో కూడా ఇది సహాయపడుతుంది. *నిశ్శబ్ద.
read moreఈ నాలుగు పనులు చేస్తే 100ఏళ్ల ఆయుష్షు గ్యారెంటీ అంట..!
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఎక్కువ కాలం బ్రతకాలంటే శరీరం దృఢంగా ఉండాలి. ఇందుకోసం మంచి పౌష్టికాహారం తీసుకోవాలని అంటుంటారు. అయితే ఆహారం వివిధ రకాలుగా ఉంటుంది. శాకాహారం, మాంసాహారం అనే వర్గాలు అందరికీ తెలిసినవే.. శరీరం బాగా దృఢంగా ఉండాలంటే మాంసాహారం బాగా తినాలని అంటుంటారు కొందరు. కానీ 114ఏళ్ల వయసున్న ఒక బామ్మ తన ఆయుష్షు వెనుక రహస్యాన్ని బయట పెడుతూ నాలుగు పనులు చేయడం వల్లే తనకు దీర్ష ఆయుష్షు లభ్యమైందని, తను వాటిని ఫాలో అవుతున్నానని చెప్పుకొచ్చింది. ఇంతకీ అంత శక్తి వంతమైన ఆ నాలుగు పనులు ఏంటో తెలుసుకుంటే.. నవోమి వైట్ హెడ్ అనే వృద్ధురాలి వయసు అక్షరాలా 114 ఏళ్ళు. ఆమె పెన్సిల్వేనియాలో నివసిస్తుంది. అమెరికా దేశంలోకెల్లా జీవించి ఉన్న అతిపెద్ద వయస్కురాలు ఈమెనె. ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన ఆమె తన 114వ పుట్టినరోజును కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకుంది. 1910లో జన్మించిన ఈమె అన్నేళ్లు జీవించడం వెనుక నాలుగు రకాల కూరగాయల తో పాటు కొన్ని పనులు కూడా సహాయపడ్డాయట. ఇంటి కూరగాయలు.. బామ్మగారు తను ఆహారంలో తినే కూరగాయలను తనే తన ఇంటి పెరట్లో పండించుకునేవారట. ప్రతి కూరగాయను తన ఇంటి వెనుక ఉన్న స్థలంలో ఒక చిన్న తోట పెంచి అందులో పండించుకునే వారట. దీని వల్ల రసాయలనాలు లేని కూరగాయలను ఆహారంలో సాధ్యమైంది. ఒక వేళ ఇంటి పెరడు లేకపోతే కనీసం మిద్దెతోట వంటివి ఏర్పాటు చేసుకుని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చని అంటున్నారు. చెడు అలవాట్లు.. చాలామంది చెడు అలవాట్ల కింద మద్యపానం, ధూమపానం ను చెబుతుంటారు. ఇవి మనిషి ఆయుష్షును తగ్గిస్తాయి. మద్యపానం., ధూమపానానికి దూరం ఉండేవారు దీర్ఘకాలం జీవించవచ్చని అంటున్నారు. చురుకుదనం.. శారీరకంగా చురుకుగా ఉండటం ఎంతో ముఖ్యం. ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉంటే అంత ఆయుష్షు అంటున్నారు. ప్రతి రోజూ వ్యాయామం చేయడమే కాకుండా వీలైనన్ని పనులు సొంతంగా చేసుకోవడం వల్ల శరీరం బాగా ఫిట్ గా తయారవుతుంది. ఇది ఎక్కువ కాలం జీవించడానికి సహాయపడుతుంది. ఆహారం.. శరీరానికి శక్తికి మూల వనరు ఆహారమే.. తీసుకునే ఆహారం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. సొంతంగా పండించుకున్న కూరగాయలను వండుకోవాలి. ఇంటి ఆహారమే తినాలి. బయటి ఆహారం అస్సలు తినకూడదట. ముఖ్యంగా ఇప్పట్లో బాగా అమ్ముడుపోతున్న పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్ అస్సలు తినకూడదని బామ్మగారు చెప్పారు. సమతుల ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. *రూపశ్రీ.
read moreఈ మూలికలు వాడితే చాలు.. ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి..!
కాలుష్యం నేటి కాలంలో ప్రజలకు అతిపెద్ద ముప్పు తెచ్చిపెడుతోంది. గాలి, నీరు, ఆహారం తో పాటు జీవనవిధానం కూడా చాలా వరకు కలుషితమైపోయింది. చాలామంది జీవినశైలి చాలా అధ్వానంగా మారింది. ఇంటి నుండి బయటకు వెళితే వాహనాల పొగ, ఫ్యాక్టరీల నుండి వెలువడే పొగ.. మొదలైన వాటి వల్ల గాలి కాలుష్యం ఎక్కువగా ఉంటోంది. దీని వల్ల ఊపిరితిత్తులు చాలా దారుణంగా దెబ్బతింటాయి. నిజానికి ధూమపానం కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతింటాయని అనుకునేవారు. కానీ నేటికాలం వాతావరణ కాలుష్యం వల్ల కూడా ఊపిరితిత్తులు ప్రమాదంలో పడుతున్నాయి. అయితే గాలి కాలుష్యం వల్ల ఊపిరితిత్తులలో పేరుకున్న మురికి శుభ్రం చేసుకోగలిగితే ఊపిరితిత్తులను జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఇందుకోసం కొన్ని మూలికలు తీసుకోవాలని ఆయుర్వేదం చెబుతోంది. ఇంతకీ అవేంటో తెలుసుకుంటే.. తులసి.. తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి. దగ్గు, జలుబు, ఉబ్బసం వంటి సమస్యలలో తులసి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. నాలుగైదు తులసి ఆకులను ప్రతిరోజూ ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో మరిగించి ఆ నీటిని తాగాలి. లేదా తులసి ఆకుల రసాన్ని తీసి అందులో కొద్దిగా తేనె కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అల్లం.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం అల్లంలో యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులలో వాపును తగ్గిస్తుంది. ప్రతిరోజూ అల్లాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ఇది చాలా బాగా సహాయపడుతుంది. అతి మధురం.. అతి మధురం ఆయుర్వేదంలో చాలా శక్తివంతమైన మూలిక. ఇది శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఊపిరితిత్తులను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. ఇది మాత్రమే కాకుండా దగ్గు, గొంతు నొప్పి, ఉబ్బసం వంటి సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది. తిప్పతీగ.. తిప్పతీగ లో యాంటీ ఆక్సిడెంట్లు, ఇమ్యునోమోడ్యులేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులను బలోపేతం చేస్తాయి. పైగా మధుమేహం ఉన్నవారికి కూడా చాలా మంచిది. తిప్పతీగను పొడి రూపంలో లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. *రూపశ్రీ.
read moreకంటిచూపు నుండి మధుమేహం వరకు.. 300 సమస్యలకు చెక్ పెట్టే ఆకు ఇది..!
టెక్నాలజీ పెరిగాక ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. శరీరం కష్టపడకుండా ఉద్యోగాలు చేసుకుంటే హాయిగా ఉండవచ్చని చాలా మంది అనుకుంటారు. కానీ దీని వల్ల జబ్బుల రాజ్యం ఉదృతమైంది. కంటి సంబంధ సమస్యలు, మధుమేహం, ఊబకాయం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఆహారంతోనే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా గ్రామాలలోనూ, పట్టణాలలోనూ విరివిగా పెరిగే మునగ చెట్ల నుండి మునక్కాయలు కాస్తాయని అందరికీ తెలుసు. వీటిని డబ్బు పెట్టి కొనుక్కుంటాం. అయితే మునగ ఆకులను కూడా ఆహారంలో తీసుకోవచ్చు. పచ్చిగా ఉన్న ఆకులను తీసుకోలేని పక్షంలో ఎండిన మునగ ఆకులను అయినా పొడి చేసి వినియోగించవచ్చు. ఇంతకీ మునగ ఆకులలో ఉండే పోషకాలేంటి? ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది తెలుసుకుంటే.. పోషకాలు.. మునగ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. మునగ ఆకుల్లో ఐరన్, కాల్షియం, విటమిన్ సి, విటమిన్ ఎ తో పాటు అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఐరన్, కాల్షియంతో పాటు, విటమిన్ బి, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను కూడా కలిగి ఉంటాయి, ఇవి శరీరానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. ఇవి ఆరోగ్యకరమైన జీవనశైలికి ఒక వరం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మునగ ఆకులను ఆహారంలో తీసుకుంటే300 రకాల జబ్బులకు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రయోజనాలు.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మునగ ఆకులు చాలా మేలు చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి, శరీరంలో ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచుతాయి. వీటిని ఆహారంలో చేర్చడం ద్వారా, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. మునగ ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లను నివారించడానికి మునగ ఆకులను తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. విటమిన్ సి కాకుండా ఇందులో విటమిన్ ఎ కూడా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక వ్యవస్థను మరింత ప్రభావవంతంగా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి మునగ ఆకులు చక్కని పరిష్కారం. మునగ ఆకుల్లో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా మునగ ఆకులు శరీరం నుండి విషాన్ని తొలగిస్తాయి. జీవక్రియను వేగవంతం చేస్తాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మునగ ఆకులలో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ముఖ్యంగా మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మహిళలు తరచుగా ఐరన్, కాల్షియం లోపాన్ని ఎదుర్కొంటారు. మునగ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి, బోలు ఎముకల వ్యాధి వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మునగ ఆకుల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. విటమిన్ ఎ తీసుకోవడం కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, రేచీకటి వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, వయస్సుతో వచ్చే బలహీనతలను నివారిస్తుంది. *రూపశ్రీ.
read moreఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఆరోగ్య ప్రయోజనాలెన్నో!
చూడటానికి గుండ్రంగా కనిపించే అంజీర్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఓ రెండు అంజీర్ పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కొందరు బాదం, వాల్నట్లను, అత్తి పండ్లతో నానబెట్టి తింటుంటారు. అంజీర్ నానబెట్టిన నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పునరుత్పత్తి వ్యవస్థకు మంచిది: అత్తి పండ్లలో ఎక్కువ మొత్తంలో ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ మిమ్మల్ని సమతుల్యంగా ఉంచుతాయి. ఉదాహరణకు జింక్, మాంగనీస్, మెగ్నీషియం, ఇనుము మొదలైనవి. ఇవన్నీ కూడా మీ జీర్ణవ్యవస్థకు అనుగుణంగా ఉంటాయి. అంజీర్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మహిళల్లో రుతుక్రమం తర్వాత, హార్మోన్ల సమస్యలకు ప్రత్యేకంగా సహాయపడుతుంది. మెనోపాజ్ సమస్యలకు ఇది దివ్యౌషధం వంటిది. షుగర్ కంట్రోల్లో ఉంటుంది: మీ రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగ్గా నిర్వహించగల గుణం అత్తి పండ్లలో ఉంటుంది. ఎందుకంటే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఇప్పటికే టైప్ 2 డయాబెటిస్తో బాధపడుతున్న వారు నీటిలో నానబెట్టిన అంజీర పండ్లను తీసుకోవడం చాలా మంచిది. ఓట్స్‌తో పాటు అత్తి పండ్లను కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. మలబద్ధకం నుంచి ఉపశమనం: చాలా మందికి కడుపుకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. మలవిసర్జన సరిగా జరగకపోవడం వల్ల జీర్ణవ్యవస్థ విచ్ఛిన్నమై మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. అలాంటి వారికి రాత్రిపూట అంజూర పండును నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగడం వల్ల మలవిసర్జన సులభతరం చేయబడి, దీర్ఘకాలంగా ఉన్న మలబద్ధకం సమస్య దూరమవుతుంది. చర్మ ఆరోగ్యానికి మంచిది: ఉదయం పూట రాత్రంతా నానబెట్టిన అంజీర్ నీటిని తాగడం వల్ల మన శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇది మన చర్మ కాంతిని పెంచడంతోపాటు చర్మ సమస్యలను నయం చేస్తుంది. తద్వారా మీ అందం పెరుగుతుంది. బరువు తగ్గుతారు: ఈ రోజుల్లో శరీర బరువు తగ్గించుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. దీని కోసం ఆహార నియమాలు, వ్యాయామాలు అనుసరిస్తున్నారు. కానీ బరువు తగ్గించుకోవడానికి ఫైబర్ కంటెంట్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అత్తిపండ్లు మనకు అవసరమైన ఫైబర్‌ని అందిస్తాయి. అయితే దీన్ని రెగ్యులర్ పరిమాణంలో తీసుకోవాలి. అధిక బరువు ఉన్నవారు దీన్ని ఎక్కువగా తింటే మళ్లీ బరువు పెరిగే అవకాశం ఉంది.
read moreటీ పొడి నాణ్యతను గుర్తించడం సాధ్యమేనా? నకిలీ టీ పొడిని ఇలా గుర్తించవచ్చు.!
టీ అనేది భారతీయలకు చాలా ఎమోషన్. ప్రతిరోజూ టీ తాగనిదే పనులను అణువంత కూడా ముందుకు కదలవు. అయితే టీ పొడిలో నాణ్యత కూడా కీలక పాత్ర పోషిస్తుంది. టీ పొడిని చాలా సులభంగా కల్తీ చేస్తారు. టీ పొడి నాణ్యమైనదా లేదా కల్తీదా తెలుసుకోవాలంటే కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో కావాలి.. ఫిల్టర్ పేపర్ తో.. టీ ఆకులు కల్తీ అయ్యాయా లేక నాణ్యమైనవా అనే విషయం కనుగొనడానికి ఫిల్టర్ పేపర్ ను ఉపయోగించ వచ్చు. ఫిల్టర్ పేపర్ తీసుకుని ఆ పేపర్ పైన టీ పొడిని వేయాలి. ఫిల్టర్ పేపర్ ను కొద్దిగా తడిపి దాని మీద కొంచెం నీరు చిలకరించాలి. తరువాత ఫిల్టర్ పేపర్ ను తీసుకుని లైట్ దగ్గర పరిశీలించాలి. మీరు వాడినది కల్తీ టీ పొడి అయితే ఫిల్టర్ పేపర్ మీద నల్లని, గోధుమ రంగు మరకలు కనిపిస్తాయి. కల్తీ లేని టీ ఆకులు అయితే ఫిల్టర్ పేపర్ పైన ఎలాంటి మరకలు ఉంచవు. నీటితో.. ఒక గ్లాసులో నీరు తీసుకోవాలి. ఈ నీటిలో టీ ఆకులు వేయాలి. నీటిలో టీ ఆకులు వేయగానే అవి రంగు మారుతుంటే.. ఆ టీ ఆకులకు కలర్ మిక్స్ చేశారని అర్థం. స్వచ్చమైన టీ ఆకుల రంగు చాలా నెమ్మదిగా రిలీజ్ అవుతుంది. రుచి.. స్వచ్చమైన, తాజా టీ ఆకులు అయితే ఫ్రెష్ గా రుచికరంగా ఉంటాయి. కానీ చేదుగా లేదా చప్పగా ఉన్నా.. లేదా తీపిగా లేదా కారంగా అనిపిస్తున్నా అవి కల్తీ చేసిన టీ ఆకులు అని అర్థం. మార్కెట్ లో దొరికే వివిధ రకాల ఫ్లేవర్ లలో ఉండే టీ ఆకులు చాలా వరకు పాత బడినవే అయి ఉంటాయి. వాటికి ఇలాంటి ఫ్లేవర్ జోడించి తాజాదనం అనుభూతిని జొప్పించి అమ్మేస్తుంటారు. రంగు.. స్వచ్చమైన టీ ఆకులు ఆకుపచ్చ రంగులో లేదా నల్లగా ఉంటాయి. కానీ కల్తీ టీ ఆకులు గోధుమ లేదా ఎరపు లేదా పసుపు వంటి ఇతరలతో కూడా ఉండే అవకాశం ఉంది. స్వభావం.. నిజమైన టీ ఆకులు పొడిగా, మృదువుగా, ముట్టుకుంటే పగిలిపోయేలా ఉంటాయి. అంటే విరిగిపోయేలా ఉంటాయి. ముఖ్యంగా వీటి సైజ్ చాలా పెద్దగా ఉంటాయి. కల్తీ టీ .. చాలా వరకు కల్తీ టీ ఆకులను టీ బ్యాగ్ ల రూపంలో అమ్మేస్తారు. ఎందుకంటే టీ బ్యాగ్ లలో ఉన్న ఆకులను బయటకు తీసి పరిశీలించే అవకాశం ఉండదు కాబట్టి. పైగా ఈ టీ బ్యాగుల తయారీలో కాగితానికి మైనం పూత ఉంటుంది. ఇది నీటిలో కరికి కడుపులోకి వెళ్లడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం కలుగుతుంది. *రూపశ్రీ.
read moreఆస్తమాను కంట్రోల్ చేసే పళ్ళు.. కూరగాయాలు...
అస్తమా వయస్సుతో నిమిత్తం లేకుండా వేదించే ఊపిరి తీసుకోవడం లో కష్టంగా ఉంటుంది. ఇందుకోసం ఎన్నొఏళ్ళుగా అనేక రకాల ఇంహేలర్లు మందులు వాడుతూనే ఉంటారు. వాతావరణం మారిందా ఆస్తమా తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. ప్రతి ఏటా వరల్డ్ అస్తమా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీ ఈ సందర్భంగా అస్తమా పై అవగాహన కొన్ని రకాల అస్తమా లక్షణాలను తగ్గించడం లో కొన్ని రకాల కూరగాయాలు పళ్ళు సహకరిస్తయన్న విషయం మీకు తెలుసా. పిల్లల నుండి పెద్దలు అంటే వృ ద్దుల వరకూ అస్తమా బారిన పడుతూనే ఉన్నారు.అస్తమా వచ్చిన వారిలో శ్వాస తీసుకోవడం తీవ్ర ఇబ్బందిగా ఉంటుంది. దీనికి కారణం తీవ్రమైన దగ్గు.ఊపిరి పీల్చుకోవడం గుండెల్లో మంట,వంటి సమస్యలు వస్తాయి. చికిత్సలో భాగం గా ఇన్హేలర్ లు వినియోగిస్తారు.అలాగే కొన్ని రకాల కూరగాయాలు పళ్ళు అస్తమా లక్షనాలను తగ్గించడం లో మీకు సహాయ పడుతుంది. సిమ్లా మిర్చి... సిమ్లామిర్చి యాంటి ఆక్సిడెంట్ గా ను,విటమిన్ సి ఫైటో న్యుట్రీ యంట్స్ గుణాలు సంపూర్ణంగా ఉంటాయి అది మీఅరోగ్యానికి పూర్తిగా సహకరిస్తుంది. దానిమ్మ పండు.. ఇందులో విట మిన్ సి పీచుపదార్ధము యాంటి ఆక్సిడెంట్ సంపూర్ణంగా ఉంటాయి.ముఖ్యంగా శ్వాస నాళం నాశనంకాకుండా సహకరిస్తుంది.వ్యక్తి బలహీనంగా ఉన్నప్పుడు శరీరంలో రక్తం శాతం తగ్గినప్పుడు. దానిమ్మ జ్యూస్,లేదా దానిమ్మ గింజలు ఆరోగ్యవంతులను చేసేది దానిమ్మ పండే అస్తమాతో ఇబ్బడి పడుతూ నీరసించి పోయేవారికి అద్భుత మైన ఔషదం గాసంజీవని గా పనిచేస్తుంది. అల్లం... అల్లం లో యాంటి ఆక్సిడెంట్ సంపూర్ణంగా ఉంటుంది.ఒత్తిడిని నియంత్రిస్తుంది.శరీరంలో డి ఎన్ ఏ కు ఎలాంటి నష్టం జరగ కుండా నిలువరించడం లో అల్లం సహాయ పడుతుంది.బ్లడ్ ప్రేషర్,గుండె పోటు.శ్వాస నాళా లలో ,ఊపిరి తిత్తులలో ఎలాంటి అనారోగ్యం తో నైనా పోరాడే విధంగా అల్లం సహాయ పడుతుంది.ముఖ్యంగా శ్వాస నాళాలలో మనకు అడ్డం పడే కళ్ళే ను తొలగించడం లో అల్లం మనకు సహాయ పడుతుంది. పాల కూర... పాల కూరలో ప్రోటీన్,ఐరన్,విటమిన్ మినరల్స్,పొటాషియం మెగ్నీషియం,వంటి విటమిన్ పీచు పదార్ధం పాస్పరస్,తయా మిన్ విటమిన్ ఇ, వంటి పోషకతాత్వాలు ఉంటాయి.పాల కూర వాడకం వల్ల జుట్టు,ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది. ఆస్తమా లక్షణాలను తగ్గించడం లో మీకు సహక రిస్తుంది. టమాట రసం... విటమిన్ సి విటమిన్ బి పొటాషియం సంపూర్ణంగా టమాటా లో ఉంటుంది.లైకో పిన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్ వంటివి సమృద్ధిగా లభించడం వల్ల గుండె అనారోగ్య సమస్యల నుండి క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధుల నుండి తగ్గించడం లో సహకరిస్తుంది. యాపిల్... యాపిల్ సంపూర్ణ పోషకాలు ఉన్న పళ్ళలో సంపూర్ణంగా పీచుపదార్ధం ఉండడం వల్ల.శరీర బరువు తగ్గించడం లో ఊపిరి తీసుకోవడం లో సహకరిస్తుంది. అయితే యాపిల్ డయాబెటిస్,గుండె సంబంధిత క్యాన్సర్,దీర్ఘకాలిక రోగాలను నిలువరించడం లో సహకరిస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఒక్క యాపిల్ తింటే చాలు అని న్యూ ట్రీషియనిస్ట్ లు అంటున్నారు. బీన్స్... బీన్స్ లో విటమిన్ ఏ,సి పోలక్ట్ యాసిడ్ ,కాల్షియం,ఫైబర్,సంపూర్ణంగా ఉంటుంది.బీన్స్ ఎముకలను పటిష్టంగా బలంగా ఆరోగ్యంగా ఉంచేందుకు. ఎముకలు విరగడం వంటి ప్రమాదాల నుండి కాపాడ డం లో కీలక పాత్ర పోషిస్తుంది.బీన్స్ లో విటమిన్ బి,డిప్రెషన్ ను తగ్గించడం లో మీకు బీన్స్ సహాయ పడుతుంది. కమలా పండు... సంత్రా... విటమిన్లు ,ఖనిజ లవణాలు యాంటి ఆక్సిడెంట్ తో నిండిన పోషక తత్వాలు ఖజానా ఉంటుంది.పైన పేర్కొన్న పండ్లు కూరగాయాలు శ్వాస కొస సంబంధిత సమస్యలను నిలువరించడం లో సహాయ పడుతుంది.
read more



.webp)







.webp)

.webp)

.webp)





.webp)
