ఈ లక్షణాలు కనిపిస్తే శరరీంలో రోగనిరోధక శక్తి తగ్గినట్టే!
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధక శక్తి చాలా అవసరం. చాలావరకు చలికాలంలో జబ్బులు, అంటువ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే అధికశాతం మంది రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి కషాయాలు, రోగనిరోధక శక్తి పెంచే ఆహారాలు, చ్యవనప్రాశ్ వంటి లేహ్యాలు వాడతారు. అయితే శరీరంలో రోగనిరోధక శక్తి లోపిస్తే శరీరం కొన్ని లక్షణాలను వ్యక్తం చేస్తుంది. ఆ లక్షాలేవీ లేకుండా ఊరికే ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు, పానీయాలు అతిగా తీసుకోవడం కూడా సమస్యను తెచ్చిపెడుతుంది. శరీరం అసౌకర్యానికి గురవుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందనడానికి కనిపించే కొన్ని లక్షణాలేంటో తెలుసుకుంటే.. ఒత్తిడి, నిరాశ.. ఒత్తిడి, నిరాశ మనిషిలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్లే సంభవిస్తాయి. ఒత్తిడి శరీరంలో తెల్లరక్తకణాల పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఇవి శరీరానికి ఆర్మీ ఫోర్స్ లాంటివి. ఇన్ఫెక్షన్లతో పోరాడి వాటిని విచ్చిన్నం చేసేది ఇవే. కాబట్టి ఒత్తిడి, నిరాశ అనేవి శరీరంలో తెల్లరక్తకణాలు తగ్గాయనడానికి సూచన, తెల్లరక్తకణాలు లోపిస్తే రోగనిరోధక శక్తి లోపించింది అనడానికి సూచన. జలుబు, దగ్గు.. చలికాలంలో రెండు నుండి మూడు సార్లు జలుబు, దగ్గు రావడం సహజమే. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ వ్యాధులతో పోరాడే ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడానికి 3 నుండి 4 రోజుల సమయం పడుతుంది. ఆ తరువాత శరీరం సమస్యల నుండి కోలుకోవడానికి 6 నుండి 8 రోజుల సమయం పడుతుంది. కానీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే ఎక్కువ రోజులు జలుబు, దగ్గు వేధిస్తాయి. చెవి సమస్యలు.. చెవి సమస్యలు చాలామందిలో వాతావరణ మార్పుల వల్ల కలుగుతుంటాయి. సంవత్సరంలో నాలుగు సార్లకు మించి చెవి సమస్యలు వస్తున్నా, సంవత్సరంలో రెండు సార్లకు మించి న్యుమోనియా వస్తున్నా రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉన్నట్టు లెక్క. ఇలాంటి సమస్యలు వస్తే మాత్రం అస్సలు నిర్లక్ష్యంగా ఉేండకూడదు. కడుపు సమస్యలు.. ప్రతి వ్యక్తి రోగనిరోధక శక్తి 70శాతం జీర్ణవ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. జీర్ణవ్యవస్థ వల్లే బాక్టీరియా, సూక్ష్మజీవుల ఇన్పెక్షన్ల నుండి ప్రేగులను రక్షిస్తాయి. మలబద్దకం, అతిసారం వంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నట్టైతే రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని అర్థం. గాయాలు.. శరీరంలో గాయాలు నయం కావడంలో ఇబ్బందులుంటే రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నట్టు అర్థం. చాలావరకు కాలిన, తెగిన, పడినప్పుడు తగిలిన గాయాల్లాంటివి రోగనిరోధక శక్తి బాగుంటే అవే తొందరగా తగ్గిపోతాయి. కానీ రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే ఇవి తొందరగా మానవు. కొన్నిసార్లు అవి పుండ్లుగా మారి పెద్ద సమస్యలకు కూడా దారితీసే అవకాశం ఉండచ్చు. శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువ ఉందనడానికి ఇది కూడా కారణం. *నిశ్శబ్ద.
read moreచలికాలంలో చిలగడదుంప తింటే ఎన్ని లాభాలో తెలుసా?
సీజన్ ను బట్టి పండ్లు కూరగాయలు అందుబాటులోకి వస్తాయి. అలాంటి వాటిలో చిలగడ దుంప కూడా ఒకటి. చిలగడ దుంప ఎంత రుచిగా ఉంటుందో అంతకు మించి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఇది నారింజ, ఊదా, తెలుపుతో సహా వివిధ రంగులలో లభిస్తుంది. స్వీట్ పొటాటో స్పెషాలిటీ ఏంటంటే దానిని ఉడబెట్టి అయినా తినచ్చు, కూరల్లోనూ ఉపయోగించవచ్చు, పచ్చిగా కూడా తినవచ్చు. కొన్నిచోట్ల దీన్ని కాల్చి కూడా తింటారు. దీనివల్ల కలిగే ఉపయోగాలేంటో పూర్తీగా తెలుసుకుంటే.. పోషకాల నిధి.. చిలగడ దుంపను పోషకాల నిధి అని చెప్పవచ్చు. కాల్షియం, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, ఫోలేట్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.ఇవి శరీరం తన విధులు సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయపడతాయి. ఫైబర్ మూలం.. చిలగడదుంపలలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. బీటా కెరోటిన్ చిలగడదుంపలో అధిక మొత్తంలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, రేచీకటి నివారించడానికి, మొత్తం కంటి ఆరోగ్యం నిర్వహించడానికి విటమిన్ ఎ ముఖ్యమైనది. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది చిలగడ దుంపలలో సహజ చక్కెరలు ఉన్నప్పటికీ తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. అంటే అవి చక్కెరను రక్తప్రవాహంలోకి నెమ్మదిగా విడుదల చేస్తాయి. ఇది బ్లడ్ షుగర్ ని మెరుగ్గా నియంత్రిస్తుంది. వెయిట్ లాస్ చిలగడ దుంపలో ఫైబర్ తో పాటు పోషకాలు ఉంటాయి. ఇవి రెండూ కలిసి ఎక్కువ ఆకలి నియంత్రించడంలో సహాయపడతాయి. అధిక కేలరీల తీసుకోడాన్ని నియంత్రిస్తాయి. తద్వారా బరువు నిర్వహణకు సహాయపడుతుంది. గుండెను ఆరోగ్యం చిలగడదుంపలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది, తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే పీచు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహకరిస్తుంది. *నిశ్శబ్ద.
read moreమీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే..!
నేటికాలంలో చాలా మంది ఏదొక సమస్యతో ఒత్తిడికి గురవుతున్నారు. దీనివల్ల సమస్య పరిష్కారం కాకపోగా..ఇతర అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అయితే పెద్దవాళ్లు మాత్రమే కాదు..చిన్నారులు కూడా ఒత్తిడికి లోనవుతున్నారని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులుగా మీరే..దానికి సరైన పరిష్కారం చూపిస్తారు. అయితే పిల్లలు ఒత్తిడికి లోనవుతున్నట్లు మాకేలా తెలుస్తుందనే డౌట్ మీకు రావచ్చు. పిల్లలు ఒత్తిడికి లోనైనప్పుడు కొన్ని రకాల లక్షణాలు వారిలో కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు. అవి ఎలా ఉంటాయి? చిన్నారులను ఒత్తిడి నుంచి ఎలా బయటపడేయాలని..ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అనారోగ్యంతో ఉన్నారేమో గమనించాలి? కొంతమంది పిల్లలు ఒత్తిడికి లోనైనప్పుడు తలనొప్పి, కడుపునొప్పి వంటి సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. అయితే ఇవిసాధారణంగా కూడా ఉంటాయనే సందేహం మీకు రావచ్చు. అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని పిల్లల్లో తరచుగా ఈ సమస్య వస్తున్నట్లయితే..దానిని ఒత్తిడికిందే పరిగణించాలని నిపుణులు అంటున్నారు. టీచర్లు ఇచ్చిన హోం వర్క్ చేయలేకపోవడం, పరీక్షలకు సరిగ్గా సన్నద్ధం కాకపోవడం వల్ల ఒత్తిడికి లోనవుతుంటారు. ఇలాంటివి తల్లిదండ్రులకు చెబితే తిడతారన్న భయం కూడా వారిలో ఉంటుంది. ఇలాంటి సమయంలో వారిని మీరే దగ్గరకు తీసుకుని వారి సమస్యలేంటో అడిగే ప్రయత్నం చేయాలి. అలాగే వారికి ధైర్యం చెప్పాలి. సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించాలి. ఫోన్లో గేమ్స్ ఆడటం? సాధారణంగా పిల్లలు ఎక్కువగా ఫోన్లలో ఆటలు ఆడుతుంటారు. కొన్ని ఆటల వల్ల పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ కొన్ని మాత్రం పిల్లల్లో ఒత్తిడిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారన్నా విషయం కూడా వారికి తెలియదు. అలాని వారిని అసలు ఫోన్లకే దూరం చేయడం కూడా మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఒకవేళ వారికి ఫోన్ ఇచ్చినా దానికంటూ కొంతసమయం మాత్రమే కేటాయించాలి. అలాగే వారు ఆడే ఆటలు చూసే వీడియోలపై కూడా ఓ కన్నేసి ఉంచడం అవసరం. ఏం తింటున్నారు..ఎలా తింటున్నారు? మనం ఆహారం తీసుకునే విధానంలో ఒత్తిడికి లోనవుతున్నామో లేదో సులభంగా తెలిసిపోతుందట. ఇది కేవలం పెద్దలకే కాదు..పిల్లలకు కూడా వర్తిస్తుందని నిపుణులు అంటున్నారు. మీ పిల్లలు అంతకుముందు కంటే ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం కానీ..తక్కువగా తీసుకోవడం కానీ జరుగుతుందంటే దానిని ఒత్తిడి కిందే పరిగణించాలని చెబుతున్నారు. వారు ఏదైనా విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తే ఇలా చేస్తారని అంటున్నారు. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తుంటే వారి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏకాగ్రత? సాధారణంగా ఒత్తిడికి లోనైతే ఏ పనిని సరిగ్గా చేయలేం. ముఖ్యంగా చదువుల విషయంలో ఇది కనిపిస్తుంది. ఒత్తిడి అనేది ఎప్పుడూ బయటి అంశాలపైనే ఆధారపడదు. కొన్ని సందర్భాల్లో మనం చేసే పనులను కూడా నిర్వర్తించినప్పుడు కూడా ఒత్తిడికి గురవుతుంటాం. అలాగే పిల్లలు కూడా చదువు విషయంలో వారు పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోలేనప్పుడు ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ క్రమంలో వారికి అండగా ఉంటూ తగిన సహకారం అందించడం చాలా ముఖ్యం. తద్వారా వారిని ఒత్తిడి నుంచి బయటపడేయవచ్చు అంటున్నారు నిపుణులు.
read moreసలాడ్ తినే అలవాటుందా? ఈ అయితే ఈ నిజాలు తెలుసుకోండి..!
ఈమద్యకాలంలో చాలామంది ఓ ఆహారపు అలవాటును బాగా ఫాలో అవుతున్నారు. అదే సలాడ్. కొందరు పండ్లతో సలాడ్ తింటే.. మరికొందరు పచ్చిగా తినదగిన కూరగాయలతో సలాడ్ చేసుకుని తింటూంటారు. ఇది శరీరానికి ఆరోగ్యాన్ని, విటమిన్లను, పైబర్ ను సమృద్దిగా అందిస్తుందని.. బరువు నిర్వాహణలో తోడ్పడుతుందని చెబుతారు. అయితే సలాడ్ లు ఎప్పుడు తినాలి? ఏ సమయంలో తినాలి? ఎలా తింటే ఆరోగ్యం? ఎప్పుడు తినకూడదు? తెలుసుకుంటే.. సలాడ్ తింటే కలిగే ప్రయోజనాలు.. సలాడ్ లో చాలావరకు పచ్చికూరగాయలు ఉంటాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. చర్మం లోపలి కణాలు, శరీరానికి బయట కలిగే గాయలను తొందరగా తగ్గించడంలో సలాడ్లు తినడం సహాయపడుతుంది. దోసకాయ, బీట్ రూట్, పచ్చి ఉల్లిపాయ,నిమ్మకాయ, టమోటా మొదలైనవి పచ్చిగా తీసుకుంటే కాలేయ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. చలికాలంలో సలాడ్ తినడం గురించి చాలామంది సందిగ్ధంలో ఉంటారు. దీనికి కారణం పచ్చి కూరగాయలు తినడం వల్ల జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సమస్యలు సులువుగా వస్తాయని. అయితే చలికాలంలో క్యారెట్, ముల్లంగి, క్యాబేజీ, ముల్లంగి రుచితో బీట్రూట్ ఆకారంలో ఉండే టర్నిప్ దుంపలు చలికాలపు సలాడ్ లో జోడించుకోవచ్చు. ఇవే కాకుండా పండ్లు కూడా తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో నీటి కొరత ఉండదు. సలాడ్ తినడానికి సరైన సమయం.. చాలామంది సలాడ్ అంటే ఎక్కువగా కీరా, క్యారెట్, టమోటాలను తింటూంటారు. వీటిని కూడా భోజనంతో పాటు తింటూంటారు. ముఖ్యంగా బిరియానీలతో పచ్చి ఉల్లిపాయ, క్యారెట్, నిమ్మకాయ, టమోటా వంటివి ఇవ్వడం చూస్తుంటాం. వీటిని ఉడికించిన ఆహారంతో పాటు తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. జీర్ణసమస్యలు ఎదురవుతాయి. ఉడికించిన ఆహారంలో ఉష్టోగ్రత, ఆహారం గుణాలు, సలాడ్ లోని ఉష్టోగ్రత, వాటి గుణాలు రెండూ వేరు వేరు కాబట్టి ఇది జరుగుతుంది. అందుకే సలాడ్ లను ఎప్పుడూ ఆహారానికి అరగంట ముందు తీసుకోవాలి. లేదా ఉదయం కాస్త ఆకలిగా ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు. ఆహారంతో ఎందుకు తినకూడదంటే.. ఆహారంతో పాటు సలాడ్లు తీసుకోకూడదు అనడానికి మరిన్ని కారణాలు ఉన్నాయి. ఆహార స్థితిని బట్టి దాన్ని జీర్ణం చేయడానికి శరీరంలో కాలేయం ఎంజైమ్ లను విడుదల చేస్తుంది. దీనివల్లే ఆహారం జీర్ణం అవుతుంది. కానీ సలాడ్లు ఆహారంతో తీసుకోవడం వల్ల కాలేయం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మరొక కారణం ఏమిటంటే.. చల్లని ఆహారం, ఉడికించిన ఆహారం రెండూ కలిపి తింటే ఆయుర్వేదం ప్రకారం జఠరాగ్ని మందగిస్తుంది. జఠరాగ్ని అనేది ఆహారాన్ని జీర్ణం చేసే శక్తి. సలాడ్లు ఆహారంతో కలిపి తీసుకోవడం దీర్ఘకాలం కొనసాగితే జీర్ణశక్తి మందగిస్తుంది. *నిశ్శబ్ద.
read moreప్రోటీన్ పౌడర్లు కాదు.. ఈ డ్రింక్ 15రోజులు తాగితే చాలు.. శరీరం ఉక్కులా మారుతుంది!
ఎప్పుడూ అలసటగా, బలహీనంగా ఉంటుందా? బద్దకంగానూ, మోకాళ్లలో నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? వీటిని అధిగమించడానికి జిమ్ కు వెళ్తున్నా, మార్కెట్లో లభించే ఖరీదైన ప్రొటీన్ పౌడర్లు తీసుకుంటున్నా అంత ఫిట్ గా అనిపించడం లేదా? ఈ సమస్యలను గనుక ఎదుర్కొంటున్నట్లయితే, ప్రోటీన్ తీసుకునే విధానాన్ని మార్చుకోవాలి. నిత్యం బలహీనంగా ఉంటే శరీరంలో ప్రాణం ఉండదని, మోకాళ్లలో నొప్పులు వస్తుంటే మంచి ప్రోటీన్ అవసరం అని అర్థం. ఇంట్లోనే ఆరోగ్యకరమైన ప్రొటీన్‌ను ఎలా తయారు చేసుకోవచ్చో, దాని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే.. ప్రోటీన్ పౌడర్ కు కావలసిన వస్తువులు.. 60 గ్రాముల వేయించిన శనగలు 2 ఖర్జూరాలు. 1 అపటిపండు 1 గ్లాసు పాలు బెల్లం రుచికి సరిపడా తయారువిధానం.. ముందుగా వేయించిన శనగలను మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇలా తయారుచేసిన పొడిని సత్తు అని అంటారు. ఇది బీహార్ లో ఫేమస్. ఇందులో ప్రోటీన్, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఈ పొడిలో అరటిపండు, ఖర్జూరం, బెల్లం, పాలు వేసి కలపాలి. అంతే ఎంతో పోషకరమైన ప్రోటీన్ డ్రింక్ సిద్దమైనట్టే. ప్రయోజనాలు.. ఈ మిశ్రమాన్ని కేవలం 15 రోజుల పాటు తీసుకోవడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. బలహీనతతో బాధపడుతున్నవారు దీనిని తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రొటీన్లే కాకుండా శరీర సామర్థ్యం పెరగడానికి అవసరమైన అన్ని పోషకాలు దీంట్లో లభిస్తాయి. ఈ శక్తివంతమైన ప్రోటీన్ డ్రింక్ లో కాల్షియం వల్ల కేవలం 15 రోజుల్లోనే శరీరంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. జిమ్ కు వెళ్లే అలవాటున్నా,వర్కౌట్లు చేస్తున్నా ఈ డ్రింక్ కు తీసుకుంటూ ఉంటే శరీరం దృడంగా మారుతుంది. ఎముకలు, కండరాలలో బలం పుంజుకుంటుంది. శరీరం ఉక్కులా మారుతుంది. *నిశ్శబ్ద.
read moreపాలలో కలిపి ఈ ఆహారాలు తీసుకుంటే విషంతో సమానం..
ఆహారమే ఆరోగ్యం. మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచి ప్రమాదకరమైన జబ్బులను సైతం తట్టుకునేలా చేస్తుంది. కానీ ఆరోగ్యం అనుకుంటూనే చాలామంది ఆహారం విషయంలో తప్పులు చేస్తారు. ఈ తప్పులు కాస్తా పెద్ద ముప్పులకు దారితీస్తాయి. చాలామంది సాధారణమేలే అనుకుంటూనే పాలతో కొన్ని పదార్థాలు మిక్స్ చేయడం లేదా పాలతో పాటు తినడం చేస్తుంటారు. అవి పాలతో పాటు తీసుకోగానే విషంతో సమానమైన నష్టాన్ని శరీరానికి కలిగిస్తాయి. ఆయుర్వేదం ఈ విషయాన్ని తెలిపింది కూడా. ఈ ఆహారాలు కొన్ని అప్పటికప్పుడు వాటి ప్రభావం చూపకపోయినా అవి స్లో పాయిజన్ లా శరీరాన్ని, శరీరంలో అవయవాలను నిర్వీర్యం చేస్తాయి. పాలతో తినకూడని ఆ ఆహారాలేంటో తెలుసుకుంటే.. పాలు.. చేపలు.. పాలు, చేపలు కలిపి వండటం, పాల ఉత్పత్తులైన పనీర్, పెరుగు, చీజ్ వంటి వాటితో కలిపి చేప వంటకాలను తయారుచేయడం అస్సలు చేయకండి. చేపలు, పాలు, పాల ఉత్పత్తులతో కలిస్తే ఆహారం విషపూరితం అవుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్ కు దారితీస్తుంది. జీర్ణాశయాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది. మరీ ముఖ్యంగా ఈ కాంబినేషన్ తింటే చర్మ సంబంధ సమస్యలు వస్తాయి. పాలు.. పుల్లని పండ్లు.. పుల్లని పండ్లను సిట్రస్ పండ్లు అని కూడా అంటారు. సిట్రస్ పండ్లలో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా పాలలో కాసింత నిమ్మరసం పడితే పాలు విరిగిపోవడం గమనించే ఉంటారు. అలాగే పనీర్ తయారీకి చాలామంది పాలలో నిమ్మరసం పోసి తయారుచేస్తుంటారు. అయితే పనీర్ ను మళ్లీ వేయించడం లేదా ఉడికించడం చేస్తారు కాబ్టటి అది తిన్నా పర్వాలేదు. కానీ పాలు-సిట్రస్ పండ్ల కాంబినేషన్ చాలా ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. కడుపులో గందరగోళం ఏర్పరుస్తుంది. జీర్ణాశయాన్ని దెబ్బతీస్తుంది. పాలు.. బ్రెడ్డు.. చాలామంది ఇష్టంగా తినే కాంబినేషన్ ఇది. ఉదయాన్నే కొందరు దీన్ని అలవాటుగా తింటే.. ఆరోగ్యం బాలేనప్పుడు పాలు-బ్రెడ్డు తింటుంటారు. అయితే బ్రెడ్డులో కూడా ఈస్ట్ బ్రెడ్డును పాలతో తినడం మంచిది కాదు. ఇది కడుపులో అసౌర్యం కలిగిస్తుంది. జీర్ణాశయాన్ని బలహీనంగా మారుస్తుంది. జీర్ణాశయ గోడలను మెల్లగా శిథిలం చేస్తుంది. పాలు.. అరటిపండ్లు.. పాలు, అరటిపండ్లు చాలా మందికి ఇష్టమైన కాంబో. గ్లాసుడు పాలు, ఓ అరటిపండు తింటే దాదాపు రెండు గంటల సేపు ఆకలి అనే మాట మాట్లాడరు. ఈ కాంబినేషన్ వల్ల పుడ్ పాయిజనింగ్ వంటి ప్రమాదాలు ఏర్పడకపోయినా గొంతులో కఫానికి దారితీస్తుంది. ఇది శ్వాస సంబంధ సమస్యలకు, రోజంతా చికాకుగా ఉండటానికి కారణం అవుతుంది. పాలు.. పుచ్చకాయ, కర్బూజ.. పుచ్చకాయ, కర్బూజ వంటి పండ్లలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పండ్లను పొరపాటున పాలతో తీసుకోకూడదు. చాలామంది ఈ పండ్లకు పాలు కలిపి మిల్క్ షేక్ తయారుచేసుకుని తాగడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఇవి తీసుకోవడం వల్ల జీర్ణసంబంధ సమస్యలు ఏర్పడతాయి. అంత ఈజీగా వదలవు. కేవలం పైన చెప్పుకున్నవే కాకుండా పాలతో పాటూ ఉప్పు, కారం, మాంసాహారం, ఆకు కూరలు వంటివి తీసుకోకూడదు. *నిశ్శబ్ద.
read moreఆహారాన్ని పదే పదే వేడి చేస్తున్నారా?
సాధారణంగా మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్ లో పెట్టేస్తాం. కూరలు, పప్పులు అయితే తప్పకుండా పెడుతుంటాం. కావాల్సినప్పుడు వాటిని బయటకు తీసుకుని వేడిచేసుకుని తింటుంటాం. ఇలా చేయడం వల్ల ఆహారం వేస్ట్ కాకుండా చేశామని అనుకుంటాం. కానీ అనారోగ్యానికి కోరి తెచ్చున్నట్లు అవుతుందని మీకు తెలుసా? -మాంసాహారం, గుడ్లు, పప్పులు వంటివన్నీ మాంసక్రుత్తులు ఎక్కువగా ఉండే పదార్థాలు. వీటిని మళ్లీ మళ్లీ వేడిచేసినట్లయితే వాటిలో ఉండే మాంసక్రుత్తులు విచ్చిన్నమవుతాయి. ఆమ్లాలు ఉత్పత్తై తిన్న ఆహారం జీర్ణం కాకుండా చేస్తాయి. వీటిని తాజాగానే తినడం మంచిది. అస్సలు నిల్వ చేయకూడదు. -ఆహారాన్ని మళ్లీ మళ్లీ వేడిచేయడం వల్ల అందులోని విటమిన్, సి, బి వంటిపోషకాలు నశించిపోతాయి. ఆ ఆహారం తిన్నాకూడా శరీరానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. - అన్నం, పాస్తా వంటివాటిని ఎంత కావాలో అంతే వండుకోవాలి. మిగిలిదాన్ని ఫ్రిజ్ లో పెట్టి వేడిచేసి తింటే హానికర బ్యాక్టీరియాని స్వయంగా శరీరంలోకి ఆహ్వానించినట్లవుతుంది. -ఆలుగడ్డ లేదా బ్రెడ్ వంటి పిండిపదార్థాలను మళ్లీ వేడి చేస్తే క్యాన్సర్ కరకాలు ఉత్పన్నమవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వాటిని తాజాగా ఉన్నప్పుడే తినాలి. ఎక్కువసేపు వండటం, ఫ్రిజ్ లో స్టోర్ చేయడం కంటే కావాల్సినంతే వండుకోవడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.
read moreచలికాలంలో జలుబు,దగ్గుకు చెక్ పెట్టే అమృతసమానమైన కషాయాలు..!
చలికాలంలో విపరీతమైన దగ్గు,జలుబు కారణంగా గొంతులో కఫం ఏర్పడుతుంది. కొన్నిసార్లు గొంతు లోపల పేలుతుంది. దీనికారణంగా రక్తస్రావం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. దగ్గు నుండి ఉపశమనం పొందడానికి కొన్ని ఆరోగ్యకరమైన కషాయాలను ఉపయోగించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. ఈ కషాయాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ డయాబెటిక్, ఇమ్యూన్-బూస్టర్ లక్షణాలు ఉంటాయి. ఉదయాన్నే టీ, కాఫీలకు బదులుగా వీటిని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే వీటిని బెస్ట్ మార్నింగ్ డ్రింక్స్ అంటారు. వాటిని ఎలా తయారు చేయాలో, వాటి ప్రయోజనాలేంటో తెలసుకుంటే.. అల్లం, పసుపు.. అల్లం పసుపు కలపడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇమ్యూనిటీ బూస్టర్ లక్షణాలు పుష్కలంగా ఉండే ఎఫెక్టివ్ డికాక్షన్ తయారవుతుంది. ఈ డికాషన్ జలుబుతో పోరాడటమే కాకుండా జీర్ణక్రియకు సహాయపడుతుంది. తయారు విధానం.. తురిమిన అల్లం, పసుపు, మిరియాలు, దాల్చిన చెక్కను నీటిలో 10-15 నిమిషాలు ఉడకబెట్టాలి. వడపోసి త్రాగే ముందు, కొద్దిగా తేనె, నిమ్మకాయ రసం కలిపి తీసుకోవాలి. తులసి తులసిని ఆయుర్వేదంలో శక్తివంతమైన మూలిక అంటారు. తులసి కషాయం అద్భుతమైన డీకాంగెస్టెంట్‌గా పనిచేస్తుంది, కఫాన్ని తొలగించడం ద్వారా దగ్గు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. యాంటీవైరల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాల వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తయారు విధానం.. తాజా తులసి ఆకులను తీసుకుని, మిరియాలు, లవంగాలు, అల్లం ముక్క వేసి నీటిలో ఉడకబెట్టాలి. కాసేపు మరిగిన తర్వాత రుచికి సరిపడా బెల్లం వేసి తాగాలి. దాల్చిన చెక్క ఒక అధ్యయనం ప్రకారం దాల్చినచెక్కలో పాలీఫెనాల్స్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఏలకులు కూడా ఆక్సీకరణ ఒత్తిడి నుండి కణాలను రక్షిస్తుంది. తయారు విధానం.. దాల్చిన చెక్క, ఏలకులు, అల్లం ముక్క కొన్ని లవంగాలను నీటిలో ఉడకబెట్టాలి. కాసేపు మరిగిన తర్వాత వడకట్టి అందులో ఒక చెంచా తేనె వేసి సిప్ బై సిప్ తాగాలి. ఆయుర్వేద త్రిఫల.. ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమాన్ని త్రిఫల అంటారు. ఆయుర్వేదంలో ఇది శరీరాన్ని శుద్ది చేసి శరీరానికి కొత్త శక్తిని ఇస్తుందని చెబుతారు. రోజూ దీన్ని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తయారు విధానం.. ఒక చెంచా త్రిఫల పొడిని నీటిలో వేసి 5-10 నిమిషాలు తక్కువ మంట మీద మరిగించాలి. మెంతులు,ధనియాలు.. ఈ కషాయాన్ని తాగడం వల్ల రోగనిరోధక శక్తితో పాటు జీర్ణశక్తి పెరుగుతుంది. ఇది శ్వాసకోశ ఆరోగ్యాన్ని, రక్తంలో చక్కెరను కూడా బ్యాలెన్స్ గా ఉంచుతుంది. టైప్ 2 డయాబెటిక్ రోగులలో రక్తంలో చక్కెర, పొట్ట కొవ్వు, వేగంగా తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. తయారు విధానం.. మెంతి గింజలు, దనియాలు, మిరియాలు, దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించాలి. దీన్ని కాసేపు ఉడకబెట్టాలి. తరువాత ఫిల్టర్ చేసి తాగాలి. *నిశ్శబ్ద.
read moreఉదయం బ్రేక్ ఫాస్టులో వీటిని తినకండి..ఈ సమస్యలు తప్పవు.!
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉదయం అల్పాహారం ఆరోగ్యకరమైనదిగా ఉండాలి. దీని వల్ల రోజంతా శరీరంలో శక్తి ఉంటుంది.కానీ చాలా మంది అల్పాహారంలో అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటారు. వీటి వల్ల ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది.అంతేకాదు అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇవి శరీరాన్ని లోపల నుండి బోలుగా చేసి, వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి అందించవు. కాబట్టి, పొరపాటున కూడా బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తినకూడదు. అల్పాహారంలో తీసుకోకూడని కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెడ్, జామ్: చాలా మంది ఉదయం అల్పాహారంగా బ్రెడ్, జామ్ తినడానికి ఇష్టపడతారు. అంతే కాదు చాలా మంది పిల్లల టిఫిన్‌లో బ్రెడ్, జామ్ కూడా ప్యాక్ చేస్తారు. కానీ, బ్రెడ్, జామ్‌లో కొవ్వు, చక్కెర అధికంగా ఉంటుంది. ఇది భవిష్యత్తులో ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. అందువల్ల, మీరు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలనుకుంటే, బ్రెడ్, జామ్ తినకండి. టీ, కాఫీలు తాగకూడదు : ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం వల్ల శరీరంలో యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. దీని కారణంగా మీకు గ్యాస్, బర్నింగ్ సెన్సేషన్, వాపు సమస్యలు ఉండవచ్చు. కాఫీలో పెద్ద మొత్తంలో కెఫీన్ ఉంటుంది. కెఫిన్ వినియోగం ఆరోగ్యానికి చాలా హానికరం. పాన్కేక్లు, స్వీట్లు: మీరు ఉదయం పూట పాన్కేక్లను అస్సలు తినకూడదు. నిజానికి అల్పాహారం కోసం తీపి పదార్థాలు తినకూడదు. ఎందుకంటే ఉదయం పూట తీపి పదార్థాలు తినడం వల్ల మీ షుగర్ లెవెల్ పెరుగుతుంది. భవిష్యత్తులో మీరు డయాబెటిస్తో బాధపడవచ్చు. క్యాన్డ్ జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్: ఉదయం అల్పాహారంలో ఎప్పుడూ క్యాన్డ్ జ్యూస్ లేదా ఎనర్జీ డ్రింక్స్ తాగకండి. నిజానికి, క్యాన్డ్ జ్యూస్‌లో చాలా చక్కెర ఉంటుంది. దీన్ని రోజూ తాగడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. ఇది కాకుండా, ఈ ఎనర్జీ డ్రింక్ రక్తంలో చక్కెరను కూడా పెంచుతుంది.
read moreఒకసారి వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తినచ్చా? చలికాలంలో ఈ నిజాలు తెలుసుకుని తీరాలి!
ఆహారం శరీరానికి శక్తిని ఇస్తుంది. మనిషి ఆయుష్షు చాలా వరకు ఆరోగ్యకరమైన ఆహారం మీదనే ఆధారపడి ఉంటుంది. ఆహారం తరువాత వ్యాయామం, అలవాట్లు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. అయితే చలికాలంలో చాలామంది ఆహారం దగ్గరే పెద్ద తప్పు చేస్తారు. ఉదయం అయినా మధ్యాహ్నం అయినా వండిన ఆహారం అంతో ఇంతో మిగులుతూనే ఉంటుంది. చలికాలంలో ఆహారాన్ని చల్లగా తినలేక దాన్ని మళ్లీ వేడి చేస్తుంటారు. అయితే ఇలా వేడి చేయడం అస్సలు మంచిది కాదని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కింది ఆహారాలు అయితే పొరవాటున కూడా వేడి చేయకూడదని చెబుతున్నారు. ఈ ఆహారాల గోల ఏంటో తెలుసుకుంటే.. చలికాలంలో పొరపాటున కూడా మళ్లీ వేడి చేసి తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. వాటిలో పాలకూర, క్యారెట్లు, ఆకుకూరలు, బీట్రూట్ వంటి నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలు ముఖ్యమైనవి. పాలకూరను చాలామంది పప్పుగానే వండుతారు. కొందర పనీర్ తో కూర చేస్తారు. వీటిని మధ్యాహ్నం వండితే చాలావరకు మిగులుతాయి. చూస్తూ వీటిని పడెయ్యలేరు. అలాగని చలికాలంలో వీటిని చల్లగానూ తినలేరు. అలాంటప్పుడు మళ్లీ వేడి చేసి వేడిగా తింటారు. మిగిలిన కూరగాయలు, ఆకుకూరలు కూడా ఇంతే.. రుచికరమైన, పోషకాలు కలిగిన ఆహారం కాబట్టి ముందు వెనుక ఆలోచించరు. కానీ ఇలా ఒకసారి వండిన ఆహారన్ని మళ్లీ వేడి చేస్తే వాటిలోని నైట్రేట్ లు వేడి వల్ల నైట్రోజినేస్ గా మారుతాయి. ఇవి శరీర కణాలకు హాని కలిగిస్తాయి. అన్నం గురించి అన్ని ఇళ్లలో కనిపించే సీన్ ఒకటే.. అన్నం మిగిలితే ఫ్రైడ్ రైస్, ఎగ్ రైస్, కలర్ రైస్ ఇలా చాలా రకాలు చేస్తారు. అయితే అన్నం ఒక్కసారి వండిన తరువాత మళ్లీ దాన్ని వేడి చేయకూడదు. ఫుడ్ స్టాండర్ ఏజెన్సీ ప్రకారం అన్నాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల పుడ్ పాయిజన్ జరిగే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అన్నాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల అన్నంలో బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఫుడ్ పాయిజన్ కు కారణం అవుతుంది. మాంసాహారం పడెయ్యాలంటే ఎవ్వరికీ మనసొప్పదు. పైగా ఖరీదైన ఆహారం కూడా. మధ్యాహ్నం మిగిలితే రాత్రి, రాత్రి మిగిలితే దాన్ని ఫ్రిజ్ లో పెట్టి మళ్లీ మరుసటిరోజు కూడా తింటారు. అయితే చలికాలంలో మాంసాహారాన్ని వేడిగా తినాలనే జిహ్వ చాపల్యంతో తిన్న ప్రతీ సారి వేడి చేసుకుని తింటారు. కానీ వండిన మాంసాన్ని మళ్ళీ వేడి చేస్తే చాలా ఈజీగా ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది. పైపెచ్చు జీర్ణసమస్యలు కూడా పెరుగుతాయి. ఆహార నిపుణుల ప్రకారం అధిక ప్రోటీన్ ఉన్న ఆహారంలో నైట్రోజన్ ఉంటుంది. అది శరీరానికి హాని చేస్తుంది. చాలా మంది ఇష్టంగా తినే ఆహారాలలో బంగాళాదుంపలు ఒకటి. బంగాళాదుంపలను ఒకసారి ఉడికించాక మళ్లీ వేడి చేయకూడదు. అలా చేస్తే బంగాళా దుంపల్లో క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది బంగాళాదుంపల్లో ఉండే విటమిన్-బి6, పొటాషియం, విటమిన్-సి వంటి పోషకాలను అన్నింటిని నాశనం చేసి శరీరానికి హాని కలిగిస్తుంది. పుట్టగొడుగులు మంచి పోషకాహారం. ముఖ్యంగా చలికాలంలో విటమిన్-డి కావాలంటే పుట్టగొడుగులు తినాల్సిందే. దీంతో చలికాలంలో పుట్టగొడుగులు బాగా తింటుంటారు. అయితే పుట్టగొడుగులను ఒకసారి వండిన తరువాత మళ్లీ వేడి చేయడం అస్సలు మంచిది కాదు. వీటిని ఒకసారి వండి మళ్లీ వేడి చేస్తే వాటిలో ఉన్న ప్రోటీన్, ఖనిజాలు విచ్చిన్నం అవుతాయి. అవి టాక్సిన్లను విడుదల చేసి శరీరానికి హాని కలిగిస్తాయి. జీర్ణవ్యవస్థను దారుణంగా దెబ్బతీస్తాయి. *నిశ్శబ్ద.
read moreఆహారంలో మునగాకు చేర్చుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
ఆరోగ్యంగా ఉండటానికి ఆహారాలు ఎంతగానో తోడ్పడతాయి. సరైన ఆహారం తీసుకుంటే అసలు జబ్బుల గోల ఉండదు, అంతకు మించి మందుల తలనొప్పి అసలే ఉండదు. కానీ ఆహారాల మోజులో పడి కొందరు అనారోగ్యాలను తెచ్చుకుంటున్నారు. మన చుట్టూ ఎంతో సులువుగా లభించే ఆహారాలతోనే బోలెడు ఆరోగ్యం పొందవచ్చు. చాలాచోట్ల మునగ చెట్లు బాగా పెరిగి ఉంటాయి. వీటి కాయలు అయితే డబ్బు పెట్టి కొనాల్సి వస్తోంది. కానీ మునగాకు మాత్రం డబ్బు వెచ్చించకుండానే కోసుకోవచ్చు. ఒకవేళ మునగ చెట్లు అందుబాటులో ఉంటే మాత్రం తరచుగా మునగాకును మిస్ కాకుండా తినండి. కేవలం మునగాకే కాదు మునగ పువ్వులను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటారు. మునగాకును పప్పు, కారప్పొడి, టీ వంటి వంటకాలుగానూ, మునగ పువ్వులను కూడా ఇదే విధంగానే వండుకుంటారు. చాలా మంది మునగాకును, మునగ పువ్వులను ఎండబెట్టి పొడి చేసుకుని వాటిని ఉపయోగించుకుంటారు. మార్కెట్లో కూడా మునగాకు పొడి డబ్బులు పోసి కొనాల్సి వస్తోంది. కాబ్టటి మునగాకును ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనిలో పోషకాలేంటో.. దీనివల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుంటే.. మునగాకులో ప్రోటీన్, విటమిన్-బి6, విటమిన్-సి, విటమిన్-ఎ, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి మూలకాలు సమృద్దిగా ఉంటాయి. మునగాకు తరచుగా తీసుకుంటే ఎముకలు బలపడతాయి. కాల్షియం తక్కువ ఉందని కాల్షియం ఆధారిత ఆహారం తీసుకున్నా ఎముకలు బలంగా మారకపోతే మునగాకును ఆహారంలో చేర్చుకోవచ్చు. మునగాకు అల్సర్లను తగ్గించంలో అద్బుతం చేస్తుంది. ఇందులో యాంటీ అల్సర్ గుణాలు ఉన్నాయి. అల్సర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు మునగాకును తింటూ ఉంటే సమస్య తొందరలోనే తగ్గిపోతుంది. అధికబరువు సమస్య ఇప్పట్లో పెద్ద తలనొప్పిగా మారింది. కానీ బరువు తగ్గించడంలో మునగాకు సమర్థవంతంగా పనిచేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా ఆహారంలో తీసుకుంటూ ఉంటే బరువు తగ్గుతారు. ఇందులో ఉండే పైబర్ జీర్ణాశయ పనితీరు మెరుగుపరుస్తుంది. మునగాకులో ఉండే పైబర్ అధిక బరువు నియంత్రణకు సహాయపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ను అదుపు చేస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరానికి శక్తి అందించడంలో మునగాకుది అందె వేసిన చెయ్యి. దీన్ని తింటూ ఉంటే శరీరం బలంగా మారుతుంది. రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. అన్నింటి కంటే ముఖ్యంగా మునాకును మధుమేహం ఉన్నవారిని తినమని సిఫారసు చేస్తారు. కాస్త వైద్యం మీద అవగాహన ఉన్నవారి నుండి నైపుణ్యం ఉన్న వైద్యుల వరకు అందరూ మునగాకును తీసుకోమని సమర్థిస్తారు. మునగాకు ఆహారం ద్వారా విడుదలయ్యే చక్కెరలను నెమ్మది చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఐరన్ లోపం ఉన్నవారు కూడా మునగాకు తినాలి. ఐరన్ లోపం దీర్ఘకాలం పాటూ కొనసాగితే అది రక్తహీనత సమస్యకు దారితీస్తుంది. ఐరన్ భర్తీ అయితే హిమోగ్లోబిన్ లెవల్స్ పెరిగి రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. మునగాకు తింటే కలిగే మరో అధ్బుతమైన లాభం.. జుట్టు పెరుగుదల. చాలామంది జుట్టు పెరుగుదల కోసం తలకు హెయిర్ ప్యాక్ లు, షాంపూలు, నూనెలు ఉపయోగిస్తుంటారు. కానీ మునగాకును ఆహారంలో భాగం చేసుకుంటూ ఉంటే చాలు. కేవలం నెల రోజుల్లోపే జుట్టు పెరుగుదల లోనూ, జుట్టు రంగు లోనూ, జుట్టు మందంగానూ మారుతుంది. *నిశ్శబ్ద.
read moreఉదయం లేవగానే మెంతుల నీళ్లు తాగుతే అధిక బరువుకు చెక్ పెట్టొచ్చు..!
మెంతుల్లో చాలా పోషకాలు ఉంటాయి. ఐరన్, మాంగనీస్‌తో సహా మంచి మొత్తంలో ఫైబర్, ఖనిజాలను కలిగి ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మెంతి గింజల నీటిని తాగడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కోసం, రాత్రిపూట ఒక గ్లాసు శుభ్రమైన నీటిలో మెంతులు వేసి నానపెట్టండి. ఉదయాన్నే ఆ నీటిని బాగా ఫిల్టర్ చేసి ఖాళీ కడుపుతో త్రాగాలి. కావాలంటే మెంతి గింజలు కూడా తినొచ్చు. దీంతో శరీరంలో ఉండే టాక్సిన్స్ తొలగిపోతాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది: ఖాళీ కడుపుతో మెంతుల గింజల నీరు తాగితే షుగర్ అదుపులో ఉంటుంది. మెంతులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది డయాబెటిస్‌లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మధుమేహంతో బాధపడేవారు రోజూ ఉదయాన్నే మెంతి గింజల నీటిని తాగవచ్చు. గుండెకు మేలు చేస్తుంది: మెంతి నీరు గుండెకు చాలా మేలు చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించే హైపోకొలెస్టెరోలెమిక్ మూలకాలను కలిగి ఉంటుంది. తద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని వినియోగం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి, మీరు రోజూ మెంతి నీటిని కూడా తీసుకోవచ్చు. బరువు తగ్గుతుంది: మెంతి గింజల్లో ఫైబర్ ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. రోజూ ఉదయాన్నే మెంతుల నీళ్లు తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది: మెంతి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. అజీర్ణం లేదా మలబద్ధకంతో సమస్యలు ఉన్నవారికి మెంతి నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మెంతిలో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్‌లు ప్యాంక్రియాస్‌ను మరింత యాక్టివ్‌గా చేస్తాయి. ఇది జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది: మీరు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో మెంతి గింజల నీటిని తాగుతే, మీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ సమస్యను నయం చేయవచ్చు. మెంతి గింజల నీటిని ఒక నెలపాటు క్రమం తప్పకుండా తాగితే, హెచ్‌డిఎల్ అంటే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని భావిస్తున్నారు.
read moreచలికాలంలో ఆరోగ్య సమస్యలా.. నీటిలో ఒక్క చెంచా దీన్ని కలిపి వాడితే సెట్!
చలికాలంలో ముక్కు, చెవి, గొంతుకు సంబంధించిన సమస్యలు చాలా వస్తాయి. వాటిలో జలుబు, గొంతు కింద వాపు ముఖ్యమైనవి. ఇవి టాన్సిల్స్ సమస్యకు దారితీస్తాయి. టాన్సిల్స్ కారణంగా ఆహారం తిన్నాలన్నా, తాగాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. దీనికి చాలా సింపుల్ గా చెక్ పెట్టవచ్చు. కేవలం ఒక్క చెంచా వంటింట్లో ఉండే పదార్థాన్ని నీళ్లలో కలిపి ఉపయోగించడం వల్ల టాన్సిల్ సమస్య తగ్గుముఖం పడుతుంది. అసలు జలుబు, టాన్సిల్స్ సమస్య ఎందుకొస్తుంది? దీనికి కారణాలు ఏంటి? తెలుసుకుంటే.. చలికాలంలో చల్లని, పొడిగాలులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళలల్లో ఈ గాలులు ఎక్కువ. ఇలాంటి వాతావరణంలో ఉండటం వల్ల గాలుల ప్రభావం గొంతులో కణజాలాన్ని పొడిగా మారుస్తుంది. దీనికారణంగా గొంతులో చికాకును, వాపును కలిగిస్తుంది. ఇదే క్రమంగా గొంతు నొప్పి, జలుబు, సైనస్, శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్య ఏర్పడిన తరువాత తొందరగా సమస్యను గుర్తించి జాగ్రత్తలు తీసుకోకపోతే టాన్సిల్స్ కు దారితీస్తుంది. జలుబు వస్తే.. చలికాలంలోనే కాదు జలుబు చేస్తే ముక్కులు బ్లాక్ అయిపోతాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీనికారణంగా రోజంతా డిస్టర్బ్ అవుతారు. జలుబును లైట్ తీసుకుంటే శ్లేష్మం పెరుగుతుంది. గొంతులో వాపు కూడా వస్తుంది. దీన్నుండి ఉపశమనం పొందాలంటే గోరువెచ్చని నీటితో పుక్కిలించాలి. దీనివల్ల శ్లేష్మం తొలగిపోతుంది. ముక్కులు కాస్త రిలాక్స్ అవుతాయి. టాన్సిల్స్ వస్తే.. టాన్సిల్స్ వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆహారం తినాలన్నా, తాగాలన్నా కూడా ఇబ్బందే. దీన్ని పరిష్కరించాలంటే ఇంట్లో ఉన్న ఒక్క స్పూన్ ఉప్పు చాలు. లీటరు నీటిలో ఒక స్పూను ఉప్పు వేసి బాగా పుక్కిలించాలి. రోజులో ఇలా నాలుగైదు సార్లు చేస్తుంటే చాలు గొంతు నొప్పి, గొంతులో శ్లేష్మం తగ్గుతుంది. బ్లాక్ అయిపోయిన ముక్కులు రిలాక్స్ అవుతాయి. జలుబు, టాన్సిల్స్ కు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్ లను కూడా ఇది తొలగిస్తుంది. దగ్గు సమస్య ఉంటే అది కూడా తగ్గిపోతుంది. ఉప్పు నీరుతో పుక్కిలిస్తేనే ఉపశమనం ఎందుకుంటుందంటే.. నీటిలో ఉప్పు కలిపినప్పుడు నీటి పిహెచ్ స్థాయి సమతుల్యంగా ఉంటుంది. దీని కారణంగా బ్యాక్టీరియా అభివృద్ది చెందదు. ఎందుకంటే ఆల్కలీన్ వాతావరణంలో బ్యాక్టీరియా ఎక్కువకాలం మనుగడ సాగించలేదు. *నిశ్శబ్ద.
read moreస్వీట్ల మీద సిల్వర్ కోటింగ్ ఎందుకు వేస్తారో తెలుసా!
స్వీట్లంటే ఇష్టపడని వారు ఉండరు. ఇళ్లలో మహా అయితే రెండు మూడు రకాల స్వీట్లు రిపీట్ అవుతూ ఉంటాయి. కానీ బయట షాపులలో బోలెడు రకాల స్వీట్లు ఉంటాయి. ఇవి వివిధ రంగులలో, వివిధ ఆకారాలలో చూడగానే తినేయాలనిపించేలా ఆకర్షిస్తాయి. కొన్ని ఖరీదైన స్వీట్లను గమనిస్తే వాటి మీద సిల్వర్ కోటింగ్ ఉంటుంది. ఇలా వెండి పూత కలిగిన స్వీట్లు పెద్ద పెద్ద షాపులలో ఎక్కువ ఖరీదులో ఉంటాయి. ఈ వెండి పూతను వరాక్ అని పిలుస్తారు. చాలామంది అలంకరణ కోసం ఈ పూత వేస్తారని అనుకుంటారు. కానీ ఇలా స్వీట్ల మీద వెండి పూత వేయడానికి వెనుక వేరే కారణాలు కూడా ఉన్నాయి. మోతీచూర్ లడ్డూ, కాజూ కట్లీ, కాజూ పిస్తా రోల్స్ వంటి స్వీట్ల మీద వెండి పూత ఉంటుంది. పాలతో మాత్రమే చేసే వివిధ స్వీట్లకు కూడా ఈ వెండి పూత అప్లై చేస్తారు. స్వీట్ల మీద అప్లై చేసే వెండి పొరలో నిజంగానే శుద్దమైన వెండి ఉపయోగిస్తారు. శుద్దమైన వెండితో తయారైన వెండిపూత ఉన్న స్వీట్లు చాలా ఆరోగ్యం. వెండిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సమృద్దిగా ఉంటాయి. అలాగే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఈ కారణంగా స్వీట్ల మీద వెండి పూత వేస్తే స్వీట్లు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. లేకపోతే పాలతోనూ, నెయ్యితోనూ చేసిన స్వీట్లు తొందరగా ముక్కిపోయిన వాసన వస్తాయి. మొట్టమొదట స్వీట్ల మీద వెండి పూత వేయడం మొదలైంది కూడా ఈ కారణంతోనే. అయితే వెండి అనేది ఖరీదైన లోహంగా మారడం వల్ల స్వీట్ల మీద వెండి పూత వేయగానే సాధారణ స్వీట్లు కూడా ధర కొండెక్కి కూర్చుంటున్నాయి. మరీ ముఖ్యంగా పెద్ద పెద్ద షాపులు స్వీట్లు చాలా అట్రాక్షన్ గా కనిపించడం కోసం వెండి పూతను ఎంచుకుంటారు. . *నిశ్శబ్ద.
read moreచలికాలం పిల్లలకు న్యుమోనియా ప్రమాదం ఎక్కువ..సమస్యకు చెక్ పెట్టే చిట్కాలు..!!
వాతావరణం ఒక సీజన్ నుంచి మరో సీజన్ కు మారుతున్న సమయంలో మన శరీరం ఒక రకమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది. క్రమంగా వాతావరణానికి అలవాటు పడుతుంది. అయితే ఈ సమయంలోనే కొన్ని రకాల సీజనల్ వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం చలికాలం ప్రారంభ దశలో చాలా మంది జలుబు, దగ్గు, ఫ్లూ, న్యుమోనియా వంటి వ్యాధుల బారిన పడుతుంటారు. పెద్దవాళ్లు ఈ సమస్యల నుంచి సులభంగా కొలుకున్నప్పటికీ పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈమధ్య చైనాలో పెద్ద సంఖ్యలో పిల్లలు న్యుమోనియాతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇది సాధారణ సీజనల్ ఇన్ఫెక్షన్ అని అక్కడి వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదం ఎక్కడైనా ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఐదేళ్ల కంటే తక్కువ వయస్సున పిల్లల్లో న్యుమోనియా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. చలికి వాయు కాలుష్యం కూడా తోడవ్వడంతో పిల్లలు ఊపిరితిత్తుల సమస్యలను ఎదుర్కొంటారు. అందుకే పిల్లల్లో న్యుమోనియా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం అందించాలి. దగ్గు, వేగంగా శ్వాసతీసుకోవడం, జ్వరం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. అలాగే న్యుమోనియాతో పోరాడే శక్తిని పొందేందుకు ఊపిరిత్తుల ఆరోగ్యం కోసం కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటంటే... జలుబు: సాధారణ జలుబు లక్షణాలే న్యుమోనియా లక్షణాలుగా ఉంటాయి. జలుబు క్రమంగా న్యుమోనియాకు దారితీసే ఛాన్స్ ఉంటుంది. అందుకే జలుబు చేసినప్పుడు, మరింత తీవ్రమైన న్యుమోనియాగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే చికిత్స తీసుకుని మందులు వాడాలి. పరిశుభ్రత: న్యుమోనియా అనేది బ్యాక్టీరియా, వైరస్ లు , శిలీంధ్రాలు వంటి అనేక రకాల సూక్ష్మజీవులతో వస్తుంది. సాధారణంగా న్యుమోనియా అంటువ్యాధి కాదు..కానీ వేగంగా వ్యాప్తిచెందుతే అంటువ్యాధిగానే గుర్తించాలి. అందుకే బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించడం తప్పనిసరి. ఇంట్లోకి రాగానే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. వ్యాధి ప్రాబల్యం ఉన్న ప్రాంతాలకు వెళ్లినప్పుడు ముక్కు, నోరును ఎక్కువగా తాకకూడదు. దగ్గు: దగ్గు న్యుమోనియా సాధారణ లక్షణంగా చెబుతారు. బాధితులు దగ్గినప్పుడు రోగి నుంచి ఆరోగ్యకరమైన వ్యక్తికి వ్యాధి కారకాలు వ్యాపించే మార్గం ఇది. అందుకే దగ్గు వచ్చినప్పుడు నోటికి గుడ్డ అడ్డుగా పెట్టుకోవాలి. దీంతో ఇతరులకు వ్యాపించకుండా అడ్డుకోవచ్చు. వ్యాక్సిన్: న్యుమోనియాకు కారణమయ్యే సాధారణ బ్యాక్టీరియా, వైరస్ లను నిరోధించేందుకు వ్యాక్సిన్ తీసుకుంటే సమస్య ప్రభావం ఎక్కువగా ఉండదు. ఆసుపత్రిలో చేరేంత తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదాన్ని వ్యాక్సిన్ తగ్గించేస్తుంది. ఇమ్యునిటీ లేనివారు న్యుమోనియా వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. లైఫ్ స్టైల్: సీజనల్ ఇన్ఫెక్షన్ తో పోరాడే శక్తి శరీరానికి ఉండాలంటే ఇమ్యునిటీ బలంగా ఉండాలి. దీనికి ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి. మంచి ఆహారం తీసుకోవాలి. వ్యాయాయం చేయాలి. విశ్రాంతి తీసుకోవాలి. స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్లను మానేయాలి.
read moreఈఫుడ్స్ తో నెలసరి ఇబ్బందులకు చెక్!
ప్రతి ఆడపిల్లకూ నెలసరి తప్పనిసరి. ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, పోషకాహారలోపం వంటి కారణాలతో అధిక రక్తస్రావం, కడుపునొప్పి, తీవ్ర భావోద్వేగాలు వంటికి కనిపిస్తుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. అవేంటో చూద్దామా. ఆకు కూరలు: ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటాయి. వీటిని ఈ సమయంలో తింటే నొప్పులు తగ్గుతాయి. రక్తహీనత సమస్య అదుపులో ఉంటుంది. ఇందులోని మెగ్నీషియం మెదడుకి ఉపశమనం కలిగిస్తుంది. అరటిపండ్లు: ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇందులోని పొటాషియం ఒంట్లోని నీటిని నిల్వల్ను కోల్పోకుండా చేయడంతో డీహైడ్రేషన్ సమస్య ఎదురుకాదు. అంతేకాదు అరటిలో ఉండే ట్రిప్టోఫాన్ సెరటోనిన్ విడుదల చేస్తుంది. ఇది మెదడుకు ఉపశమనం అందిస్తుంది. డార్క్ చాక్లెట్ : నెలసరి సమయంలో ఒంట్లోని ప్రొజెస్టెరాన్ హార్మోన్ తగ్గడంతో ఈస్ట్రోజన్ పెరుగుతుంది. దీంతో ఒంట్లో చక్కెర స్థాయిలు తగ్గి నీరసం పెరుగుతుంది. దీంతో తీపి తినాలన్న కోరిక పెరుగుతుంది. ఇలాంటి సమయంలో డార్క్ చాక్లెట్ తినండి. పెరుగు: చాలామంది నెలసరి సమయంలో పెరుగు తినకూడదని చెబుతుంటారు. కానీ ఇది ఆ సమయంలో మంచి ఆహారమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఇందులో ఉండే కాల్షియం, పొత్తికడుపు నొప్పిని తగ్గించి, మూడ్ స్వింగ్స్ కి దూరంగా ఉంచుతుంది.
read moreనిద్రలో ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటుకు సంకేతమా..?
మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో గుండె ఒకటి. గుండె పనితీరు సజావుగా సాగితేనే మన ఆరోగ్యం బాగుంటుంది. మనకు ఎదురయ్యే కొన్ని సంకేతాలు గుండెకు సంబంధించి ఏదో సమస్య ఉందని ముందే చెబుతాయి. ఇటీవలి కాలంలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. నేపథ్యంలో ముందే గుండె పోటును ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. గుండెపోటు ఎందుకు వస్తుందో మనం గమనిస్తే, గుండె కండరాలకు ఆక్సిజన్ అందని సమయంలో గుండె పోటు వస్తుంది. ప్రధానంగా మనం తినే కొవ్వు పదార్థాల ప్రభావం వల్ల రక్తనాళాలు కొలెస్ట్రాల్ రూపంలో మూసుకుపోతాయి. దీని వల్ల గుండెకు రక్తం, ఆక్సిజన్ అందడం లేదు. ఇలా అరగంటలోనే గుండె పనిచేయడం ఆగిపోతుంది. లక్షణాలు ఇవే… శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది: రాత్రిపూట ఊపిరి ఆడకపోవడం కూడా గుండె సమస్యలను సూచిస్తుంది. ఊపిరితిత్తుల్లో నీరు చేరడమే దీనికి మూలకారణమని చెబుతున్నారు. దీంతో గుండెకు కూడా సమస్యలు వస్తాయి. రాత్రి చెమటలు: కొందరికి రాత్రి నిద్రిస్తున్నప్పుడు అకస్మాత్తుగా చెమటలు పట్టడం మొదలవుతుంది. బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కూడా ఇది జరుగుతుంది. ఇలా పదే పదే జరిగితే, అది క్రమంగా గుండె పోటుగా గమనించవచ్చు. విపరీతమైన దగ్గు: దగ్గు అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. కానీ నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా దగ్గు రావడం కూడా గుండె సమస్యలను సూచిస్తుంది. ఎందుకంటే శ్వాస నాళంలో నీరు నిండి దగ్గు చికాకు కలిగించే అవకాశం ఉంది. విపరీతమైన గురక: కొంతమంది రాత్రి నిద్రలో ఎక్కువగా గురక పెడుతుంటారు. దీనివల్ల నిద్రలేమి సమస్య వస్తుంది.అంతే కాదు గురకకు ప్రధాన కారణం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. గుండె లోపల ఏదైనా సమస్య వచ్చినా, గాయమైనా ఇలా గురక పెడతారని నిపుణులు అంటున్నారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. - గుండెపోటుకు సంబంధించినంతవరకు, దానిని నివారించడానికి జీవనశైలిలో కొన్ని మార్పులను అనుసరించడం అవసరం. - ధూమపానం, మద్యపానం మానేయాలి - ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలి. - మీ వైద్యునిచే మీ రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోండి. ఎలా నియంత్రించాలి? -శరీరానికి రోజువారీ వ్యాయామం అందించడం - డాక్టర్ సలహా మేరకు రక్తనాళాలు అడ్డుపడే అవకాశం ఉండకుండా ఉండేందుకు తక్కువ మోతాదులో ఆస్పిరిన్ మాత్రలు తీసుకోవడం. - మెనోపాజ్‌కు చేరుకునే స్త్రీలు ఈస్ట్రోజెన్ రీప్లేస్మెంట్ థెరపీ గురించి వారి వైద్యుని నుండి సమాచారాన్ని పొందాలి.
read more