ఏం తిన్నా నీరు తాగే అలవాటుందా.. ఈ పండ్లు తిన్నాక మాత్రం తాగొద్దండీ బాబూ!

ఆహారం శరీరానికి శక్తిని అందిస్తుంది. సాధారణంగా ఆహారం తింటున్నప్పుడు, తిన్న తరువాత నీరు తాగుతుంటారు. ఘనాహారం తినేటప్పుడు కొంచెం అయినా నీరు తాగాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ నిజానికి ఆహారం బాగా నమిలి తింటే అస్సలు నీరు తాగాల్సిన అవసరమే లేదని వైద్యుల నుండి పోషకాహార నిపుణుల వరకు అందరూ చెబుతారు. కానీ కొందరికి మాత్రం ఏం తిన్నా నీరు తాగే అలవాటు ఉంటుంది. టిఫిన్, స్నాక్స్, పండ్లు, భోజనం ఇలా ఏం తిన్నా నీరు తాగుతుంటారు. కానీ కొన్ని పండ్లు తిన్న తరువాత నీరు అస్సలు తాగకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇంతకూ ఆ పండ్లేంటో తెలుసుకుంటే.. బొప్పాయి.. బొప్పాయిలో చాలా మంచి పోషకాలు ఉంటాయి. వీటి ఆకులు, గింజలు, పండు అన్ని తింటారు. అయితే బొప్పాయి పండు తిన్నతరువాత  నీరు తాగకూడదు. ఎందుకంటే బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది చాలా ఆలస్యంగా జీర్ణం అవుతుంది. బొప్పాయి తిన్నాక నీరు తాగితే జీర్ణాశయంలో ఇబ్బంది ఏర్పడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. మామిడి పండ్లు.. నోరూరించే మామిడి పండ్లు తినడం అందరికీ మహా ఇష్టం. కానీ మామిడి పండ్లు తినగానే మామిడి పీచు పండ్లలో ఇరుక్కుందని కొందరు, అలవాటులో మరికొందరు నీరు పుక్కిలిస్తూ తాగుతుంటారు. కానీ మామిడి పండ్లు తిన్నాక నీరు తాగితే నష్టాలుంటాయి. మామిడి పండ్లలో ఉండే విటమిన్-సి, పోషకాలు శరీరానికి అస్సలు అందవు. పైపెచ్చు అజీర్ణానికి కారణమవుతుంది. పుచ్చకాయ.. అధికశాతం నీరు కలిగిన పుచ్చ పండు తిన్నాక కూడా చాలామంది నీరు తాగుతారు. అదొక అలవాటు. పుచ్చకాయలో 90శాతం నీరు ఉంటుంది, మిగిలిన 10శాతం ఫైబర్, విటమిన్లు గట్రా ఉంటాయి.  అయితే పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగితే కడుపు ఉబ్బరం, అజీర్తీ చేస్తుంది. పైనాపిల్.. తియ్యగా, పుల్లగా ఉండే పైనాపిల్ సిట్రస్ పండు కోవకే చెందుతుంది. దీన్ని తిన్న తరువాత నీరు తాగినప్పుడు  గమనిస్తే నాలుక మండినట్టు ఉంటుంది.  దీనికి కారణం పైనాపిల్ లో బ్రోమెలనిన్ ఎంజైమ్ లు ఉంటాయి. ఇవి నాలుక మండటానికి కారణం అవుతాయి. కేవలం నాలుకే కాదు.. కడుపులో కూడా అసౌర్యం ఏర్పడుతుంది. పైనాపిల్ తినగానే నీరు తాగితే విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అరటిపండు.. అరటిపండు పౌష్టికాహారంలో ఒక భాగం. వ్యాయామం చేసిన తరువాత, ప్రతిరోజూ పిల్లలు, పెద్దలు ఒక అరటిపండు తింటే మంచిదని చెబుతారు. అరటిపండులో కేలరీలు, పోషకాలు, చక్కెర శాతం ఎక్కువగానే ఉంటాయి. ఇక అరటిపండులో ఉండే పొటాషియం, మాంగనీస్ శరీరానికి ఎంతో అవసరం. కానీ అరటిపండు తిన్న తరువాత  నీరు తాగితే పండులో పోషకాలు శరీరానికి అందవు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పండ్లలో ఆల్రెడీ నీరు ఉంటుంది. అది శరీరాన్ని హైడ్రేట్ గా మారుస్తుంది. పండ్లలో ఉండే గుణాల కారణంగా పండ్లు తిన్న వెంటనే కొందరికి జలుబు కూడా చేస్తుంది. పండ్లను కూడా పూర్తీగా నమిలి తింటే అసలు నీరు తాగాల్సిన అవసరం ఉండదు.                                                     *నిశ్శబ్ద.  

read more
వ్యాయామం చేస్తూ ఇలా తినాల్సిందే..!!

ఆరోగ్యంగా ఉండాలన్నా..ఫిట్ గా ఉండాలన్నా..కేవలం వ్యాయామం చేస్తే సరిపోదు. వ్యాయామంతోపాటు కచ్చితమైన ఆహార నియమాలు పాటించడం తప్పనిసరి. - వ్యాయామాలు చేసేవారు ఏదొక తేలికపాటి భోజనంతో సరిపెట్టుకోకూడదు. ఆహారంలో తగినన్ని ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు ఉండేలా చూడాలి. అది కూడా ఒకేరకం పదార్థాల నుంచి కాకుండా ఇతర రకాల ఆహారాల నుంచి అందేలా చూసుకోవాలి. దీనికోసం అప్పటికప్పుడు ఆలోచించకుండా వారానికి సరిపడా డైట్ ప్లాన్ చేసుకుంటే మంచిది . - వ్యాయామం అయినా, ఆహారమైనా ఎంత అవసరమో అంతే తీసుకోవడం తప్పనిసరి. ఎలాగు కసరత్తులు చేస్తున్నామంటూ అతిగా తినడం సరికాదు. సన్నబడాలన్న తపనతో అసలు తినకుండా ఉండట కూడా మంచిది కాదు. వర్కవుట్స్ చేయడానికి ముందు తినే స్నాక్స్ లో కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అప్పడే తగినంత ఉత్సాహంతో వ్యాయాయం చేస్తాం. - కార్డియో ట్రైనింగ్ కు వెళ్లేవారు పొట్టను ఎంత వీలైతే అంత ఖాళీగా ఉంచుకోవడం మంచిది. ఒక కప్పు గ్రీన్ టీ తోపాటుగా ఏదైనా పండు తీసుకుంటే సరిపోతుంది. వర్కవుట్స్ తర్వాత త్రుణధాన్యాలతో చేసిన ఉప్మా, దోసె, కొవ్వు తక్కువగా ఉండే పాలు పండ్ల రసాలు, పెరుగు వంటివి తింటే కండరాలకు సాంత్వన లభిస్తుంది. -భోజనం తర్వాత వ్యాయామం చేయాలనుకుంటే కచ్చితంగా మూడు నుంచి నాలుగు గంటల విరామం తర్వాత జిమ్ కు వెళ్లాలి.  

read more
చామంతి పువ్వుల టీ ఎప్పుడైనా తాగారా? దీంతో ఎన్ని లాభాలంటే...

విదేశాల నుండి భారతదేశానికి వ్యాప్తి చెందినా భారతీయులు టీ, కాఫీలను గుండెల్లో పెట్టుకున్నారు.  అర్థరాత్రి, ఆపరాత్రి అనే తేడా లేకుండా కాఫీ, టీ లకోసం అర్రులు చాచేవారున్నారు. అయితే వీటిలో కెఫిన్ ఆరోగ్యానికి హానికరం. కానీ ఆయుర్వేదం సూచించే హెర్బల్ టీలు ఆరోగ్యానికి ది బెస్ట్ అని చెప్పవచ్చు. పువ్వులతోనూ, ఆకులతోనూ టీలు చేసుకుని వేడివేడిగా సిప్ చేస్తుంటే కలిగే అనుభూతి, ఆ తరువాత శరీరానికి చేకూరే ఓదార్పు మాటల్లో చెప్పలేనిది. పైపెచ్చు వైద్యుల దగ్గలకు వెళ్లి వేలు పోసి ఖర్చుపెట్టి తగ్గించుకునే ఎన్నో జబ్బులు ఈ టీలతో తగ్గుతాయి. ఇలాంటి పువ్వుల టీలలో ప్రసిద్ది చెందినది చమోమిలే టీ. చామంతి పూల టీ నే చమోమిలె టీ అని అంటారు. అసలు టీ వల్ల కలిగే లాభాలేంటి? ఈ టీ కోసం ఉపయోగించే చామంతులేవి? ఈ టీ ఎప్పుడు తాగితే బెస్ట్ ఫలితాలు ఉంటాయి?పూర్తీగా తెలుసుకుంటే.. చామంతి టీ.. చామంతి టీని చామంతి పువ్వులతో తయారుచేస్తారు. బాగా మరిగించిన నీటిని ఒక కప్పులో వేసి అందులో ఎండబెట్టిన చామంతి పువ్వులను వేస్తారు. దానిమీద మూత పెట్టి 3 నుండి 5 నిమిషాలు అలాగే వదిలేస్తారు. ఇలా చేయడం వల్ల ఎండిన పువ్వులలో సారం నీటిలోకి చేరుతుంది. చామంతి పువ్వుల టీ సిద్దమవుతుంది. ఇది అచ్చం గ్రీన్ టీ తయారు విధంలానే ఉంటుంది కాబట్టి దీన్ని చేసుకోవడం సులభం.అయితే దీనికి సాధారణ చామంతులు పనికిరావు.  రెండు ప్రత్యేక రకాల చామంతులు ఈ టీ కోసం వినియోగిస్తారు. జర్మన్ జాతికి చెందిన చామంతి పూలు, రోమన్ జాతికి చెందిన చామంతులు మాత్రమే టీకి పనికొస్తాయి.. ఎప్పుడు తాగాలి?   చామంతి పువ్వుల టీ తాగడానికి సరైన సమయం రాత్రి. అన్ని టీలు ఉదయం, సాయంత్రం తాగితే ఈ టీ మాత్రం రాత్రి తాగితే మంచి ఫలితాలు ఇస్తుంది. చామంతి పువ్వుల టీ తాగితే కలిగే ఫలితాలు.. రాత్రి పూట చామంతి పువ్వుల టీ తాగితే నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి సమస్య ఎక్కువ రోజులు కొనసాగితే అది మానసిక ఒత్తిడి, ఆందోళన, హార్మోన్ల అసమతుల్యత, జ్ఞాపకశక్తి మందగించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. గుండె సంబంధ సమస్యలు, హైపర్ టెన్షన్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. వీటన్నింటికి చామంతి పూల టీ చెక్ పెడుతుంది. రాత్రి పడుకునే ముందు ఈ టీ తాగితే మంచిగా నిద్ర పట్టేలా చేస్తుంది. చామంతి టీలో యాంటీస్పాస్మోడిక్ లక్షణాలు ఉంటాయి. ఇది నొప్పులు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. నొప్పిని ప్రేరేపించే కారకాలు ఉత్పత్తి కాకుండా చేసి నొప్పులలో ఉపశమనం ఇస్తుంది. కడుపునొప్పి, మహిళలలో నెలసరి నొప్పులు, ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల వచ్చే కడుపు నొప్పి వంటి సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. చామంతి టీ కేవలం టీ మాత్రమే కాదు. ఒక మంచి ఔషదం కూడా. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ప్లేవనాయిడ్లు, ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ టీని క్రమం తప్పకుండా తాగుతుంటే హైపర్ టెన్షన్ కాస్తా బలాదూర్ అవుతుంది. రక్తనాళాలు, ధమనులు  పనితీరు సరిగా ఉండేలా చేస్తుంది. చామంతిలో క్వెర్సెటిన్ లు ఉంటాయి. ఇవి పాలీఫెనాల్ లు. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయల్ గుణాలు  ఉంటాయి. ఇవి ఇమ్యునిటీ పవర్ ను పెంచుతాయి. యాంటీ క్యాన్సర్ ఏజెంట్ గా కూడా పనిచేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కడుపులో మంట, గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం, పొత్తి కడుపు నొప్పి                                                  *నిశ్శబ్ద.  

read more
లైట్ వేసుకుని నిద్రపోవచ్చా... అసలు నిద్ర గురించి ఈ నిజాలు తెలుసా?

ఆహారం,  వ్యాయామం, విశ్రాంతి మనిషికి చాలా ముఖ్యం. కానీ చాలామంది ఈ మూడింటిలోనే తప్పులు చేస్తుంటారు. వీటికి తగిన కారణాలు చూపించి సమర్థించుకుంటారు కూడా. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు ఉరుకుల పరుగులతో సాగిన శరీరానికి రాత్రి మాత్రమే విశ్రాంతి లభిస్తుంది. కానీ కొందరి అవగాహనా లోపం వల్ల కనీసం ఈ రాత్రి కూడా సరైన విశ్రాంతి ఉండదు. నిద్రపోయే సమయం నుండి నిద్రించే పరిస్థితులు, ఎంత సేపు నిద్రపోతారనే విషయాల వరకు అస్సలు పట్టించుకోనే పట్టించుకోరు. నామ్ కే వాస్తి అన్నట్టుగా  నిద్రను కూడా సరిపెట్టేస్తుంటారు. అయితే నిద్ర గొప్ప ఔషదం. అది సక్రమంగా ఉంటే శరీర ఆరోగ్యం చాలావరకు బాగుంటుంది. మెదడు రిలాక్స్ అవుతుంది. ఆలోచనా సామర్థ్యం పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. నిద్ర గురించి ఉన్న అపోహలు.. సందేహాలు పటాపంచలు చేయాలంటే ఈ కింది విషయాలు చదివితే సరోపోతుంది.  రాత్రి నిద్ర.. రాత్రిళ్లే నిద్రపోవాలనే రూల్ ఉండటం వెనుక బోలెడు బయటి కారణాలు అయితే ఉండొచ్చు కానీ అసలైన కారణం వాతావరణమే. రాత్రి ప్రకృతి కూడా నిశ్శబ్దమైపోతుంది. ఆ సమయంలో నిద్రే  అందరికీ మంచిది. ఉద్యోగాల పేరుతోనూ, సరదాల పేరుతోనూ కోల్పోయే నిద్రకు భవిష్యత్తులో తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. వాటి పుణ్యమే మానసిక సమస్యలు, మధుమేహం, రక్తపోటు నియంత్రణలో లేకపోవడం, అకాల వృద్దాప్యం మొదలైనవి. కాబ్టటి రాత్రి నిద్రే బెస్టు.  ఎంతసేపు..  ప్రతి ఒక్కరూ రోజుకు 6నుండి 8 గంటలు నిద్రపోవాలని చెబుతుంటారు. కానీ చాలామంది రాత్రి సమయంలో ఇంతసేపు నిద్రపోరు. ఎప్పుడో ఒంటి గంటకు పడుకుని ఉదయమే లేచి ఉద్యోగానికి పరిగెత్తుతారు.మరికొందరు అయితే ఇలా కోల్పోయిన నిద్రను సెలవు రోజుల్లో భర్తీ చేద్దాం అనుకుంటారు. అయితే ఇవన్నీ పిచ్చి చర్యలే.. రాత్రిళ్లు ఏకధాటిగా నిద్రపోతేనే శరీరం తగినవిధంగా రిలాక్స్ అవుతుంది. కునుకుపాట్లు.. చాలామంది కళ్లుమూసుకుని అలా కునుకుపాట్లు పడి నిమిషాల వ్యవధిలో మళ్లీ లేస్తారు. తాము నిద్రపోయామని అంటారు. కానీ అదసలు నిద్రే కాదు. నిద్రలో ఉన్నప్పుడు అసలు శరీర అవయవాల గురించి స్పృహే ఉండదు చాలామందికి. అందులోనూ ఇలాంటి కునికిపాట్లవల్ల మెదడు మీద ఒత్తిడి పెరిగి తలనొప్పి వస్తుంది. లైట్ వెలుతురులో నిద్ర.. అదేంటోగానీ రాత్రిపూట గదిలో చిన్న జీరో లైటో లేదా బెడ్ లైటో వేసుకోవడం మంచిదని అనుకుంటార. కానీ వెలుతురు కారణంగా నిద్రలో పదే పదే మెలకువ రావడం జరుగుతుంది. ముఖ్యంగా నిద్రలో ఇబ్బందులున్నవారు గదిలో బెడ్ లైట్ లేదా జీరో లైట్ వేసుకోకుండా నిద్రపోవడమే మంచిది. ప్రశాంతమైన నిద్ర కావాలంటే చీకటి గదిలో పడుకోవడం బెస్ట్.                                                *నిశ్శబ్ద.

read more
21రోజులు ఎర్ర అరటిపండ్లు కంటిన్యూగా తింటే జరిగేదిదే!

అరటిపండ్లు ఆరోగ్యానికి చాలామంచివి. సమతుల్య ఆహారంలో పౌష్టికర ఆహారంలో అరటిపండుకు తప్పనిసరిగా చోటు ఉంటుంది.  ఇది అందరికీ అందుబాటు ధరలోనే అన్ని సీజన్లలో లభిస్తుంది. అయితే అరటిపండ్లలో రకాలున్నాయి.  వీటిలో ఎర్ర అరటి పండు ఒకటి. తొక్క ఎర్రగా, పరిమాణంలో సాధారణ అరటిపండ్లకంటే పెద్దగా ఉండే ఈ అరటిపండ్లు   సాధారణ అరటి పండ్లకంటే తియ్యగా ఉంటాయి. వీటిలో కేలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి.  ఈ ఎర్ర అరటిపండ్లు ప్రతిరోజూ క్రమం తప్పకుండా 21రోజుల పాటు తింటే చాలా షాకింగ్ ఫలితాలు ఉంటాయి. ఎర్ర అరటిపండ్లు 21రోజుల పాటు తింటే వేధిచే చర్మ  సమస్యలు తగ్గుతాయి. పొడి చర్మం,  దద్దుర్లు, చర్మం ఎర్రగా మారిపోవడం, సోరియాసిస్,  వంటి చర్మసమస్యలకు ఎర్ర అరటిపండు అద్భుత ఔషదం.  వీటిని  తినడమే కాదు, చర్మ సమస్యలున్న చోట పూతగా కూడా అప్లై చేయవచ్చు.  దీని వల్ల సొరియాసిస్ లాంటి దారుణమైన చర్మ సమస్యలే తగ్గుతాయి. ప్రస్తుతకాలంలో సంతానలేమి సమస్యతో ఇబ్బంది పడుతన్న జంటలు చాలా ఉన్నాయి. పిల్లల కోసం వైద్యుల చుట్టూ, గుడుల చుట్టూ తిరుగుతుంటారు.  అయితే ఎర్ర అరటిపండు క్రమం తప్పకుండా తీసుకుంటే పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా, ధృడంగా మారుతుంది.  సంతానోత్పత్తి అవకాశాలు పెరుగుతాయి. మగవారిలో అంగస్థంభన సమస్య దూరం అవుతుంది. ఎర్ర అరటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు  ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో నాడీ వ్యవస్థను బలంగా చేసి ట్యాక్సిన్లను డిటాక్సిపై చేస్తాయి.  నరాల సంబంధ సమస్యలతో ఇబ్బంది పడేవారు, పక్షవాతం, మూర్చలు వంటి సమస్యలున్నవారు రెగ్యులర్ గా ఎర్ర అరటి పండ్లు తింటూ ఉంటే నాడీ బలం పుంజుకుంటుంది. . ఎర్ర అరటిపండ్లలో సాధారణ అరటిపండ్లకంటే ఎక్కువగా పొటాషియం ఉంటుంది. దీన్ని రెగ్యులర్ గా తింటూ ఉంటే మూత్రపిండాలలో  రాళ్ల సమస్య నుండి  బయటపడవచ్చు. ఎర్ర అరటిపండ్లలో విటమిన్స్, పొటాషియం, కాల్షియం సమృద్దిగా ఉంటాయి.  వీటిని రోజూ తింటే పంటికి సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి.  21రోజులు ఎర్ర అరటిపండ్లు తింటే  నోటి దుర్వాసన, చిగుళ్ల బలహీనతతో పాటు అన్ని రకాల పంటి సమస్యలు దూరమవుతాయి.                               *నిశ్శబ్ద.

read more
చలికాలంలో ఉసిరికాయలు తింటే ఇన్ని లాభాలా?

ఉసిరికాయలు భారతీయ ఆయుర్వేదంలో చాలా గొప్ప ఔషదం. త్రిఫలాలు అని పిలువబడే ఆయుర్వేద పండ్లలో ఉసిరి కాయ కూడా ఒకటి. చిన్నతనంలో వీటిని ఉప్పు, కారం అద్దుకుంటూ తింటూంటే ఎంతో మజాగా ఉండేది. ఇప్పుడు కూడా వీటిని చూస్తే పెద్దలు కూడా పిల్లలైపోయి నోట్లో లాలాజలం ఊరించుకుంటూ తింటుంటారు. ఒకప్పుడు సరదాగా తిన్న ఈ ఉసిరికాయలు గొప్ప ఔషదం అని తెలిశాక వీటిని దూరం పెట్టాలని ఎవరూ అనుకోరు. ముఖ్యంగా  ఉసిరికాయలను చలికాలంలో తింటే ఎన్ని లాభాలో తెలిస్తే  ఆశ్చర్యపోతారు. కార్తీక మాసంలో ఈ ఉసిరికాయలు లభ్యం కావడం మొదలవుతుంది.  సుమారు ఫిబ్రవరి నెల వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. ఈ కాలంలో వీటిని తినడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలేంటో తెలుసుకుంటే వీటిని మిస్ కాకుండా తినచ్చు. చలికాలంలో జీర్ణవ్యవస్థ చాలా నెమ్మదిస్తుంది. ఈ కారణంగా జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది.  ఉసిరి కాయలో ఉండే ఫైబర్ ప్రేగులను చురుగ్గా పనిచేసేలా  చేస్తుంది. ఇది మలబద్దకాన్ని దూరం చేస్తుంది. జీర్ణవ్యవస్థలో పేరుకున్న మలినాలను బయటకు పంపేస్తుంది. రోగనిరోధక శక్తి ఎంత బలంగా ఉంటే ఈ చలికాలంలో ఆరోగ్యం అంత బాగుంటుంది. లేదంటే చాలా సులువుగా ఇన్ఫెక్షన్లు సోకుతాయి. ఉసిరికాయలో ఉండే విటమిన్-సి, యాసిడ్ ఫాలిఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ సహా చాలా యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీరాడికల్స్ తో పోరాడతాయి. రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. వాతావరణం చల్లగా మారడం వల్ల శరీరంలో కూడా మార్పులు వస్తాయి. బద్దకంగా అనిపించడం, పనులు చేయడంలో అనాసక్తి, క్రమంగా వీటి ప్రభావం ఒత్తిడిగా మారుతుంది. ఈ సమస్యలన్నీ తగ్గించడంలో ఉసిరి పనిచేస్తుంది. ఉసిరిలో ఉండే గుణాలు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి బాగుండాలంటే విటమిన్-సి చాలా అవసరం. ఉసిరికాయ విటమిన్-సి కి  పెట్టింది పేరు.  ఉసిరి రసం తీసుకుంటే ఇమ్యునిటీ పెరిగి అంటువ్యాధుల సమస్యలు తగ్గుతాయి.  తెల్లరక్తకణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.  సాధారణంగా సీజనల్ వారిగా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలను మంత్రించినట్టు మాయం చేస్తుంది. చలికాలంలో చర్మం, జుట్టు చాలా దారుణంగా దెబ్బతింటుంటాయి. వీటికి ఉసిరితో చెక్ పెట్టవచ్చు.  ఉసిరిలో ఉండే యంటీ ఆక్సిడెంట్ లక్షణాలు,  విటమిన్-సి  కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా మారుస్తాయి. తలలో చుండ్రు, కురుపులు, చర్మ సంబంధ సమస్యలు అన్నీ దూరం అవుతాయి.                                                       *నిశ్శబ్ద.

read more
చలికాలంలో బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి!

  శీతాకాలంలో జలుబు, దగ్గు, కీళ్లు పట్టేయడం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, చర్మం పొడిబారడం వంటి సమస్యలు చాలామందిని వేధిస్తుంటాయి. అయితే ఈ కాలంలో చాలా మంది బరువు కూడా పెరుగుతారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంతకు ఈ కాలంలో బరువు పెరగడానికి అసలు కారణాలు ఏంటి? అది తెలుసుకుంటే మన శరీరంలో అనవసరంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించుకోవచ్చు. చలికాలంలో చల్లటి వాతావరణం కారణంగా ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడానికి శరీరం సహకరించదు. దీంతో ఫిట్నెస్ రొటిన్ అదుపు తప్పి...శరీరంలో క్యాలరీలు కొవ్వుగా మారుతాయి. ఫలితంగా బరువు పెరుగుతారు. అయితే దీన్ని అధిగమించేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ క్రమంలో మీ భాగస్వామి లేదాస స్నేహితుడిని ఫిట్నెస్ పార్టనర్ గా సెలక్ట్ చేసుకుని ఒకరికొకరు ప్రోత్సహించకుంటూ వ్యాయామం చేయండి. ఇదొక్కటే కాదు ఈ కాలంలో బరువు పెరగడానికి చాలా కారణాలే ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో చూద్దాం. ఎండ శరీరానికి తగలకపోయినా: వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వెచ్చదనం కోసం ఎండలో నిల్చుంటాం. ఈ క్రమంలో ఎండలో వ్యాయామాలు చేసేవారు కూడా ఉన్నారు. అయితే ఈ కాలంలో కొన్ని రోజులు పొగమంచు కారణంగా ఎండ ఉండదు. ఇలా  చలికాలంలో శరీరానికి ఎండ తగలకపోవడం వల్ల సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ సమస్య తలెత్తే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక రకమైన డిప్రెషన్ వంటిదేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా ఆహారపు అలవాట్లు, మోతాదుకు మించి ఆహారం తినడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ అలవాట్లు అంతిమంగా బరువు పెరిగేందుకు దోహదం చేస్తాయి కాబట్టి ఉదయం ఎండ లేకపోతే మధ్యాహ్నం పూట కాసేపు వీలు కుదుర్చుకుని ఎండలో ఉండటం మంచిది. అయితే ఈ క్రమంలో సూర్యకిరణాల కారణంగా చర్మ సమస్యలు తలెత్తకుండా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. హర్మోన్ల అసమతుల్యత: హర్మోన్ల అసమతుల్యత కారణంగా కూడా బరువు పెరుగుతారని మనకు తెలిసిందే. అయితే వాతావరణంలో మార్పులు వచ్చిన కొద్దీ హర్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది బరువు తగే ప్రక్రియను నెమ్మదిస్తుంది. ఆహారపు కోరికలను పెంచుతుంది. దీంతో బరువు పెరుగుతాం. అర్థరాత్రి ఆకలేస్తుంది? శీతాకాలంలో పగటి సమయం కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. ఈక్రమంలో డిన్నర్ తొందరగా చేయడం, రాత్రి ఎక్కువ సేపు మెలకువ ఉండటం, రాత్రుళ్లు తేలికపాటి ఆహారం తీసుకోవడం..ఇలా కారణాలతో అర్థరాత్రి ఆకలేస్తుంది. అలాంటప్పుడు చాలామంది బిస్కెట్లు, చిప్స్, పాప్ కార్న్, కుకీస్, చాక్లెట్స్ తింటుంటారు. ఈ అలవాటును కొనసాగి్స్తే బరువు పెరగడం ఖాయమంటున్నారు నిపుణులు. వీటికి బదులుగా పండు, పండ్ల రసాలు, నట్స్ , డ్రైఫ్రూట్స్ తినడం మంచిదని చెబుతున్నారు.

read more
ఎప్పుడూ అలసటగా అనిపిస్తుంటుందా..అయితే ఇది తెలుసుకోండి!

అలసట.. చాలాసార్లు అలసట అనేది తీవ్రశారీరక శ్రమ చేసినప్పుడు కలుగుతూ ఉంటుంది. అలసట కారణంగా శరీరమంతా బలహీనంగా ఉంటుంది. ఏ పని మీద ఆసక్తి లేకపోవడం, ఏ పనులు  చేయాలన్నా చిరాగ్గా ఉండటం. బద్దకం వంటి సమస్యలు చుట్టుముడతాయి. చాలామంది అలసటగా ఉన్నవారిని బద్దకిష్టులు అంటూ  ఉంటారు. అయితే అది బద్దకం కాదు.. మనిషి శారీరక స్థితిలో మార్పు.  ముఖ్యంగా శరీరంలోపల హార్మోన్లు, అవయవాల పనితీరులో అసమతుల్యత ఏర్పడటం. దీన్ని గుర్తించి సరిచేసుకోవడానికి ప్రయత్నించాలి. అలసటకు కారణాలు.. అలసటకు ప్రధాన కారణం తప్పుడు ఆహారాలు తీసుకోవడం. ఆహారాల కారణంగా శరీరం ప్రభావితమవుతుంది. సరైన ఆహారాన్ని ఎక్కువరోజులపాటు తీసుకోకుండా దాని స్థానంలో తప్పుడు ఆహారం తీసుకుంటే అది శారీరక బలహీనత, రక్తహీనత వంటి సమస్యలకు కారణం అవుతుంది. దీన్ని పరిష్కరించాలంటే కింది నాలుగు రకాల ఆహారాలు తప్పకుండా తీసుకోవాలి. తృణధాన్యాలు.. దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండే వారి రహస్యం తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం. ఓ ఇరవై ముప్పై ఏళ్ళ కిందట అన్నీ ఆరోగ్యకరమైన పంటలే ఉండేవి. ప్యాక్డ్ ఫుడ్స్, నిల్వ ఆహారాలు వంటివి  అప్పుడు తక్కువ. చాలావరకు చిరుతిళ్ళు కూడా తృణధాన్యాలతోనే చేసేవారు. అందుకే నాటికాలం వారి ఆరోగ్యం బాగుంటుంది. వీటిలో ఫైబర్ ఎక్కువ మొత్తం ఉంటుంది. విటమిన్లు కూడా మెండుగా ఉంటాయి.  శుద్ది చేసిన పిండులు, శుద్ది చేసిన బియ్యం వంటి వాటిని తగ్గించి తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. బ్రౌన్ రైస్, పొట్టు తీయని గోధుమలు, రాగులు, జొన్నలు వంటివి వినియోగించాలి. రంగురంగుల పండ్లు.. పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివనే విషయం తెలిసిందే. పండ్లలో విటమిన్లు,ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్లు పుష్కలంగా ఉంటాయి. పండ్లు రంగురంగులో ఉంటాయి. కంటికి ఇంపుగా కనిపించే ఈ పండ్లు ఆరోగ్యం చేకూరుస్తాయి. అలసటను మంత్రించినట్టు మాయం చేస్తాయి.                                                          *నిశ్శబ్ద.

read more
శీతాకాలంలో పసుపు పాలు తాగితే ఎన్ని బెనిఫిట్సో!

మన ఇంట్లో పెద్దవాళ్లు పసుపు పాలు  తాగమని సలహా ఇస్తుంటారు. ఎందుకంటే పసుపు పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి వినియోగం ఎన్నో తీవ్రమైన వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బయాటిక్, యాంటీ ఆక్సిడెంట్  వంటి అనేక లక్షణాలు ఉన్నాయి. ఇవి తీవ్రమైన వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. అంతేకాదు  రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది. అందువల్ల శీతాకాలంలో పసుపుపాల వినియోగం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. పసుపు పాలు చలికాలంలో మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా, అనేక వ్యాధుల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. పసుపు పాలు తాగడం వల్ల ఏయే వ్యాధులు నయమవుతాయో తెలుసుకుందాం. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి : చలికాలంలో పసుపు పాలు తీసుకోవడం వల్ల మన గుండె ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో..., ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షించడంలో సహాయపడుతుంది. అటువంటి పరిస్థితిలో, ప్రతిరోజూ పసుపు పాలు తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి:  పసుపు పాలు తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. వాస్తవానికి, పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించి బరువును తగ్గిస్తుంది. నొప్పి, వాపు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది: పసుపు పాలు తీసుకోవడం వల్ల శీతాకాలంలో కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు..శరీరంలో ఎలాంటి నొప్పి,వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. జలుబు, దగ్గు నుండి ఉపశమనం: పసుపులో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో సహాయపడతాయి. అంతే కాదు, ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని కూడా తగ్గిస్తుంది. శీతాకాలంలో పసుపు పాలు తాగడం వల్ల దగ్గు,  జలుబు సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. జీర్ణవ్యవస్థ చక్కగా ఉంటుంది: పసుపు పాలు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుందని,  గ్యాస్,  ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అంతే కాదు, దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.  

read more
ఈ డైట్ ఫాలో అయితే నెలలో 10 కిలోల బరువు తగ్గొచ్చు!

అందరూ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. నేటికాలంలో  చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. పెద్దా చిన్నా అనే తేడా లేకుండా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. యువత కూడా దీని బారిన పడుతున్నారు. 25ఏళ్లకు పొట్టతో ఇబ్బంది పడుతున్నారు. పెళ్లి చేసుకోవాలనుకునేవారు ఈ బరువు ఎలా తగ్గాలో అర్థం కాక రకరకాల డైట్ ఫాలో అవుతుంటారు. అయినా కూడా ఫలితం ఉండదు. అందంగా , ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటాము.  కానీ కొన్నిసార్లు మన శరీర ఆకృతి కారణంగా మనకు ఇష్టమైన దుస్తులను ధరించలేకపోతున్నాము. చెడు జీవనశైలి చర్మం, జుట్టును కూడా దెబ్బతీస్తుంది. బరువు తగ్గాలంటే ఈ డైట్ ఫాలో అవ్వాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం. కలబంద రసం: బరువు తగ్గడానికి ఉదయం 6:30 నుండి 7 గంటల మధ్య కలబంద రసం తాగండి. కలబంద ఆకులను కడిగి, జెల్ తొలగించి, జెల్,  1 గ్లాసు నీటిని మిక్సర్‌లో కలపండి. దీన్ని 4 నుంచి 5 రోజుల వరకు ఉపయోగించేందుకు సీసాలో నిల్వ చేయండి. త్రాగడానికి, ఒక గ్లాసులో మిశ్రమాన్ని కొద్ది మొత్తంలో తీసుకుని, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని జోడించి త్రాగాలి. దీనితో 5 నానబెట్టిన బాదంపప్పులను తినండి. అల్పాహారం కోసం చిక్‌పీస్, అన్నం: ఉదయం 8 నుండి 8:30 వరకు చిక్‌పీస్, అన్నం తినండి. దీనితో మీరు పాలు, చక్కెర,  బెల్లం లేకుండా ఒక కప్పు టోన్ లేదా డబుల్ టోన్ టీని త్రాగవచ్చు. ఈ రుచికరమైన అల్పాహారం ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్ల యొక్క అద్భుతమైన మూలం, ఇది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. భోజనం కోసం అధిక ప్రోటీన్ సలాడ్: మధ్యాహ్నం 1, 2 గంటల మధ్య అధిక ప్రోటీన్ మొలకెత్తిన సలాడ్ తినండి. 1/4 కప్పు నానబెట్టిన నల్ల చిక్‌పీస్ తీసుకోండి. 1/4 కప్పు మొలకెత్తిన మొత్తం చిక్‌పీస్ తీసుకోండి. తరిగిన టొమాటో, ఉల్లిపాయ, దోసకాయ కూడా జోడించండి. ఉడికించిన బీన్స్ జోడించండి. కొన్ని పచ్చిమిర్చి, కొత్తిమీర వేయాలి. నల్ల ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, నిమ్మరసం కలపండి. రాత్రి భోజనం: సాయంత్రం 6:30 నుండి 7 గంటల మధ్య నెయ్యి, ధాన్యపు సూప్ త్రాగాలి. 1/4 కప్పు నానబెట్టిన పప్పు. నానబెట్టిన మసూర్ పప్పు 1/4 కప్పు తీసుకోండి. 3-4 వెల్లుల్లి రెబ్బలు, కొంత అల్లం జోడించండి. తరిగిన టమోటా జోడించండి. దానికి కాస్త ఉప్పు, పసుపు, నీళ్లు పోసి 3-4 విజిల్స్ వచ్చేవరకు విజిల్ వేయాలి. ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసి మళ్లీ మరిగించి త్రాగాలి. మీరు రుచికి నల్ల మిరియాల పొడి,  నిమ్మరసం జోడించవచ్చు. ఈ నియమాలు కూడా పాటించండి: ప్రతిరోజూ7 నుంచి 8గంటలు నిద్రించేలా చూడండి. రోజంతా 3 నుంచి 3.5 లీటర్ల నీరు తాగండి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. రాత్రి 7గంటలలోపు తినండి.  

read more
శీతాకాలంలో   ఏ నువ్వులు మంచివి? నల్లవా లేక తెల్లవ

శీతాకాలం ఉష్ణోగ్రతలలో చాలా మార్పు తెలుస్తుంది. ఇది శరీరాల మీద ప్రభావం చూపిస్తుంది. శీతాకాలంలో నువ్వులు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. నువ్వులు వేడి స్వభావం కలిగి ఉంటాయి. వీటిని శీతాకాలంలో తినడం వల్ల శరీరంలో వేడి పుట్టి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చలికాలపు అనారోగ్యాలను ఎదుర్కొనే విధంగా శరీరాన్ని ధృడంగా ఉంచుతాయి. నువ్వులలో రెండు రకాలున్నాయనే విషయం అందరికీ తెలిసిందే.. ఈ  రెండూ ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ  రెండింటిలో ఒకటి ఎక్కువ ఆరోగ్యప్రయోజనాలను, మరొకటి తక్కువ ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. నలుపు, తెలుపు  నువ్వులలో ఏవి ఆరోగ్యానికి ఎక్కువ మంచివి? వేటి వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి? పూర్తీగా తెలుసుకుంటే.. ఏవి మంచివి? నలుపు, తెలుపు నువ్వులు రెండూ ఆరోగ్యానికి మంచివే.  అయినప్పటికీ తెల్లనువ్వుల కంటే నల్ల నువ్వులలో ఎక్కువ పోషకాలు ఉంటాయి.  వీటిలో అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది. కాబట్టి శీతాకాలంలో నల్ల నువ్వుల లడ్డూలు లేదా నువ్వుల చిక్కీలు తినడం మంచిది. వీటిని రోజూ తినడం వల్ల ఎముకల ఆరోగ్యం బలపడుతుంది. నల్ల నువ్వులు వగరుగా, క్రంచీగా ఉంటాయి. అయితే తెల్ల నువ్వులు మెత్తగా, తీపిగా తేలికపాటి రుచి కలిగి ఉంటాయి. నల్ల నువ్వులలో పోషకాలు ఎక్కువ ఎందుకంటే.. తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. నల్లనువ్వులలో ఒమెగా-3 ప్యాటీ యాసిడ్ లు తెల్లనువ్వులలో కంటే ఎక్కువ. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.  నల్ల నువ్వులలో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఇనుము, రాగి, మెగ్నీషియం,  పాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా తెల్లనువ్వుల కంటే  పుష్కలంగా ఉంటాయి. వీటన్నింటికి కారణం నల్ల నువ్వుల మీద పొట్టు తీయకపోవడమే.  నల్లనువ్వులను పొట్టు తీసే క్రమంలో పోషకాలు లాస్ అవుతాయి. శీతాకాలంలో ప్రాముఖ్యత ఎందుకంటే.. శీతాకాలంలో నల్ల నువ్వులు తినమని చెబుతారు. ఎందుకంటే పైన చెప్పుకున్నట్టు వీటిలో వేడి గుణం ఉంటుంది. వీటని రోజూ ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది. వేడి శరీరం ఉన్నవారు డైలీ అరటీస్పూన్ వేయించిన నల్లనువ్వులను, ఇతర శరీర తత్వం ఉన్నవారు టేబుల్ స్పూన్ నల్లనువ్వులను తీసుకోవచ్చు. లేదంటే లడ్డూ చేసుకుని అయినా తినవచ్చు. సలాడ్ లలోనూ, వంటకాల్లోనూ ఉపయోగించవచ్చు. వీటిలో పైబర్, ఐరన్, ఫాస్పరస్, కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల వీటిని డైలీ ఆహారంలో తీసుకుంటే ఐరన్ లోపం, కాల్షియం లోపం ఏర్పడదు. మలబద్దకం సమస్య పరిష్కారమవుతుంది. రక్తపోటు మెరుగవుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.  అయితే నువ్వులు  వేడి చేస్తాయి కాబట్టి నీరు కూడా బాగా తాగితే వేడి సమస్య వేధించదు.                                                         *నిశ్శబ్ద.

read more
వీటిని పచ్చిగా తింటే ఆసుపత్రి పాలవ్వడం పక్కా..!

 తాజాకూరగాయలు,  పండ్లు మనకు ముఖ్యమైనవి. కానీ కొన్నింటిని పచ్చిగా తినే ముందు, మీరు మీ ఆరోగ్య పరిస్థితిపై కూడా శ్రద్ధ వహించాలి. గ్యాస్, అసిడిటీ, కాలేయ వ్యాధి లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా వెంటనే అనారోగ్యానికి గురైన వ్యక్తులు పచ్చిగా తినకూడదు.  అయితే ఆరోగ్యకరమైన వ్యక్తి కూడా పచ్చిగా తినకుండా ఉండవలసిన కొన్ని పచ్చి పదార్థాల గురించి తెలుసుకుందాం. మనలో చాలా మంది కొన్ని పదార్థాలను పచ్చిగా తింటారు, ఎందుకంటే ఇది ఎక్కువ విటమిన్లు, ఖనిజాలు, యు రఫ్‌గేజ్‌ని అందిస్తుంది. శరీరం దాని నుండి ప్రయోజనం పొందుతుంది, కానీ ఇది ఎల్లప్పుడూ సరైనది కాదు. కొన్ని కూరగాయలలో సహజమైన టాక్సిన్స్,  జీర్ణం కావడం కష్టతరమైన చక్కెరలు ఉంటాయి, ఇవి గ్యాస్ట్రోనామికల్ వ్యాధుల నుండి ఫుడ్ పాయిజనింగ్ వరకు అన్నింటినీ కలిగిస్తాయి. మీరు కూరగాయలు,  పండ్ల క్లీనర్‌లో ఆహారాన్ని కడిగినప్పటికీ, ఇది పండ్లు,  కూరగాయలపై పురుగుమందులు,  కలుషితాలను తొలగిస్తుంది, అవి పచ్చిగా తినడానికి అనుకూలమైనవి కావు. బంగాళాదుంప: పచ్చి బంగాళాదుంపలు చెడు రుచిని మాత్రమే కాకుండా జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తాయి. పచ్చి బంగాళాదుంప పిండి ఉబ్బరం,  గ్యాస్‌కు కారణమవుతుంది. ఏ రకమైన గ్యాస్ట్రోనమికల్ సమస్యను నివారించడానికి, బంగాళాదుంపలను తినడానికి ముందు కాల్చడం, వేయించడం లేదా ఉడకబెట్టడం మంచిది. ఆకు కూరలు: క్యాబేజీ కుటుంబానికి చెందిన కాలీఫ్లవర్, బ్రస్సెల్స్, బ్రోకలీ, మొలకలు వంటి కూరగాయలను ఎప్పుడూ పచ్చిగా తినకూడదు. ఈ కూరగాయలలో చక్కెర ఉంటుంది, ఇది జీర్ణం కావడం కష్టం. ఈ కూరగాయలను పచ్చిగా తినడం వల్ల అనేక గ్యాస్ట్రోనమికల్ సమస్యలు వస్తాయి. పుట్టగొడుగులు: పచ్చి పుట్టగొడుగులను తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం పెరుగుతుంది. అలాగే దీన్ని ఉడికించి తింటే మరిన్ని పోషకాలు లభిస్తాయి. పచ్చి పుట్టగొడుగుల కంటే కాల్చిన లేదా కాల్చిన పుట్టగొడుగులలో ఎక్కువ పొటాషియం ఉంటుంది. మీకు ఇష్టమైన ఆహారానికి ఆరోగ్యకరమైన రుచిని అందించడానికి మీరు పాస్తా లేదా పిజ్జాలో వేయించిన పుట్టగొడుగులను జోడించవచ్చు. మాంసం: పచ్చి లేదా ఉడకని మాంసం, చికెన్,  టర్కీ తినడం చాలా ప్రమాదకరం. చాలా పచ్చి చికెన్‌లో క్యాంపిలోబాక్టర్ ఉంటుంది. ఇది సాల్మోనెల్లా, క్లోస్ట్రిడియం పెర్ఫ్రింజెన్స్,  ఇతర బ్యాక్టీరియాను కూడా కలిగి ఉండవచ్చు, ఇది తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. ఎర్రటి కిడ్నీ బీన్స్: పచ్చి లేదా తక్కువగా ఉడికించిన బీన్స్‌లో పెద్ద మొత్తంలో టాక్సిన్, గ్లైకోప్రొటీన్ లెక్టిన్ ఉంటాయి, ఇది తిన్న కొన్ని గంటల్లోనే వికారం, వాంతులు,  విరేచనాలు వంటి సమస్యలను కలిగిస్తుంది. లక్షణాల తీవ్రత కూడా తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది.    

read more
కార్తీకమాసంలో పొరపాటున కూడా ఈ ఆహారాలు తినకండి..

ఋతుచక్రాన్ని అనుసరించి కాలం మారుతుంది. ప్రకృతిలో కూడా మార్పు వస్తుంది. దేవీనవరాత్రులతో శరత్కకాలం మొదలవుతుంది కాబట్టి కార్తీకమాసంలో చలి ఉంటుంది.  ఈ మాసంలో కొన్ని ఆహారాలు తినకూడదని  శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే వీటని చాదస్తం అని, మూఢనమ్మకాలు అని కొందరు తేలికగా కొట్టిపడేస్తారు. కానీ ఆయుర్వేదం కార్తీక మాసంలో అస్సలు తినకూడని పదార్థాలేవో శాస్త్రీయ ఆధారాలతో సహా చెప్పింది. వీటిని వాతావరణ మార్పుల ఆధారంగా నిర్ణయించినట్టు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కార్తీకమాసంలో అస్సలు తినకూడని ఆహారాలేంటో తెలుసుకుంటే..   మాంసాహారానికి దూరం ఉండాలి.. శ్రావణ మాసం, కార్తీకం, మాఘమాసం ఇలా పుణ్యప్రదమైన మాసాలు రాగానే మాంసాహారం తినకూడదు అనే నియమాలు పాటిస్తారు చాలా మంది. అయితే నేటికాలంలో హిందూ విశ్వాసాలను హేళన చేసేవారు తింటే ఏమవుతుంది? అని వితండవాదం చేస్తారు. ఆయుర్వేదం ఆహారాన్ని వివిధరకాలుగా  పేర్కొంది. వాటిలో మాంసాహారం తినడాన్ని భూత ఆహారం అని అంటారు. పుణ్యం సంపాదించుకోవాల్సిన కాలంలో భూత ఆహారం తినడం మహా పాపం అని పురాణం చెబితే.. శాస్త్రప్రకారం మాత్రం ఈ మాసంలో జంతువులలో పునరుత్పత్తి ప్రక్రియ జరుగుతుంది.  ఇలాంటి సమయంలో జంతువులను వధించి వాటి మాంసాన్ని తింటే వాటి పునరుత్పత్తి ప్రక్రియకు  నష్టం కలిగించినట్టే కాకుండా వాటి మాంసాన్ని తింటే బోలెడు రోగాలు కూడా వచ్చే ఆవకాశం ఉంటుంది.  ఈ మాసంలో జీర్ణవ్యవస్థ కాస్త నెమ్మదిగా ఉంటుంది. మాంసాహారం తింటే ఈ జీర్ణవ్యవస్థ మరింత బలహీనపడుతుంది. అందుకే కార్తీకమాసంలో మాంసాహారం అస్సలు తినకూడదు. చల్లనీరు తాగకూడదు.. కొందరికి చల్లనీరు తాగడం అలవాటు అయిపోయి ఉంటుంది. కానీ ఈకాలంలో పొరపాటున కూడా చల్లనీరు తాగకూడదని ఆయుర్వేదం చెబుతోంది. చల్లనీరు, చల్లని పదార్థాలు తీసుకోవడం వల్ల తొందరగా జలుబు, దగ్గు, శ్వాససంబంధ సమస్యలు వస్తాయి. మరీ ముఖ్యంగా ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలున్నవారు చల్లని పదార్థాల జోలికి అస్సలు వెళ్లకూడదు. చల్లనివాతావరణంలో ఎక్కువ సేపు ఉండటం కూడా మంచిది కాదు. ఈ పప్పులు అస్సలు వద్దు.. వంటలలో ఎక్కువగా ఉపయోగించే పప్పు ధాన్యాలలో కందిపప్పు, శనగపప్పు ముఖ్యమైనవి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో వీటిని ఎక్కువ వాడుతుంటారు. కానీ కార్తీకమాసంలో ఈ రెండు పప్పు ధాన్యాలు అస్సలు వాడకపోవడం మంచిది. ఇవి సహజంగానే వాతగుణం ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇవి జీర్ణసంబంధ సమస్యలు, కడుపుకు సంబంధించిన అనారోగ్యాలు కలిగిస్తాయి. కాకరకాయ  వద్దే వద్దు.. కాకరకాయ మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది. మాములుగా కూడా కాకరకాయను తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే కాకరకాయను కార్తీకమాసంలో నిషేధించమని  ఆయుర్వేదం చెబుతోంది. కార్తీకమాసంలో కాకరకాయలు తొందరగా పండిపోతాయి.   కాకర గింజల్లో ఉండే బ్యాక్టీరియా ఈ కాలంలో చాలా అభివృద్ది చెందుతుంది. వీటిని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ కావడంతో పాటు అనేక ఇతర సమస్యలు కూడా ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పొరపాటున కూడా కార్తీకమాసంలో కాకరకాయ తినొద్దని అంటున్నారు.                                         *నిశ్శబ్ద.

read more
దీపావళిలో ఎక్కువగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు ఇవే..

  దీపావళి దేశం యావత్తు సంతోషంగా జరుపుకునే పండుగ. ఈ పండుగ సమయంలో పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తుంటారు. ఒకప్పటికంటే ఇప్పుడు బాణసంచా కూడా అప్డేట్ అయ్యాయి. కేవలం బాణసంచా మాత్రమే కాదు,  ప్రతి ఇంట్లో స్వీట్లు, పిండివంటలు ఘుమఘుమలాడిపోతాయి. ఒకవైపు పటాసుల మోత, మరొకవైపు వంటల పరిమళాలు  మనసును నిలువనీయవు. అయితే ఈ పండుగ కారణంగా  బరువు పెరగడం, రక్తపోటు, మధుమేహం ఉన్నవారిలో చక్కెర స్థాయిలు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. వీటి నియంత్రణ ఎవరి చేతుల్లో వారిదే. కాబట్టి వీటి గురించి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. కానీ పటాసుల పొగ కారణంగా కళ్లు, శ్వాసక్రియ మొదలైన వాటికి పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉంటుంది. దీపావళి సందర్భంగా కళ్ళు, శ్వాస క్రియ  విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలేమిటో తెలుసుకుంటే..  బాణసంచా కాల్చేటప్పుడు వాటి నుండి వెలువడే స్పార్క్స్ లేదా పొగ నుండి  కళ్లను రక్షించుకోవడానికి రక్షిత గాగుల్స్ ధరించడం చాలా ముఖ్యం . ఈ సాధారణ   గాగుల్స్  ఎగిరే నిప్పురవ్వలు, బాణసంచా తాలుకూ అవశేషాలు,  బాణసంచాలో ఉపయోగించే రసాయనాల నుండి  కళ్ళను రక్షిస్తాయి. అందుకే దీపావళి సమయంలో గాగుల్స్  ధరించడం వల్ల ఇలాంటి సమస్యలను చాలా వరకు నివారించవచ్చు.  బాణసంచా కాల్చేటప్పుడు సేప్ గా ఉండాలంటే  నిర్ణీత  దూరం పాటించడం అవసరం. పేలుడు సంభవించే  బాణసంచా, నిప్పురవ్వలు ఎగజిమ్మే చిచ్చుబుడ్లు, కాకరవొత్తులు, పటాసులు  కంటికి గాయం కలిగించే ప్రకాశవంతమైన కాంతిని,  మంటలను ఎగజిమ్ముతాయి. ఇలాంటి వాటిని  ఉపయోగించేటప్పుడు  వాటిని దూరం నుండి వెలిగించాలి. బాణసంచాలో గన్‌పౌడర్‌తోపాటు అనేక రకాల రసాయనాలు ఉంటాయి.  వాటిని తాకిన తర్వాత పొరపాటున కూడా ఆ చేతులతో కళ్లను తాకరాదు.  కళ్లకు తగిలితే తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల, బాణాసంచా తాకడం లేదా కాల్చిన తర్వాత,  ముఖం లేదా కళ్లను తాకడానికి ముందు  చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. చేతులకు అంటిన పటాసుల తాలూకు  అవశేష రసాయనాలు కంటి చికాకు కలిగించవచ్చు. పటాసులు కాల్చేటప్పుడు కంటి సంరక్షణే కాదు ప్రాణానికి ముఖ్యమైన శ్వాసక్రియ పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ పొగను వెలువరిచే బాణసంచాకు దూరంగా ఉండాలి. అలాంటివి కాలుస్తున్నప్పుడు వీలైనంత దూరం వెళ్ళాలి.  పటాసులు కాల్చేటప్పుడు మరచిపోకుండా  మాస్క్ పెట్టుకోవాలి.  ఆస్తమా, శ్వాస సంబంధ సమస్యలు ఇదివరకే ఉన్నవారు  ఇన్ హెలర్ ను వెంట ఉంచుకోవాలి.  పటాసులు కాల్చేటప్పుడు పెద్ద మొత్తంలో ఒకేసారి పటాసులు పేల్చకుండా గ్యాప్ తీసుకోవాలి. పోటీ పెట్టుకుని అందరూ ఒకేసారి కాల్చడాన్ని నివారించాలి. ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పట్లో ఏ పని చేస్తున్నా దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుని సంబంరపడాలని అనుకునేవారు చాలా ఎక్కువ. పటాసులు కాలుస్తూ వీడియోలు, సెల్పీలు తీసుకుంటూ పటాసులను నిర్లక్ష్యం చేయకూడదు. పరిసరాల మీద స్పృహ ఉండాలి.  చిన్నపిల్లలతో పటాసులు కాల్పించేటప్పుడు పెద్దలు దగ్గరే ఉండాలి.                                                      *నిశ్శబ్ద.

read more
గ్రీన్ టీ బరువు తగ్గడానికే కాదు..ఈ సమస్యలకు చెక్ పెడుతుంది!

 బరువు తగ్గడానికి చాలా మంది గ్రీన్ టీ తాగుతుంటారు. అయితే గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి కూడా అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ బి5, పాలీఫినాల్, మాంగనీస్, పొటాషియం, కాపర్, ఐరన్, ఆక్సిడెంట్లు వంటి పోషకాలు గ్రీన్ టీలో లభిస్తాయి.  ఇది మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే, ఒక రోజులో గ్రీన్ టీ ఎంత తాగాలి అనే ప్రశ్న కూడా ప్రజల మదిలో మెదులుతోంది.  కాబట్టి రోజుకు ఎంత గ్రీన్ టీ తాగాలో ఇప్పుడు చూద్దాం. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి: మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే.. మీరు వెంటనే అనారోగ్యానికి గురైనట్లయితే, ఖచ్చితంగా గ్రీన్ టీని తాగండి. గ్రీన్ టీ మీ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. దీనివల్ల మీరు సులభంగా ఏ వ్యాధి బారిన పడరు. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ పాలీఫెనాల్స్ శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచడానికి పని చేస్తాయి. బరువు కోల్పోతారు: గ్రీన్ టీలో పాలీఫెనాల్ ఉంటుంది, ఇది శరీర జీవక్రియను బలపరుస్తుంది. ఇందులో కొవ్వు, పిండి పదార్థాలు ఉండవు. ఇప్పటికే ఏర్పడిన కొవ్వును తగ్గించడానికి గ్రీన్ టీ పని చేయదు కానీ కొవ్వు ఏర్పడకుండా నిరోధించడానికి ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తాయి: గ్రీన్ టీలో ఉండే పాలీఫెనాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది. మీరు చాలా ఒత్తిడికి లోనవుతున్నట్లయితే, మీరు ఈ టీని తీసుకోవాలి. రోజూ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడితో పాటు శారీరక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. బీపీకి, గుండెకు మేలు చేస్తుంది: గ్రీన్ టీ చెడు కొలెస్ట్రాల్‌ను అదుపు చేయడంతోపాటు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది.దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా మీ బీపీని తగ్గించుకోవచ్చు. అలాగే హార్ట్ స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది. రోజుకు ఎన్నిసార్లు తాగాలి : మీకు ఎలాంటి వ్యాధి లేకుంటే, మీరు రోజుకు 2 నుండి 3 కప్పుల గ్రీన్ టీని తీసుకోవచ్చు. కానీ మీరు డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్నట్లయితే, మీరు గ్రీన్ టీని తీసుకునే ముందు ఒకసారి మీ వైద్యుడిని సంప్రదించాలి.  

read more
జ్ఞాపకశక్తికి సూపర్ ఫుడ్స్.. ఇవి తిన్నారంటే బ్రెయిన్ పవర్ మాములుగా ఉండదు..

ఆహారమే ఆరోగ్యం అనే మాట చాలాసార్లు వినే ఉంటారు. అయితే శరీరంలో ఒక్కో అవయవానికి ఒక్కో రకమైన పోషకాలు, విటమిన్లు అవసరం అవుతాయి. ఆయా విటమిన్లు తీసుకుంటేనే ఆయా భాగాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. శరీరంలో ప్రతి అవయం పనితీరు మెదడు మీదనే ఆధారపడి ఉంటుంది. మెదడు సరిగా పనిచేయకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మెదడు పనితీరు మందగిస్తే జ్ఞాపకశక్తి తగ్గుతుంది. చాలావరకు జ్ఞాపకశక్తి తగ్గడం అనేది వయసు పైబడిన వారిలోనే కనిపిస్తుంది. కానీ కొందరిలో మాత్రం చిన్నవయసులోనే జ్ఞాపకశక్తి లోపిస్తుంటుంది. కానీ మెదడుకు శక్తిని ఇచ్చే ఆహారాలు కొన్ని ఉన్నాయి. వాటిని తింటే బ్రెయిన్ సూపర్ ఫాస్ట్ గా పనిచేస్తుంది. తృణధాన్యాలు.. శనగలు, ఓట్స్, పెసలు, మిల్లెట్స్ మొదలైన తృణధాన్యాలు  తీసుకోవాలి.  వీటిలో ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇవి మెదడుకు మేలు చేస్తాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. చేపలు.. సాల్మన్, సార్డినెస్ లేదా ట్యూనా వంటి  చేపలను వారానికి ఒకసారి తినాలి. వీటిలో అధిక మొత్తంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది విటమిన్ డి,  ఇతర ఖనిజాలను భర్తీ చేస్తాయి.  ఇది  మెదడుకు అలాగే మొత్తం ఆరోగ్యానికి మంచిది. బీన్స్.. బీన్స్, కాయధాన్యాలు,  సోయాబీన్స్ మెదడుకు  కావల్సిన  ఆహారంలో ప్రముఖమైనవి.  ఎందుకంటే అవి అధిక మొత్తంలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు,  ఖనిజాలను కలిగి ఉంటాయి. వారానికి కనీసం నాలుగు సార్లు వాటిని తినాలి. చికెన్ మెడిటరేనియన్,  DASH డైట్‌లతో రూపొందించబడిన మైండ్ డైట్‌ని అనుసరిస్తుంటే వారానికి రెండుసార్లు చికెన్ తినమని సలహా ఇస్తారు. చికెన్ లో  అధిక ప్రోటీన్, విటమిన్లు,  ఖనిజాల  ఉంటాయి. పచ్చని ఆకుకూరలు.. పచ్చని ఆకు కూరలు ప్రతి వారం 6 సార్లు కంటే ఎక్కువగా తినడం మెదడుకు అలాగే  ఆరోగ్యానికి రెండింటికీ మేలు చేస్తుంది. ఇందులో బచ్చలికూర, బ్రోకలీ, పాలకర, ఆకుకూరలు, పొట్లకాయ,  మెంతులు మొదలైన కూరగాయలు ప్రముఖమైనవి. బెర్రీలు బెర్రీలు కొన్నిప్రాంతాలలో మాత్రమే లభ్యమవుతాయి. పైగా ఇవి ఖరీదైనవి. కానీ వారానికి రెండుసార్లు బెర్రీలు తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్,  బ్లాక్బెర్రీస్ వంటి బెర్రీలు  మెదడు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో ఉండే ప్రత్యేక యాంటీ ఆక్సిడెంట్లు మెదడు సామర్థ్యాన్ని పెంచుతాయి. గింజలు  గింజలను తీసుకోవడం  మెదడు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.   ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు  యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక రకాల పోషకాలను కలిగి ఉంటాయి. వారానికి 5 లేదా అంతకంటే ఎక్కువ సార్లు నట్స్ తినాలి. వీటి వినియోగం మెదడును చాలా షార్ప్ గా మారుస్తుంది.                                                     *నిశ్శబ్ద.

read more
ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు గొంతు నొప్పి, వాపు, కఫం అన్ని మటాష్!

  చలికాలం వచ్చిందంటే చాలారకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వాటిలో ఎక్కువగా  గొంతు, ముక్కు, చెవి సమస్యలే అధికం. ఈ మూడు ఒకదానికొకటి అనుబంధంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా గొంతుకు సంబంధించిన సమస్యలు చాలావరకు చాలా ఇబ్బంది పెడతాయి. తినాలన్నా, తాగాలన్నా, మాట్లాడాలన్నా చెప్పలేనంత ఇబ్బంది ఉంటుంది.  గొంతు నొప్పి, గొంతు పట్టేయడం, గొంతులో పేరుకుపోయిన కఫం మొదలైన సమస్యలనను ఇంటివద్దే సింపుల్ చిట్కాలతో తగ్గించేసుకోవచ్చు. చాలా తొందరగా రిలీఫ్ ఇచ్చే ఈ చిట్కాల గురించి తెలుసుకుంటే.. హెర్బల్ టీ.. గొంతు నొప్పి ఇబ్బంది పెడుతుంటే దానికి హెర్బల్ టీ చక్కని ఉపశమనాన్ని ఇస్తుంది.  ఇందుకోసం చమోమిలే టీ, అల్లం, పిప్పరమెంటు, అతిమధురం వేర్లు వంటి పదార్థాలలో హెర్బల్ టీ చేసుకుని తాగాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గొంతుకు చురుకుదనాన్ని ఇస్తాయి. గొంతువాపు, నొప్పి తగ్గిస్తాయి. గోరు వెచ్చని తేనె, నిమ్మరసం.. గోరువెచ్చని తేనె, నిమ్మరసం గొంతునొప్పి తగ్గించడంలో ఇతర గొంతు సమస్యలు తగ్గించడంలో సహాయపడతాయి. సహజంగానే గొంతునొప్పికి తేనె దివ్యౌషదంగా పనిచేస్తుంది. తేనె సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. గొంతు ఇన్పెక్షన్లను నయం చేస్తుంది. తేనెతో పాటు ఉపయోగించే నిమ్మకాయలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది  ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. ఆహారం.. గొంతు నొప్పి ఉన్నప్పుడు ఆహారం తినాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటి సమయాలలో ఘనాహారం జోలికి వెళ్లకపోవడమే మంచిది. గంజి, జావ వంటి ఆహారాలు గొంతు నొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. పనిలో పనిగా ఆకలి కూడా తీరుస్తాయి. బెస్ట్ ఆప్షన్.. గొంతునొప్పి వేధిస్తున్నప్పడు దానికి బెస్ట్ ఆప్షన్ గా సూప్ పనిచేస్తుంది. ఇది ఇమ్యునిటీని పెంచడంలోనూ, గొంతునొప్పి తగ్గించడంలోనూ, శరీరానికి శక్తిని ఇవ్వడంలోనూ, గొంతులో కఫాన్ని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. సూప్ తయారీలో ఉపయోగించే మిరియాలు, వెల్లుల్లి, అల్లం వంటివి నొప్పి, మంట తగ్గించడంలోనూ, ఇమ్యూనిటీ పెంచడంలోనూ సహాయపడతాయి. చికెన్ సూప్ లేదా వెజిటబుల్ వంటివి తాగడం వల్ల దగ్గు లాంటి సమస్యలు కూడా మంత్రించినట్టు మాయం అవుతాయి. గోల్డెన్ మిల్క్.. పసుపు పాలను అందరూ గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు. పేరుకు తగ్గట్టే ఈ పాలు బంగారంలాంటి ఆరోగ్యాన్ని చేకూర్చుతాయి. పసుపు పాలలో యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇమ్యునిటీ తక్కువగా ఉన్నవారు పసుపు పాలను తాగుతూంటే రోగనిరోధక శక్తి బలపడుతుంది. పసుపు పాలలో చిటికెడు పసుపు, కొద్దిగా నల్ల మిరియాల పొడి, తేనె కలిపి తాగితే అద్భుతమైన ఫలితం ఉంటుంది.                                                           *నిశ్శబ్ద.

read more