ఎండు ద్రాక్ష నీటిని రోజూ తాగితే ఈ వ్యాధులు మాయమట..!
ఎండుద్రాక్ష తీపి పదార్థాల తయారీలో ఎక్కువగా వాడే డ్రై ఫ్రూట్. సాధారణ ద్రాక్షను ఎండబెట్డడం ద్వారా దీర్ఘకాలంగా నిల్వ చేస్తారని అందరికీ తెలిసిందే. అయితే సాధారణ ద్రాక్ష కంటే ఎండుద్రాక్ష మరింత శక్తివంతమైనది. ఎందుకంటే ద్రాక్ష ఎండేకొద్ది అందులో పోషకాలు, తీపిదనం పెరుగుతుంది. ఎండుద్రాక్షను నానబెట్టి ఆ నీటిని తాగుతుంటే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు, ఆయుర్వేద వైద్యులు కూడా చెబుతున్నారు. ఆహార నిపుణులు అయితే మహిళలు ఎండుద్రాక్షను ఖచ్చితంగా తీసుకోవాలని కూడా చెబుతున్నారు. ముఖ్యంగా ఎండుద్రాక్ష నీరు తాగుతుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు చాలా తొందరగా నయమవుతాయట. అవేంటో తెలుసుకుంటే.. పోషకాలు.. ఎండుద్రాక్షల ఐరన్, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది తినడానికి చాలా రుచిగా ఉంటుంది కూడా. ఎండుద్రాక్షను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగి ఎండుద్రాక్షను కూడా తినడం కొందరికి అలవాటు. ప్రయోజనాలు.. ఎండుద్రాక్షను రాత్రి నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగి ఎండుద్రాక్షలను కూడా తింటుంటే శరీరం శుద్ది అవుతుంది. శరీరంలో ఉండే విషపదార్థాలు టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. అధిక బరువుతో ఇబ్బంది పడేవారికి ఎండుద్రాక్ష నీరు గొప్ప మెడిసిన్. ఈ నీరు స్థూలకాయాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. బరువు తగ్గాలని అనుకునేవారు రోజూ ఉదయాన్నే నానబెట్టిన ఎండుద్రాక్ష తిని ఆ నీటిని తాగుతుంటే సులువుగా బరువు తగ్గుతారు. ఎండుద్రాక్ష నీటిలో నానిన తరువాత అందులో పెద్ద మొత్తంలో ఫైబర్ ఏర్పడుతుంది. ఈ నీటిని ఉదయాన్నే తాగి ఆ నానిన ఎండుద్రాక్షలు కూడా తింటుంటే జీర్ణాశయం, పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఎండుద్రాక్ష డ్రై ఫ్రూట్ గా పరిగణించబడుతుంది. ఇందులో సాధారణ ద్రాక్ష కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి. వీటిని నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగుతున్నా, నానిన ఎండుద్రాక్ష తింటున్నా రోజంతా శరీరం చురుగ్గా ఉంటుంది. శరీరానికి మంచి ఎనర్జీ లభిస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి చాలా రకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటారు. చాలా రకాల ఆహారాలను అవాయిడ్ చేస్తుంటారు. అయితే ఎండుద్రాక్ష నీరు శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గితే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎండుద్రాక్ష నీటిని ఉదయాన్నే తాగడం చాలా మంచిది. ఒకవేళ ఆ సయమంలో తాగలేక పోతే.. ఉదయం టిఫిన్ సమయంలో లేదా.. సాయంత్రం స్నాక్స్ సమయంలో అయినా తాగవచ్చు. కనీసం 15 నుండి నెల రోజులు దీన్ని క్రమం తప్పకుండా ఫాల్లో అవుతుంటే మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. *రూపశ్రీ.
read moreముల్లంగి ఆకులు దొరికితే అస్సలు వదలకండి.. వీటితో ఎన్ని లాభాలంటే..!
ముల్లంగి ఆరోగ్యానికి చాలా మంచిది. ఎక్కువ శాతం నీరు, ఫైబర్ కలిగిన ఈ దుంపలు చాలా రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెడతాయి. ముఖ్యంగా మొలలు, మలబద్దకం. మధుమేహం వంటి సమస్యలున్న వారికి ముల్లంగి ఔషధం కంటే తక్కువ కాదు. అయితే ముల్లంగి దుంపలే కాకుండా ముల్లంగి ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయట. ముల్లంగి ఆకులు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో.. ఇవి ఎవరికి ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తాయో తెలుసుకుంటే.. ముల్లంగి ఆకులలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా పోషకాలు అందిస్తాయి. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ముల్లంగి ఆకులను తరచుగా తింటూ ఉంటే చాలా మేలు జరుగుతుంది. సాధారణంగా ముల్లంగిని కొన్నప్పుడు వాటికి ఆకులు ఉంటే వాటిని చాలామంది విసిరేస్తారు. చెత్తబుట్టలో వేస్తారు. ముల్లంగి ఆకులు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. ముల్లంగి ఆకులలో ఫైబర్ మెరుగ్గా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం, అజీర్ణం, ఇతర కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ముల్లంగి ఆకులను తరచుగా ఆహారంలో తీసుకోవాలి. మధుమేహం ఉన్నవారికి కూడా ముల్లంగి ఆకులు సహాయపడతాయి. సాధారణంగా ముల్లంగి దుంపలు మధుమేహం ఉన్నవారికి మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రిస్తాయి. అలాగే ముల్లంగి ఆకులు కూడా అంతే శక్తివంతంగా పనిచేస్తాయి. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని సమతుల్యం చేయడంలో ముల్లంగి ఆకులు సహాయపడతాయి. శరీరంలో టాక్సిన్లు తొలగించడంలో ముల్లంగి ఆకులు సహాయపడతాయి. కాలేయాన్ని శుధ్ది చేసి కాలేయ పనితీరును మెరుగ్గా ఉంచుతాయి. అదే విధంగా మూత్ర పిండాల పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉండాలంటే శరీరానికి విటమిన్-సి చాలా అవసరం. ముల్లంగిలో విటమిన్-సి మెరుగ్గా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు సమస్యలను సులువుగా తగ్గిస్తుంది. మొలల సమస్యతో బాధపడేవారు ముల్లంగి ఆకులను ఆహారంలో తీసుకుంటే మంచిది. సాధారణంగా మలబద్దకం సమస్య వల్ల మొలల సమస్య వస్తుంది. ముల్లంగి ఆకులు ఆహారంలో తీసుకుంటే మలబద్దకం సమస్య తగ్గి మొలల సమస్య వచ్చే అవకాశమే ఉండదు. ఒక వేళ మొలల సమస్య ఉన్నా ముల్లంగి ఆకులను ఆహారంలో తీసుకుంటే చాలా తొందరగా సమస్య నుండి బయటపడతారు. *రూపశ్రీ.
read moreసోంపు నీళ్లు తాగితే కలిగే ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసా?
సొంపు లేదా సోపు చాలా మందికి తెలిసిన పదార్థమే. ఇవి జీలకర్రను పోలిన గింజలు. తరచుగా రెస్టారెంట్లు, హోటళ్లలో భోజనం తరువాత వీటిని ఇస్తుంటారు. భారీ భోజనం తరువాత సొంపు తింటే ఆహారం బాగా జీర్ణమై కడుపు బరువు తగ్గుతుందని అంటారు. పైగా ఇది గొప్ప మౌత్ ఫ్రెషనర్ గా కూడా పనిచేస్తుంది. అందుకే చాలామంది భోజనం తరువాత సొంపు తింటారు. చాలామందికి సొంపు గింజలను ఇలా తినడమే తెలుసు. కానీ సొంపు గింజలను కాకుండా సొంపు గింజల నీటిని తాగితే కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు. జీర్ణక్రియ.. సొంపు గింజల నీరు తీసుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణాన్ని, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు.. బరువు తగ్గడంలో సొంపు నీరు బాగా పనిచేస్తాయి. సొంపు గింజలలో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఇక సొంపు నీటిలో సమ్మేళనాలు శరీరంలో ఉండే కొవ్వు కరిగించడంలో సహాయపడతాయి. ఈ కారణంగా ఇది బరువు తగ్గిస్తుంది. పదే పదే ఆహారం తినాలనే కోరికను కంట్రోల్ చేస్తుంది. పరగడుపునే సొంపు నీరు తాగడం చాలామంచిది. యాంటీ ఆక్సిడెంట్లు.. సొంపు నీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ నుండి శరీర కాణాలను కాపాడటంలో సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు యవ్వనంగా కనిపించడంలోనూ, అనేకరకాల వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఇది ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. క్యాన్సర్ ముప్పు తగ్గిస్తుంది.. సొంపులో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. సొంపు నీటిని తాగుతూ ఉంటే శరీరంలో క్యాన్సర్ కణాల అభివృద్దిని అడ్డుకుంటుంది. క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. *నిశ్శబ్ద.
read moreఈ సమస్య ఉన్నవారు పాలు తాగకూడదు!
శరీరం మెరుగైన పనితీరుకు కారణమయ్యే అన్ని పోషకాలను కలిగి ఉండటం వల్ల పాలు లెక్కలేనన్ని ప్రయోజనాలు చేకూరుస్తుంది. పాలు, పాల ఉత్పత్తులలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ B2 (రిబోఫ్లావిన్), విటమిన్ B12, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ A, విటమిన్ D వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. ప్రతిరోజూ పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం, ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని పెంపొందించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, గుండెను ఆరోగ్యంగా ఉంచడం, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పాల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, పాలు తాగడం కొంతమందికి ప్రమాదకరం. ఏయే వ్యక్తులు పాలు ఎందుకు తీసుకోకూడదో తెలుసుకుంటే.. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నవారు పాలు తాగకూడదు. ఫ్యాటీ లివర్ అంటే కాలేయంలో కొవ్వు పేరుకుపోయి మంటగా మారుతుంది. వీరు పాలను తీసుకోవడం వల్ల సమస్య తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. లాక్టోస్ ప్రతికూలత ఉన్నవారు పాలు తాగకూడదు. అంటే పాలు తాగడంతో కడుపు ఉబ్బరం, అసిడిటీ లేదా వాంతులు లేదా విరేచనాలు కలుగుతుంటాయి కొందరికి. ఇలాంటి సమస్య ఉన్నవారు పాలు తాగకూడదు. పాలు మరియు పాల ఉత్పత్తులను తీసుకున్న తర్వాత కొంతమందికి వికారం లేదా వాంతులు అవుతాయని ఫిర్యాదు చేస్తుంటారు. అలాంటి సమస్యలు ఉన్న వ్యక్తులు పాలు తాగకూడదు. అలాంటి వారు చాలా మంది ఉన్నారు, వీరికి ఒక సిప్ పాలు తాగిన తర్వాత వికారం మొదలైపోతుంటుంది. క్యాన్సర్ ఉన్నవారు పాలు తాగకూడదు. ప్రోస్టేట్ క్యాన్సర్ అయినా, బ్రెస్ట్ క్యాన్సర్ అయినా, అండాశయ క్యాన్సర్ అయినా, అలాంటి వారు పాలు అస్సలు తాగకూడదు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, మలం నుంచి రక్తం పడటం వంటి సమస్యలు ఉన్నవారు పాలు తాగకూడదు. అలాగే పాలు తాగడం వల్ల అలర్జీ ఉన్నవారు కూడా పాలు అస్సలు తాగకూడదు. ఏవైనా చర్మవ్యాధులు ఉన్నా, పాలు తాగడం వల్ల చర్మంపై మొటిమలు, మచ్చలు లేదా ముడతలు వచ్చే ప్రమాదం ఉన్నా పాలు తాగకూడదు. ఇవి మాత్రమే కాకుండా హృద్రోగులు పాలు తాగకూడదు. పైన చెప్పుకున్న సమస్యలున్నవారు పొరపాటున కూడా పాలు తీసుకోకూడదు. *నిశ్శబ్ద.
read moreతెలివిని పెంచే ఆహారం
మెదడు కూడా మన శరీరవ్యవస్థలో ఒక భాగమే! దానికీ తగినంత నీరు కావాలి. దానికీ సరిపడా పోషకపదార్థాలు చేరుతుండాలి. అందుకే మనం తీసుకునే ఆహారపు ప్రభావం ఎంతోకొంత మన మెదడు పనితీరు మీరు ఉంటుంది. అంతేకాదు! శరీరంలోని మిగతాభాగాల ఆరోగ్యం కూడా ఒకోసారి మెదడు మీద కనిపిస్తుంది. అందుకే... ఎలాంటి ఆహారం తీసుకుంటే మన మెదడుకి మంచిదో సూచిస్తున్నారు నిపుణులు. వాటిలో కొన్ని ఇవిగో... చాక్లెట్లు చాక్లెట్లు తింటే రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చేమాట నిజమే! కానీ డార్క్ చాక్లెట్లను మితంగా తినడం వల్ల మన గుండెకు, రక్తపోటుకీ మంచిదంటూ ఎన్నో పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. తద్వారా మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుందంటున్నారు. డార్క్ చాక్లెట్లలో ఉండే ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్ల వల్ల కీడుకంటే మేలే ఎక్కువ. కాకపోతే చాక్లెట్ నల్లటిదై ఉండాలి (డార్క్), మోతాదు మించకుండా తినాలి. ఆకుకూరలు పచ్చగా ఉండే ఆకుకూరలు తింటే ఆ ప్రభావమే వేరంటున్నారు వైద్యులు. ముఖ్యంగా పాలకూర, బచ్చలికూర, బ్రకోలి వంటి ఆకుకూరల వల్ల జ్ఞాపకశక్తి చెక్కుచెదరకుండా ఉంటుందట. వీటిలో ఉండే సి,బి, కె, ఇ వంటి విటమిన్లు.... ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడతాయి. ఆకుకూరలను తరచూ తిన్నవారి జ్ఞాపకశక్తి అమోఘంగా ఉండటమే కాదు... వారి మెదడులో నిక్షిప్తమై ఉన్న విషయాలు సుదీర్ఘకాలం పాటు చెక్కుచెదరవని అనేక పరిశోధనలలో రుజువైంది. చేపలు మాంసాహారం గురించి భిన్నాభిప్రాయాలు ఉండవచ్చుగాక. కానీ వాటిలో చేపల గురించి మాత్రం కాస్త మంచి మాటలే వినిపిస్తుంటాయి. ముఖ్యంగా సాల్మన్, ట్యూనా వంటి చేపలలో ఉండే ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల గుండె పదిలంగా ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. ఈ ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటుగా Docosahexaenoic acid (DHA) అనే రసాయనం వల్ల మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుందట. పిల్లల్లో కనిపించే ADHD వంటి మానసికమైన లోపాలలో సైతం చేపలు తమదైన ప్రభావం చూపుతాయట. పప్పులు బాదంపప్పులు తింటే మెదడు చురుగ్గా ఉంటుందని తరతరాల నుంచీ వింటూనే ఉన్నాము. ఇక ఈ మధ్యకాలంలో బాదంతో పాటుగా ఆక్రోటుని కూడా తినమని ప్రోత్సహిస్తున్నారు. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లతో పాటుగా సమృద్ధిగా లభించే విటమిన్ ఇ వల్ల మెదడులోని న్యూరాన్లు ఆరోగ్యంగా ఉంటాయట. పైగా వయసుతో పాటుగా వచ్చే మతిమరపు వంటి సమస్యలు కూడా దరిచేరవని ఘంటాపథంగా చెబుతున్నారు. టమాటాలు మెదడుకి మేత కోసం రూపొందిన జాబితాలో టమాటాలు కూడా ఉండటం ఆశ్చర్యమే! టమాటాలలో ఉండే ‘లైసోపిన్’ అనే రసాయనం మెదడులోని కణాలు దెబ్బతినకుండా చూస్తుందట. దానివలన మెదడు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, అల్జీమర్స్ వంటి వ్యాధులు సైతం దాడి చేసేందుకు వెనకాడతాయట. ఇవే కాకుండా పసుపు, తృణధాన్యాలు, కొబ్బరినూనె, నెయ్యి, బీన్స్, అవ్కాడో, పొద్దుతిరుగుడు గింజలు వంటి పదార్థాలు కూడా మెదడు సామర్థ్యాన్ని పెంచడంలోనూ, ఆరోగ్యవంతంగా ఉంచడంలోనూ సాయపడతాయని సూచిస్తున్నారు. - నిర్జర.
read moreకంటి శుక్లం రాకుండా ఉండాలంటే ఉసిరికాయలు ఇలా తినాలి..!
ఉసిరి కాయలు భారతీయులకు వరం కంటే తక్కువ కాదు. ఆయుర్వేదంలో ఉసిరికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. సంస్కృతంలో ఉసిరిని అమలకి అని అంటారు. రోజూ ఉసిరికాయలు తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని, బరువు తగ్గించడంలోనూ, రోగనిరోధక శక్తిని బలంగా మార్చడంలోనూ సహాయపడతాయని అంటారు. అయితే ఉసిరికాయలను తినడం వల్ల కంటి శుక్లానికి కూడా చెక్ పెట్టవచ్చని అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే.. కంటి శుక్లం.. చాలామంది చూపు కోల్పోవడానికి కంటి శుక్లం కారణం అవుతుంది.. ముఖ్యంగా కంటి చూపు అస్పష్టంగా మారుతుంది. కాలక్రమేణా పూర్తీగా చూపు పోవడానికి దారితీస్తుంది. వయసు పెరిగేకొద్ది కంటి శుక్లం సమస్యలు వస్తాయి. చాలా వరకు వృద్దులలో కంటి శుక్లం సమస్యలు కనిపించేవి. కానీ నేటి కాలంలో చాలా తక్కువ వయసులోనే ఈ సమస్యలు బయటపడుతున్నాయి. కంటి శుక్లం రాకూడదన్నా, కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉండాలన్నా ఉసిరికాయలు తినాలని అంటున్నారు. ఎలాగో ఇది కార్తీక మాసం.. ఈ మాసం మొదలు దాదాపు రెండు, మూడు నెలల వరకు ఉసిరికాయలు విరివిగా లభిస్తాయి. ఉసిరికాయలు దొరికినన్ని రోజులు వీటిని తినడం.. మిగిలిన రోజులలో తినడానికి వీటిని ఎండబెట్టి పొడి చేసుకుని నిల్వ చేసుకుంటే ఏడాది మొత్తం క్వాలిటీతో కూడిన ఉసిరికాయ పొడి సిద్దమవుతుంది. ఉసిరికాయలు కంటి శుక్లానికి ఎలా చెక్ పెడతాయి తెలుసుకుంటే.. కంటి శుక్లం వయసుతో సంబంధం లేకుండా రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏదైనా ఆరోగ్య సమస్యల వల్ల మందులను ఎక్కువ కాలం వాడటం వల్ల కంటి శుక్లం వచ్చి కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా కంటికి గాయం, మధుమేహం వంటి సమస్యల వల్ల కూడా కంటి శుక్లం వస్తుంది. సాధారణంగా కంటి శుక్లాన్ని ఆపరేషన్ చేసి తొలగిస్తారు. అయితే శస్ర్తచికిత్సతో సంబంధం లేకుండా జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల కంటి శుక్లానికి చెక్ పెట్టవచ్చు. దీనికి ఉసిరికాయ బాగా సహాయపడుతుంది. ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి, ఫ్లేవనాయిడ్లు కంటి శుక్లాన్ని నయం చేయడంలో, రాకుండా చేయడంలో సహాయపడతాయి. ఇతర కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా చేయడంలో కూడా సహాయపడతాయి. శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో ఉసిరి సహాయపడుతుంది. ముఖ్యంగా ఉసిరికాయలో ఉండే విటమిన్-సి దృష్టి సమస్యలు నయం చేయడంలో సహాయపడుతుంది. వృద్దాప్య ప్రభావాల నుండి కళ్లను రక్షిస్తుంది. ఉసిరికాయ తినడం వల్ల కంటి లెన్స్ లోని టెన్షన్ తగ్గుతుందని అంటున్నారు. ఇది కంటి శుక్లం సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలు కూడా వెల్లడిస్తున్నాయి. రోజూ ఒకటి లేదా రెండు ఉసిరికాయలను తినవచ్చు. దీన్ని పగలకొట్టి కొద్దిగా ఉప్పు వేసి నోట్లో వేసుకుని సుమారు గంట సేపటి వరకు దాని సారాన్ని మెల్లిగా జుర్రుకుంటూ ఉసిరిని తినవచ్చు. లేదంటే ఉసిరికాయను ముక్కలు చేసి దాన్ని గ్రైండ్ చేసి అందులో తగినంత నీరు జోడించి జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చు. ఉసిరికాయ సీజన్ దాటితే అవి దొరకవు. అందుకే ఉసిరికాయల సీజన్ లోనే ఉసిరికాయలను ఎండబెట్టి పొడి చేసుకుని వాటిని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని వేడి నీటిలో కలిపి ఒక 10 నిమిషాల తరువాత గోరువెచ్చగా తాగాలి. *రూపశ్రీ.
read moreఅలోవేరలో ఔషద గుణాలు
అలోవేరా నేడు ప్రతి ఇంట్లో పెంచుకుంటున్న ఔషద మొక్క ఈమొక్క ఎక్కువగా గుబురు గా విస్తరిస్తుంది.ఊష్ణ ప్రాంతంలో ఇది ఎక్కువగా పెరుగుతుంది.దీనిని తెలుగులో కలబందఅని పిలుస్తారు.దీనిని వందల సంవత్సరాలుగా వైద్య పరంగా వినియోగిస్తునే ఉన్నారు. ఈ మోకలో మెత్తగా, వచ్చే గుజ్జు చాలా రకాల చికిత్సలకి నేటికీ వాడతారు.ప్రాచీన కలం నుండి ఇందులో ఉండే రసాయన పదార్ధం, జెల్ వైద్య పరంగా కనేతిక్స్ లో వాడుతున్నారు. అలో వీర ను పూర్తిగా కృష్ చేసి రుబ్బి మొత్తం ఆకును వినియోగిస్తారు.వివిధ పద్దతులలో వాడతారు, దీనుంది వచ్చిన రసాన్ని పూర్తిగా ఫిల్టర్ చేసి అలోవీరా జ్యూస్ గా ఒక సాధారణ ఆహరంమ్గా తీసుకుంటున్నారు. ఇది అల్కరైజర్ గా పనిచేస్తుంది,ఇటీవలి కాలంలో అలోవీరా జ్యూస్ డయాబెటిస్ నివారణకు వినియోగించడం గమనించవచ్చు. అలోవీరా అల్క లైసేర్ మన శరీరామ్ లో ఫై హెచ్ శాతాన్ని సమానంగా ఉంచుతుంది. ఇక డిటోక్షి కేషన్ చేయడం వల్ల లివర్ పనితీరు మెరుగు పడుతుంది.అలోవీరా జ్యూస్ మీ లివర్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది.అలోవీరా జ్యూస్ లో లివర్ కు మాత్రమే పనిచేస్తుంది ఎందుకంటే ఇందులోఫి టో న్యూట్రి యాంట్స్ ఉండడం వాళ్ళ మల బద్ధకం ఎదుర్కుంటున్న వాళ్ళకి అలోవీరా జ్యూస్ నిత్యం రోజువారి ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా మీ పెద్ద పేగులు చిన్న పేగులు లేదా చాతి మంటగా ఉంటె కొంచం అలోవీరా జ్యూస్ తీసుకోండి గుండెల్లో మంతా మాయం కాస్త ఉపసమనం ఇస్తుంది.గ్యా స్టిక్ అల్సర్ ను సమర్ధంగా ఎదుర్కున్ర్ శక్తి అలోవీరా జుఇసుకి ఉంది.అలోవీరా చర్మా సంబందిత గాయాలులేదా తమర గజ్జి వంటి సమస్యకు అలోవీరా లో ఉన్న గుజ్జును కొంచం రాసి చ్చోదండి మంట ఉండదు దెబ్బ తగిలిన ప్రాంతంలో నెప్పి లేదా మచ్చ ఉండనే ఉండదు ఇన్ని ఔషద గుణాలు ఉన్న అలోవీరాను వినియోగిస్తే ఆరోగ్య పరంగా మేలుజరుగుతుందో. అలోవేర అలంకరానికే కాదు ఆరోగ్యానికి ఉపయోగమే.
read moreటీ బ్యాగ్ లతో టీ తయారు చేసుకుని తాగుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి..!
టీ.. భారతీయులకు ఒక ఎమోషన్. ఒకప్పుడు పట్టణాలలో ప్రజలు, బయటి షాపులలో మాత్రమే టీ కనిపించేది. కానీ ఇప్పుడు గ్రామాలకు కూడా టీ ఫీవర్ పాకింది. ఉదయాన్నే కాఫీలు, సద్ది అన్నం తినే కల్చర్ నుండి ఉదయాన్నే టీ తాగి, టిఫిన్లు తిని పనులు చేసుకునే స్థితికి కాలం మారింది. ఇప్పుడు భారతదేశంలో నీటి తర్వాత అత్యధికంగా వినియోగిస్తున్న పానీయం టీ కావడం గమనార్హం. చాలామంది టీ ఆకులు, టీ పొడి కొనుగోలు చేసి టీని తయారు చేసుకుని తాగుతుంటారు. కానీ ఆరోగ్యం మీద స్పృహ ఉన్నవారు గ్రీన్ టీ, బ్లాక్ టీ మొదలైనవి తాగుతారు. ఇవి కూడా తయారు చేసుకోవడానికి సులభంగా ఉంటుందని టీ బ్యాగ్ రూపంలో కొనుగోలు చేస్తారు. అయితే టీ బ్యాగ్ లు ఉపయోగించి తయారు చేసుకునే టీ వల్ల ఆరోగ్యం పాడవుతుందనే విషయాలను వైద్యులు, ఆహార నిపుణులు వెలిబుచ్చుతున్నారు. అసలింతకీ టీ బ్యాగ్ ల వల్ల జరిగే నష్టం ఏంటి తెలుసుకుంటే.. ఉదయాన్నే వేడి నీటిని ఒక పెద్ద కప్పులో పోసి అందులో గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ బ్యాగ్ వేసి 5 నుండి 10 నిమిషాల తరువాత ఆ పానీయాన్ని తాగడం చాలా మంది చేసే పని. ఆరోగ్యానికి ఆరోగ్యం, పని కూడా తక్కువే అనేది వారి భావన. కానీ ఇలా టీ బ్యాగుల ద్వారా తయారు చేసే టీ ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని అంటున్నారు. టీ బ్యాగులు ఉపయోగించడం చాలా తేలిక. కేవలం వేడి నీటిలో ఈ టీ బ్యాగులను కొన్ని నిమిషాలు ఉంచితే ఆరోగ్యకరమైన టీ తయారవుతుందని అనుకుంటారు. దీనికి తగ్గట్టుగానే మార్కెట్లో కూడా టీ బ్యాగుల అమ్మకం ఎక్కువ. ముఖ్యంగా టీ బ్యాగులు కూడా వివిధ రకాల ఫ్లేవర్లలో అమ్ముతుంటారు. టర్మరిక్ టీ, మందార టీ, దాల్చిన చెక్క టీ, చమోమిలే టీ వంటి టీలను కూడా అమ్ముతుంటారు. ఇవన్నీ శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయని అనుకుంటారు. వీటిలో కెఫీన్ ఉండదు. అయినప్పటికీ ఇవి కూడా డెంజరే.. ఎందుకంటే ఇవి కూడా టీ బ్యాగ్ ల రూపంలో ఎక్కువ వాడతారు. టీ బ్యాగ్ లలో ఉండే రసాయనాలు శరీరాన్ని అనారోగ్యానికి గురి చేస్తాయి. అంతే కాదు వీటిని ప్యాక్ చేసిన తరువాత ఇందులో ఏమున్నాయో గమనించే అవకాశం ఉండదు. కానీ కొన్ని సార్లు ఈ టీ బ్యాగ్ లలో కీటకాలు, చనిపోయిన పురుగులు వంటివి కూడా ఉండవచ్చు. ఈ కారణంగా ఇవి ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. ముఖ్యంగా టీ బ్యాగులను వేడి నీటిలో ఉంచినప్పుడు టీ బ్యాగుల నుండి మైక్రో ప్లాస్టిక్ విడుదల అవుతుంది. టీ బ్యాగులలో డయాక్సిన్ లేదా ఎపిక్లోరోహైడ్రిన్ పూత ఉంటుంది. వేడి నీటిలో టీ బ్యాగులను ఉంచినప్పుడు ఈ పూత కరుగుతుంది. ఇది గ్లాసులోని నీటిలో కలిసిపోతుంది. దీని వల్ల శరీరానికి హాని కలుగుతుంది. దీర్ఘకాలంగా ఈ టీ బ్యాగులు వాడితే శరీరానికి మేలు జరగకపోగా వివిధ రకాల జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. *రూపశ్రీ.
read moreచలికాలంలో వాము ఆకులు తప్పక తినాలి.. బెనిఫిట్స్ ఇవే..!
వాము ఆకుల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. మందంగా ఆకుల చివర కత్తిరించినట్టుగా కనిపించే వాము ఆకులు చాలామంది ఇళ్లలోనే పెంచుకుంటారు.దీని వాసన ఘాటుగా ఉంటుంది. దగ్గు, జలుబు చేయగానే చాలామంది ఈ ఆకులను తినమని సలహా ఇస్తుంటారు కూడా. అయితే ఈ వాము ఆకులు చలికాలంలో చాలా ఉపయోగపడతాయి. చలికాలంలో జలుబు, గొంతు సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. కేవలం వీటికే కాకుండా వాము ఆకు మరిన్ని సమస్యలకు అద్బుతమైన ఔషదంగా పనిచేస్తుంది. వాము ఆకుల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో పూర్తీగా తెలుసుకుంటే.. వాము ఆకులలో కాసింత ఉప్పు పెట్టి తాంబూలంలా చుట్టి నమిలి తినాలి. ఆ తరువాత గోరువెచ్చని నీరు తాగాలి. ఇలా చేస్తే కడుపునొప్పి సమస్య మంత్రించినట్టు మాయం అవుతుంది. వాము ఆకులలో విటమిన్-ఎ,సి, సెలీనియం, జింక్ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా ఇవి హార్మోన్స్ ను బ్యాలెన్స్ గా ఉంచడంలో సహాయపడతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉన్న కారణం వల్ల వాము ఆకులను తిన్నప్పుడు కడుపులో మంట తగ్గుతుంది. కడుపులో యాసిడ్లకు ఇది చికిత్స చేస్తుంది. వాము ఆకుల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. వీటిని బాగా నమిలి తినడం వల్ల నోటిలోని బాక్టీరియా మాత్రమే కాకుండా నోటి దుర్వాసన కూడా తగ్గిపోతుంది. వాము ఆకులలో థైమోల్ అనే యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి శ్వాసకోశ ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతాయి. ఆయుర్వేదం మహిళలకు వాము ఆకులతో గొప్ప ఆరోగ్య చిట్కా సూచించింది. ఈ ఆకులను క్రమం తప్పకుండా తింటూ ఉంటే నెలసరి సమస్య వచ్చినప్పుడు అస్సలు నెలసరి నొప్పి సమస్యే ఉండదు. వాము ఆకులలో ఎక్స్ పెక్టరెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి దగ్గు, జలుబు లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఇవి గొంతు, ముక్కులలో రద్దీని క్లియర్ చేయడంలో సహయపడతాయి. అరచెంచా వాము ఆకులు, అరచెంచా మారేడు ఆకులను కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. ఇలా చేస్తే మధుమేహం ఉన్నవారిలో పాలీయూరియా పై ప్రభావం చూపిస్తుంది. దానివల్ల కలిగే నష్టాలను నియంత్రిస్తుంది. వాము ఆకులు, తెనె, కాసింత వెనిగర్ మూడూ కలిపి తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తగ్గుతుంది. విటమిన్-ఎ మెండుగా ఉన్న కారణంగా వాము ఆకులు తినే వారిలో కంటి చూపు ఆరోగ్యంగా ఉంటుంది. ఆ తరువాత కంటి సమస్యలు అస్సలు రాకుండా చేస్తుంది. *నిశ్శబ్ద.
read moreనల్ల ఉప్పు నీటిని ఖాళీ కడుపుతో తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
ఉప్పు వంటకు రుచిని ఇస్తుంది. ఉప్పు లేని వంట ఎవరూ తినలేరు కూడా. ఉప్పులో చాలా రకాలున్నాయి. వాటిలో రాతి ఉప్పు, సాధారణ ఉప్పు మాత్రమే కాకుండా కొన్ని రకాల స్నాక్స్ లోనూ, వంటలలోనూ ప్రత్యేకంగా నల్ల ఉప్పును వాడుతుంటారు. బ్లాక్ సాల్ట్ అని పిలుచుకునే ఈ నల్ల ఉప్పును నీటిలో కలిపి ప్రతి రోజూ ఉదయమే ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలుంటాయని అంటున్నారు. నల్ల ఉప్పును, నల్ల ఉప్పు నీటిని ఆరోగ్య ప్రయోజనాల కోసం.. ఆయుర్వేదంలో చాలా ఏళ్ల నుండి ఉపయోగిస్తున్నారు. నల్ల ఉప్పులో సోడియం క్లోరైడ్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. నల్ల ఉప్పు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే ఏం జరుగుతుందంటే.. నల్ల ఉప్పు నీరు కాలేయాన్ని శుధి చేయడంలో సహాయపడుతుంది. ఈ ఉప్పు ప్రత్యేకత ఏమిటంటే ఇది కాలేయ కణాలలో పేరుకుపోయిన మురికిని బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది మాత్రమే కాకుండా కాలేయం పనితీరును వేగవంతం చేస్తుంది. కాలేయానికి పొంచి ఉండే ఇతర వ్యాధులను నివారిస్తుంది. కేవలం కాలేయాన్ని మాత్రమే కాదు.. నల్ల ఉప్పు నీరు తాగితే శరీరం కుడా శుద్ది అవుతుంది. శరీరంలో ఉండే టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. చర్మ సంబంధ సమస్యలను తగ్గించడంలో నల్ల ఉప్పు నీరు చాలా సహాయపడుతుంది. రక్తాన్ని శుద్ది చేస్తుంది. చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నల్ల ఉప్పు నీరు తాగడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. మలబద్దకాన్ని తగ్గించడం ద్వారా ఫైల్స్ సమస్య కూడా తగ్గుతుంది. ఒకే రకమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది ఎసిడిటీ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే నల్ల ఉప్పు నీటిలో ఆల్కలీన్ స్వభావం ఉంటుంది. ఇది ఎసిడిటీని తగ్గించడంలో.. కడుపులో ఆమ్లాలను తటస్థం చేయడంలో సహాయపడుతుంది. గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ నుండి ఉపశమం కలిగిస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నల్ల ఉప్పు, కాసింత నిమ్మరసం కలిపి తీసుకుంటే ఎసిడిటీ సమస్య మరింత తొందరగా తగ్గుతుంది. జీవక్రియ కూడా బాగుంటుంది. *రూపశ్రీ.
read moreమొలకలు వచ్చిన బంగాళదుంపలతో ముప్పు.. అంతా ఇంతా కాదు!
బంగాళదుంపలు భారతీయులకు మాత్రమే కాకుండా విదేశీయులకు కూడా ఇష్టమైన ఆహారం. తినడానికి రుచిగా, వండటానికి ఈజీగా ఉండే బంగాళదుంపలను ప్రతి వంటిట్లోనూ చూడవచ్చు. ఏ కూర చేయాలో అర్థం కాని వారికి బంగాళదుంప బంగారంలా కంగారు తగ్గిస్తుంది. ముక్కలుగా కోసి నూనెలో వేపి కాసింత ఉప్పు, కారం చల్లితే అన్నంలో కలుపుకుని తినడానికి అయినా, సైడ్ డిష్ కోసం అయినా, రోటీలలోకి అయినా ఇట్టే సెట్ అవుతుంది. ఇక బంగాళదుంపలు కేవలం కూరలాగానే కాకుండా పానీ పూరి నుండి చిప్స్ వరకు ప్రతి ఒక్క చోట తన ట్యాగ్ వేస్తుంది. ఈ కారణాల వల్ల బంగాళదుంపకు కాసింత క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. అయితే చాలా ఇళ్లలో బంగాళదుంపల మీద చిన్నగా మొలకలు రావడం గమనించి ఉంటారు. ఈ మొలకలను తొలగించి హాయిగా కూర వండేసుకోవడమే అందరికీ తెలుసు.. కానీ ఇలాంటి బంగాళదుంపలతో పెద్ద ముప్పేనని ఆహార నిపుణులు అంటున్నారు. మొలకెత్తిన బంగాళదుంపలు.. మొలకెత్తిన బంగాళదుంపల మీద ఉన్న మొలకలు తొలగించి వండుకునే వారికి పెద్ద షాకే తగులుతోంది. ఇలా మొలకలు వచ్చిన బంగాళదుంపలను వండుకుని తినడం అంటే విషాన్ని తినడమేనట.. మొలకలు వచ్చిన బంగాళదుంపలు కానీ, బంగాళదుంపల మీద లేత ఆకుపచ్చ రంగు ఉన్నా కానీ ఇవి మంచివి కాదట. ఇలాంటి బంగాళదుంపలలో సోలనైన్, చకోనైన్ వంటివి ఉత్పత్తివి. ఇవి చాలా విషపూరితమైన సమ్మేళనాలు. వీటిని తీసుకుంటే కడుపు ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా కడుపులో తిప్పడం, విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇవి మాత్రమే కాకుండా తల తిరగడం, తలనొప్పి, నరాల సంబంధ సమస్యలు పెంచుతాయి. బంగాళదుంపలు ఇలా తినకండి.. బంగాళదుంపలు వేయించి తినడం చాలా మందికి ఇష్టం. ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి. ఈ కారణంగానే బంగాళదుంపల చిప్స్, లేస్, బింగో, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి స్నాక్స్ కు కూడా బాగా డిమాండ్ ఉంది ఇప్పట్లో. అయితే ఇలా తినడం అస్సలు మంచిది కాదు. ఇవి రక్తపోటును పెంచుతాయి. కేలరీలు కూడా ఎక్కువగా అందిస్తాయి. ఈ కారణంగా బరువు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎలా తినాలి.. బంగాళదుంపలు తినడానికి సరైన మార్గం వాటిని ఉడికించి తినడం. బంగాళదుంపలు ఉడికించి తిన్నా, వాటిని వివిధ రకాల కూరలలో భాగం చేసి ఉడికించినా మంచిది. సాంబార్, కిచిడి, ఉప్మా, కూర్మా వెజిటబుల్ రైస్ వంటి వాటిలో భాగం చేయవచ్చు. *రూపశ్రీ.
read moreఅశ్వగంద గురించి ఈ నిజాలు విన్నారా?
అశ్వగంధ ఆయుర్వేదంలో ఒక ముఖ్య ఔషధం. ఇది మొక్క వేరు నుండి లభించే పదార్థం. అశ్వగంధ వేరు రూపంలో ఉంటుంది. దీన్ని సేకరించి ఎండబెట్టి పొడిగా చేసి వివిధ ఆరోగ్య సమస్యలకు ఔషదంగా వాడతారు. అశ్వగంధ కేవలం పొడి రూపంలోనే కాకుండా టాబ్లెట్లు, లేహ్యం రూపంలో కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఆయుర్వేద వైద్యులు చాలా రకాల జబ్బులకు అశ్వగంధను సిఫారసు చేస్తారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, ఆందోళన, నరాల సమస్యలు, నిద్రలేమి వంటి సమస్యలకు అశ్వగంధను సిఫారసు చేస్తారు. అనారోగ్యంతో బాధపడే చాలామందికి అశ్వగంధను కూడా ఔషదంల బాగం చేస్తారు. ఇది ఇతర ఔషధాలు సమర్థవంతంగా పని చేయడంలో సహకరిస్తుంది. అంటే మందులను కాంబినేషన్ రూపంలో ఇస్తారు. కాబట్టి ఏవైనా మందులు వాడేవారు సొంతంగా అశ్వగంధ మాత్రలు లేదా పొడి తీసుకోకూడదు. అశ్వగంద నేరుగా తీసుకోవడం కంటే పాలతో తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి. లేకుంటే వేడి నీటితో అయినా తీసుకోవచ్చు. అశ్వగందను ఏ రూపంలో తీసుకున్నా జ్ఞాపకశక్తి, శ్రద్ద, ఆలోచనలు మెరుగుపడటం, మెదడు ఆరోగ్యం మెరుగ్గా ఉండటం వంటి వాటిలో సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారికి కూడా అశ్వగంధ బాగా పనిచేస్తుంది. అశ్వగంధను తీసకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. ఈ కారణంగా శరీరంలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నవారికి, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మేలు చేస్తుంది. అధిక బరువు ఉన్నవారు అశ్వగంధను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ కారణంగా ఇది బరువు తగ్గిస్తుంది. అంతే కాదు శరీరంలో కండరాలు బలంగా మారడంలో కూడా అశ్వగంధ సహాయపడుతుంది. మహిళలకు కూడా అశ్వగంధ చక్కగా పనిచేస్తుంది. మహిళలు సాధారణంగా హార్మోన్ సమస్యలు ఎక్కువగా ఎదురుకుంటూ ఉంటారు. అలాంటి వారికి అశ్వగంధ బాగా పనిచేస్తుంది. హార్మోన్ సమస్యలు తగ్గిస్తుంది. నెలసరి సమస్యలను పరిష్కరిస్తుంది. మహిళలలో లైంగిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు ఎదుర్కునే పురుషులలో పునరుత్పత్తి హార్మోన్లను మెరుగు పరచడంలో అశ్వగంధ సహాయపడుతుంది. స్పెర్మ్ కౌంట్ మెరుగ్గా ఉండేలా, స్పెర్మ్ క్వాలిటీని మెరుగుపరుస్తుంది. *రూపశ్రీ.
read moreజీర్ణ వ్యవస్థ బలంగా ఉండాలంటే ఈ కూరగాయ తినాలి..!
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నప్పుడే తిన్న ఆహారం సరిగా జీర్ణం అవుతుంది. ఆహారం సరిగా జీర్ణం అవుతుంటే ఆహారంలో పోషకాలు శరీరానికి బాగా అందుతాయి. అదే ఆహారం సరిగా జీర్ణం కాకుంటే శరీర వ్యవస్థ దెబ్బ తింటుంది. అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలా కాకుండా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆహారం సరిగా జీర్ణం కావాలన్నా ఆహారంలో ఒక కూరగాయను జోడించుకుంటే సరిపోతుంది. అదేంటో తెలుసుకుంటే.. గుమ్మడికాయ.. గుమ్మడికాయను చాలామంది రెగ్యులర్ కూరగాయలతో సమానంగా ఉపయోగించడంలో వెనుకబడి ఉంటారు. చాలా వరకు గుమ్మడికాయను హోటల్స్, పెళ్లిళ్ళు, అన్న వితరణ వంటి చోట్ల మాత్రమే చూస్తుంటారు. వంటల్లో గుమ్మడి కాయ వినియోగాన్ని పెంచితే జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. గుమ్మడికాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలంగా ఉంచుతుంది. అంతే కాదు పైబర్ ఉండటం మూలాన గుమ్మడికాయను తింటే ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది. పదే పదే ఆకలి వేయకుండా అరికడుతుంది. కేవలం పొట్ట ఆరోగ్యం మాత్రమే కాదు.. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా గుమ్మడికాయ ఉపయోగపడుతుంది. కేవలం గుమ్మడికాయ మాత్రమే కాదు.. గుమ్మడి గింజలు కూడా జీర్ణక్రియకు మేలు చేస్తాయి. గుమ్మడి గింజలను వేయించి తినవచ్చు. లేదా వీటిని సలాడ్ లలోనూ జోడించుకోవచ్చు. స్నాక్స్ తీసుకునే సమయంలో అనారోగ్యకరమైన ఆహారాలు తొలగించి గుమ్మడి గింజలు తీసుకోవచ్చు. గుమ్మడికాయను వంటల్లో ఉపయోగించలేక పోతే వాటిని సూప్, వెజిటబుల్ సలాడ్, స్మూతీ వంటివి తయారుచేసి తీసుకోవచ్చు. *రూపశ్రీ.
read moreదీపావళికి ఈ షుగర్ ఫ్రీ స్వీట్స్ తినండి.
దీపావళికి షుగర్ మిఠాయిలు తినకుండా ఇంట్లోనే ఈ షుగర్ ఫ్రీ స్వీట్లను తయారు చేసి ఆరోగ్యంగా ఉండండి. ఖర్జూర లడ్డూలు: ఖర్జూరం సహజ స్వీటెనర్. డ్రై ఫ్రూట్స్, నెయ్యితో తయారు చేసిన ఈ లడ్డూలు షుగర్ పేషంట్లు మంచి ఎంపిక. మధుమేహ వ్యాధిగ్రస్తులు, బరువు తగ్గాలనుకునే వారు దీనిని తినవచ్చు. ఫ్రూట్ చాట్: వివిధ తాజా పండ్లు, చాట్ మసాలాతో చేసిన ఫ్రూట్ చాట్ ఒక సంతోషకరమైన ఎంపిక. చక్కెర అవసరాన్ని తొలగిస్తుంది. ఈ డెజర్ట్ డయాబెటిస్ ఫ్రెండ్లీ మాత్రమే కాదు, బరువు చూసేవారికి కూడా గొప్ప ఎంపిక. బాదం పాలతో తక్కువ కార్బ్ పాయాసం: దీపావళి సమయంలో పాయసం ఒక ప్రసిద్ధ తీపి వంటకం. అధిక కేలరీల ఆహారాలను ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలతో భర్తీ చేయండి. కేలరీలను తగ్గించడానికి సాధారణ పాలకు బదులుగా బాదం పాలను ఉపయోగించండి. డ్రై ఫ్రూట్లను జోడించడం వల్ల డెజర్ట్ యొక్క పోషక విలువను పెంచుతుంది. షుగర్ ఫ్రీ గులాబ్ జామూన్: చక్కెర స్థానంలో ఖర్జూరం వంటి సహజమైన స్వీటెనర్లతో గులాబ్ జామూన్‌ను ఆరోగ్యకరమైన రీతిలో తయారు చేసుకోవచ్చు. ఫైబర్, అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉన్న దీనిని మధుమేహ వ్యాధిగ్రస్తులు, బరువు తగ్గించే ఆహారంలో ఉన్నవారు తినవచ్చు. గోధుమ బెల్లం కేక్: గోధుమ పిండి, బెల్లంతో తయారు చేసిన కేక్ షుగర్ పేషంట్లకు మేలు చేస్తుంది. ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికతో సహజ స్వీటెనర్. రక్తంలో చక్కెర స్థాయిలు, కేలరీల తీసుకోవడం నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచిది.
read moreరాగి పాత్రలో నీళ్లు తాగండి.. ఈ లాభాలన్నీ మీ సొంతం..!
వంటింట్లో చాలా వరకు స్టీల్ సామాన్లు ఉంటాయి. స్టీల్ బిందెలు, స్టీల్ జోడాలలో తాగడానికి నీరు పోసి పెట్టుకుంటారు. మరికొందరు మట్టి కుండలలో నీరు తాగుతుంటారు. అయితే ఆరోగ్య స్పృహ ఎక్కువ ఉన్నవారు రాగి పాత్రలలో నీరు తాగుతుంటారు. అసలు రాగి పాత్రలో నీరు ఎందుకంత శ్రేష్టం. రాగి పాత్రలలో నీరు తాగితే ఆరోగ్య కలిగే ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుంటే.. రాగి పాత్రల వాడకం.. రాగిపాత్రలలో నీరు నిల్వ చేసి నీటిని తాగడం ఇప్పుడు కొత్తగా పుట్టిన అలవాటు ఏమీ కాదు.. దీనికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. రాగి పాత్రలలో నీరు తాగడం ప్రజల జీవనశైలిలో భాగం. ముఖ్యంగా రాగి పాత్రల వినియోగం, రాగి పాత్రలలో నిల్వ చేసిన నీరు తాగడం ఆయుర్వేదంలో ప్రాచుర్యం చెందింది. రాగి పాత్రలను ఆహారం వండుకోవడానికి, ఆహారం నిల్వ చేసుకోవడానికి కూడా ఉపయోగించేవారు రాగి పాత్రలలో నిల్వ చేసిన నీరు తాగడం, రాగి పాత్రలో వండిన ఆహారం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలు ఉంటాయి. శరీరానికి అవసరమైన ఖనిజాలలో రాగి ప్రధానమైనది. ఇది శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. రాగి పాత్రలలో నీరు తాగడం వల్ల శరీరంలో ఐరన్ లోపాన్ని భర్తీ చేయవచ్చు. రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడేవారు రాగి పాత్రలలో నీరు తాగితే రక్తహీనత సమస్య తగ్గుతుంది. రాగిలో ఉండే యాంటీ ఇన్ప్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మెరుగ్గా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి చాలా హెల్ప్ అవుతాయి. రాగి పాత్రలలో నీరు తాగితే శరీరం శుద్ది అవుతుంది. చాలామంది ఉదయాన్నే రాగి పాత్రలలో నీటిని తాగుతుంటారు. దీని వల్ల రోజంతా శరీరం ఉత్సాహంగా ఉంటుంది. అయితే రాగి పాత్రలలో నీటిని ఎక్కువ సేపు నిల్వ చేయకూడదు. ఎనిమిది గంటల కంటే ఎక్కువ సేపు నీటిని నిల్వచేస్తే ఆ నీరు వేడి గుణం అధికంగా అవుతాయి. అంతేకాదు.. రాగి పాత్రలలో నీరు ఆరోగ్యానికి మంచిది కదా అని అదే పనిగా తాగకూడదు. రోజుకు రెండు గ్లాసుల కంటే ఎక్కువ రాగి పాత్రలలో నీటిని తాగకూడదు. శరీరంలో రాగి ఎక్కువైనా హాని కలుగుతుంది. ముఖ్యంగా గర్భవతులు, ఎసిడిటీ, కిడ్నీ సమస్యలు ఉన్నవారు, గుండె జబ్బులు ఉన్నవారు రాగి పాత్రలలో నీరు తాగాలంటే మొదట వైద్యుల సలహా తీసుకోవాలి. లేదంటే తీవ్ర నష్టాలు సంభవిస్తాయి. *రూపశ్రీ.
read moreచిలకడదుంపలను క్రమం తప్పకుండా తింటే ఏమవుతుందో తెలుసా..?
చిలకడదుంపలు చాలామందికి ఇష్టమైన ఆహారం. చాలామంది వీటిని ఉడికించి తినడానికి ఇష్టపడతారు. మరికొందరు నిప్పుల మీద కాల్చి తింటారు. ఫుడ్ లవర్స్ అయితే చిలకడ దుంపలతో రకరకాల వంటకాలు తయారు చేసుకుని తింటారు. వీటితో టిప్స్, టిక్కీ, పూర్ణం బూరెలు, భక్ష్యాలు కూడా చేసుకుని తింటారు. అయితే చిలకడదుంపలను క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే శరీరానికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయట. అవేంటో తెలుసుకుంటే.. పోషకాలు.. చిలగడదుంపలు ఒక పోషకాల గని అని చెప్పవచ్చు. అవి మన శరీరానికి ప్రతిరోజూ అవసరమయ్యే ముఖ్యమైన విటమిన్లతో నిండి ఉన్నాయి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే విటమిన్ ఎ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కొల్లాజెన్ ఉత్పత్తి, చర్మ ఆరోగ్యంలో దాని పాత్రకు ప్రసిద్ధి చెందిన విటమిన్ సి కూడా ఉంటుంది. ఒక మధ్యస్థ-పరిమాణ చిలగడదుంప అంటే సుమారు 130 గ్రాముల చిలకడదుంపలో పోషకాలు ఇలా ఉంటాయి. విటమిన్ ఎ.. రోజువారీ అవసరమైన దానికంటే 400% కంటే ఎక్కువ విటమిన్-ఎ ఉంటుంది. విటమిన్ సి.. రోజువారీ అవసరమైన దానిలో 25% లభిస్తుంది ఫైబర్.. 4 గ్రాములు ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది పొటాషియం.. గుండె ఆరోగ్యానికి, రక్తపోటు నియంత్రణకు చాలా అవసరం మెగ్నీషియం.. ఒత్తిడిని తగ్గించడానికి, కండరాల పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది ఇంకా ఇందులో ఐరన్, బి విటమిన్లు ఉంటాయి. ఇది మొత్తం శరీర శక్తి స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బీటా-కెరోటిన్ అనేది యాంటీఆక్సిడెంట్. ఇది శరీరం లో విటమిన్ ఎ గా రూపాంతరం చెందుతుంది. ఇది చిలగడదుంపలలో సమృద్ధిగా ఉంటుంది. ఈ విటమిన్ కంటి చూపు మెరుగ్గా ఉండటానికి రేచీకటి వంటి వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. ఇప్పట్లో చాలామంది కంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు స్వీట్ పొటాటోను ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది. శరీరంలోని యాంటీఆక్సిడెంట్లు ఏదైనా సెల్యులార్ దెబ్బతినకుండా శరీరం రక్షణను బలోపేతం చేస్తాయి. స్వీట్ పొటాటోను తరచుగా తింటూ ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుుతంది. స్వీట్ పొటాటోలో డైటరీ ఫైబర్ ఉంటుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఫైబర్ కంటెంట్ మలాన్ని మృదువుగా చేస్తుంది. మలబద్దకం సమస్య రానీయదు. ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. *రూపశ్రీ.
read moreఈ డ్రై ఫ్రూట్స్ క్రమం తప్పకుండా తింటే చాలు.. శరీరానికి ప్రాణం పోస్తాయి..!
డ్రై ఫ్రూట్స్ చాలా ఆరోగ్యకరమైన ఆహారం. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. డ్రై ఫ్రూట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి. మాంసాహారం తినని వారికి ప్రోటీన్ లోపం ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి వారు డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల కొద్దో గొప్పో ప్రోటీన్ లోపాన్ని అధిగమించవచ్చు. కొన్ని డ్రై ప్రూట్స్ ను రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే పోషకాహారంతో బలహీనంగా ఉన్న శరీరానికి తిరిగి ప్రాణం పోస్తాయి. శరీరాన్ని వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. బాదం.. ఆరోగ్యం మీద స్పృహ పెరిగిన చాలామంది రాత్రి నానబెట్టిన బాదం పప్పును ప్రతి రోజూ ఉదయం తీసుకుంటూ ఉంటారు. బాదంలో విటమిన్-ఇ ఉంటుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఇంకా ఇందులో ప్రోటీన్, పైబర్ కూడా ఉంటాయి. బరువును అదుపులో ఉంచుతుంది. ఎండుద్రాక్ష.. ప్రతిరోడూ ఎండుద్రాక్ష తింటే శరీరానికి అమితమైన బలం లభిస్తుంది. ఎండుద్రాక్షను కూడా రాత్రి నానబెట్టి ఉదయాన్నే తినాలి. ఇది శరీరాన్ని శుద్ది చేస్తుంది. పేగు ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. వాల్ నట్స్.. వాల్ నట్స్ కండరాలను బలపరుస్తుంది. వాల్ నట్స్ మీద సన్నని పొర ఉంటుంది. దీన్ని తీసేసి తినాలి. అందుకే వాల్ నట్స్ ను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే సన్నని పొర తీసేసి తినాలి. కనీసం రోజుకు ఒక వాల్ నట్ తీసుకుంటే మంచిది. అంజీర్.. అంజీర్ చాలా శక్తి వంతమైన డ్రై ప్రూట్స్. అంజీర్ పండ్లు తాజాగా కూడా లభ్యమవుతాయి. కానీ తాజా పండ్ల కంటే డ్రై అంజీర్ చాలా మంచివి. అంజీర్ పండేకొద్ది తీపిదనం పెరుగుతుంది. డ్రై అంజీర్ ను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినాలి. ఇలా చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు, కండరాలు బలపడతాయి. ఎముకలు, కండరాల నొప్పులు తగ్గుతాయి. ఖర్జూరం.. ఖర్జూరం కూడా శక్తి వంతమైన డ్రై ప్రూట్. ఖర్జూరాలు తక్షణ శక్తిని ఇస్తాయి. వీటిని నేరుగా తీసుకోవచ్చు. ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత తొలగించడంలో బాగా సహాయపడుతుంది. శరీరానికి ఐరన్ ను అందించడం ద్వారా హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచుతుంది. పై డ్రై ప్రూట్స్ ను రాత్రి నానబెట్టి ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకోవడం లేదా.. స్నాక్స్ సమయంలో అనారోగ్యకరమైన చిరుతిండికి బదులు వీటిని తీసుకోవడం వల్ల శరీరం బలంగా మారుతుంది. *రూపశ్రీ.
read more










.jpg)




.webp)
.webp)
.webp)
.webp)

.webp)

.webp)