ఈ ఆహారాలు షుగర్ ఉన్నవారికి అమృతంతో సమానం!

మధుమేహం చాలా తేలికగా అనిపించే సమస్య. ఇది చాలామందిలో కామన్ అనే ఫీలింగ్ కూడా వచ్చేసింది. కానీ మధుమేహంతో బాధపడేవారికే ఈ సమస్య ఎంత దారుణంగా ఉంటుందో అర్థమవుతుంది. ముఖ్యంగా ఆహారం దగ్గర చాలా ఇబ్బందికి గురిచేస్తుంది. మధుమేహం ఉన్నవారు ఏం తినాలన్నా, తాగాలన్నా సతమతం అయిపోతుంటారు. దీనికి తగినట్టు మధుమేహం   ఉన్నవారిలో బరువు పెరగడం అనే సమస్య కూడా ఉంటుంది.  కానీ కొన్ని ఆహారాలు రుచితో పాటూ రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతాయి. అవేంటో తెలుసుకుంటే.. స్ట్రాబెర్రీలు, గ్రీన్ యాపిల్స్.. స్ట్రాబెర్రీ రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ పండు. ఫైబర్ అధికంగా ఉండే ఈ పండు ఆకలిని నియంత్రించడం  ద్వారా బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా గ్రీన్ యాపిల్ కరిగే ఫైబర్‌ను అందిస్తుంది.  జీర్ణక్రియను నెమ్మదిస్తుంది.  రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు నియంత్రణకు గొప్ప పండు. బ్లూ బెర్రీస్, గుమ్మడికాయ.. బ్లూ బెర్రీస్ విదేశాలలో పండటం మూలానా ఇవి భారతీయులకు అరుదుగా లభిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బ్లూబెర్రీస్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా మధుమేహానికి మేలు చేస్తాయి. ఇందులో ఉండే అధిక ఫైబర్ బరువు తగ్గడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా గుమ్మడికాయలో పిండి పదార్థాలు, కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనిలో నీటి కంటెంట్ ఎక్కువ.  దీని కారణంగా బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. పెసలు..   పెసలలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటుంది.  రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ప్రోటీన్ శరీరానికి శక్తిని ఇస్తూ నెమ్మదిగా జీర్ణమవుతుంది. ఈ కారణంగా ఎక్కువసేపు ఆకలిని నియంత్రించి బరువును నియంత్రణలో ఉంచుతుందియ. కాల్చిన శనగలు, శనగపిండి.. శనగపిండి అయినా, కాల్చిన లేదా వేయించిన శనగలు అయినా మధుమేహం ఉన్నవారికి మంచివి. శనగలలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.  ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. డయాబెటిక్ రోగులకు ఇది మంచి ఆహారం కావడానికి ఇదే కారణం. ఇది శరీరానికి శక్తిని అందించడానికి,  బరువును నియంత్రించడానికి చక్కని ఎంపిక. బీట్రూట్.. బీట్రూట్  తీసుకోవడం ద్వారా  అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. దీని వినియోగం రక్తపోటును తగ్గిస్తుంది,  ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. తక్కువ కేలరీలు,  పోషకాలు పుష్కలంగా ఉండే ఈ పదార్థాన్ని తీసుకోవడం బరువు నిర్వహణలో సహాయపడుతుంది. మిల్లెట్స్.. అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా మిల్లెట్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇది శక్తిని ఇస్తుంది,  బరువు తగ్గాలనుకునే వారికి  మంచి ఎంపిక. ఈ ఆహార పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో  బరువును మైంటైన్ చేయడంలలో  సహాయపడుతుంది.                               *నిశ్శబ్ద.   

read more
జుట్టు బాగా రాలిపోతోందా? ఈ నాలుగే అసలు కారణాలు..!

వేగంగా మారుతున్న జీవనశైలి ప్రభావం మన ఆరోగ్యంపైనే కాకుండా జుట్టుపై కూడా కనిపిస్తుంది.ఇప్పట్లో చాలామంది  జుట్టు రాలడం, జుట్టుకు సంబంధించి  అనేక ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. తప్పుడు ఆహారపు అలవాట్లు, జీవన శైలి,  ఇతర కారణాల వల్ల, జుట్టు రాలే సమస్య తరచుగా మొదలవుతుంది. జుట్టు రాలడం, జుట్టు పలుచబడటం, బట్టతల రావడం వల్ల ఆత్మన్యూనతా భావం ఏర్పడుతుంది. జుట్టు రాలడానికి కారణాలు తెలుసుకుని,  దాని పరిష్కారాన్ని కనుగొనడం చాలా ముఖ్యం. జుట్టురాలడంలో ఈ 4 కారణాలే ప్రధానం... పోషకాహార లోపాలు.. ఇప్పట్లో ప్రజల  ఆహారపు అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. ఇవి కూడా అనారోగ్యంగా తయారవుతున్నాయి.  శరీరంలో పోషకాలు లేకపోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, జుట్టు మీద కూడా లోతైన ప్రభావం చూపుతుంది. బయోటిన్ లేకపోవడం వల్ల  జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. అంతే కాకుండా విటమిన్ సి,  ఐరన్ లోపం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. జుట్టు రాలడాన్ని నివారించడానికి ఆహారంలో పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. జుట్టు రాలే సమస్య వేగంగా అరికట్టడానికి, జుట్టు తిరిగి ఆరోగ్యంగా పెరగడానికి  ఆరోగ్య నిపుణుల సలహా కూడా తీసుకోవచ్చు. ఫలితాలు వేగంగా ఉంటాయి. ఒత్తిడి,  శారీరక సమస్యలు.. భావోద్వేగాలు ఎక్కువగా ఉండటం,  శారీరక ఒత్తిడి జుట్టు రాలడానికి దోహదం చేసే టెలోజెన్ ఎఫ్లూవియం అనే పరిస్థితిని ప్రేరేపిస్తుంది. అధిక ఒత్తిడి కారణంగా, జుట్టు రాలడం పెరుగుతుంది.  జుట్టును దువ్వినప్పుడు, తలస్నానం చేసినప్పుడు   జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి కారణంగా జుట్టు రాలడాన్ని నివారించడానికి మొదట ఒత్తిడిని నియంత్రణలో ఉంచడానికి ప్రయత్నించాలి . దీని కోసం  రిలాక్సేషన్ టెక్నిక్స్, మెడిటేషన్, రెగ్యులర్ వ్యాయామం,  హెల్తీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్  ఫాలో కావడం చేయాలి. జన్యు కారణాలు.. కొన్నిసార్లు హెయిర్ ఫాల్ సమస్య జన్యుపరమైన కారణాల వల్ల అంటే కుటుంబ చరిత్ర వల్ల కూడా రావచ్చు. దీనిని ఆండ్రోజెనెటిక్ అలోపేసియా అంటారు, ఇది చాలా మందిలో బట్టతలకి దారి తీస్తుంది. అలోపేసియా అరేటా అనే పరిస్థితిలో  రోగనిరోధక వ్యవస్థ జుట్టు కుదుళ్లపై దాడి చేస్తుంది.  ఫలితంగా జుట్టు రాలుతుంది. అలోపేసియా అరేటా శరీరంలో ఎక్కడైనా జుట్టు రాలడానికి కారణం అయినప్పటికీ, ఇది సాధారణంగా తల, ముఖాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ సమస్యకు చికిత్స ఎంపికలు మారుతూ ఉంటాయి. . కార్టికోస్టెరాయిడ్స్, ఇమ్యునోథెరపీ లేదా ఆరోగ్య నిపుణులు సూచించిన ఇతర మందులు కూడా ఉండవచ్చు. జుట్టు సంరక్షణలో చెడు అలవాట్లు.. ఈ రోజుల్లో  స్టైలింగ్ కోసం జుట్టుపై అనేక రకాల వస్తువులను ప్రయోగిస్తున్నారు.  దీని కారణంగా జుట్టు పాడైపోతోంది.  దీని కారణంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. జుట్టు సంరక్షణ కోసం సరైన పద్ధతులను పాటించాలి. హీట్ స్టైలింగ్‌ను తగ్గించాలి.  బిగుతుగా ఉండే కేశాలంకరణను నివారించాలి.  జుట్టుకు సరైన ఉత్పత్తులను ఉపయోగించాలి.                                      *నిశ్శబ్ద. 

read more
రోజూ ఓ కప్పు లవంగాల టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే..!

టీ అనేది భారతీయులు తీసుకునే పానీయాల్లో చాలా గాఢంగా భాగమైపోయింది. టీని సాదారణంగా పాలతోనూ, టీ ఆకుతో మాత్రమే కాకుండా వివిధ సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసుల సహాయంతో తీసుకుంటారు.  వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో భాగమైన లవంగాలతో టీ చేసుకుని తాగడం వల్ల వెలకట్టలేని లాభాలు ఉంటాయి. ప్రతిరోజూ ఓ కప్పు లవంగాల టీ తాగడం  వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి,  దీన్ని ఎప్పుడు తీసుకుంటే మంచిది అనే విషయం గురించి  పూర్తీగా తెలుసుకుంటే.. యాంటీఆక్సిడెంట్లు.. లవంగం టీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీర కణాలను రక్షించడంలో సహాయపడే సమ్మేళనాలు. జీర్ణక్రియ.. లవంగం టీ సాంప్రదాయకంగా  జీర్ణ సంబంధ సమస్యల కోసం ఉపయోగిస్తారు. లవంగాలలోని క్రియాశీల సమ్మేళనాలైన యూజినాల్, జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించడానికి,  మొత్తం జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి.. లవంగం టీ రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను మెండుగా కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్- సి,  కె ఉంటాయి. అదేవిధంగా  పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.  ఇవన్నీ ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు అవసరం. శ్వాసకోశ సమస్యలు.. లవంగం టీ  సువాసన దగ్గు, జలుబు,  బ్రోన్కైటిస్ వంటి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. లవంగాలలోని యూజినాల్ ఒక ఎక్స్‌పెక్టరెంట్‌గా పనిచేస్తుంది, శ్లేష్మాన్ని విప్పుటకు,  వాయుమార్గాలను క్లియర్ చేయడానికి సహాయపడుతుంది.   వాపులు.. లవంగం టీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎఫెక్ట్‌లను కలిగి ఉండే సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని వాపును తగ్గించడానికి  సహాయపడతాయి. ఇది ఆర్థరైటిస్, తలనొప్పి,  ఇతర తాపజనక  లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. లవంగం టీ తాగడానికి మంచి సమయం ఏది? రోజులో ఏ సమయంలోనైనా దీన్ని తాగవచ్చు. అయినప్పటికీ దీనివల్ల మెరుగైన ఫలితాలు కావాలంటే ఇది తాగడానికి వేర్వేరు సమయాలు కూడా ఉన్నాయి.   ఒక కప్పు గోరువెచ్చని లవంగం టీతో  రోజును ప్రారంభించడం వలన  జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది.  శక్తిని పెంచుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు  శరీరాన్ని ఫ్రీ రాడికల్స్  కారణంగా దెబ్బతినకుండా కాపాడతాయి.  రోజంతా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.  భారీ భోజనం తర్వాత ఉబ్బరం,  అజీర్ణాన్ని తగ్గించడంలో లవంగం టీ సహాయపడుతుంది. కాబట్టి యాంటాసిడ్‌ని తీసుకోకుండా జీర్ణక్రియకు సహాయపడటానికి  భోజనం తర్వాత ఒక కప్పు లవంగం టీని త్రాగడానికి ప్రయత్నించడం మంచిది.  పడుకునే ముందు లవంగం టీ త్రాగవచ్చు.  వెచ్చని సువాసన,  రుచి  మనస్సు, శరీరం విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది.  ప్రశాంతమైన నిద్రకు దోహదం చేస్తుంది. వాతావరణం పరిస్థితుల కారణంగా జలుబు, దగ్గు సమస్యలతో  బాధపడుతుంటే ఒక కప్పు లవంగం టీ ఉపశమనాన్ని అందిస్తుంది. లవంగాలలోని యాంటీ బాక్టీరియల్,  యాంటీవైరల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.  వెచ్చని ఆవిరి గొంతు నొప్పిని,   రద్దీని తగ్గిస్తుంది. లవంగం టీ సాంప్రదాయకంగా నెలసరి సమయంలో కడుపు నొప్పి, కండరాల  తిమ్మిరి,  ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తారు. దీనిలో ఉండే  యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నెలసరిలో వచ్చే  తిమ్మిరి,  అసౌకర్యం ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.  ఇది మహిళలకు సహజమైన,  సమర్థవంతమైన నివారణగా పనిచేస్తుంది. లవంగం టీ ఎలా తయారుచేయాలి? ఇంట్లో లవంగం టీని తయారు చేయడానికి ఒక కప్పు వేడి నీటిలో 1-2 లవంగాలు వేసి 5-10 నిమిషాలు  స్థిరమైన మంటమీద ఉడికించాలి.  అదనపు రుచి,  ఆరోగ్య ప్రయోజనాల కోసం ఓ ముక్క దాల్చినచెక్క, అల్లం లేదా తేనె వంటి ఇతర పదార్థాలను కూడా జోడించవచ్చు. దీన్ని చాలా వేడిగా కాకుండా కాసింత వెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటే బాగుంటుంది.                                          *నిశ్శబ్ద.

read more
ఈ జపనీస్ థెరపీతో ఒత్తిడి మటుమాయం.!

సాంకేతిక ప్రపంచంలో జీవిస్తున్నాము. ప్రతిరోజూ ఒకే పని, అదే వాతావరణం, ఒకే ప్రయాణం చేయడం బోరింగ్‌ గా ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒకవైపు ఆఫీసు పని ఒత్తిడి, మరోవైపు ఇంట్లో సమస్యలు. ఈ పనులన్నింటితో శరీరం,మనస్సు అలసిపోతుంది. దీని కారణంగా చాలా మంది తరచుగా నిరాశ, ఆందోళన, ఒత్తిడి శారీరక రుగ్మతలను ఎదుర్కోవలసి వస్తుంది.దీని నుండి ఉపశమనం పొందడానికి, మీరు మీ ఖాళీ సమయంలో పురాతన జపనీస్ థెరఫీలను అనుసరించవచ్చు. దీంతో పని ఒత్తిడి, మానసిక కుంగుబాటు, ఆఫీసులో ఆందోళన వంటి అనేక సమస్యలకు దూరంగా ఉండవచ్చు. దీని కారణంగా మీరు ప్రతిరోజూ సంతోషకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అనుభవిస్తారు. 'షిన్రిన్-యోకు' థెరపీ అంటే ఏమిటి? మీరు ప్రకృతిలో ఉన్నప్పుడు ఈ పురాతన జపనీస్ ఔషధాన్ని అభ్యసించాలనుకుంటున్నారు. ఈ చికిత్సను జపనీస్ భాషలో 'షిన్రిన్ యోకు' అని పిలుస్తారు, దీనిని సాధారణంగా 'అటవీ స్నానం' అని పిలుస్తారు. ప్రకృతి వాతావరణానికి అనుగుణంగా జీవించడం ద్వారా శారీరక, మానసిక రుగ్మతలను నయం చేయవచ్చు. అందువల్ల 'షిన్రిన్ యోకు' యొక్క చికిత్సా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఈ చికిత్స కోసం, మీరు అడవిలో నడవడం, కూర్చోవడం, నిలబడటం లేదా స్వేచ్ఛగా శ్వాస తీసుకోవడం వంటివి చేయాలి. దీనితో మీరు చాలా విషయాలను మరచిపోయి ప్రకృతికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అందుకే దీనిని అటవీ చికిత్స అని కూడా పిలుస్తారు. అంటే అడవి వాతావరణాన్ని పూర్తిగా ఆస్వాదించడం. ఇది 1980లలో జపాన్‌లో ఉద్భవించిన చికిత్స. ఇక్కడ ప్రజలు అడవిలోని దృశ్యాలు, శబ్దాలు,వాసనలలో మునిగిపోయేలా ప్రోత్సహించడం.  వీటిలో ప్రయాణం, ధ్యానం, కొన్ని అందమైన ప్రదేశంలో కొంత సమయం గడపడం వంటివి ఉన్నాయి. దీని వల్ల మనిషి మానసిక, శారీరక ఆరోగ్యంలో మంచి మార్పులు వస్తాయి. ప్రకృతి మధ్య సమయం గడపడం వల్ల మనసులో వచ్చే ఆలోచనలు తగ్గుతాయి. జపనీస్ షిన్రిన్ యోకు థెరపీ నిజంగా ప్రయోజనకరంగా ఉందా? షిన్రిన్ యోకు మానసిక ఆరోగ్య రంగంలో ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం కోసం శక్తివంతమైన చికిత్సా పద్ధతిగా ఉద్భవించింది. శాంతి, ఉనికి యొక్క భావాన్ని ప్రోత్సహిస్తుంది. అనేక భౌతిక విషయాల నుండి వేరు చేయడానికి అనుమతిస్తుంది. అడవిలోని ప్రశాంతతలో గడపడం  వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ అభ్యాసం ఒత్తిడిని తగ్గిస్తుంది. మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.  పనిలో ఏకాగ్రత వహించడంలో మీకు సహాయపడుతుంది. ఇది కాకుండా ఈ థెరపీ మీ బర్న్‌అవుట్‌కు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. రోజూ కొంత సమయం ప్రకృతిలో గడిపితే మానసిక ఒత్తిడి, అనారోగ్యం, శారీరక రుగ్మతలకు దూరంగా ఉండవచ్చు. షిన్రిన్ యోకు థెరపీ ఎలా చేయాలి? ప్రతి ఒక్కరూ అడవిలోకి  వెళ్లి ప్రతిరోజూ షిన్రిన్ యోకు థెరపీ చేయలేరు. అలా చేయలేని వారు సమీపంలోని పార్క్ లేదా ప్రశాంతమైన గార్డెన్‌కి వెళ్లి షిన్రిన్ యోకు థెరపీ చేయించుకోవచ్చు.  తద్వారా మీరు శారీరక, మానసిక వ్యాధులకు దూరంగా ఉంటూ సంతోషంగా, ప్రశాంతంగా, ఒత్తిడి లేని జీవితాన్ని గడపవచ్చు.  

read more
బాదం పప్పు ఏ సమయంలో తింటే,ఎప్పుడు తింటే ఆరోగ్యానికి మేలంటే..!

శరీరం ఆరోగ్యంగా ఉండటంలో ఆహారానిదే ప్రధాన పాత్ర.   డ్రై ఫ్రూట్స్, నట్స్, పండ్లు, కాయలు, తృణధాన్యాలు అన్నీ ఆరోగ్యాన్ని చేకూర్చేవే. అయితే వేటిని ఎలా తినాలో అలా తింటే ఆరోగ్యానికి మరింత మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి. ఎండు గింజలలో బాదం పప్పుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. బాదం పప్పును నానబెట్టి తింటే శరీరానికి తగిన పోషకాలు లభిస్తాయి. అయితే బాదం పప్పును ఏ సమయంలో తింటే శరీరానికి ఎక్కువ లాభాలు ఉంటాయి? బాదం పప్పులో ఉండే పోషకాలు ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే.. ప్రతిరోజూ నానబెట్టిన బాదం పప్పు తినడం ముఖ్యంగా కరోనా దాడి పెరిగింది. చాలామంది ఆరోగ్యం మీద స్పృహతో బాదం పప్పులు నానబెట్టి ఉదయాన్నే తింటారు. బాదంలో  ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మోనో అన్ శాచురేటెడ్, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా ఫైబర్, కార్భోహైడ్రేటెడ్లు కూడా ఉంటాయి. శరీరానికి పోషణ ఇవ్వడం నుండి బరువు తగ్గడం వరకు ఇవి ఎన్నో విధాలుగా సహాయపడతాయి.  అయితే  బాదం పప్పులు ఏ సమయంలో తింటే ఏం జరుగుతుందో? ఎప్పుడు తింటే   ఎక్కువ లాభాలు ఉంటాయో చాలామందికి తెలియదు. సాధారణంగా అందరూ తిన్నట్టు ఉదయం సమయంలో నానబెట్టిన బాదం పప్పును పొట్టు తీసి తినడం వల్ల గరిష్ట ప్రయోజానాలు ఉంటాయి. రోజు మొత్తం శక్తివంతంగా ఉంచుతుంది. ఉదయాన్నే శరీరానికి అవసరమైన పోషకాలు లభించడం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. వ్యాయామం చేసే అలవాటు ఉంటే వ్యాయామానికి ముందు బాదం పప్పు తినడం వల్ల శరీరం తొందరగా అలసిపోదు. దీని వల్ల ఎక్కువసేపు అలసట లేకుండా వ్యాయామం చెయ్యడానికి  వీలుంటుంది. బాదం పప్పు  కండరాలకు మేలు చేస్తాయి. ఈ కారణంగా వ్యాయామం తరువాత కూడా కండరాలు అలసిపోవు. సాయంత్రం స్నాక్స్ తీసుకునే సమయంలో నానబెట్టిన బాదం పప్పు తీసుకోవడం వల్ల  కూడా ప్రయోజనాలు ఉంటాయి. సాధారణంగా సాయంత్రం ఆయిల్ ఫుడ్, ఉప్పు, కారం జోడించిన ఆహారాలు లేదా పంచదారతో కూడిన పదార్థాలు స్నాక్ గా తింటుంటారు. వీటి వల్ల ఆరోగ్యం పాడవుతుంది. వీటి బదులు సాయంత్రం బాదం పప్పులు తింటే రాత్రి భోజనం వరకు ఆకలి వేధించదు. బాదం పప్పు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.  ఈ కారణంగా షుహర్ కూడా అదుపులో ఉంటుంది. మధుమేహం ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరం.                                   *నిశ్శబ్ద.  

read more
అల్లం, దాల్చిన చెక్క, తేనె...వీటితో ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?

అల్లం, దాల్చిన చెక్క,  తేనెను క్రమం తప్పకుండా ఉదయం తీసుకోవడం వల్ల శరీరానికి ప్రత్యేకమైన ప్రయోజనాలు లభిస్తాయి.  బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా, శరీరం సులభంగా వ్యాధులకు గురవుతుంది. రోగాలు,  ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించుకోవడానికి అల్లం, దాల్చిన చెక్క, తేనె కలిపి  తీసుకోవాలి. అల్లం,  దాల్చిన చెక్కను సాధారణంగా వంటలలో సుగంధ ద్రవ్యాలుగా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో అల్లం, దాల్చిన చెక్క,  తేనెను ఔషధాలుగా ఉపయోగిస్తారు.అనేక తీవ్రమైన వ్యాధులను నివారించడానికి, దాల్చినచెక్క, అల్లం, తేనె కషాయాలను తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. కడుపు,  జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం పొందడంలో జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు మొదలైన వాటిని నివారించడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అల్లం, దాల్చిన చెక్క, తేనె తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది: అల్లం, దాల్చిన చెక్క,  తేనె తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యలను నయం చేయవచ్చు. ఇందులో ఉండే పీచు మలబద్ధకం, కడుపునొప్పి,గ్యాస్,  ఎసిడిటీ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. భోజనం తర్వాత అల్లం, తేనె, దాల్చిన చెక్క తినడం వల్ల ఆహారం సక్రమంగా జీర్ణం కావడమే కాకుండా పుల్లటి త్రేన్పుల  సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది: అల్లం, దాల్చినచెక్క, తేనె  కషాయాలను తీసుకోవడం వల్ల శరీరం సాధారణ రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి, ఇన్సులిన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. వీటిలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్ గుణాలు శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను సాధారణ స్థాయిలో ఉంచడంలో సహాయపడతాయి. ఆర్థరైటిస్ సమస్యకు మేలు చేస్తుంది: అర చెంచా దాల్చిన చెక్క పొడిలో అర చెంచా అల్లం పొడి, తేనె కలిపి తింటే ఆర్థరైటిస్‌కి చాలా మేలు చేస్తుంది. ఇందులోని గుణాలు ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. బరువు తగ్గడానికి సహాయపడుతుంది: స్థూలకాయం, బరువు సమస్యలతో బాధపడేవారికి అల్లం, దాల్చిన చెక్క, తేనె తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజూ సమాన పరిమాణంలో అల్లం, దాల్చిన చెక్క పొడిని తేనెతో కలిపి తాగడం వల్ల బరువు తగ్గుతారు. అధిక కొలెస్ట్రాల్‌కు చెక్ పెడుతుంది: క్రమబద్ధమైన ఆహారం,  చెడు జీవనశైలి కారణంగా, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, అల్లం, దాల్చిన చెక్క, తేనెను సమాన మొత్తంలో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల  ప్రయోజనకరంగా ఉంటుంది.  

read more
చలికాలంలో అల్లంటీ తాగకూడదా?  టీ గురించి షాకింగ్ నిజాలు ఇవీ..!

భారతీయులకు టీ అంటే ఇష్టం. ముఖ్యంగా నగరవాసులు టీను ఎమోషన్ గా ఫీలవుతారు. టీ తాగాలని అనిపిస్తే ఎప్పుడంటే అప్పుడు బయటకు వెళ్ళి  టీ తాగేస్తుంటారు.  ముఖ్యంగా చలికాలంలో టీ ఎక్కువగా తీసుకుంటారు.  చలిని తప్పించుకోవడానికి వేడే వేడి టీ తాగుతుంటే అదొక చెప్పలేని అనుభూతి కలుగుతుంది. చాలామంది రోజు టీతోనే మొదలై టీతోనే ముగుస్తుంది కూడా.  పట్టణాలలో చాలాచోట్ల 24గంటలు టీ ఉడుకుతూనే ఉంటుంది.  చలికాలంలో టీ ఉత్తమ రోగనిరోధక శక్తిని పెంచేదిగా పరిగణించబడుతుంది. అయితే టీని ఎక్కువసేపు ఉడికిస్తున్నా, ఒకసారి చేసిన టీని మళ్ళీ మళ్లీ వేడి చేస్తున్నా, చలికాలంలో బాగుంటుంది కదా అని అల్లం టీ తాగుతున్నా ఆరోగ్యానికి ముప్పేనని వైద్యులు చెబుతున్నారు. అసలు టీ ఆరోగ్యానికి ఎలా హానికరమవుతుంది పూర్తీగా తెలుసుకుంటే.. టీ తాగడం ఆరోగ్యానికి మంచిదే. అయితే రోజులో కేవలం రెండు నుండి మూడు కప్పులు మాత్రమే తీసుకోవాలి. అంతకు మించి ఎక్కువ తాగకూడదు. ఇకపోతే టీని ఎక్కువ సేపు ఉడికించడం, ఒకసారి తయారైన టీని మళ్లీ మళ్లీ వేడి చేయడం ప్రమాదం. చల్లని వాతావరణంలో అల్లం టీ  తాగడం వల్ల జలుబు నుంచి ఉపశమనం పొందడమే కాకుండా చలికాలంలో తరచుగా వచ్చే మూత్ర విసర్జన సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కానీ అల్లం టీ తాగవద్దని  వైద్యులు చెబుతున్నారు. టీలో అల్లం, లవంగాలు, యాలకులు వేసి ఎక్కువ సేపు ఉడకబెడతారు.  ఇలా ఎక్కువసేపు టీని ఉడకబెట్టడం వల్ల టీలో  టానిన్ లు ఏర్పడతాయి. ఇది అసిడిటీకి అతి పెద్ద కారణం. టానిన్ అనేది ఒక రకమైన యాంటీఆక్సిడెంట్. ఇది టీ ఆకులలో కనిపిస్తుంది. టానిన్‌లను పెద్ద మొత్తంలో తీసుకున్నప్పుడు, అది యాసిడ్ రిఫ్లక్స్,  గ్యాస్‌కు కారణమవుతుంది. టీ తాగిన తర్వాత గ్యాస్ ఎక్కువసేపు ఉంటే  కడుపులో వాపు వస్తుంది. అందుకే పేగు సమస్యలు ఉన్నవారు టీ తీసుకోవడం తగ్గించాలని చెబుతారు. అంతే కాదు స్టమక్ ఇన్ఫెక్షన్ ఉంటే టీని పూర్తీగా మానెయ్యాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం టీ రోజుకు రెండు లేదా మూడు సార్లు కంటే ఎక్కువ టీ  త్రాగకూడదు.  వీలైనంత వరకు అల్లాన్ని టీలో ఎక్కువ సేపు ఉడికించకుండా జాగ్రత్త పడాలి.  అలాగే.. ఒకసారి చేసిన టీని చలికాలం కదా అని  మళ్లీ మళ్లీ  వేడి చేస్తే దాంట్లో క్యాన్సర్ కారకాలు ఏర్పడతాయి. ఇది చాలా ప్రమాదం. జీర్ణాశయంలో పేగులను విచ్చిన్నం చేస్తుంది.                                       *నిశ్శబ్ద.  

read more
వావ్.. రోజూ కాసిన్ని నువ్వులు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా ..!

  నువ్వులు భారతీయుల ఆహారంలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఆయుర్వేదం కూడా నువ్వులను గొప్ప ఆహారంగా పేర్కొంది.  నువ్వులలో ప్రోటీన్, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఐరన్, ఫైబర్ వంటివన్నీ ఉంటాయి. చలికాలంలో రోజూ కాసిన్ని నువ్వులను తింటే శరీరం వెచ్చగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. నువ్వులను రోజూ తినడం వల్ల కలిగే ఇతర ఆరోగ్యప్రయోజనాలు ఏంటో తెలిస్తే నువ్వులను అస్సలు వదలకుండా తింటారు. ఆయుర్వేదం ప్రకారం నువ్వులు వేడి గుణం కలిగి ఉంటాయి. నువ్వులను తీసుకుంటే శరీరంలో వేడి పుడుతుంది. ఇది జఠరాగ్నిని సమతుల్యం చేస్తుంది. సాధారణంగా జఠరాగ్ని లోపించడం వల్ల  జీర్ణశక్తి మందగించి జీర్ణక్రియ తగ్గుతుంది. దీనికారణంగా మలబద్దకం సమస్య ఏర్పడుతుంది. అదే నువ్వులు తింటే ఈ సమస్య పరిష్కారమవుతుంది. నువ్వులలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి  శరీరంలో ఉన్న చెడు కొవ్వులను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. శరీరంలో కండరాలు ఆరోగ్యంగా, బలంగా ఉండటానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. నువ్వులలో ఉండే ప్రోటీన్ కండరాలను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా  హార్మోన్ల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. నువ్వులలో ఉండే  మాక్రోన్యూట్రియెంట్ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే చర్మాన్ని  యవ్వనంగా ఉంచుంతుంది. శరీరం లోపల వాపులు, నొప్పులు వంటివి ఊబకాయం, క్యాన్సర్ వంటి ప్రమాద సమస్యలకు కారణమవుతాయి. నువ్వులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు  ఈ వాపులు, నొప్పులు తగ్గించడంలోనూ.. శరీరంలో అంతర్గత జబ్బులు నయం చేయడంలోనూ సహాయపడతాయి. నువ్వులలో విటమిన్-బి1, బి3, బి6 పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. శరీరం అన్ని విధులను సక్రమంగా నిర్వర్థించేందుకు దోహదం చేస్తాయి. విటమిన్-బి లోపం వల్ల శరీరంలో బలహీనత దారుణంగా పెరుగుతుంది.  నువ్వులు తింటే మహిళలలో నడుము భాగం బలంగా మారుతుంది. ఇది నెలసరి సమస్యలు, గర్బం దాల్చడం, ప్రసవం తరువాత కూడా నడుము బలంగా ఉండటంలో  సహాయపడుతుంది. కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల నువ్వులు తింటే ఎముకలు బలంగా ఉక్కులాగా మారతాయి. ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి, ఎముకలు పెలుసుబారడం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మహిళల్లోచాలామందిలో కనిపించే రక్తహీనత సమస్యకు నువ్వులు చెక్ పెడతాయి. నువ్వులలో ఉండే ఐరన్ రక్తహీనతకు చెక్ పెడుతుంది. రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో లేకపోతే రోజూ కాసిన్ని నువ్వులు తినడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.                                                 *నిశ్శబ్ద.  

read more
సంక్రాంతి స్పెషల్ పొంగల్ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!

వసంత ఋతువులో వచ్చే  మొదటి పండుగ పంట పండుగ లేదా సంక్రాంతి పండుగ. దక్షిణ భారతదేశంలో ఇదో పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కేరళ ప్రాంతాలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి, పండుగ ఆహారంగా సంప్రదాయ పొంగల్‌ను తయారు చేస్తారు.ఇక్కడ మనం రెండు రకాల పొంగల్‌లను చూడవచ్చు. ఒకటి తీపి పొంగల్, మరొకటి స్పైసీ వెన్న పొంగల్. ఆరోగ్యం విషయానికి వస్తే పండుగల సమయంలోనే కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారుచేసుకుని ఆనందించవచ్చు. దాని ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం. జీర్ణ శక్తిని పెంచుతుంది: పొంగల్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్.. మన శరీరం యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. మన కడుపుని  నిండుగా ఉంచుతుంది.తొందరగా ఆకలి వేయదు. అంతే కాదు, మలబద్ధకం, అజీర్ణంతో బాధపడేవారికి ఇది ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది. మెరుగైన జీర్ణ శక్తిని అందిస్తుంది. స్పైసీ పొంగల్ అల్లం, మిరపకాయలతో తయారు చేస్తారు. దీంతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.   వెన్న పొంగల్: వెన్న పొంగల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరగదు. బదులుగా అది నియంత్రణ అవుతుంది. ఇందులో వాడే చాలా ఆహార పదార్థాలు ఆరోగ్యకరం. కాబట్టి అవి శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను అందిస్తాయి. వికారం సమస్యను దూరం చేస్తుంది: పొంగల్‌లో అల్లం, మిరియాలు ఉపయోగిస్తారు. అందువలన అల్లం అజీర్ణం, వికారం సమస్యను తొలగిస్తుంది. ఇది ఉదయాన్నే ఆరోగ్య రుగ్మతల వల్ల వచ్చే వికారం, వాంతుల సమస్యను తొలగిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పెరుగుతాయి: పండుగ సమయంలో వెన్న పొంగల్ ను తయారు చేసినప్పుడు...అది  మీ శరీరానికి అవసరమైన  యాంటీ-ఆక్సిడెంట్లను అందిస్తుంది. అదనంగా, ఇది అనేక రకాల పోషకాలను కలిగి ఉంటుంది. మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే గుణంతోపాటు జలుబు, దగ్గు వంటి సమస్యలను దూరం చేసి ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. పోషకాలు పుష్కలంగా ఉంటాయి: అపారమైన పోషకాలను కలిగి ఉన్న సాంప్రదాయ వంటలలో వెన్న పొంగల్ ఒకటి. ఇందులో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్స్, ఫైబర్,  క్లోరోఫిల్ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఈ సంక్రాంతి పండుగలో వెన్న పొంగల్‌ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.  

read more
బీపీ ఎక్కువైతే ఏకంగా ఇన్ని ప్రమాదాలు ఉంటాయని తెలుసా?

అధిక రక్తపోటు అంటే హైపర్‌టెన్షన్ అనేది నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధి. రక్తపోటు సాధారణ పరిమితిని మించిపోయినప్పుడు  శరీర అవయవాలను  ప్రభావితం చేస్తుంది. అధిక రక్తపోటు రోగులకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. సాధారణ అధికరక్తపోటు ఉన్నవారికి గుండెపోటు సమస్య పొంచి ఉంటుందని అంటారు. అయితే కేవలం గుండె మాత్రమే కాకుండా మరిన్ని విషయాల మీద బీపీ ప్రభావం ఉంటుంది.  బీపీ ఎక్కువైతే శరీరంలో ఏ ఏ అవయవాల మీద దారుణమైన ప్రభావం ఉంటుందో తెలుసుకుంటే వాటి గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. గుండె సంబంధ సమస్యలు.. రక్తపోటు పెరగడం  గుండెకు అస్సలు మంచిది కాదు, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, స్ట్రోక్,  హార్ట్ ఫెయిల్యూర్‌తో సహా హైపర్‌టెన్షన్ గుండెకు పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తుంది.  రక్తపోటు పెరిగినప్పుడు   గుండె వేగం పెరుగుతుంది. ఈ సమయంలో శరీరంలోని మిగిలిన భాగాలకు  రక్తం ప్రవహించడం కష్టం అవుతుంది. ఇలాంటి పరిస్థితిలో హార్ట్ అటాక్ సమస్య వస్తుంది. కరోనరీ ఆర్టరీ.. కరోనరీ ఆర్టరీ  అనేది గుండె సంబంధిత సమస్య. అధిక రక్తపోటు కారణంగా ధమనులు ఇరుకుగా మారి దెబ్బతింటాయి.  దీని కారణంగా  గుండె నుండి రక్తాన్ని సరఫరా చేయడంలో ఇబ్బంది పడతాయి. ఇలాంటి  పరిస్థితిలో గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. కంటి సమస్యలు.. హైపర్‌టెన్షన్ కంటిలో రక్తస్రావాన్ని ప్రభావితం చేయడం ద్వారా రెటినోపతి,  గ్లాకోమా వంటి కంటి సమస్యలను కలిగిస్తుంది. గ్లాకోమా అనేది కంటిలోపల రక్తపోటు పెరగడం వల్ల వచ్చే కంటి వ్యాధి. గ్లాకోమాకు హైపర్‌టెన్షన్ ఒక ముఖ్యమైన ప్రమాద కారకంగా వైద్యులు చెబుతున్నారు. మానసిక సమస్యలు.. రక్తపోటు వల్ల మొదట గుండెకు ముప్పు కలిగినా గుండె తర్వాత ఇది  మెదడుకు  పొంచి ఉంటుంది. హైపర్‌టెన్షన్ మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.  స్ట్రోక్ వచ్చే అవకాశాలను పెంచుతుంది. అధిక రక్తపోటు కారణంగా జ్ఞాపకశక్తి కోల్పోవచ్చు. మెదడుకు రక్తం,  ఆక్సిజన్ సక్రమంగా ప్రసరణ కావడం  అవసరం.కానీ అధిక రక్తపోటు  ఈ ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల మెదడుకు తగినంత ఆక్సిజన్ అందదు. ఫలితంగా  తీవ్రమైన మానసిక  సమస్యలు  తలెత్తుతాయి. మెటబాలిక్ సిండ్రోమ్.. అధిక రక్తపోటు  మెటబాలిక్ సిండ్రోమ్‌ సమస్యను కలిగిస్తుంది. ఇది మధుమేహం, ఊబకాయం,  కొలెస్ట్రాల్ సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యలన్నింటినీ నివారించడానికి, రక్తపోటుకు  సకాలంలో చికిత్స తీసుకోవడం  చాలా ముఖ్యం.                                       *నిశ్శబ్ద.

read more
చిన్నవయసులోనే జుట్టు రాలడం డేంజరా? డాక్టర్లు ఏం చెబుతున్నారో తెలుసుకోండి!

జుట్టు రాలడం ఇప్పట్లో పెద్దా చిన్న అనే తేడా లేకుండా అన్ని వయసుల వారిలో ఉంటోంది.  జుట్టు రాలుతున్నప్పుడు చాలామంది దాన్ని అరికట్టడానికి హెయిర్ ఆయిల్స్, షాంపూలు, హెయిర్ ప్యాక్ లు వగైరా ట్రై చేస్తుంటారు. కానీ జుట్టు ఎందుకు రాలుతోంది అనే విషయం తెలుసుకోరు.  సాధారణంగా జుట్టు రాలడం అనేది సీజన్ సమస్య లేదా వాటర్ ఎఫెక్ట్ వల్ల జరిగితే అది తొందరలోనో మార్పులు చేసుకోవడం వల్ల తగ్గిపోతుంది.  షాంపూలు, నూనెలు ప్రయత్నించగానే కట్టడి అవుతుంది. కానీ ఎన్ని ప్రయత్నించినా జుట్టు రాలడం అనే సమస్య  తగ్గకపోతే అది  ప్రమాదకరమైనదిగానే పరిగణించాలని వైద్యులు చెబుతున్నారు.  జుట్టు రాలడం అనే సమస్య శరీరంలో మెల్లగా పెరుగుతున్న జబ్బులను సూచిస్తుందని అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే.. ఒత్తిడి.. ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నవారు లేదా డిప్రెషన్ తో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు జుట్టుకు సంబంధించిన సమస్యలతో సఫర్ అవుతారు. ముఖ్యంగా జుట్టు రాలడంలో ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటారని పరిశోధకులు, వైద్యులు తమ అధ్యయనాలలో  కనుక్కున్నారు. ఒత్తిడి సమయంలో విడుదలయ్యే ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ జుట్టు పెరుగుదలకు అవసరమైన మూలకణాలను దెబ్బతీయడం ప్రారంభిస్తుంది. ఇది జుట్టును బలహీనంగా  మారుస్తుంది.  జుట్టు సమస్యలు ఏవైనా ఉంటే వాటికి గల కారణాలను సకాలంలో గుర్తించడం మంచిది. థైరాయిడ్ .. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి కూడా జుట్టు రాలడం,  విరిగిపోవడమనే  ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. హైపర్ థైరాయిడిజం-హైపోథైరాయిడిజం రెండింటిలోనూ జుట్టు రాలడమనే  సమస్య  ఉండచ్చు. హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్న వ్యక్తులలో దాదాపు 50% మందిలో..  హైపో థైరాయిడిజంతో బాధపడుతున్న వారిలో దాదాపు  33% మంది వ్యక్తులలో జుట్టు రాలడం కనిపిస్తుందని వైద్యుల సర్వేలలో స్పష్టం అయింది. కాబట్టి ఎక్కువ రాలిపోతుంటే ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం మంచిది. పోషకాల లోపం.. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి.. శరీరంలో జుట్టు, గోర్లు, చర్మం ఆరోగ్యంగా ఉండటానికి  అనేక రకాల పోషకాలు  అవసరం. రిబోఫ్లావిన్, బయోటిన్, ఫోలేట్,  విటమిన్ B12- విటమిన్- E  లోపాల వల్ల జుట్టు రాలిపోవడం జరుగుతుంది. జింక్,  ప్రోటీన్ వంటి ముఖ్యమైన పోషకాల లోపం కూడా జుట్టు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. జుట్టు ఆరోగ్యంగా ,  దృఢంగా ఉండాలంటే  ఆహారంలో పోషక విలువలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇతర కారణాలు.. చాలామందిలో జుట్టు రాలిపోవడానికి ఐరన్ లోపం కారణమవుతుంది. ఐరన్ తక్కువగా ఉంటే  శరీరంలో హిమోగ్లోబిన్ కూడా తక్కువగా ఉండి  రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. ఇది జుట్టు రాలిపోవడం, జుట్టు బూడిద రంగులోకి మారడం, జుట్టు పలుచబడిపోవడం మొదలైన పరిస్థితులకు కారణం అవుతుంది.  ఐరన్, జింక్ లోపాలు జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. పైవి మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తిలో సెక్స్ హార్మోన్లు విడుదల అవుతాయి. ఈ సెక్స్ హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడినా కూడా జుట్టు రాలడం జరుగుతుంది. ఎవరికైనా జుట్టు రాలడం అనే సమస్య తీవ్రంగా వేధిస్తుంటే కారణం ఏంటో తెలుసుకుని ఆహారం, జీవనశైలిని చక్కదిద్దుకోవడం ద్వారా జుట్టు రాలడాన్ని అరికట్టడం ఆరోగ్యకరం. అంతేకానీ జుట్టు రాలుతుంది కదా అని విభిన్నరకాల షాంపూలు, నూనెలు వాడి జుట్టును మరింత దెబ్బతీయడం మంచిది కాదు.                                         *నిశ్శబ్ద. 

read more
అండాశయ క్యాన్సర్ అంటే ఏమిటి? మహిళల్లో ఈ వ్యాధి వేగంగా ఎందుకు పెరుగుతుంది?

గత కొంతకాలంగా, జీవనశైలి, ఆహారంలో మార్పుల వల్ల మహిళల్లో అనేక రకాల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. వీటిలో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ,  అండాశయ క్యాన్సర్ ఒకటి. అండాశయ క్యాన్సర్ భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళల్లో పెరుగుతున్న తీవ్రమైన ముప్పుగా పరిగణించబడుతుంది. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే అండాశయ క్యాన్సర్ లక్షణాలు చివరి దశలో కనిపిస్తాయి. అటువంటి పరిస్థితిలో, ఈ క్యాన్సర్ కటి నుంచి కడుపులోకి వ్యాపించినప్పుడు బయటపడుతుంది. కొన్ని ప్రారంభ లక్షణాలపై చాలా శ్రద్ధ చూపడం ద్వారా ఈ తీవ్రమైన సమస్యను నివారించవచ్చు. అండాశయ క్యాన్సర్ అంటే ఏమిటి? దాని లక్షణాలు.. నివారణ చర్యలు ఏమిటో తెలుసుకుందాం. అండాశయ క్యాన్సర్ అంటే ఏమిటి? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, అండాశయాలలో ఏ రకమైన క్యాన్సర్ అభివృద్ధి అయినా అండాశయ క్యాన్సర్ ఎక్కువగా అండాశయం యొక్క బయటి పొర నుండి ఉద్భవిస్తుంది. అండాశయ క్యాన్సర్ యొక్క అత్యంత సాధారణ రకాన్ని ఎపిథీలియల్ ఓవేరియన్ క్యాన్సర్ (EOC)అని పిలుస్తారు.  అండాశయ క్యాన్సర్ తరచుగా నడుము నుంచి  పొత్తికడుపు వరకు వ్యాపించిన తర్వాతే బయటపడుతుంది. అండాశయ క్యాన్సర్ లక్షణాలు ఏమిటి? ప్రారంభ లక్షణాలు : - పొత్తికడుపు,  వెనుక భాగంలో నొప్పి -ఇండియేషన్ సమస్య -తక్కువ తిన్నా కడుపు నిండిన అనుభూతి -తరచుగా మూత్ర విసర్జన -ప్రేగు అలవాట్లలో మార్పు క్యాన్సర్ పెరిగినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి: -వికారం అనుభూతి -ఆకస్మిక బరువు నష్టం -శ్వాస ఆడకపోవడం, అలసట అండాశయ క్యాన్సర్‌ను నివారించే మార్గాలు. తల్లిపాలు : తల్లిపాలు తాగినప్పుడు, అండాశయ, ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గర్భం : ఎక్కువ కాలం తర్వాత గర్భం దాల్చిన స్త్రీలకు అండాశయ, ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తక్కువ. శస్త్రచికిత్స : గర్భాశయ శస్త్రచికిత్స లేదా ట్యూబల్ లిగేషన్ చేయించుకున్న స్త్రీలకు కూడా ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువ. జీవనశైలి : ఇది కాకుండా, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం మంచి ఆరోగ్యానికి సంకేతాలు. క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

read more
మకర సంక్రాంతి స్పెషల్..నువ్వుల లడ్డు తింటే ఎన్ని హెల్త్ బెనిఫిట్సో..!

చలికాలం ముగిసి వేసవికాలం ప్రారంభమయ్యే సమయం. ఈ సమయంలో పంట చేతికి వస్తుంది. రైతులు ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుంది. ఈ సమయాన్ని గొప్ప పండుగగా జరుపుకుంటారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో మూడు రోజులపాటు పొంగల్ ను ఘనంగా జరుపుకుంటారు. ఈ మకర సంక్రాంతికి పండుగకు స్పెషల్ నువ్వులు. ఈ పండుగలో నువ్వులు, బెల్లం, చెరకు ఎక్కువగా వినియోగిస్తారు. సంక్రాంతి స్పెషల్ నువ్వుల లడ్డు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. పొంగల్: పొంగల్ ను సాధారణంగా మకర సంక్రాంతి రోజు ఆరుబటయ తయారుచేస్తారు. సూర్యరశ్మి నుంచి మనకు విటమిన్ డి అందుతుంది. ఎంతో రుచికరమైన పొంగల్లో నెయ్యిని వాడుతారు. నెయ్యిలో కరిగే విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ వంటకంలో విటమిన్ ఇ, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. నువ్వులు, బెల్లం: వేరుశెనగ, ఎండు కొబ్బరి, నువ్వులు, బెల్లం మిశ్రమంతో లడ్డును తయారు చేస్తారు. నువ్వులు విటమిన్ ఇ, రాగి, కాల్షియం, జింక్, ఐరన్ వంటి ఖనిజాలకు మంచి మూలం. నువ్వుల నూనె మన చర్మం, జుట్టును తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ఎండు కొబ్బరి: ఎండు కొబ్బరిలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇందులో ఫైబర్, ఎమ్‌సిటిలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి చలికాలంలో చర్మ ఇన్ఫెక్షన్‌లను నివారిస్తాయి. వేరుశనగ: వేరుశెనగలో ఒమేగా-6 ఫ్యాట్స్ ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన చర్మం, కణాల పనితీరుకు మద్దతు ఇస్తుంది. బి విటమిన్ బయోటిన్, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదల, మృదువైన తల చర్మం కోసం అవసరం. ఇది వేరుశెనగలో లభిస్తుంది. బెల్లం: బెల్లం చెరకు నుంచి తయారు చేస్తారు. ఇందులో ఎలక్ట్రోలైట్స్, కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటుంది. చెరకు కాలేయం డిటాక్స్‌లో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. చల్లని వాతావరణంలో జలుబు, దగ్గును నయం చేస్తుంది.బెల్లంలో కాల్షియం, ఐరన్, జింక్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం వంటి అనేక ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవన్నీ ఫ్రీ రాడికల్స్‌ను నిరోధించడంలో సహాయపడతాయి.

read more
చికెన్, మటన్ కూడా దీని ముందు బలాదూర్.. !

                                         ప్రోటీన్ అనేది శరీరానికి అవసరమైన పోషకం. ఇది శరీరంలో జరిగే అనేక పనులకు  బాధ్యత వహిస్తుంది. కండరాలను నిర్మించడంలో,  మరమ్మత్తు చేయడంలో  ప్రోటీన్ ప్రధాన భాగం. శరీరానికి శక్తిని ఇచ్చేది ప్రోటీనే..  ఎముకలు, చర్మం, గోర్లు,  జుట్టు వంటి   భాగాలను నిర్మించడంలో ప్రోటీన్ సహాయపడుతుంది. ప్రొటీన్ లోపం వల్ల శరీరంలో బలహీనత,  అలసట ఏర్పడుతుంది. వెంట్రుకలు రాలడం,  గోళ్లు బలహీనపడడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలకు దారి తీస్తుంది. దీని లోపం వల్ల పిల్లల బరువు తగ్గి శారీరక, మానసిక ఎదుగుదలకు ఆటంకాలు ఏర్పడవచ్చు. ఇవి మాత్రమే కాకుండా  అలసట, ఆందోళన,  మానసిక కల్లోలం వంటి మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ప్రోటీన్ లోపాన్ని అధిగమించడానికి చాలామంది మాంసం, చేపలు, చికెన్ లేదా గుడ్లు వంటి ఆహారాలు తింటుంటారు. అవే చాలా ఆరోగ్యమని కూడా నమ్ముతారు.  కానీ వాస్తవానికి కొన్ని కూరగాయలు, పప్పులు,  బీన్స్ మొదలైనవి ప్రోటీన్‌తో నిండి ఉంటాయి. చికెన్, మటన్ కాకుండా శాఖాహారులు కూడా తినడానికి అద్భుతమైన ప్రోటీన్ ఆహారంగా ఉలవలను పేర్కొనవచ్చు. వీటినే హార్స్ గ్రామ్ అని కూడా అంటారు. ఉలవలలో  ప్రోటీన్ సమృద్దిగా ఉంటుంది.   ఉలవల నుండి మరింత  పోషకాలను పొందడానికి వీటిని  మొలకెత్తించి తినాలి. ఇలా తింటే ఇవి  జీర్ణం కావడం  కూడా సులభం అవుతుంది. ఉలవలు అర అంగుళం వరకు మొలకెత్తడం మొలకెత్తినప్పుడు వీటిని  తినాలి. ఉలవలు శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి. శరీరంలో పుట్టే అమతమైన వేడిని సమతుల్యం చేయడానికి ఉలవలు తిన్న తరువాత మొలకెత్తించిన పెసలు కూడా తినాలి. అప్పుడ శరీరం వేడికి ఇబ్బంది పడదు.   ఉలవలలో ఫైబర్,  ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు తగ్గాలనుకునే వారికి గొప్ప ఎంపిక. ఇందులో ఉండే మూలకాలు ఫ్యాట్ బర్నర్స్‌గా పనిచేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ని పెంచుతాయి. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థను చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది. మొలకెత్తిన ఉలవలు తింటే  రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.  శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తాయి. వీటిలో  లిపిడ్లు, ఫైబర్  రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. అందువల్ల మొలకెత్తిన ఉలవలు తింటే  గుండె సిరలలో చిక్కుకున్న చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడుతాయి, సిరలలో  అడ్డుపడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇక ఉలవల మొలకలు తీసుకోవడం వల్ల అనేక రకాల చర్మ సంబంధ సమస్యలు తొలగిపోతాయి.  లివర్ ఇన్ఫెక్షన్, కిడ్నీలో రాళ్లు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించి వాటిని నివారించడంలో సహాయపడుతుంది.                                                     *నిశ్శబ్ద.

read more
ఏబీసీ జ్యూస్ అంటే ఏంటి..? ఈ జ్యూస్ తాగితే ఎప్పటికీ ముసలివారు కారా..?

ఇటీవల ఎక్కడ చూసిన ఏబీసీ జ్యూస్ తాగమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ జ్యూస్ ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో ఫిట్‌నెస్‌కు సంబంధించిన సలహాలు ఇచ్చే వారు సైతం ఏబీసీ జ్యూస్ తాగమని చెబుతున్నారు. ఇంతకీ ఈ ABC జ్యూస్ అంటే ఏమిటి. దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. A అంటే ఆపిల్, B అంటే బీట్‌రూట్,  C అంటే క్యారెట్  ఈ పదార్థాలు కలిసి ABC జ్యూస్‌ అంటారు. చాలా మంది ఆరోగ్య నిపుణులు ఈ జ్యూస్‌లను తాగాలని సూచిస్తున్నారు. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు  మినరల్స్ పుష్కలంగా ఉండే పండ్లతో ఈ జ్యూస్ తయారుచేస్తారు. ABC జ్యూస్‌లో జింక్, పొటాషియం, కాల్షియం, కాపర్, ఐరన్, మాంగనీస్  విటమిన్లు A, B6, C, D  E వంటి పోషకాలు ఉన్నాయి, ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతేకాకుండా, ఈ జ్యూస్‌లో ఒక్కో సర్వింగ్‌కు 60-150 కేలరీలు మాత్రమే ఉంటాయి  బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులకు ఇది మంచి ఎంపిక. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మీ రోజువారీ ఆహారంలో ఈ సాధారణ జ్యూస్‌ని ఎందుకు చేర్చుకోవడం ముఖ్యమో తెలుసుకుందాం. డీటాక్సిఫికేషన్ కోసం ఉపయోగపడుతుంది: ఉదయాన్నే ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరం డిటాక్సిఫికేషన్ అవుతుంది.  శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. ఈ జ్యూస్‌లోని పోషకాలు శరీరంలోని పోషకాలను తిరిగి నింపి శరీరాన్ని బాగా హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడతాయి. అంటు వ్యాధులను నివారించడానికి సహాయం పడుతుంది: అవసరమైన పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉండే ఈ రసం రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. వాస్తవానికి, ఈ జ్యూస్‌ని రోజూ తాగడం వల్ల సహజంగా హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడతాయని, ఈ జ్యూస్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు తెల్ల రక్త కణాలను పెంచి, అంటు వ్యాధులను దూరం చేయడంలో సహాయపడతాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ రసం కణాల పునరుత్పత్తికి కూడా సహాయపడుతుంది  ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. మీ రోజువారీ ఆహారంలో ఈ పానీయాన్ని చేర్చుకోవడం వల్ల వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది, యాంటీఆక్సిడెంట్లు  విటమిన్ సి, కె, ఇ, ఎ  బి-కాంప్లెక్స్ కంటెంట్‌లు మంచి చర్మం కోసం  సహాయపడతాయి. చర్మం యవ్వనంగా  కాంతివంతంగా కనిపిస్తుంది. ABC రసం జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది  జీవక్రియ రేటును పెంచుతుంది, ఇది మెరుగైన జీర్ణక్రియ  బరువు నిర్వహణలో సహాయపడుతుంది. అంతే కాకుండా పీచుపదార్థాలు, క్యాలరీలు తక్కువగా ఉండే ఈ జ్యూస్ బెల్లీ ఫ్యాట్ ను త్వరగా తగ్గించడంలో సహాయపడుతుంది. ABC జ్యూస్ ఎలా తయారు చేయాలి? ఈ రసాన్ని సిద్ధం చేయడానికి ఒకటిన్నర్ కప్పుల ఆపిల్ ముక్కలు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, అరకప్పు బీట్‌రూట్ ముక్కలు తీసుకోండి. వీటిని బ్లెండర్‌లో వేయాలి. ఆపై జ్యూస్ తయారుఅవుతుంది.  ఆపై కొద్దిగా తురిమిన అల్లం వేసి, ఈ రసాన్ని మళ్లీ బ్లెండర్లో కలపండి. రసాన్ని వడకట్టి నిమ్మరసం  రాక్‌సాల్ట్‌తో సర్వ్ చేయండి.  

read more
జామ ఆకులతో ఇలా ఔషధం తయారు చేసుకుంటే జలుబు, దగ్గు పరార్..!

చలికాలం వచ్చిందంటే చాలు  జలుబు దగ్గు  మనల్ని వదిలిపెట్టవు.  జలుబు దగ్గు కారణంగా మనకు చాలా చికాకు కలుగుతుంది.  ముఖ్యంగా జలుబు దగ్గు అనేది ఇన్ఫెక్షన్ల కారణంగా వస్తాయి.  చలికాలంలో ఎండ తీవ్రత తక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా అనేది వాతావరణంలో పెరుగుతుంది.  ఫలితంగా జలుబు దగ్గు లాంటి వ్యాధులు తీవ్రతరం అవుతూ ఉంటాయి. . అయితే మీరు దగ్గు నుండి ఉపశమనం పొందాలంటే ఆయుర్వేదంలో చాలావరకు పరిష్కారాలు ఉన్నాయి.  ఇంగ్లీష్ మందులు ఎక్కువగా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది.  కావునా  కొన్ని సులభమైన పరిష్కారాలతో మీ  దగ్గు జలుబును వదిలించుకోవచ్చు. దగ్గు నుండి ఉపశమనం కోసం జామ ఆకులను కూడా ఉపయోగించవచ్చుజామ ఆకుల్లో ప్రొటీన్లు, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియంతో పాటు విటమిన్ బి, సి ఉంటాయి. ఇది యాంటీ అలెర్జీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంది. దగ్గు నివారణకు జామ ఆకులను ఇలా ఉపయోగించండి: జామ ఆకుల కషాయం: కషాయం తాగడం దగ్గు  గొంతుకు చాలా మంచిది. జామ ఆకుల నుండి కూడా డికాక్షన్ తయారు చేసుకోవచ్చు. దీని కోసం, ఒక పాత్రలో నీటిలో జామ ఆకులను ఉడకబెట్టండి. కాసేపయ్యాక ఎండుమిర్చి, అల్లం, లవంగాలు, యాలకులు వేయాలి. వాటిని 5 నిమిషాలు ఉడికించి, ఫిల్టర్ చేసి త్రాగాలి. దీంతో దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.  జామ ఆకు నీరు: ఈ ఆకుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి దగ్గు వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. దగ్గు నుండి ఉపశమనం పొందడానికి జామ ఆకుల నీరు త్రాగడం మంచిది. దీని కోసం, ఒక పాత్రలో జామ ఆకులను శుభ్రం చేసి మరిగించి, నీరు మారే వరకు వేడి చేయండి. తర్వాత వాటిని వడకట్టి గోరువెచ్చగా తాగాలి. జామ ఆకుల పొడి: దగ్గు నుండి ఉపశమనం కోసం జామ ఆకుల పొడిని కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం జామ ఆకులను బాగా కడిగి ఆరబెట్టాలి. వాటిని ఆరిన తర్వాత మెత్తగా పొడి చేసి నిల్వ చేసుకోవాలి. మీరు ఈ జామ ఆకుల పొడిని పాలు లేదా గోరువెచ్చని నీటితో తీసుకోవచ్చు.

read more
ఈ పండ్ల ముందు పాలు కూడా బలాదూర్.. దెబ్బకు కాల్షియం లోపం సెట్ అవుతుంది..!

కాల్షియం ఎదిగే పిల్లల నుండి మహిళలు, పురుషులు, వృద్దులు ఇలా అందరికీ చాలా అవసరం.  శరీరంలో  కండరాలు, నరాల పనితీరుకు, ఎముకలు బలంగా ఉండటానికి కాల్షియం అవసరమవుతుంది.  ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు 1,000 mg కాల్షియం అవసరం. తగినంత కాల్షియం అందకపోవడం వల్ల, ఎముకలలో బలహీనత, కండరాల తిమ్మిరి, వేళ్లు,  కీళ్లలో నొప్పి, ఎముకలు త్వరగా పగుళ్లు రావడం.  దంతాలు,  చిగుళ్ళు బలహీనపడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.   కాల్షియం లోపాన్ని అధిగమించడానికి చాలామంది  పాలు, గుడ్లు బాగా తీసుకోవాలని అంటారు. కానీ శాఖాహారులకు కాల్షియం లోపం ఎంతో కొంత ఉంటుంది. దీన్ని అధిగమించాలంటే  ఈ కింద చెప్పుకునే పండ్లు తీసుకుంటే చాలు.. నారింజ.. క్యాల్షియం పుష్కలంగా ఉండే పండ్లలో ఆరెంజ్ ఒకటి. 100 గ్రాముల నారింజలో 45 నుండి 50 mg కాల్షియం మరియు వివిధ విటమిన్లు ఉంటాయి. ఇది కాకుండా, నారింజలో ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఒక  నారింజ పండు తింటే కాల్షియం లోపమే ఉండదు. నేరేడు.. నేరేడు పండ్లలో కూడా కాల్షియం సమృద్దిగా ఉంటుంది. 100గ్రాముల నేరేడు పండ్లలో  15 mg కాల్షియం ఉంటుంది. అంజీర్.. 100 గ్రాముల ఎండిన అత్తి పండ్లను తీసుకుంటే 160 mg కాల్షియం పొందవచ్చు. ఇది ఎముకలు,  దంతాలు బలంగా,  ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన కాల్షియంను మెండుగా అందిస్తుంది. కివి..  కివిలో కాల్షియం,  శరీరానికి మేలు చేసే అనేక ఇతర ముఖ్యమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎంతో  రుచికరమైన పండు.  100 గ్రాముల కివిలో  30 mg కాల్షియం ఉంటుంది.  ఒక గ్లాసు కివిలో జ్యూస్ లో  60 mg కాల్షియం ఉంటుంది. మల్బరీ.. మల్బరీ క్యాల్షియం పుష్కలంగా ఉండే పండు. ఇది బెర్రీల కుటుంబానికి చెందిన పండు. ఒక కప్పు మల్బరీలో 55 mg కాల్షియం ఉంటుంది. వీటిని నేరుగా అయినా తినవచ్చు.  స్మూతీలు, జ్యూస్‌లు  డెజర్ట్‌లలో చేర్చుకోవచ్చు. రేగు పండ్లు.. రేగు పండ్లలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిని నేరుగా అయినా తినవచ్చు. అదే విధంగా ఫ్లం పండ్లు కూడా ఉంటాయి. ఇవి కూడా రేగు కుటుంబానికి చెందిన పండ్లు. వీటిలో కూడా కాల్షియం మెండు. వీటిని జ్యూస్ గా తీసుకోవచ్చు. ఒక గ్లాసు ప్లం జ్యూస్‌లో 55 mg కాల్షియం ఉంటుంది. ఎండుద్రాక్ష.. తెలుపు, నలుపు ఎండు ద్రాక్షలో కూడా కాల్షియం బాగుంటుంది. ఇవి బిపిని నియంత్రించడంతో పాటు ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా సహాయపడతాయి. ఒక కప్పు ద్రాక్షపండు రసంలో 50 mg కాల్షియం ఉంటుంది. నల్ల ఎండుద్రాక్ష గర్భిణీ స్త్రీలకు ప్రయోజనకరంగా ఉంటుంది, వాపును తగ్గిస్తుంది. 100 గ్రాముల నల్లద్రాక్షలో 55 mg కాల్షియం ఉంటుంది. నిమ్మకాయలు..  నిమ్మకాయలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల నిమ్మకాయలో 33 mg కాల్షియం ఉంటుంది. ఇది కాకుండా.. విటమిన్ సి వంటి అనేక ఇతర పోషకాలు ఉంటాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జబ్బులతో పోరాడటానికి,   చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి , మలబద్ధకం వంటి జీర్ణశయాంతర సమస్యల నుండి ఉపశమనాన్ని అందించడంలోనూ సహాయపడుతుంది. బొప్పాయి.. బొప్పాయి  పోషకాలతో నిండిన రుచికరమైన పండు. కాల్షియం అధికంగా ఉండే ఆహారాలలో బొప్పాయి ఒకటి.  100 గ్రాముల బొప్పాయిలో 20 mg కాల్షియం ఉంటుంది. ఇది కాకుండా బొప్పాయి పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాల నుండి రక్షించడంలో,  గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుంది. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.                                        *నిశ్శబ్ద.

read more