పాషన్ ఫ్రూట్ గురించి విన్నారా? దీంతో కలిగే లాభాలేంటంటే..!
పండ్లలో చాలా రకాలు ఉన్నాయి. అయితే తెలుగు ప్రజలకు కాస్త పరిచయం తక్కువ ఉన్న పండ్లలో పాషన్ ఫ్రూట్ కూడా ఒకటి. ఈ పాషన్ ఫ్రూట్ లోపల గుజ్జు, గింజలతో కూడి ఉంటుంది. దీని తొక్క మాత్రం గట్టిగా చూడటానికి ఏ మారేడు కాయో అనిపించేలా ఉంటుంది. ఊదా రంగులోనూ, పసుపు రంగులోనూ పాషన్ ఫ్రూట్ లు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. దీని గుజ్జుతో వివిధ రకాల పానీయాలు తయారుచేస్తారు. రోగనిరోధక శక్తికి పాషన్ ప్రూట్ పెట్టింది పేరు. ఈ పండులో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆరోగ్యకరమైన చర్మానికి సహాకరిస్తుంది. పాషన్ ఫ్రూట్ లో పెద్ద మొత్తంలో విటమిన్ ఎ, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం కూడా ఉంటాయి. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలు.. దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుంది.. విటమిన్ సి, పాలీఫెనాల్స్తో సహా పాషన్ ఫ్రూట్‌లోని అధిక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడటానికి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్.. పాషన్ ఫ్రూట్ లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచవు, మధుమేహం ఉన్నవారికి మంచివి. పాషన్ ఫ్రూట్లో ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది. రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచడంలో ఆస్కార్బిక్ ఆమ్లం సహాయపడుతుంది. బరువు నిర్వహణ.. ఈ పండులో ఉండే పీచు పదార్ధం ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. తద్వారా పదే పదే తినడాన్ని నియంత్రిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ప్రేగు కదలికలను చురుగ్గా ఉంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. విటమిన్ సి, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, ఇన్ఫెక్షన్తో పోరాడడంలో, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ప్యాషన్ ఫ్రూట్ పీల్స్ వల్ల రోగనిరోధక వ్యవస్థ ప్రభావవంతంగా ఉంటుంది. గుండె ఆరోగ్యం.. ప్యాషన్ ఫ్రూట్‌లోని పొటాషియం కంటెంట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులోని ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ధమనులలో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడతాయి. గట్ మైక్రోబయోమ్.. ఒక చిన్న పాషన్ ఫ్రూట్ లో ఉండే ఫైబర్ ప్రీబయోటిక్‌గా పనిచేస్తుంది. ఇది మైక్రోబయోమ్‌ను మంచి బ్యాక్టీరియాతో ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. *నిశ్శబ్ద.
read moreఆయుర్వేదం ప్రకారం.. పండ్లు ఎలా తీసుకుంటే ఎక్కువ లాభాలుంటాయి?
రోజూ పండ్లు తినడం వల్ల లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొత్తం శరీరం మెరుగైన పనితీరుకు అవసరమైన అన్ని పోషకాలను పండ్లు కలిగి ఉంటాయి. పండ్లలో పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, ఫోలేట్, ప్రొటీన్, కాల్షియం, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. పండ్లు క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది, గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదం తగ్గుతుంది, అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది, మధుమేహం నియంత్రణలోనూ, స్థూలకాయాన్ని తగ్గించడంలోనూ, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ సహాయపడుతుంది. కంటి సమస్యలు, జీర్ణ సమస్యలను నివారించడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం ద్వారా వ్యాధులను నివారించడానికి పండ్లు మంచి ఔషదం. ఆయుర్వేదంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఆహారపు అలవాట్లు, జీవనశైలి నియమాలు, కాలానుగుణ నియమాలు ఇలా మరెన్నో జాగ్రత్తలు ఉంటాయి. పండ్లను సరైన పద్ధతిలో తినడానికి కూడా ఆయుర్వేదం నియమాలను సూచించింది. తద్వారా పండ్ల నుండి గరిష్ట ప్రయోజనాలను పొందవచ్చు. పండ్లు ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలు. వాటిని సరైన మార్గంలో తీసుకుంటే ఆరోగ్యానికి గొప్ప ప్రయోజనం ఉంటుంది. తప్పుడు మార్గంలో, తప్పు సమయంలో పండ్లు తినడం వల్ల ప్రయోజనాలకు బదులుగా హాని కలుగుతుంది. పండ్లు ఎలా తీసుకోకూడదో ఆయుర్వేదం చెప్పిన నియమాలు ఏంటో తెలుసుకుంటే.. ఆహారంతో పాటు పండ్లు తినకూడదు.. చాలా మంది ఈ తప్పు చేస్తుంటారు. ఆహారంతో పాటు పండ్లు తినడం వల్ల పేగుల్లో విషపదార్థాలు పేరుకుపోతాయి. ఆయుర్వేదంలో కొన్ని విషయాలను 'ఆమ' అంటే విషపదార్థాలు అంటారు. ఆహారంతో పాటు పండ్లను తీసుకోవడం వల్ల అజీర్ణం ఏర్పడుతుంది. ఇది కాకుండా అనేక చర్మ సమస్యలు, వాపులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. పండ్లను జ్యూస్ చేస్తే ప్రాణానికే ముప్పు.. చాలా సులువుగా ఉంటుందని ఎక్కువ మంది పండ్లు తినడం కంటే పండ్ల రసాన్ని తీసుకోవడానికి ఇస్టపడతారు. అయితే పండ్ల రసం తీసుకున్నంత మాత్రాన ప్రయోజనం ఉండదు. పండ్ల నుండి ఎక్కువ పోషకాలను పొందడానికి మొత్తం పండు తినాలి. రసం తాగడం ద్వారా ఫైబర్ తో పాటు అనేక ఇతర మూలకాలను కోల్పోతారు. డిన్నర్లో లేదా సాయంత్రం తర్వాత పండ్లు తినవద్దు.. ఆయుర్వేదం ప్రకారం పండ్లను సాయంత్రం లేదా రాత్రి భోజనం చేసినప్పుడు తీసుకోకూడదు. ఈ సమయాన్ని కఫా కాలం అని, ఈ కాలంలో పండ్లు జీర్ణం కావడానికి చాలా బరువుగా ఉంటాయని, ఇది దోష అసమతుల్యతకు దారితీస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. పాలలో పండ్లను కలపవద్దు.. పాలతో పండ్లను తినడం విరుద్ధ ఆహారం అని ఆయుర్వేదం చెబుతోంది. చాలామంది పాలను పండ్లను మిక్సీ పట్టి మిల్క్ షేక్ చేసుకుని ఇష్టంగా తాగుతుంటారు. అరటిపండు తియ్యగా ఉన్నప్పటికీ పేగులకు భారంగా ఉంటుంది. అందుకే అరటిపండ్లు పాలు కలిపి తినకూడదు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఎల్లప్పుడూ సీజనల్ పండ్లను మాత్రమే తినాలి.. సీజన్లో లభించే పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిది. ఇతర పండ్లు రసాయనాల ద్వారా ఎక్కువ కాలం భద్రపరచబడతాయి. సీజనల్ లేని పండ్లను తినడం ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. పైపెచ్చు సీజన్ కాని పండ్లు సహజంగానే ఎక్కువ ధరకు అమ్ముతుంటారు. కాబట్టి సీజన్ లో లభించే పండ్లను తాజాగా ఉన్నట్టే తినాలి. *నిశ్శబ్ద.
read moreడయాబెటిస్ ఉన్నవాళ్లకు నేరేడు ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలు..!!
భారతీయులకు ప్రాచీనులు అందించిన గొప్ప వరాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఆయుర్వేదం, యోగ ప్రథమ స్థానంలో ఉంటాయి. ముఖ్యంగా ప్రకృతిలో భాగమైన పంచభూతాలు మనిషికి గొప్ప ఔషదంగా పనిచేస్తాయి. చెట్లు, పండ్లు, చెట్ల ఆకులు ఇవన్నీ ఎన్నో జబ్బులను నయం చేయడంలో సహాయపడతాయి. ఆయుర్వేదంలో వీటి గురించి గొప్ప సమాచారం కూడా ఉంటుంది. ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది. ఎక్కడ చూసినా నేరేడు పండ్లు నోరూరిస్తూ ఉంటాయి. అయితే నేరేడు పండ్లు మాత్రమే కాదు.. నేరేడు చెట్టు ఆకులు, నేరేడు పండ్ల గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి నేరేడు ఆకులు చాలా మంచివి. నేరేడు ఆకులు ఎలా ఉపయోగించాలి? వీటి వల్ల కలిగే ప్రయోజనాలేంటంటే.. నేరేడు పండ్ల ఆకులను డయాబెటిస్ కంట్రోల్ ఉంచడానికి ఉపయోగించవచ్చు. ఇందుకోసం తాజా నేరేడు ఆకులను గ్రైండ్ చేసి రసం తీసి ఈ రసాన్ని ఉదయోన్నే ఖాళీ కడుపుతో తాగాలి. ఒక వేళ తాజా నేరేడు ఆకులు ఎప్పుడూ అందుబాటులో లేకపోతే నేరేడు ఆకులను ఎండబెట్టి పొడి చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఉదయం, సాయంత్రం నీటితో తీసుకోవాలి. నేరేడు ఆకుల పొడితో టీ కూడా చేసుకోవచ్చు. లేదంటే తాజా ఆకులతో కూడా టీ చేసుకోవచ్చు. ఇందుకోసం తాజా నేరేడు ఆకులు లేదా పొడిని నీటిలో వేసి బాగా ఉడికించాలి. తరువాత వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. దీనికి కాసింత నిమ్మరసం కూడా జోడించుకోవచ్చు. ప్రయోజనాలు.. నేరేడు ఆకులలో జాంబోలిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. నేరేడు ఆకులను టీగా చేసుకుని తీసుకోవచ్చు. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయి పెరగడానికి ఆక్సీకరణ ఒత్తిడి కారణం అవుతుంది. నేరేడు ఆకులతో టీ చేసుకుని తాగడం వల్ల ఈ ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. నేరేడు ఆకులలో ఉండే ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంట, నొప్పి సమస్యలు తగ్గిస్తాయి. నేరేడు ఆకులను ఏ రూపంలో తీసుకున్నా ఇన్సులిన్ ఉత్పత్తి ప్రక్రియను పెంచుతాయి. *రూపశ్రీ.
read moreరాత్రిపూట గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఈ బెనిఫిట్స్ ఉంటాయి..!
నీరు శరీరానికి ఇంధనం వంటిది. గోరు వెచ్చని నీరు తాగడం వల్ల శరీరం చాలా వరకు ఆరోగ్యంగా ఉంటుంది. కొందరు ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగుతారు. దీనివల్ల శరీరం శుద్ది అవుతుందని, శరీరంలో టాక్సిన్లు బయటకు వెళతాయని అంటారు. అంతే కాదు ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణాశయం శుభ్రం అవుతుంది. పేగులు శుభ్రపడతాయి. మలబద్దకం సమస్య తగ్గుతుంది. మోషన్ ఫ్రీగా అవుతుంది. కానీ రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీరు తాగడం వల్ల కలిగే లాభాలు ఏంటో మీకు తెలుసా? రాత్రిపూట వేడినీరు తాగడం వల్ల ఒత్తిడి తగ్గి మంచి నిద్ర వస్తుంది. రాత్రిపూట వేడినీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది, ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. జలుబు లేదా ఫ్లూ సమస్య ఉన్నట్లయితే వేడి నీరు తాగడం వల్ల మూసుకుపోయిన ముక్కును క్లియర్ చేయడంలో, గొంతు నొప్పిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా రాత్రంతా హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల గ్యాస్, ఉబ్బరం సమస్యను కూడా పరిష్కారమవుతుంది. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది. రాత్రిపూట గోరువెచ్చని నీటిని తాగితే ఉదయాన్నే శరీరంలోని టాక్సిన్స్‌ను సులభంగా బయటకు పంపుతుంది. రాత్రి భోజనం చేసిన అరగంట తర్వాత లేదా నిద్రకు ఒకటి లేదా రెండు గంటల ముందు గోరువెచ్చని నీటిని తాగాలి. రాత్రిపూట జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. కాబట్టి గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ బాగా జరుగుతుంది. రాత్రిపూట గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది. తరచుగా ఒత్తిడికి గురయ్యేవారు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిని తాగాలి. ఇది ఒత్తిడిని, నిస్పృహను తగ్గిస్తుంది. హాయిగా నిద్ర పొందడానికి కూడా సహాయపడుతుంది. వేడి నీటిని తాగడం వల్ల మెటబాలిజం స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఆరోగ్యంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. శరీరంలో అదనపు కొవ్వు బర్న్ చేయడంలో సహాయపడుతుంది. *రూపశ్రీ.
read moreడెంగ్యూకు మందు ఉందా...
భారతీయులు డెంగ్యు కు మందు కనుగొనడం లో విజయం సాధించారు. ప్రతి సంవత్సరం లక్షల మందిని ప్రభావితం చేస్తున్న డెంగ్యు ను మందును భారతీయ పరిశోదనలు చేసిన తరువాత ఎట్టకేలకు డెంగ్యు మందును కనుగొన్నారు. మొదటి విడతగ ఎలుకల పై ట్రైల్ నిర్వహించగా అద్భుత విజయం సాధించారు. త్వరలోనే మానవులపై క్లినికల్ ట్రైల్స్ నిర్వహిస్తామని చెప్పారు.తదనంతరం డెంగ్యు మందును ప్రజలకు త్వరలో అందుబాటులోకి తెస్తామని తెలిపారు.కేంద్ర ప్రభుత్వ ఔషద సమన్వయ సంస్థ సి ఎస్ ఐ ఆర్ సి డి ఆర్ ఐ. పరిసోదకులు డెంగ్యు రోగుల చికిత్సకు చికిత్స చేయవచనే ఆశలు చిగిరించాయి.ఇప్పటి వరకూ ప్రపంచం లో డెంగ్యు చికిత్సకు మందు లేదని కేవలం లక్షణాలను బట్టి చ్కిత్స చేసేవారని.ఈ సమయంలో పరిశోధకులు దీనిని కనుగొనడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డెంగ్యు రోగుల కోసం మందు ప్రాధాన్యత పెరిగింది.అయితే మనుషులపై ఈ మందు ట్రైల్ నిర్వహించలేదు. కాని మందు ఉత్పత్తి ప్రారంభించారు.సి డి ఆర్ ఐ డైరెక్టర్ ప్రతాప్ కుండా మాట్లాడుతూ ఈ మందు డెంగ్యు రోగులపై పూర్తి విజయ వంతంగా పని చేస్తుందని అన్నారు.మనవులపై మానవులపై నిర్వహించిన ట్రైల్స్ తరువాత మందులపై పేటెంట్ తెస్తామని ఆ తరువాతే మార్కెట్లో కి అందుబాటులో తెస్తామని అన్నారు.మానవులపై ట్రైల్స్ మరింత వేగవంత మైనదని ఆయన అన్నారు.ప్రస్తుత మంత దేశం లో కోరోనా పాటు డెంగ్యు కేసులు పెరుగుతున్నాయని పేటెంట్ హక్కులు ప్రక్రియ ఇంకా కాలేదని వీటికి ఇంకా పేర్లు కూడా నిర్ణయించలేదని వెల్లడించారు. శరీరంలో రక్త నాళాలు మూసుకు పోవడం క్లాట్ పెరగడం ఈ మధ్య కాలం లో కోవిడ్ తరువాత మరింత పెరిగింది.రక్తనాళాలు గడ్డకట్టకుండా ఈ మందు నివారిస్తుంది.శరీరంలో రక్త ప్రసారం నిలిచిపోయి క్లాత్స్ ఎక్కువగా నివారించవచ్చని.ఈ మందు త్రామ్బోస్ స్ట్రోక్స్ వచ్చే రోగులకు చేసే చికిత్సలో సహాయ పడుతుంది.త్రేమ్బోస్ రక్తనాళం ధమనులు లేదా రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యలు.వస్తే ఇది సహాజంగా సాగే రక్త ప్రసారం జరగ కుండా నిరోదిస్తుంది. అసలు డెంగ్యు అంటే... డెంగ్యు జ్వరం దీనివల్ల రక్త ప్రసారంలో సమస్యలు వస్తాయి.దీనిని డెంగ్యు హెమరేజిక్ ఫీవర్ అంటారు.దీనివల్ల శరీరంలో ప్లేటిలేట్స్ స్థాయి తగ్గి పోతుంది ఇది ఏడిస్ ఈజిప్ట్ దోమ వల్ల వస్తుంది.సి డి ఆర్ ఐ శాస్త్రజ్ఞులు విశ్లేషణ ప్రకారం ఈ మందు వల్ల రోగుల ప్లేటి లెట్లు పెరుగు తాయని రోగులు హెమరేజిక్ స్థితి నుంచి ఈ మందులు రక్షిస్తాయని అన్నారు.డెంగ్యు మందు ముందు ముందు మంచి ఫలితాలు వస్తాయని ఆశిద్దాం.
read moreమోకాళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? ఇలా తగ్గించేసుకోండి..!
సాధారణంగా వయసు పెరిగే కొద్దీ కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి. అంతే కాకుండా శరీరంలో విటమిన్ డి, కాల్షియం, ఐరన్ లోపం వల్ల కూడా మోకాళ్ల నొప్పులు వస్తాయి. ఏదైనా గాయం కారణంగా, ఏదైనా దెబ్బతగలడం, కాళ్లను చాలా సేపు వంచి కూర్చోవడం వల్ల, కండరాలు కణజాలాలు సాగదీయబడతాయి. ఇది మోకాళ్లలో నొప్పిని కలిగిస్తుంది. మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు కొన్ని ఇంటి చిట్కాలతో వాటి నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ ఇంటి చిట్కాలను పాటించడం కూడా చాలా సులభం. వాటి ప్రభావం కూడా చాలా త్వరగా కనిపిస్తుంది. అల్లం టీ.. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండే అల్లం తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అల్లం చిన్న ముక్కలుగా కోసి నీళ్లలో వేసి మరిగించాలి. 10 నిమిషాల తర్వాత ఈ నీటిని ఫిల్టర్ చేయాలి. ఇందులో కొంచెం తేనె, నిమ్మరసం కూడా జోడించాలి. ఇలా తయారుచేసిన టీని రోజుకు 2 నుంచి 3 సార్లు తాగడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. నిమ్మకాయ, నువ్వుల నూనె.. మోకాళ్ల నొప్పులకు నిమ్మకాయ, నువ్వుల నూనె దివ్యౌషధం లా పనిచేస్తాయి. నిమ్మకాయను నువ్వుల నూనెలో ఉడికించి మోకాళ్లపై రాసుకోవచ్చు. లేదంటే ఒకటి రెండు నిమ్మకాయలను కోసి కాటన్ గుడ్డలో కట్టాలి. నువ్వుల నూనెలో ఈ గుడ్డను ముంచి నొప్పి ఉన్న ప్రదేశంలో 5 నుండి 10 నిమిషాల పాటు ఉంచండి. ఈ రెమెడీని రోజుకు రెండుసార్లు ప్రయత్నించడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. పసుపు.. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న పసుపును కడుపుకు తీసుకోవడమే కాదు.. మోకాళ్లపై రాసుకోవడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది మోకాళ్ల నొప్పుల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. అర టీస్పూన్ తురిమిన అల్లంలో అర టీస్పూన్ పసుపు వేసి నీటిలో వేసి 10 నిమిషాలు ఉడికించాలి. ఈ టీలో కొంచెం తేనె కలుపుకుని రోజుకు రెండుసార్లు తాగాలి. నొప్పి తగ్గడం గమనించవచ్చు. పసుపు పాలు కూడా తాగవచ్చు. పసుపులో ఆవాల నూనెను కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ను మోకాళ్లపై అప్లై చేయవచ్చు. తులసి టీ.. తులసిని ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తారు. కొన్ని తులసి ఆకులను నీటిలో వేసి 10 నిమిషాలు ఉడికించాలి. ఈ టీని రోజూ 2 నుంచి 3 సార్లు తాగడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆముదము.. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు ఆముదం కూడా ఉపయోగపడుతుంది. 2 నుంచి 3 చెంచాల ఆముదం తీసుకుని కాస్త వేడి చేసి మోకాళ్లకు పట్టించాలి. ఈ నూనెతో లైట్ మసాజ్ చేయడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. *రూపశ్రీ.
read moreబరువు తగ్గడానికి, శరీరంలో కొవ్వు తగ్గడానికి మధ్య తేడాలు తెలుసా?
ఫిట్నెస్ గురించి మాట్లాడే చాలామంది బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్న వారై ఉంటారు. వీరు బరువు తగ్గడం, తీసుకునే ఆహారం గురించి తరచుగా చర్చిస్తూ ఉంటారు. కొందరు పొట్ట తగ్గడానికి, మరికొందరు బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ చాలా అరుదుగా శరీరంలో కొవ్వు తగ్గించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ఇలా బరువు తగ్గడం, శరీరంలో కొవ్వు తగ్గించుకోవడం వేర్వేరు విషయాలని. శరీరంలో కొవ్వు తగ్గడం వల్ల శరీరం ఫిట్ గా మారుతుంది. కానీ బరువు తగ్గడం అనేది శరీరంలో కండరాలకు అస్సలు మంచిది కాదు. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసుకుంటే.. కొవ్వు తగ్గడం అంటే శరీరంలో నిల్వ ఉండే అదనపు కొవ్వును తగ్గించడం. కొవ్వు కండరాల చుట్టూ పొర రూపంలో పేరుకుపోతుంది. దానిని తగ్గించడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. కానీ కండరాల నష్టం అంటే కండరాలు తగ్గుతాయి. మన శరీర బలం, స్థిరత్వం కాపాడుకోవడంలో కండరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందుకే కండరాలకు నష్టం కలిగితే అది ఆరోగ్యానికి మంచిది కాదు. బరువు తగ్గడం అంటే కొవ్వు తగ్గడం. కొవ్వును తగ్గించడానికి కేలరీల తీసుకోవడం తగ్గించాలి. శరీరంలో కొవ్వును కోల్పోతే కండరాలు అవసరమైన కేలరీలను పొందలేకపోవచ్చు. కొవ్వు తగ్గడం, కండరాలు పెరగడం ఒకేసారి జరుగుతుందా అనే సందేహం ప్రజల్లో ఉంటుంది. బరువు తగ్గడం కోసం క్యాలరీలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే శరీరంలో క్యాలరీల లోటు ఏర్పడి శరీరానికి అవసరమైన శక్తి అందనప్పుడు, కండరాలను పనితీరు పెరిగి శరీరానికి శక్తి లభిస్తుంది. దీని కారణంగా కండరాల నష్టం ఏర్పడుతుంది. కండరాల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు తీసుకుంటూ శరీరంలో ఉన్న అదనపు కొవ్వును తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల కండరాలు బలంగా ఉంటూనే శరీరంలో ఉన్న అదనపు కొవ్వు తగ్గి బరువు తగ్గడం జరుగుతుంది. కాబట్టి బరువు తగ్గాలా? లేదా శరీరంలో కొవ్వు తగ్గించుకోవాలా? అనే విషయాన్ని శరీర స్థితిని బట్టి నిర్ణయించుకోవాలి. *రూపశ్రీ.
read moreఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి కలిపిన వేడి నీరు తాగితే.. !
ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు . ఆరోగ్యం బాగుండటం కోసం చాలామంది ఉదయాన్ని ఒక మంచి ఆహారపు అలవాటుతో ప్రారంభిస్తారు. కొందరు నిమ్మరసం, తేనె తాగుతారు. మరికొందరు గ్రీన్ టీ తాగుతారు. ఇంకొందరు ఇతర ఆరోగ్యకర ఎంపికల వైపు వెళతారు. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నెయ్యి కలుపుని తాగడం చాలా అధ్బుతాలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గోరు వెచ్చని నీటిలో నెయ్యి వేసుకుని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే.. నెయ్యి నీరు ఎలా తయారుచేసుకోవాలి అంటే.. స్వచ్చమైన ఆవు నెయ్యిని కొద్దిగా వేడి చేయాలి. ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తీసుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. ప్రయోజనాలేంటంటే.. నెయ్యిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. సహజమైన మాయిశ్చరైజింగ్ గుణాలు నెయ్యిలో ఉన్నాయి. ఇవి చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తాయి. ఆవు నెయ్యి ఫ్రీ సెల్స్ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. ఈ కారణంగా ఇది ధమనులు గట్టిపడకుండా చేస్తుంది. నెయ్యి మెదడును లోపల నుండి బలోపేతం చేయడంలో, జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మార్కెట్లో దొరికే నెయ్యి కంటే ఇంట్లో తయారుచేసుకుని లేదా ఇంట్లోనే తయారుచేసి అమ్మేవారి దగ్గర నెయ్యి కొనుక్కుని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దేశీ నెయ్యి వాడటం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోయి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగిపోతాయి. నీళ్లలో నెయ్యి కలుపుకుని తాగడం వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుంది. నెయ్యి ఎముకలను బలోపేతం చేయడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. పేగు ఆరోగ్యానికి కూడా మంచిది. నెయ్యి శరీరంలో జీర్ణక్రియ ఎంజైమ్‌లను పెంచుతుంది. *రూపశ్రీ.
read moreఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటే ఏం జరుగుతుందో తెలుసా?
భారతీయులు చాలా వంటకాలలో ఎక్కువగా వినియోగించే పదార్థాలలో వెల్లుల్లి ఒకటి. ప్రతి వంటిట్లో వెల్లుల్లి తప్పనిసరిగా ఉంటుంది. వెల్లుల్లి వంటకు రుచిని, సువాసనను మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తుంది. రోగనిరోధక శక్తి పెరగాలంటే వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటే అద్భుత లాభాలు ఉంటాయని వైద్యులు అంటున్నారు. వెల్లుల్లిలో కార్బోహైడ్రేట్లు, కాపర్, ఫాస్పరస్, డైటరీ ఫైబర్, ప్రొటీన్, పొటాషియం, ఐరన్, విటమిన్ సి, బి6, మాంగనీస్, క్యాల్షియం, సెలీనియం, ఫైబర్ మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో 2 నుండి 3 వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే.. ఇన్ఫ్లమేటరీ డిజార్డర్లను తొలగించడంలో వెల్లుల్లి చాలా మేలు చేస్తుంది. దీన్ని ఒక్కటి తింటే చాలు రోగనిరోధక శక్తి బలంగా మారుతుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెల్లుల్లి తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తం గడ్డకట్టడాన్ని కూడా నిరోధిస్తుంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. జీర్ణ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇది యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉన్నందువల్ల జీర్ణశయాంతర వ్యాధులను తగ్గిస్తుంది. పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల కడుపులోని నులిపురుగులు మూత్రం, మలం సహాయంతో బయటకు వెళ్లిపోతాయి. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే.. ఇది చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. పేగులోని మంచి బ్యాక్టీరియాను రక్షిస్తుంది. పచ్చి వెల్లుల్లి రోజూ తినడం వల్ల లాభాలే కాదు.. నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. వెల్లుల్లి ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) లేదా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ (GERD)తో బాధపడుతున్న వ్యక్తులకు జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి వైద్యుల సలహా లేకుండా జీర్ణ సమస్యలు, ప్రేగు వ్యాధులు ఉన్నవారు తినకూడదు. వెల్లుల్లిలో ఫ్రక్టాన్లు ఉంటాయి. ఇది ఒక రకమైన కార్బోహైడ్రేట్, ఇది ప్రకోప ప్రేగు సిండ్రోమ్ ఉన్నవారిలో గ్యాస్, ఉబ్బరం సమస్యలు కలిగిస్తుంది. *రూపశ్రీ.
read moreదోసకాయ నీరు ఇలా తాగితే ఎంత ఈజీగా బరువు తగ్గచ్చో..!
దోసకాయ చాలామందికి ఇష్టమైన కూరగాయ. దీన్ని నేరుగా తినేసేవారు కొందరైతే.. ఉప్పు కారం చల్లుకుని, కాస్త మసాలా జోడించి స్పైసీగా తినేవారు మరికొందరు. జ్యూస్ చేసుకుని తాగేవారు ఇంకొందరు. చాలామంది ఆరోగ్య స్పృహతో డిటాక్స్ వాటర్ తయారుచేసుకుని తాగుతుంటారు. అందులో తప్పనిసరిగా కీరదోసకాయను చేర్చుతారు. అటు నోటికి రుచిని ఇస్తూ, ఇటు ఆకలి తీరుస్తూ.. మొత్తం మీద బరువు తగ్గడంలో మ్యాజిక్ చేసే కీర దోసకాయను నీటిలో వేసి ఆ తరువాత ఆ నీటిని తాగడం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయని డైటీషియన్లు అంటున్నారు. ఇంతకీ ఈ కీర దోసకాయ కథ ఏంటో పూర్తీగా తెలుసుకుంటే.. కీర దోసకాయ కూలింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది శరీరాన్ని చాలా బాగా చల్లబరుస్తుంది. శరీరంలో తేమ శాతాన్ని నిలిపి ఉంచుతుంది. అయితే కీర దోసకాయను ముక్కలుగా చేసి దాదాపు లీటరుకు పైగా నీటిలో వేయాలి. ఈ నీరు ఇంకా బాగా రుచిగా ఉండటం కోసం ఇందులో పుదీనా ఆకులు, నిమ్మకాయ ముక్కలు, అల్లం వేసుకోవచ్చు. ఒక జార్ లో ఇవన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టి ఉంచాలి. దీన్ని 1-2 గంటల పాటూ అలాగే కదపకుండా ఉంచాలి. ఆ తరువాత ఈ నీటిని తాగవచ్చు. లాభాలేంటంటే.. చర్మం పొడిబారడం, శరీరంలో మంట, మైకము వంటివి శరీరంలో నీటి కొరత ఏర్పడటం వల్ల సంభవించే సమస్యలు. ఈ దుష్ప్రభావాలను తగ్గించడానికి సాధారణ సమయాల్లో అయినా, వేసవి వేడి సమయంలో అయినా ఈ నీటిని తీసుకోవడం ఉత్తమం. దోసకాయ నీటిలో జోడించే ఇతర పదార్థాల వల్ల ఇది అదనపు రుచితో ఉల్లాసంగా ఉంచుతుంది. దోసకాయలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. కీర దోస నీటిలో ఉండే ఫైబర్లు, ఎంజైమ్ ల కారణంగా చర్మం ఆరోగ్యంగా మారుతుంది. ఇది సెల్యులార్ స్థాయిలో చర్మం పొరలను క్లియర్ చేస్తుంది. చర్మాన్ని మెరుగుపరుస్తుంది. దోసకాయల్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ ఎ, విటమిన్ కె ఉంటాయి. ఇవన్నీ సహజ యాంటీఆక్సిడెంట్లు. కణాలకు ఆక్సీకరణ నష్టం జరగకుండా ఇవి సహాయపడతాయి. దోసకాయలో చక్కెరలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు పెరగడానికి దోహదం చేయదు. పైపెచ్చు వాటిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది, అతిగా తినడాన్ని నిరోధిస్తుంది. *రూపశ్రీ.
read moreనిలబడి నీళ్లు తాగకూడదా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..!
సకల జీవులకు నీరే ప్రాణాధారం. మానవ శరీరంలో దాదాపు 70శాతం నీరు ఉంటుంది. మనిషి జీవితం చాలా వరకు నీటి మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రతి రోజూ 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తీసుకోవాలని అంటుంటారు. కానీ నీరు తాగే విధానంలోనే దాని వల్ల కలిగే ప్రయోజనాలు కూడా ఉంటాయి. కొందరు నీటిని నిలబడుకుని తాగుతారు. మరికొందరు చాలా వేగంగా ఒక్కసారే నీటిని తాగుతారు. ఇంకొందరు మెల్లిగా నీటిని తాగుతారు. అయితే నీరు ఎలా తాగితే మంచిది? ఎలా తాగకూడదు? వైద్యులు చెబుతున్న విషయాల వైపు ఓ లుక్కేస్తే.. నిలబడి నీళ్లు తాగడం వల్ల జరిగేది ఇదీ.. నిలబడి నీళ్లు తాగడం వల్ల కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉంటే మాత్రం అస్సలు నిలబడి నీళ్లు తాగకూడదు. కీళ్లనొప్పులు ఉన్నవారు ఎప్పుడూ నిలబడి నీళ్లు తాగకూడదు. అలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు పెరుగుతాయి. నిలబడి నీరు త్రాగడం వల్ల శరీరంలో ద్రవం పెరుగుతుంది. ఇది కీళ్ల నొప్పులను పెంచుతుంది. నిలబడి నీరు తాగడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. నిలబడి నీరు త్రాగడం జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. నిలబడి నీళ్లు తాగడం వల్ల ఆ నీరు త్వరగా పొట్టలోకి చేరి శరీరం కింది భాగంలో గాయం అవుతుంది. నీరు త్రాగడానికి సరైన మార్గం.. నీరు తాగేటప్పుడు హాయిగా కూర్చొని తాగాలని వైద్యులు చెప్తున్నారు. ఒక్కసారిగా నీళ్లు తాగే బదులు చిన్న చిన్న గుక్కలుగా తాగాలి. నెమ్మదిగా నీటిని తాగడం ద్వారా శరీరం ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుంది. శరీరానికి అవసరమైన అన్ని ఖనిజాలు అందుతాయి. అంతేకాదు చిన్న గుక్కలుగా నీరు తాగేటప్పుడు నీటిలో లాలాజలం కలిసి జీర్ణక్రియ పెరగడంలో సహాయపడుతుంది. *రూపశ్రీ.
read moreసైనస్ సమస్యను దారుణంగా పెంచే నాలుగు కామన్ మిస్టేక్స్ ఇవే..!
సైనస్ ఇన్ఫెక్షన్లు ఫ్లూ, జలుబు వంటి అంతర్లీన అనారోగ్యాల ద్వారా తరచుగా వస్తుంటాయి. ఇవి సాధారణంగా ఒక వారం లేదా అంతకుముందే తగ్గిపోయినప్పటికీ కొంతమందికి సైనస్ సమస్యలు చాలారోజుల పాటూ ఉంటాయి. ఇలా ఉంటే దీర్ఘకాలిక సైనసైటిస్ ఉందని అర్థం. ఇలాంటి పరిస్థితి ఉంటే మాత్రం సైనస్ నిపుణుడిని తక్షణమే సంప్రదించడం అత్యవసరం. సైనస్ సమస్య ఉన్నవారిలో ఈ సమస్యను మరింత దారుణంగా మార్చే సాధారణ మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుని వాటికి తగిన చర్యలు తీసుకోవడం వల్ల సైనస్ సమస్య ప్రభావాన్నిచాలా వరకు తగ్గించవచ్చు. సైనస్ ఇన్ఫెక్షన్లను తీవ్రతరం చేసే సాధారణ తప్పులు.. హ్యూమిడిఫైయర్ ఉపయోగించకపోవడం.. గాలి పొడిగా మారినప్పుడు చలి కాలంలో సైనస్ ఇన్ఫెక్షన్లు ఎక్కువ అవుతాయి. శీతాకాలపు చలి, పొడి పరిస్థితులు చర్మాన్ని ప్రభావితం చేయడమే కాకుండా నాసికా రంధ్రాలు పొడిబారడానికి దారితీస్తుంది. దీనిని పరిష్కరించడానికి గాలికి తేమను జోడించడం అవసరం. దీనికోసం హ్యూమిడిఫైయర్ లేదా ఆవిరి పట్టడం వంటివి చేయాలి. ఇది సైనస్‌లు ఎక్కువ పొడిగా, చికాకుగా మారకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. నాసల్ స్ప్రే ఎక్కువ వినియోగించడం.. చాలామంది మూసుకుపోయిన ముక్కులనుండి ఉపశమనం పొందడానికి నాసల్ స్ప్రేలు ఉపయోగిస్తారు. ఇవి సైనస్ ఇన్ఫెక్షన్ ఒత్తిడి నుండి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తాయి. ఎక్కువరోజులు అవగాహన లేకుండా తక్షణమే రిలీఫ్ లభిస్తోంది కదా అని వాటిని ఎక్కువ ఉపయోగిస్తే.. ప్రతికూల ప్రభావాలు తప్పవు. ఈ స్ప్రేలలోని ప్రధాన రసాయనం సైనస్ ఇన్ఫెక్షన్లను మరింత తీవ్రతరం చేయడానికి దోహదం చేస్తుంది. సైనస్ ఇన్ఫెక్షన్ ఒక వారం దాటితే దాన్ని తగ్గించుకోవడానికి ENT నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. నిద్ర లేకపోవడం.. పుష్కలమైన నిద్ర మొత్తం శరీర ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ముఖ్యంగా సైనస్ ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడుతున్నప్పుడు కనీసం ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్కి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో సపోర్ట్ ఇస్తుంది. అంతేకాకుండా పగటిపూట విశ్రాంతి తీసుకోవడం, శక్తిని ఆదా చేయడం సైనస్ ఇన్ఫెక్షన్ల నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. హైడ్రేటెడ్ గా ఉండకపోవడం.. సైనస్ ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడేటప్పుడు బాగా హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శ్లేష్మం ఉత్పత్తికి తోడ్పడుతుంది. శ్లేష్మం సన్నగా, సులభంగా బయటకు వెళ్లేలా చేయడంలో సహాయపడుతుంది. సైనస్ ఇన్ఫెక్షన్ సమయంలో సరైన ఆర్ద్రీకరణ రద్దీని తగ్గించడానికి, మెరుగైన శ్వాసను సులభతరం చేయడానికి దోహదం చేస్తుంది. *నిశ్శబ్ద.
read moreనల్ల ఉప్పు నీటిని ఖాళీ కడుపుతో తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
ఉప్పు వంటకు రుచిని ఇస్తుంది. ఉప్పు లేని వంట ఎవరూ తినలేరు కూడా. ఉప్పులో చాలా రకాలున్నాయి. వాటిలో రాతి ఉప్పు, సాధారణ ఉప్పు మాత్రమే కాకుండా కొన్ని రకాల స్నాక్స్ లోనూ, వంటలలోనూ ప్రత్యేకంగా నల్ల ఉప్పును వాడుతుంటారు. బ్లాక్ సాల్ట్ అని పిలుచుకునే ఈ నల్ల ఉప్పును నీటిలో కలిపి ప్రతి రోజూ ఉదయమే ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలుంటాయని అంటున్నారు. నల్ల ఉప్పును, నల్ల ఉప్పు నీటిని ఆరోగ్య ప్రయోజనాల కోసం.. ఆయుర్వేదంలో చాలా ఏళ్ల నుండి ఉపయోగిస్తున్నారు. నల్ల ఉప్పులో సోడియం క్లోరైడ్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. నల్ల ఉప్పు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే ఏం జరుగుతుందంటే.. నల్ల ఉప్పు నీరు కాలేయాన్ని శుధి చేయడంలో సహాయపడుతుంది. ఈ ఉప్పు ప్రత్యేకత ఏమిటంటే ఇది కాలేయ కణాలలో పేరుకుపోయిన మురికిని బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది మాత్రమే కాకుండా కాలేయం పనితీరును వేగవంతం చేస్తుంది. కాలేయానికి పొంచి ఉండే ఇతర వ్యాధులను నివారిస్తుంది. కేవలం కాలేయాన్ని మాత్రమే కాదు.. నల్ల ఉప్పు నీరు తాగితే శరీరం కుడా శుద్ది అవుతుంది. శరీరంలో ఉండే టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. చర్మ సంబంధ సమస్యలను తగ్గించడంలో నల్ల ఉప్పు నీరు చాలా సహాయపడుతుంది. రక్తాన్ని శుద్ది చేస్తుంది. చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నల్ల ఉప్పు నీరు తాగడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. మలబద్దకాన్ని తగ్గించడం ద్వారా ఫైల్స్ సమస్య కూడా తగ్గుతుంది. ఒకే రకమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది ఎసిడిటీ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే నల్ల ఉప్పు నీటిలో ఆల్కలీన్ స్వభావం ఉంటుంది. ఇది ఎసిడిటీని తగ్గించడంలో.. కడుపులో ఆమ్లాలను తటస్థం చేయడంలో సహాయపడుతుంది. గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ నుండి ఉపశమం కలిగిస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నల్ల ఉప్పు, కాసింత నిమ్మరసం కలిపి తీసుకుంటే ఎసిడిటీ సమస్య మరింత తొందరగా తగ్గుతుంది. జీవక్రియ కూడా బాగుంటుంది. *రూపశ్రీ.
read moreఫ్యాటీ లివర్ కు ఈ మొక్కలు మ్యాజిక్ లా పనిచేస్తాయి..!
మన చుట్టూ చాలా మొక్కలు ఉంటాయి. చాలా వరకు మొక్కల పేర్లు కూడా చాలామందికి తెలియవు, కానీ ఆయర్వేద పరంగా చూసినప్పుడు ప్రతి మొక్క ఆద్బుతం అనిపిస్తుంది. అలాంటి మొక్కలలో నేల ఉసిరి కూడా ఒకటి. ఉసిరి చెట్టు ఆకులను పోలి ఉండి నేలమీద పెరిగే ఈ నేల ఉసిరి మొక్క ఫ్యాటీ లివర్ సమస్యలకు అధ్భుతంగా పనిచేస్తుంది. అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారికి నేల ఉసిరి ఎలా పని చేస్తుంది? తెలుసుకుంటే.. ఫ్యాటీ లివర్ లో రెండు రకాలు ఉన్నాయి. మొదటిది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఇది అధికంగా తాగడం వల్ల వస్తుంది. రెండవది ఆల్కహాలిక్ లేని ఫ్యాటీ లివర్. ఇది జీవనశైలి, జన్యుశాస్త్రం, తినడం, త్రాగడంలో అజాగ్రత్త లేదా కొన్ని ఔషధాల దుష్ప్రభావాల వల్ల కూడా వస్తుంది. ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ పెద్ద వ్యాధిగా రూపాంతరం చెందుతోంది. వైద్యుల ప్రకారం 10 మందిలో 6-7 మందికి ఫ్యాటీ లివర్ సమస్య ఉండవచ్చు. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేయడం చాలా ప్రమాదకరమని వైద్యులు కూడా చెబుతున్నారు. ఇది ఎక్కువగా పెరిగితే లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాలేయం సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో ఉండే కొవ్వు, ప్రోటీన్ చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీన్ని LDL లేదా తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ అంటారు. ఈ చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా వేగంగా పెరుగుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారిలో కడుపు కుడి ఎగువ భాగంలో నొప్పి ఉంటుంది. బరువు తగ్గడం, బలహీనంగా అనిపించడం, కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారడం, ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, ఎసిడిటీ లేదా పొట్టలో ఉబ్బరం.. ఇవన్నీ ఫ్యాటీ లివర్ వ్యాధికి సంకేతాలు. నేల ఉసిరి ఎలా పనిచేస్తుందంటే.. నేల ఉసిరి ఒక ఆయుర్వేద ఔషధం. దీని పండ్లు సరిగ్గా ఉసిరి లాగా ఉంటాయి. అలాగే దీని ఆకులు కూడా ఉసిరి చెట్టు ఆకులను పోలి ఉంటాయి. కానీ ఇది చాలా చిన్న మొక్క. అందుకే దీనిని నేల ఉసిరి అంటారు. నేల ఉసిరి మాత్రలు అందుబాటులో ఉంటాయి. ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు వీటిని తీసుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్ సహజంగా నయమవుతుంది. ఇది మాత్రమే కాకుండా పునర్నవ లేదా తెల్ల గలిజేరు కూడా ఫ్యాటీ లివర్ తగ్గిస్తుంది. పునర్నవలో పునరుత్పత్తి అంటే కొత్త కణాలను తయారు చేసే గుణం ఉంది. ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. భోజనం చేసే ముందు పునర్నవ రసం తీసుకోవడం వల్ల గ్యాస్ ఏర్పడదు, అలాగే ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. పునర్నవలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి కాలేయ సంబంధిత వ్యాధులను నయం చేస్తాయి. *రూపశ్రీ.
read moreమామిడి కాయలతోనే కాదు.. మామిడి విత్తనాలు తిన్నా ఆరోగ్యమే..!
పండ్ల రారాజు మామిడి గురించి ఎంత చెప్పినా తక్కువే. రుచిలోనూ, ఆరోగ్యాన్ని చేకూర్చడంలోనూ మామిడికి తిరుగులేదు. అయితే అందరూ మామిడి కాయను తిని అందులో ఉండే విత్తనాలు పడేస్తుంటారు. అయితే మామిడి కాయతోనే కాదండోయ్.. మామిడి విత్తనాలు తిన్నా ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయట. ఇంతకీ మామిడి విత్తనాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో.. వీటిని ఆహారంలో ఎలా తీసుకోవచ్చో తెలుసుకుంటే.. ప్రయోజనాలు.. మామిడి గింజలు ఫినోలిక్ సమ్మేళనాలుగా పిలువబడే యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవటానికి, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి కూడా దోహదం చేస్తాయి. మామిడి గింజలలో విటమిన్ సి తో పాటూ ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి బలమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తాయి. ఆహారంలో మామిడి గింజలను చేర్చుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లను దూరం చేయడంలో, ముఖ్యంగా ఫ్లూ సీజన్లో అనారోగ్యాలను దూరం చేసుకోవడంలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు ఫైబర్ చాలా అవసరం. మామిడి గింజలలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మామిడి గింజలను తీసుకోవడం వల్ల సాధారణ ప్రేగు కదలికలు మెరుగవుతాయి. మలబద్ధకాన్ని నివారించవచ్చు. ఇది మొత్తం జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మామిడి గింజలలో ఉండే సమ్మేళనాలు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆహారంలో మామిడి గింజలను చేర్చడం ద్వారా, మీరు ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను మెయింటైన్ చేయవచ్చు. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ మామిడి గింజలు బరువు నిర్వహణలో సహాయపడతాయి. వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్ ఎక్కువ కాలం కడుపు నిండిన ఫీల్ ఇస్తుంది. అతిగా తినే పరిస్థితిని తగ్గిస్తుంది. అంతేకాదు ఇవి జీవక్రియను పెంచడంలో సహాయపడే కొన్ని సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఎలా తినవచ్చంటే.. మామిడి గింజలను స్మూతీస్ లోనూ, రోస్ట్ లలోనూ, స్నాక్స్ లలోనూ తీసుకోవచ్చు. అంతేకాదు మామిడి గింజలను ఉడికించి టీలా కూడా తీసుకోవచ్చు. మామిడి గింజలను పొడి చేసి వాటిని రోటీలు, కేకులు, బ్రెడ్ వంటి వాటి తయారీలోనూ వినియోగించవచ్చు. కూరలు చిక్కదనం రావడానికి. సూపుల చిక్కదనం కోసం కూడా మామిడి గింజలను ఉపయోగించవచ్చు. మరొక విషయం ఏమిటంటే.. మామిడి గింజలలో బయోటిన్ సమృద్దిగా ఉంటుంది. ఇది చర్మం, జుట్టు ఆరోగ్యానికి చాలా గొప్పగా సహాయపడుతుంది. *రూపశ్రీ.
read moreడెంగ్యూలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గితే, ఈ 5 ఆహారాలను తినండి..!!
దేశంలోని పలు ప్రాంతాల్లో డెంగ్యూ జ్వరం ముప్పు విస్తరిస్తోంది. డెంగ్యూలో, రక్తంలో ప్లేట్లెట్స్ లోపం ఉంటుంది. దీని కారణంగా బలహీనత ఏర్పడుతుంది. ప్లేట్లెట్ కౌంట్ చాలా తగ్గితే, అది రోగి మరణానికి కూడా దారి తీస్తుంది. ఈ రోజుల్లో డెంగ్యూ ప్రమాదం ఎక్కువగా ఉంది. అటువంటి పరిస్థితిలో, రోగి యొక్క ప్లేట్లెట్ కౌంట్ తగ్గకుండా, దానిని పెంచడానికి ఆహారంలో కొన్ని అంశాలను చేర్చాలి. రక్తంలో ప్లేట్‌లెట్స్‌ను వేగంగా పెంచే ఆహారం (Foods that Increase Platelet Count) వంటి గురించి తెలుసుకుందాం. కివి: విటమిన్ సి తీసుకోవడం వల్ల రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ వేగంగా పెరుగుతుంది. ప్లేట్లెట్లను పెంచుకోవడానికి కివి మంచి ఆహారం అని ఆరోగ్య నిపుణులు కూడా నమ్ముతున్నారు. దీనితో పాటు, మీరు నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి పుల్లని పండ్లను తినవచ్చు. ఇది వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుంది. మేక పాలు: ప్లేట్లెట్లను పెంచడానికి మేక పాలు ఔషధంలా పనిచేస్తాయి. రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య గణనీయంగా తగ్గినట్లయితే...మీరు మేక పాలు తాగవచ్చు. పచ్చి, తాజా పాలు తాగడం మంచిది. వీటితో పాటు పాల ఉత్పత్తులు కూడా మేలు చేస్తాయి. కొబ్బరి నీరు: కొబ్బరి నీరు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ప్లేట్లెట్లను పెంచడంలో కూడా మేలు చేస్తుంది. డెంగ్యూలో వాంతులు కావడం వల్ల డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉందని..దీనిని కొబ్బరి నీళ్లతో నివారించవచ్చు. ఇది రక్త కణాలకు, హిమోగ్లోబిన్‌కు కూడా మంచిది. బొప్పాయి ఆకు రసం: తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. డెంగ్యూ వ్యాధిగ్రస్తులు బొప్పాయి తినాలని సూచించారు. దీనితో పాటు బొప్పాయి ఆకులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని ఉడికించి రసం తీసి తాగితే ప్లేట్లెట్స్ పెరుగుతాయి. గిలోయ్: గిలోయ్ జ్యూస్ రక్తంలో తగ్గిన ప్లేట్లెట్ కౌంట్‌ను కూడా వేగంగా పెంచుతుంది. వీటన్నింటితో పాటు క్యారెట్, బీట్రూట్, గుమ్మడికాయ రసం కూడా డెంగ్యూ రోగులకు మేలు చేస్తాయి.
read moreఈ ఆహారాలు తింటే చాలు.. గుండె ఆరోగ్యం పదిలం..
గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కాలక్రమేణా పెరుగుతోంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఈ వ్యాధి వృద్ధాప్య సమస్యగా పిలువబడింది. కానీ ఇప్పుడు యువకులు కూడా దీని బారిన పడుతున్నారు. 10 ఏళ్లలోపు పిల్లల్లో కూడా గుండెపోటు, గుండె ఆగిపోవడం వంటి సమస్యలు నిర్ధారణ అవుతున్నాయి. ఇలాంటి ప్రమాదాల దృష్ట్యా, అందరూ అప్రమత్తంగా ఉండాలని గుండె జబ్బులు నివారించడానికి నిరంతరం కృషి చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మరణానికి ప్రధాన ప్రమాద కారకాల్లో గుండె జబ్బు ఒకటి, ప్రతి సంవత్సరం మిలియన్ల మంది మరణాలకు ఇది కారణమవుతుంది. ప్రతి సంవత్సరం హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాల గురించి ప్రపంచ ప్రజలను అప్రమత్తం చేయడం, నివారణ పద్ధతుల గురించి వారికి అవగాహన కల్పించడం కోసం వరల్డ్ హార్ట్ డే ను సెప్టెంబర్ 29న జరుపుకుంటారు. జీవనశైలి, ఆహారంలో అవాంతరాల వల్ల ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం బాగా పెరిగిందని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. అయితే రోజువారీ కింద చెప్పుకునే ఆహారాలు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడతాయని పరిశోధకులు తెలిపారు. అవోకాడో .. అవకాడో గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన పండ్లలో ఒకటి. ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రతి వారం కనీసం రెండు అవోకాడోలు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 16%, కరోనరీ హార్ట్ డిసీజ్ ముప్పు 21% తగ్గుతుంది. అవకాడోలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియకు కూడా చాలా మేలు చేస్తుంది. ఆకు పచ్చని కూరగాయలు.. ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరానికి రోజూ అవసరం. ఆకుపచ్చ ఆకుకూరలు, బీన్స్ వంటి కూరగాయలను తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఆకుపచ్చ కూరగాయలు విటమిన్ల మూలం, ఇది ధమనులను రక్షించడంలో, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. నట్స్.. రోజువారీ ఆహారంలో అనేక రకాల గింజలను చేర్చుకునే వ్యక్తులలో గుండె జబ్బుల ముప్పు తక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా వాల్ నట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇది ఫైబర్, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్ వంటి సూక్ష్మపోషకాల మూలం. ఇది మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. వాల్నట్లు గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకం అయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. డార్క్ చాక్లెట్.. డార్క్ చాక్లెట్ వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా వినే ఉంటారు. ఇందులో ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో చాలా మేలు చేస్తాయి. మితంగా చాక్లెట్ తీసుకోవడం వల్ల కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని అధ్యయనాలు కనుగొన్నాయి. అధిక రక్తపోటు సమస్యను తగ్గించడంలో డార్క్ చాక్లెట్ తినడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. *నిశ్శబ్ద.
read more