Previous Page Next Page 
తెల్ల గులాబి  పేజి 18

    మంచం చివర తలవంచుకొని కూర్చున్న ప్రఖ్య వైపు చూశాడు.
    మౌనంగా కూర్చొంది. కనీసం అతని వైపు కూడా చూడటం లేదు.
    ప్రఖ్యకి ఏమీ అనిపించడం లేదా? ఇన్నాళ్ళూ తను కూడా కావాలనుకుంటేనే కదా ఇద్దరూ ఎంజాయ్ చేశాం. ఇప్పుడెం మాట్లాడదేం? ఇందులో ఆదిత్య తప్పే కాదు. నాదీ ఉంది అని చెప్పదేం? అడిత్యని ప్రేమిస్తున్నాను. మేం పెళ్ళి చేసుకుంటాం అని డిక్లేర్ చేయదెం?    
    "ప్రఖ్యా " గట్టిగా పిలిచాడు.
    గాభాల్న తలేట్టింది ప్రఖ్య. ఆ కళ్ళల్లో స్పష్టంగా భయం కనిపిస్తోంది.
    "ఎన్నిసార్లు చెప్పాల్రా నీకు బైట కెళ్ళమని మీ అమ్మ పంపించిందా నిన్ను ఇంటిమీద కెళ్ళి గొడవ చేయమని."    
    "మా అమ్మనేం అనకండి. మధ్యలో తనేం చేసింది?" కోపంగా అన్నాడు.
    "ఓ రోషం పొడుచుకోస్తోందే" వెటకారంగా అంది భాను.
    ఆవిడ మాటలు విననట్లు స్థిరంగా అన్నాడు ఆదిత్య "ప్రఖ్యా! మనం కావాలనుకున్నాం. ఎంజాయ్ చేశాం. నేనేం పారిపోలేదు కదా నీ ఎదురుగానే ఉన్నా కదా! మనం పెళ్ళి చేసుకుందాం. నువ్వైనా మీ అమ్మకి నచ్చ చెప్పు. మళ్ళీ కలుస్తాను. ఆలోచించు" అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
    భానుప్రియ నిప్పులు కురుస్తున్న కళ్ళతో చూస్తూ అంది. "వాడన్నది నిజమేనా...? నువ్వే ప్రోవోక్ చేశావా...? చెప్పవే నీకెందు కొచ్చింది పాడు బుద్ది బుద్దిగా చదువుకుంటారని చనువిచ్చి చాలా తప్పు చేశాను..."
    ప్రఖ్య మాట్లాడలేదు.
    "ఛ .. తప్పు నాది.... నిన్ను నమ్మి పరాయి వాడితో ఒంటరిగా వదిలేశాను. నువ్వింత వీక్ మైండని అనుకోలేదు."
    ప్రఖ్య నెమ్మదిగా అంది. "నేను ఆదిత్యను మ్యారేజ్ చేసుకుంటాను మమ్మీ."    
    "చంపేస్తాను..." గర్జించింది భానుప్రియ. "నేను ఆశపడిందేంటి? జరిగేదేంట్? ఇంకా జీవితంలోకే అడుగు పెట్టలేదు. అప్పుడే పెళ్ళి కావాలా? అప్పుడే పెళ్ళి పిల్లలు అని అఘోరోస్తే నీ జీవితం పాతికేళ్ళకే ఎండ్ అయిపోతుంది. అర్ధమైందా? చదువుకుని, మంచి హోదా సంపాదించుకుని మంచివాడిని నీకు తగినవాడిని పెళ్ళి చేసుకుని జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలి. అంతేకాని ఇలా కక్కుర్తి పడితే ఇంతే! అయిందేదో అయింది. నేనేం చెబితే అది చేయి . పిచ్చి వేషాలేసావంటే పళ్ళు రాలగొడతాను వెళ్ళు.. వెళ్లి చదువుకో...."
    ప్రఖ్య మాట్లాడకుండా లోపలి కెళ్ళి దాడాల్న తలుపేసుకుని మంచం మీద వాలిపోయింది. ఆమెకి ఏడుపు రావడం లేదు. కానీ, ఏదో తెలియని భయం అవరించేసింది. నా జీవితం ఏమవ బోతోంది? అని వణికిపోయింది.
    ఆ రాత్రంతా ప్రఖ్య కి నిద్ర పట్టలేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో, భయంతో వణికి పోతూ గడిపింది.
    మర్నాడు అనుకున్న టైం కి ప్రఖ్య ని తీసుకుని క్లినిక్ కి వెళ్ళింది భాను.
    డాక్టర్ ప్రవీణ ప్రఖ్య ని తీసుకొని రూమ్ లోకి వెళ్ళిపోయింది.
    భాను టెన్షన్ అణచుకుంటూ కూర్చుంది. అబార్షన్ అయిపోగానే ప్లాట్ వెకేట్ చేసేయాలి అని నిశ్చయించుకుంది.
    డాక్టర్ పరీక్ష చేస్తూ నెమ్మదిగా అడిగింది "ఎమ్మా మీ అమ్మ అబార్షన్ అంటున్నారు. నీ అభిప్రాయం ఏంటీ? హాయిగా ఆ అబ్బాయిని పెళ్ళి చేసుకోవచ్చు కదా!"
    "అప్పుడేనా పెళ్లి .... నేనింకా చదువుకోవాలి..."
    "తరువాత చదువుకోవచ్చు కదా..."
    'అమ్మో! అమ్మ ఒప్పుకోదు...."
    "అమ్మ ఒప్పుకుంటే చేసుకుంటావా?"
    "ఒప్పుకోదు", స్థిరంగా అంది.
    "ఒకవేళ ఒప్పుకుంటే...."
    ప్రఖ్య ఆలోచించింది. ఒక పక్క నుంచి ఆదిత్య కావాలనిపిస్తోంది. కానీ, ఇప్పటి నుంచే పెళ్ళి పిల్లలు అంటే మమ్మీ అన్నట్టు జీవితం ఆగిపోతుందేమో....?
    "అతన్ని నువ్వు ప్రేమిస్తున్నావు కదా...?'
    డాక్టర్ ప్రశ్నకి ఉలిక్కిపడింది ....ప్రేమా...! ఏమో అసలా ఆలోచనే రాలేదు. ఎంతసేపూ ఆ అనుభవం కోసం తహ , తహ లాడించే కానీ, ఆదిత్య ను ప్రేమిస్తున్నట్టు గాని , అతను కావాలన్న ఆరాటం కాని కలగలేదు.
    "ఏమోనండి నాకేం తెలియదు. బహుశా ప్రేమించడం లేదు...."    
    "అయితే అతడిని పెళ్ళి చేసుకోవా...?"
    "ఏమో , మమ్మీ ఏం చెబితే అదే చెప్తా..."
    ఒళ్ళు మండింది డాక్టర్ కి, "మీ మమ్మీ చెబితేనే ప్రెగ్నెంట్ అయ్యావా?" చిరాగ్గా అంది.
    ఆవిడలా విసుక్కోవడం తో ప్రఖ్య బిక్కమొహం పెట్టింది.
    ఆ మొహం చూసిన డాక్టర్ ప్రవీణ ఒక్కసారిగా సర్దుకుంది. తను అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నానేమో అనిపించింది.
    "సర్లే. మీ ఇష్టం నాకెందుకు...?" అంటూ స్టేత స్కోప్ తీసుకుంది.
    సుమారు పది నిమిషాల తరువాత ప్రఖ్య, డాక్టర్ ప్రవీణ బైటకి వచ్చారు. వాళ్ళ వైపు అనుమానంగా చూసింది భాను.
    ప్రఖ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా కుర్చీలో కూర్చుని టేబిల్ మీద ఉన్న జర్నల్ తీసుకొని తిరగేయసాగింది.
    భాను ముఖం చిట్లించి అడిగింది . "ఏం జరిగింది ?"
    ఎవరూ ఏమి మాట్లాడలేదు. భాను అసహనంగా వదిలింది.
    కొన్ని క్షణాల తరువాత డాక్టర్ అంది. "మీకో సజెషన్ ఇస్తాను వింటారా?"
    "ఏం చెబుతుందో అని ఆలోచిస్తూ, నెమ్మదిగా తల పంకిస్తూ చెప్పండి అంది భాను.
    "మీ అమ్మాయి చాలా వీక్ గా ఉంది. ఇప్పుడు అబార్షన్ చేయడం అంత మంచిది కాదు..."
    "అయితే తొమ్మిది నెలలు మోసి కనేయమంటారా పిల్లని మా పరువు పోతుంది..."
    "చూడండి.... తొమ్మిది నెలలు మోయనవసరం లేదు. ఏడో నెలలో సిజేరియన్ చేసి బేబీని తీస్తాం..."
    'ఆ తరువాత ఆ బేబీని ఏం చేస్తారు? అనాధని చేస్తారా? ఒక పిల్లకి జన్మనిచ్చి అనాధను చేయడం ధర్మమా? లేక అసలు జన్మనివ్వకపోవడం ధర్మమా?" సీరియస్ గా అడిగింది భాను.
    నవ్వింది డాక్టర్ ప్రవీణ....' అనాధను చేయమని నేనెందుకంటాను చెప్పండి...."
    "మరి కని ఏం చేయమంటారు..."
    "నిన్ననే నా దగ్గరకు ఒక వైఫ్ అండ్ హజ్బెండ్ వచ్చారు. వాళ్ళకి పిల్లల్లేరు. పెళ్లై ఇరవై ఏళ్ళయింది. ఆవిడ వయసు కూడా ఎక్కువే.... పార్టీ సిక్స్ ....పీరియడ్స్ కూడా ఆగిపోయాయి. సరోగేట్ బేబీ ప్రపోజ్ చేశాను. వద్దన్నారు. ఎవరన్నా అనాధ లుంటే పెంచుకుంటాం అన్నారు. మీరో పని చేయండి. ఈ అమ్మాయికి ఏడో నెల రానివ్వండి. ప్రీ మెచ్యూర్ బేబీ సిజేరియన్ చేసి బేబీని బైటకి తీస్తాం.  ఒన్ వీక్ మా కస్టడీ లో ఉంచుకొని వాళ్ళకి ఇచ్చేస్తాం. మీకు అంగీకారం అయితే నేనో ఫాం ఇస్తాను. ఫిల్ చేసి సైన్ చేసి ఇవ్వండి..."
    భానూ కి డాక్టర్ మీద పిచ్చి కోపం వచ్చిందని ఆమె ముఖం లోని భావాలే చేబుతున్నాయ్.
    "సెవెన్ మంత్స్ అది గర్భం మోస్తూ తిరిగితే నా పరువు ఉంటుందా? మీరేం మాట్లాడుతున్నారు...?" అంది ఆవేశంగా.
    డాక్టర్ ప్రశాంతంగా అంది. "అంతకన్నా వేరే మార్గం లేదు మేడమ్ అమ్మాయి కూడా జంక్ పుడ్ తిన్నట్టు అన్నం తినదనుకుంటా ... షి ఈజ్ వెరీ వీక్.... మీకు మీ అమ్మాయి కావాలి కదా!"
    'అంటే అబార్షన్ చేస్తే అమ్మాయి కేమైనా అవుతుందా....?"
    "ప్రాణానికి ప్రమాదం లేకపోయినా , ఆరోగ్యం పాడవుతుంది...."
    "అయితే ఏం చేయమంటారు? అది కడుపెసుకుని కాలేజీకి వెళితే దాని పరిస్థితేంటి...?"
    "రెండు రోజుల్లో మూడో నెల వస్తుంది. ఇప్పుడేలాగూ వెకేషన్ ఉంది. పైగా ఫస్ట్ ప్రెగ్నెన్సీ తను స్లిమ్ గా ఉంది కాబట్టి పొట్ట కనిపించదు. ఒకవేళ ఎవరన్నా అడిగితె లావైంది అని చెప్పండి. ఎలాగూ మంచి పుడ్ ఇస్తారు కాబట్టి తను ఖచ్చితంగా లావు అవుతుంది...మీరిందుకు ఒప్పుకుంటే ఒక పాపకి మంచి జీవితాన్నిచ్చిన వాళ్ళవుతారు. ఒక జంటని తల్లి తండ్రిని చేసిన వాళ్ళవుతారు. నాకు అబార్షన్ చేయడం అంటే ఇష్టం లేక నేనిలా చెప్తున్నాను అనుకోకండి. ఆలోచించుకోండి. బాగా అలోచించి చెప్పండి."
    భానుప్రియ ప్రఖ్య వైపు చూసింది. ఏమీ విననట్టు తల వంచుకొని జర్నల్ తిరగేస్తోంది.
    భానుకి ఆ క్షణం లో ప్రఖ్య ని లాగిపెట్టి తన్నాలని పించింది . స్టుపిడ్ గర్ల్ , వాడు ఒంటి మీద చెయ్యేస్తే ప్రోటేక్టు చేయచ్చు కదా.... తనిష్టం , తన సహకారం లేకుండా వాడు ఇంతపని చేసేవాడా....? ఎంత పెద్ద సమస్య ఇది? ఎలా పరిష్కరించాలి? అయినా తను కూడా పెద్ద ఫూల్.... వాళ్ళిద్దరూ యాంగ్ ఏజ్ లో ఉన్నారని మర్చిపోయి ఇద్దరికీ చనువిచ్చింది. ఇద్దరే ఉంటె తనకి ఆ ఆలోచన కూడా రాలేదేనాడూ. శిరీష క్కూడా అలాంటి ఆలోచన వచ్చి ఉండదు. చ ఎలా ...? ఏం చేయాలి....?
    "సరే....నాక్కొంచం టైం ఇవ్వండి చెప్తాను" అంది చివరికి.
    డాక్టర్ ముఖంలో కొంచెం ప్రసన్నత చోటు చేసుకుంది.
    ప్రఖ్య ఆ మాటతో ఒక్కసారిగా తలెత్తి తల్లి వైపు చూసింది.... ఆ చూపులో ఆశ్చర్యం, అనుమానం రెండూ కనిపించాయి. నిజమేనా? అమ్మ అలా అందంటే ఇదో నాటకానికి నాంది కాదు కదా! అనుకుంది.
    "లే వెళ్దాం " అంది భాను ప్రఖ్య చూపుల్లో భావాలు గమనించకుండా.
    ప్రఖ్య చేతిలో జర్నల్ టేబిల్ మీద పెట్టేసి లేచింది.
    బ్యాగు చేతిలోకి తీసుకుని డాక్టర్ వైపు చూసి చేతులు జోడించింది.
    డాక్టర్ నవ్వింది.
    తల్లీ, కూతుళ్ళీద్దరూ బైటకి నడిచారు. డాక్టర్ సంతృప్తిగా నిట్టూర్చింది.
    ఆ తరువాత చెప్పిన టైం కి వచ్చిన ఆదిత్య కి చెప్పింది. "ప్రస్తుతానికి అబార్షన్ ప్రమాదం తప్పింది. మిగతా విషయాలు తరువాత ఆలోచిద్దాం అంతవరకూ నువ్విక్కడికి రావద్దు...." 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS