Previous Page Next Page 
తెల్ల గులాబి  పేజి 16

    "తనకి పీరియడ్స్ రావడం లేదు. అండ్ షి ఈజ్ హేవింగ్ మార్నింగ్ సిక్ నెస్."
    ఆవిడ కనుబొమలు ముడిపడ్డాయి. "అబార్షన్ ఎందుకు?"నాట్ ఆడ్ వైజబుల్."
    "సారీ డాక్టర్. నేను నా డెసిషన్ చెప్తాను మీకు." సలహా అడగలేదు అన్న ధ్వని కలిగేలా అంది భాను.
    అదేం గమనించని డాక్టర్ మండలిస్తున్నట్టుగా అంది "పిల్లలు వద్దనుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంత చిన్న వయసులో అబార్షన్ చేస్తే హెల్త్ పాడవుతుంది."
    "ప్లీజ్ అర్ధం చేసుకోండి. షి ఈజ్ అన్ మారీడ్. ఒక వెధవ వలన ప్రెగ్నెంట్ అయింది. ఇప్పుడీ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయితే తన కెరియర్ దెబ్బ తింటుంది. అది నాకిష్టం లేదు. ఎంత డబ్బు అయినా ఫరవాలేదు."
    డాక్టర్ సీరియస్ గా చూసింది భాను ప్రియ వైపు . "మీ పేరు?" అడిగింది.
    "భాను ప్రియ " చెప్పింది భాను.
    "మిసెస్ భాను ప్రియ గారూ, డబ్బు కోసం నేను డాక్టర్ అవలేదు. జబ్బు తగ్గించడానికి నేను డాక్టర్ ని అయాను. మీరన్నీ డబ్బుతో కొనచ్చని అనుకుంటున్నారా?"
    "అది కాదు నా ఉద్దేశం ."
    "ఒకే....ఒకే.... మీ ఉద్దేశం ఏదైనా నా కానవసరం రామ్మా అంటూ ఆకుపచ్చ కర్టెన్ చాటుకి తీసుకుని వెళ్ళింది ప్రఖ్యని.
    భాను టెన్షన్ తగ్గించుకునే ప్రయత్నంలో రెండు చేతులూ నలుపుకుంటూ కూర్చుంది. అమెకిప్పుడు శిరీష ని, ఆదిత్య ని గొంతు పిసికి చంపాలన్నంత కసిగా ఉంది. నెలరోజులుగా ప్రఖ్య తిండి సరిగా తినకుండా సిక్ అయి చిక్కిపోతుంటే ఏంటో అనుకుంది. కానీ, ఉదయం వాంతులు చేసుకుంటుంటే ఆవిడ గుండె ఆగిపోయింది. ముందు తేనే, నిమ్మకాయ గోరువెచ్చని నీటిలో ఇచ్చింది. తరవాత తన ఫ్రెండ్ ఎంబిబియస్ డాక్టర్ రాధకి ఫోన్ చేసి మెడిసిన్ అడిగింది. ఆమె సరదాకి అన్నా తనకి నిజంగానే గుండె ఆగింది. "ఏంటే మీ అమ్మాయి కి వాంతులేమిటి?" వేవిళ్ళ వాళ్ళలా" అంది రాధ.
    అంతే తనకి గుండె ఆగింది. ఏదో అనుమానం, భయం "వెంటనే నీకు పీరియడ్స్ సరిగా వస్తున్నాయా?" అని ప్రఖ్యని నిలదీసింది. అమాయకంగా చెప్పింది ప్రఖ్య "లేదు, మమ్మీ, టూ మంత్స్ అయింది."
    అంతే ఆవిడ గుండెల్లో పెద్ద పెద్ద బాకులు గుచ్చుకున్నట్టుగా అయింది.
    ప్రఖ్య దగ్గర కూలబడిపోయి మొత్తం అరా తీసింది. రెండు నెల్లుగా తన ఆరోగ్యంలో వచ్చిన మార్పులు చెప్పిన ప్రఖ్య ని నిలదీసింది. "ఏం జరిగింది?" అంటూ. అప్పుడే ఆవిడకి ఆరోజు ఆదిత్య పుట్టినరోజు నాడు ఇద్దరూ అదోలా రావడం గుర్తొచ్చింది. ప్రఖ్య హోలీనాడు జరిగింది చెప్పగానే పెద్ద కొండరాళ్ళు తన నెత్తి మీద పడ్డట్టుగా కుప్పకూలి పోయింది.
    డాక్టర్ మ్యాప్ చూపిస్తూ చెప్పసాగింది. "ఇలా చూడు.... ఫస్ట్ వీక్ లో ఎగ్ ఇలా యుటరస్ వాల్స్ మీద మొదలై సెకండ్ వీక్ నుంచీ ఇలా డెవలప్ ...."
    ప్రఖ్య కళ్ళు మూసుకుని తల తిప్పుకుంటూ అంది "అవన్నీ నాకు చూపించకండి. అబార్షన్ కి ఎప్పుడు రమ్మంటారో చెప్పండి ప్లీజ్...."
    డాక్టర్ ఆ పిల్ల వైపు ప్రశాంతంగా చూసింది. పద అంటూ స్టీచర్ మీద పడుకోమంటూ తాను చేతులకి గౌజు తొడుక్కుంది.
    డాక్టర్ చేతికున్న ఆరు బంగారు గాజుల నాజూకు శబ్దం, ప్రఖ్య అడుగుల చప్పుడు కి తలెత్తి వాళ్ళ వైపు చూసింది భాను.
    "మూడో నెల మీరు ముందే ఎందుకు గమనించలేదు?" అడిగిందా డాక్టర్ తన కుర్చీలో కూర్చుంటూ....
    భాను పక్కన ఫేళా ఫేళా విరుచుకుపడ్డాయి అగ్నిపర్వతాలు . గాభరాగా అడిగింది "ఏం ఎందుకలా అడుగుతున్నారు?"
    "అబార్షన్ నాట్ లీగల్ మీకు తెలుసే ఉండచ్చు కదా!"
    "డాక్టరు గారూ! అలా అనకండి. అది చిన్నపిల్ల. ఏదో తప్పు చేసింది. దానికేం తెలియదు. పీరియడ్స్ రాకపోయినా ఈజీగా తీసుకుంది. మార్నింగ్ సిక్ నెస్ స్టార్ట్ అయాక నేను గమనించాను. అప్పుడు చెప్పింది జరిగినదంతా.
    డాక్టర్ ఏదో ఆలోచిస్తూ కూర్చుంది. ఆవిడ ఏం చెబుతుందో అని ఉద్వేగంగా ఎదురు చూస్తూ కూర్చుంది భాను.
    "దరిద్రపు వెధవ, నికృష్టపు వెధవ...వాడిని చంపేయాలి.... గొంతు పిసికి చంపేయాలి.... శిరీష మీద కేసు పెట్టాలి... తల్లి కొడుకుల్ని ఉరి తీయాలి...." భాను ఆపాదమస్తకం కసితో వణికి పోతోంది.
    డాక్టర్ అయిదు నిమిషాల తర్వాత అంది. "ఈ అమ్మాయిలూ గుడ్డిగా మగాడ్ని నమ్మో, ఫ్రీడం ఎక్కువై ముందుచూపు లేకుండా ఎంజాయ్ చేసో మా చేత చట్టబద్దం కాని పని చేయిస్తున్నారు. కాదంటే గొడవ ఏం చేస్తాం! రేపు ఉదయం తొమ్మిది గంటలకి రండి. ఒక గంటలో అయిపోతుంది."
    "థాంక్యూడాక్టర్. థాంక్స్ ఎలాట్."
    "ఎమ్మా....! జస్ట్ అనుభవం కోసం ఒప్పుకున్నావా? లేక అతడిని ప్రేమించావా?" సీరియస్ గా అడిగింది డాక్టర్.
    ప్రఖ్య వంచిన తల ఎత్తలేదు.
    "అయినా చిన్న, చిన్న పిల్లలకి ఈ రోజుల్లో అన్ని విషయాలు తెలుస్తున్నాయి. నీకు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందో తెలియలేదా?"
    "డాక్టర్! ప్లీజ్! భాను చేయి ఎత్తి ఆవిడ్ని వారించింది. " ప్రఖ్య కళ్ళ నుంచి కారుతున్న కన్నీళ్ళు తట్టుకోలేకపోయింది భాను.
    "వదిలేయండి. జరిగిందేదో జరిగింది. ఏం జరగాలో అదే చేద్దాం. ఇంకేం అనకండి . మీ ఫీజు...?"
    "డాక్టర్ ఒక్కసారి తలెత్తి భాను మొహంలోకి సూటిగా చూసి "రెండొందలు" అంది.
    బాను పర్స్ తెరిచి ఆవిడకి ఫీజు ఇచ్చి, పద అన్నట్టు కనుసైగ చేసింది.
    ప్రఖ్య, భాను బైట కెళ్ళి పోతుంటే వాళ్ళనే చూస్తూ నిట్టూర్చింది డాక్టర్ ప్రవీణ.
    నెక్ట్స్....బెల్ నొక్కి ఆయా లోపలికి వచ్చాక అంది.
    "ఇంకెవరూ లేరమ్మా అంది ఆయా."
    "ఓ అలాగా....సరే అయితే అన్నీ సర్దేయ్. వెడదాం." అంది డాక్టర్ ప్రవీణ.
    ఆయా టేబిల్ మీద ఉన్న స్టేత్ స్కోప్ కిట్ తీసుకుని బైటకి వెళ్ళిపోయింది. కారులో పెట్టడానికి. డాక్టర్ వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళి మరోసారి డెట్టాల్ తో చేతులు కడుక్కుంది. నాప్ కిన్ తో చేతులు తుడుచుకుంటూ ఉండగా వచ్చాడు ఇరవై ఏళ్ళ కుర్రాడు మే ఐ కమిన్ డాక్టర్.
    డాక్టర్ నొసలు ముడిచింది. "ఎవరు మీరు?" అంటూ సీరియస్ గా ఆయా అని పిలిచింది. ఆయా పరిగెత్తుకుంటూ వచ్చింది. "నేను కారు దగ్గర ఉన్నప్పుడు లోపలికి వచ్చేస్తున్నారమ్మా. నేనోచ్చే లోగా మీ దగ్గరకు వచ్చాడు." అంటూ ఆవిడకి జవాబిచ్చి ఆ కుర్రవాడి వైపు చూస్తూ - "బాబూ! ఇక్కడ ఆడవాళ్ళ కి మాత్రమే చూస్తారు . బైటకి వెళ్ళండి." అంది.
    "నేను డాక్టర్ తో పనుండి వచ్చాను....' అన్నాడతను.
    అతడి వైపు పరుశీలనగా చూసింది డాక్టర్. తెల్లగా, సన్నగా , చక్కగా ఉన్నాడు. మెడికల్ రిఫ్రజెంటేటివ్ అయుంటాడు అనుకుంటూ టైం చూసుకుంది .సరిగ్గా బయల్దేరే టప్పుడే వస్తారు చిరాగ్గా అనుకుంటూ "కూర్చోండి" అంది.
    అతను బిడియంగా , ఇబ్బందిగా కూర్చుని "నేను ట్రీట్ మెంట్ కోసం రాలేదండి. మీతో మాట్లాడాలి" అన్నాడు.
    "నాతోటా?" అనుమానంగా చూసింది ప్రవీణ.
    "అవునండి...."
    అయాని బైట కెళ్లమన్నట్టు సైగ చేసింది. ఆయా వెళ్ళిపోయింది.
    "చెప్పండి మీరెవరు?'అడిగింది.
    "నేను....నేను.... ఇప్పుడు మీ దగ్గరికి వచ్చారే....ప్రఖ్య, వాళ్ళమ్మ ఆ ప్రఖ్యకి భర్తను..."
    "వాట్? అడిరిపదినట్లు గా చూసింది . భర్తా! ఆమెకి పెళ్ళి కాలేదంటే ఆవిడ."
    "పెళ్ళి కాలేదండి."
    "వాట్?" పిచ్చివాడివా అన్నట్టు మొహం చిట్లించింది. "ఏం మాట్లాడుతున్నావు అసలు నీ పేరేంటి?" ఆవిడకి కోపం వచ్చినట్టు అర్ధం చేసుకున్న ఆదిత్య అన్నాడు.
    "కోపం తెచ్చుకోండి. అంతా చెప్తాను. నా పేరు ఆదిత్య. ప్రఖ్య నేను ఫ్రెండ్స్. దాదాపు వన్ అండ్ ఆఫ్ ఇయర్ నుంచి మేము చాన్స్ కోసం చూశాం. తనంటే నాకు చాలా ఇష్టం. అయితే అనుకోకుండా జరిగిపోయింది. నిజం చెప్పాలంటే నాకు తను ప్రెగ్నెంట్ అవుతుందేమో అనే ఆలోచన రాలేదు. అలాగే తనక్కూడా తెలియదు కానీ తను ప్రగ్నేంట్ అని చెప్పింది. నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. తప్పు చేశానని నేను ఫీల్ అవడం లేదు. నేను ఫాదర్ గా ప్రమోట్ అవుతున్నందుకు హ్యాపీగా ఉన్నాను."
    ఆవిడ చిత్రంగా చూస్తూ అంది. "ఏం చదువుతున్నావు?"
    అతను కొద్దిగా నవ్వాడు. "నేను బి.టెక్ చదువుతున్నాను డాక్టర్... అయితే పెళ్ళి చేసుకునే టైం కాదు....కానీ తప్పదు నాకు పిల్లలంటే చాలా ఇష్టం.... మా అమ్మకి ఒక్కడే కొడుకుని. నాకు చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అక్కలు, అన్నలూ ఎవరూ లేరు. కానీ, నాకు పెద్ద ప్యామిలీ కావాలని ఇష్టం."
    "ఇప్పుడు మేము పెళ్ళి చేసుకుంటే పాప పుడుతుంది కదా! ఆ తరవాత ఇంకా పిల్లల్ని కంటాం! అప్పుడు నాకు పెద్ద ఫ్యామిలీ వస్తుంది కదా!అందుకే పెళ్ళి చేసుకుందాం అన్నాను ప్రఖ్య వినలేదు. వాళ్ళమ్మ అసలు వినరు వాళ్ళు అబార్షన్ అంటున్నారు. డాక్టర్ ప్లీజ్ హెల్ప్ చేయండి. నాకా బేబీ కావాలి ప్రఖ్య పెంచకపోయినా నేను పెంచుకుంటాను. నా ఫస్ట్ ఇష్యూ నాక్కావాలి."
    ఉద్వేగంగా డాక్టర్ చేతులు పట్టుకుని ప్రాధేయ పూర్వకంగా అన్నాడు ఆదిత్య.
    ఆవిడ ఆశ్చర్యంగా వింటూ వుండిపోయింది. అతనలా చేయి పట్టుకోడంతో ఉలిక్కిపడి "నీ వయసెంత?" అనడిగింది.
    "ఈమధ్యే ఇరవై వచ్చింది."
    "నీకు తెలుసా? నువ్వింకా నాలుగేళ్ళు చదవాలి." అప్పుడు కానీ లైఫ్ లో సెటిల్ ఆవవు."
    "తెలుసు."
    "మరి బేబిని తీసుకెళ్ళి ఏం చేస్తావు?"
    "నేను పెంచుకుంటాను."
    "బేబీ అంటే కుక్క పిల్ల కాదు. బిస్కెట్ వేసి, మిగిలిన అన్నం పెట్టి పెంచుకోడానికి."
    "నేనెలాగైనా పెంచుకుంటాను. పిల్లల్ని పెంచే పుస్తకాలు ధడువుకుంటాను. కానీ ప్లీజ్ నా బేబీని మాత్రం చంపకండి."
    ఉలిక్కిపడింది ఆవిడ ఆ మాటతో కొంచెం సానుభూతి తో అంది "చూడు బాబూ! మనుషుల్ని చంపడం నా వవృత్తి కాదు. ప్రాణం పోయడం నా వృత్తి . కాకపోతే ఆ అమ్మాయి వయసు కూడా చిన్నదే తనకి బోలేడంత భవిష్యత్తు ఉంది. నీకూ బోలెడంత భవిష్యత్తు ఉంది. పొరపాటు చేశారు. ఒకే లెటజ్ ఫర్ గెట్.కానీ, పాపాయిని పెంచుకుంటానంటూన్నావు. ఎలా సాధ్యం చెప్పు వాళ్ళని రేపు రమ్మన్నాను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS