'ఆదిత్య లేడా అంటీ" అంటూ ప్రఖ్య శిరీష ను అనుసరించింది.
శిరీష నోటి మీద చేయి పెట్టుకుని మాట్లాడద్దు అన్నట్టు సైగ చేస్తూ, నెమ్మదిగా అంది. "వాడు రాడు. వాడికి రంగులంటే అసహ్యం."
"ఓ....!ప్రఖ్య నవ్వుతూ వెనక్కి వచ్చేసింది. శిరీష బెడ్ రూమ్ తలుపేసుకుంది. బట్టలు మార్చుకోడానికి.
కాస్సేపటికి నిండా గులాబీ రంగుల్లో మునిగిపోయిన శిరీష, భాను, మరి కొందరు అడ వాళ్ళు కలిసి మొత్తం అపార్ట్ మెంట్ లో ఉన్న మిగతా ఆడవాళ్ళ దగ్గరికి కోలాహలంగా బయల్దేరారు.
"నువ్వు వెళ్ళి సెల్లార్ లో అమ్మాయిలతో ఆడుకో" అంటూ వెళ్ళింది భాను.
ప్రఖ్య వాళ్ళని అనుసరిస్తుంటే వెనక నించి ఎవరో ఆమె జడ పట్టి లాగారు.
ఉలిక్కిపడి చూసింది ప్రఖ్య. గుమ్మం లోపల తలుపు ఓరగా వేసి, ఆ తలుపు వెనకాల నిల్చుని ఉన్నాడు ఆదిత్య.
"ఏయ్ ....రా బైటకి " పిలిచింది హుషారుగా.
"హుష్....!" నోటికి వేలు అడ్డం పెట్టుకుని సైగ చేశాడు.
ప్రఖ్య తిరిగి చూసేసరికి భానూ, శిరీషా మిగతా ఆడవాళ్ళంతా కింద ఫ్లోర్ కి వెళ్ళి పోడానికి మెట్లు దిగసాగారు.
"ప్రఖ్యా....!' గట్టిగా పిలిచాడు ఆదిత్య.
ఏంటి అన్నట్టుగా పిడికిలి బిగించి బొటనవేలు ఎత్తి సైగ చేసింది.
"లోపలికి రా...!"
'అమ్మో...." గుండెల మీద చేయేసుకుంది.
"ఒక్కసారి రా ....' చిన్న మాట.
ప్రఖ్య అటూ, ఇటూ తలతిప్పి చూసింది. అందరూ ఎవరి గోలలో వాళ్ళున్నారు. తనని ఎవరూ గమనించడం లేదు. వెనక్కి తిరిగి పరుగులాంటి నడకతో లోపలికి వచ్చింది.
ఆమెని చేయి పట్టుకుని పూర్తిగా లోపలికి లాగి చటుక్కున తలుపు వేసేశాడు ఆదిత్య.
"నువ్వెందుకు హోలీ ఆడడం లేదు?" ఆశ్చర్యంగా చూసింది ప్రఖ్య.
"ఊహు...! నాకీ రంగులంటే అసహ్యం " అన్నాడు.
"ఇద్దరమే ఇలా ఇంట్లో ఉంటె ఏం బాగుంటుంది? రా మనం కూడా కాస్సేపు అడి వచ్చేద్దాం." అంది.
"ఒద్దు. ఇది మనకి గోల్డెన్ చాన్స్ . ఇప్పుడెవరూ మనల్ని గమనించరు. పట్టించుకోరు. అన్నాడు.
ఆమెని దగ్గరగా లాక్కుని గట్టిగా కౌగలించుకుంటూ.
ఆమెకి తన ఒంటి నుండా వైర్లు చుట్టి కరెంటు అన్ చేసినట్టు అనిపించింది.
ఒక్కసారిగా కళ్ళ ముందు మెరుపులు మెరిశాయి. తూలి పడబోయి అప్రయత్నంగా అతడిని గట్టిగా పట్టేసుకుంది.
"అబ్బ....! ఎంత హాయిగా ఉంది" అన్నాడు.
ఆమెకి పెదాలు ఆదరసాగాయి. ఏదో చెప్పాలని ప్రయత్నించింది కానీ , మాట బైటకి రాలేదు. ఏదో మైకం నిలువెల్లా పాకింది. అతడిని అల్లుకుపోతూ "ఒదులు.... నాకేదో అవుతోంది..." మత్తుగా అస్పష్టంగా అంది.
"అమ్మో....! ఇప్పుడు ఒదిల్తే మళ్ళీ ఈ చాన్స్ రాదు మనకి.."
"ఎవరన్నా వస్తారేమో" అంది గుసగుసగా.
"ఎవరూ రారూ... వాళ్ళు ఇప్పుడే రారు. చాలామంది ఉన్నారు కదా! ఈ లోపల మన పని అవుతుంది."
"కానీ, కానీ ఒద్దు ప్లీజ్ నాకు భయం.." అతన్నుంచి విదిపించుకోడానికి పెనుగు లాడుతూ అంది.
"నో.... నేనివాళ వదల్ను ....నీకేం తెలుసు నా బాధ. ఆ కాస్త అయిందాకా నాకు పిచ్చి పట్టినట్టు ఉంటుంది. ఇంక వేరే విషయాలే ఆలోచనల్లోకి రాడం లేదు. నిజం చెప్పు. నీకు మాత్రం కావాలని లేదా?"
ప్రఖ్య ఏం మాట్లాడ లేకపోయింది. ఆ ప్రశ్నకి నిజాయితీ గా సమాధానం మాత్రం చెప్పలేదు.
కానీ భయం, ఏవో అడ్డుగోడలు , కానీ ఆ అడ్డు గోడలకి బలం లేదు. ముఖ్యంగా భానుప్రియ లాంటి అల్ట్రా మోడరన్ తల్లికి కూతురుగా ఆమెకి ఇప్పటి వరకూ ఎలాంటి నిబంధనలూ లేవు మరి. ఈ విషయంలో ఉంటుందో, ఉండదో కూడా ఆమెకి తెలియదు. అసలా ఆలోచన కూడా రాలేదు. అతను కావాలి అంతే.
ఆమె సమాధానం కోసం ఎదురు చూడలేదు ఆదిత్య. ఇద్దరికీ కాలం స్తంభించి పోయినట్టు అనిపించింది.
ప్రఖ్య బలవంతంగా విదిపించుకుంది. మళ్ళీ కౌగిట్లో కి లాక్కున్నాడు. పెనుగులాడు తున్న అమెనలాగే గట్టిగా బంధించి గదిలోకి లాక్కెళ్ళాడు.
అయిపొయింది.
వాళ్ళు ఏడాదిగా తపించిపోయిన అనుభవం పొందారు. కొంతసేపు గడిచాక కానీ, ఇద్దరూ వాళ్ళు పొందిన స్వర్గం లోంచి బైటకి రాలేకపోయారు.
ప్రఖ్య కి సడన్ గా ఏడుపొచ్చింది. వెక్కి వెక్కి ఏడవసాగింది.
"అరెరే ఏమైంది? ఎందుకేడుస్తున్నావు?" ఖంగారుగా అడిగాడు.
ప్రఖ్య మాట్లాడలేదు.
"ప్రఖ్యా చెప్పు ప్లీజ్ " ఏడవకు.
"నేను...నేను...అమ్మని మోసం చేస్తున్నాను" ఆయామ్ చీట్" అంది వెక్కుతూ.
'అట్లా అనకు ప్రఖ్యా నాక్కూడా బాధగా ఉంటుంది. మా అమ్మని మాత్రం నేను మోసం చేసినట్టు కాదా. బాధపడకు. మనం పెళ్ళి చేసుకుందాం. అప్పుడు మనం తప్పు చేసినట్టు అవదు" అన్నాడు.
"పెళ్ళా....! పక్కలో బాంబు పడినట్టు ఉలిక్కిపడుతూ అంది. మా అమ్మ నన్ను చంపేస్తుంది. నేను చాలా హిట్స్ కి వెళ్ళాలని అమ్మ కోరిక. ఇప్పుడే పెళ్ళి అంటే నన్ను హ్యాంగ్ చేస్తుంది."
"నేను మాత్రం ....నేనూ హైట్స్ కి వెళ్ళాలి....ఇద్దరం పెళ్ళి చేసుకుని బాగా చదువు కోవచ్చు.... హైట్స్ కి ఎదగచ్చు..."అన్నాడు.
"పెళ్ళి చేసుకుంటే పిల్లల్ని కనడం తప్ప మరేం చేయమని మమ్మీ చెప్పింది . చచ్చినా ఒప్పుకోదు పెళ్ళికి."
"పోనీ ఇలాగే ఎంజాయ్ చేద్దాం చదువయిందాకా."
"అమ్మో మళ్ళీనా....చాలు బాబు చాలు.. ఇంకెప్పుడూ నా జోలికి రాకు అదీ....నీకు దణ్ణం పెడతాను....'చేతులు జోడిస్తూ ప్రాధేయపూర్వకంగా అంది.
"ప్రఖ్యా....! ఎందుకలా అంటున్నావు? నాకు నువ్వు కావాలి" ఆమె భుజం మీద చేయెసి దగ్గరకు లాక్కుంటూ అన్నాడు.
'అదీ....! దూరంగా ఉండు.... అతని చేతులు విదిలించి దూరంగా జరిగింది. ఇంకెప్పుడూ దగ్గరకు రావద్దు అదీ... ఇంకెప్పుడూ నన్నిలా రెచ్చగొట్టకు.... అదీ.... ఆ కాస్సేపు స్వర్గం అంటే ఇదేనా అనిపించింది. కానీ నాకిప్పుడు యెంత టెన్షన్ గా ఉందొ తెలుసా....? ప్లీజ్ ....ఇంకెప్పుడూ ఇలా చేయకు. నువ్వు మళ్ళీ ఇలా చేస్తే నేను నీతో మాట్లాడను."
'అమ్మో...! నువ్వు మాట్లాడకపోతే నేను చచ్చిపోతాను."
"అంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా?"
"నాకు తెలియదు. ఇన్ని రోజులూ నీతో ఈ అనుభవం కావాలని తపించాను. ఆ అనుభవం పొందాక నీమీద తెలియని అనురాగం, ప్రేమా కలుగుతున్నాయి. నీకు ఈ మాత్రం కూడా దూరంగా ఉండలేకపోతున్నాను. దీన్ని లవ్ అంటారేమో నాకు తెలియదు. బట్ ఐ నీడ్ యూ."
"కానీ, నాకు మాత్రం చాలా భయంగా ఉంది. గిల్టీగా ఉంది. ముందు నేను ఇంటికి వెళ్ళాలి."
"వెళ్ళు, కానీ ఇంకెప్పుడూ నన్ను కలవనని మాత్రం అనకు."
ప్రఖ్య అతని వైపు చూసింది. అతని కళ్ళలో అభ్యర్ధన.
చటుక్కున మొహం తిప్పుకుని హాల్లోకి వచ్చేసింది. తలుపు తీయాలంటే భయంగా ఉంది. ఎవరన్నా చూస్తె... ఇంకేమన్నా ఉందా? తటపటాయిస్తూ తలుపు దగ్గరకు నాలుగు సార్లు వెళ్ళి వెనక్కి వస్తూ చివరికి ధైర్యం చేసి తలుపు తీసి బైటకి చూసింది. అదృష్టం ఎవరూ లేరు. అంతే ఒక్క ఉదుటున బైటకి నడిచి పరిగెత్తుకుంటూ తన ప్లాట్ వైపు వెళ్ళిపోయింది.
ఆదిత్య పొందిన ఆనందాన్ని మననం చేసుకుంటూ మంచం మీద దోర్లసాగాడు.
కాస్సేపు అలా దోర్లాక ఆదిత్య కి ఏమన్నా చేయాలని పించింది. తన ఆనందాన్ని ఇంకా వేరేలాగా ఆ పరిసరాలన్నీటికీ ప్రకటించాలనిపించింది. మంచం దిగి గది మధ్యలో నిలబడి "నేను పెద్దవాణ్ణి అయానోచ్" అని అరిచాడు కొంచెం గట్టిగా. తరవాత మరోసారి కాస్త స్వరం పెంచి అరిచాడు. ఆ తరవాత పదే పదే "నేను పెద్దవాణ్ణి అయానోచ్" అనుకుంటూ చేతులు బార్లా చాచి గుడ్రంగా తిరిగాడు గదిలో. హటాత్తుగా అతని చేయి పుస్తకాల రాక కి తగిలి పైనుంచి దడ, దడమంటూ పుస్తకాలు కింద పడ్డాయి. అలా పడడం లో ఒక బరువైన వెడల్పాటి పుస్తకం ఆదిత్య కాళ్ళ మీద పడింది.
'అబ్బా!" అంటూ ఒంగి కాలు పట్టుకుని ఆ పుస్తకం పక్కకి జరిపాడు. అది పుస్తకం కాదు. పెద్ద అల్భం. అది చూడగానే ఆదిత్య నొప్పి మర్చిపోయి ఆశ్చర్యంగా దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. చాలా బరువుగా ఉంది. రెండు చేతుల్లో ఆ ఆల్బం మంచం మీద పెట్టి మంచం అంచున కూర్చుని ఆల్బం తెరిచాడు.
ఆశ్చర్యం నాన్న, ఆదిత్య పెదాలు ఉచ్చరించాయి. "నాన్న, నాన్న" అనుకుంటూ ఆ యువకుడి ఫోటో చేత్తో తడిమాడు.
ఎంత బాగున్నాడు నాన్న. ఆత్రంగా మిగతా పేజీలు తిప్పసాగాడు. ఎంతో సన్నిహితంగా , మరెంతో ప్రేమగా, అనురాగంగా, వాళ్ళిద్దరి ఫోటోలు, పెళ్ళినాటివి , హనీమూన్ వెళ్ళినప్పటివి, కొన్ని ఫోటోల్లో అతని తల్లి , తండ్రి కాబోలు.
ఆదిత్య కళ్ళు మెరిశాయి. ఒక ఫోటో దగ్గర శిరీష మధ్యలో ఉంది. పట్టు పరికిణీ, ఓణీ మేడలో నెక్లెస్ , రెండు జడలు , కళ్ళ నిండా కాటుక, అటూ ఇటూ తల్లి, తండ్రి .
అమ్మమ్మ, తాతయ్య.
ఆదిత్య చేతులు అమ్మమ్మ అంటూ ఆ ఫోటోని ఆప్యాయంగా తాకాయి. అమ్మమ్మ తాతయ్య మధ్యలో అమ్మ . ఎంత బాగుంది ఈ ఫోటో. ఇంకా ఉన్నాయా? గబ, గబా తిప్పాడు పేజీలు . చాలా ఉన్నాయి. చటుక్కున ఒక ఫోటో ఆల్బమ్ లోంచి లాగాడు. బాగా పాత ఫోటో ... బ్లాక్ అండ్ వైట్ లో ఉంది. అమ్మమ్మ తాతయ్య ల పెళ్ళి ఫోటో ....దాని వెనకాల 1968 కారం పూడి అని రాసి వుంది.
కాలింగ్ బెల్ మోగింది. వెంటనే 'అదీ" అంటూ శిరీష స్వరం వినిపించింది.
ఆదిత్య కాస్సేపు తడబడ్డాడు. ఆ ఆల్బమ్ ఎత్తి పైన పెట్టడానికి టైం పడుతుంది. ఎలా? చటుక్కున మంచం మీద మడత పెట్టి ఉన్న బ్లాంకెట్ ఆల్బమ్ మీద పడేసి లేచి వెళ్ళి తలుపు తీశాడు.
