సాయంకాలం కాలేజీ నుండి వస్తూ వస్తూ దారిలో ఉన్న పరమేశ్వరీ ఇంటికి అడుగు కదపడం అతనిలో ప్రమేయం పెట్టుకోకుండా చేసింది మనసు. అతన్ని వీధి లోనే గుర్తు పట్టి హుక్కా గొట్టం కింద పెట్టి , "రావోయ్" అన్నాడు ఈశ్వర చంద్రుడు ఆహ్వానిస్తూ. ఈశ్వర చంద్రుడి కుక్కి మంచానికి ఎదురుగా వెనక అనుకునేందుకు వీలు లేకుండా ఆ ముక్క విరిగిన పాత కుర్చీ ఉంది. అతను అందులో కూర్చునేందుకు సందేహిస్తుంటే ఈశ్వర చంద్రుడు నవ్వి అన్నాడు: "చూడు, మనూ , ఈ కుర్చీ లో మీ నాన్నగారు ఇలాగె నా ఎదురుగా కుర్చుని మాట్లాడేవారు. అప్పట్లో కొత్తగా కొన్నదే అనుకో. అయినా ఈ కుర్చీ కున్నంత శక్తీ, ఒరిమీ మరొక దానికి ఉంటుందంటే నేను ఒప్పుకోను. ఆ మాటకి వస్తే " అని ఆగి, "అమ్మాయ్ , గిరిజా!" అని కేక పెట్టేడు. మన్మోహన్ చెప్పుల చప్పుడు పరమేశ్వరి కి చిర పరిచితమే. అందుకే ఆవిడ ట్రే లో టీ కేటిల్ ఉంచి స్వదేశీ టీ పంపింది. స్వదేశీ టీ అంటే ఆవిడ పరి భాషలో కొద్దిగా ఉప్పూ, దాల్చిన చెక్కా, లవంగాలూ, ఎలుకలూ కలిపినా పొడి వేసి తగినన్ని పాలు పోసిన టీ అన్న మాట. ఊళ్ళో పరమేశ్వరీ మీద మమతా వాత్సల్యాలు ఎంతమందికి నిస్వార్ధంగా ఉన్నాయో తెలియదు కానీ ఆవిడ కాచే స్వదేశీ టీ కోసం అయినా రోజులో ఏ ఒకరిద్దరైనా వచ్చి పలకరించి వేడి వేడి టీ గొంతులో పోసుకుని మరీ వెడుతుంటారు.
"ఇప్పుడు నాకు టీ దేనికి, మామయ్యా! మీరు నిన్న చాలా విజీగా ఉన్నారు. అందుకు మాట్లాడించలేకపోయెను. ఈవేళ మీకో వార్త చెప్పిందుకు వచ్చెను." అన్నాడు, టీ, ని తిరస్కరిస్తూ.
అతను టీ తెచ్చిన మనిషిని చూశాక ఈ భావం ఉపసంహరించుకుని తాత్కాలికంగా త్రోసి పుచ్చేశాడు. జనం చెప్పుకునే విధంగా అప్సరస లా ఉన్న ఈశ్వర చంద్రుడి కూతుర్ని చూడాలనే కుతూహలం అతన్ని వేదించ సాగింది. కాలేజీ కి వెళ్ళినా ఒక్కసారి చూడాలనే అంతరంగపు సతాయింపు ని ఇక నిగ్రహంగా ఎదుర్కోలేక పోయేడు. సాయంత్రం వస్తూ వస్త్గూ పని గట్టుకుని ఈరోజు మరీ వచ్చేడు.
ఈశ్వరచంద్రుడు హుక్కా గట్టిగా పీల్చి గుడగుడ మనే శబ్దాన్ని కొంచెం ఆపి, "నువ్వు తీసుకు వచ్చేవెం, లోకేశం? అమ్మాయేది?' అని ప్రశ్నించేరు.
వాడు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ఈశ్వర చంద్రుడి కి అర్ధమైంది కానీ మన్మోహన్ కి అంతు చిక్కలేదు. "సరే, సరే! అక్కడ పెట్టి వెళ్ళు.' అన్నాడు.
పనివాడు వెళ్ళిపోయినా , కర్టెన్ కదిలినప్పుడల్లా అయన కూతురేమో అనే భ్రమతో దృష్టిని ఆటే నిలిపి ఉంచి ఆశా భంగం అయిపోబడంతో లేవబోతూ, వచ్చిన మరో ముఖ విషయం కూడా చెవిన వేసి పుస్తకాలూ, కొటూ, స్టెతస్కోపు అందుకున్నాడు. "రెండిళ్ళ అవతల రాయ్ గారి పిల్లలు ఫిప్టు ఫారం, ఫోర్టు ఫారం , ధర్డు ఫారం చదువుతున్నారు, మామయ్యా. వాళ్ళు పిల్లల్ని ఇక్కడికి పంపితే పది రూపాయలు తక్కువ ఇచ్చేటట్లూ, మీరు అక్కడికి వెళ్లి చెబితే పది రూపాయలు అదనంగా ఇచ్చేటట్లూ చెప్పమన్నారు. ఇంగ్లీషూ, లెక్కలూ చాలునుట."అన్నాడు.
ఈశ్వర చంద్రుడి మొహం లో కోటి మెర్క్యురీ లైట్ల కాంతి ఒక్కసారిగా వెలిగినట్లు కావటం మెట్లు దిగి వెడుతూ వెడుతూ మరోసారి వెనక్కి చూసిన మన్మోహన్ గ్రహించేడు.
రెండు సందులు మలుపు తిరిగితే రమేష్ చక్రవర్తి డాబా ఇల్లు వస్తుంది. దాదాపు ఆరేడు సంవత్సరాలుగా అతని ఇంటి మీది కాకి అమరేంద్ర చక్రవర్తి ఇంటి మీద వాలడం మానుకుంది. కూతుళ్ళ నీ, కొడుకుల్నీ అతను అజ్నాపించేడు. ఆజ్ఞాపించడం అనేకన్న అయన శిలా శాసనం ;లా తీర్పు ఇచ్చిన శిక్ష తాలుకూ ఫలితం కనీసం కన్నతల్లి కడుపు తీపిని సైతం లెక్క చేయకుండా వజ్రాయుధం లా పనిచేసి మొదలంటా నరికి వేసింది. సౌదామినిని చేసుకున్నాక ఆ ఇంట ప్రచండ యుద్ధం లాంటిది జరిగింది. ఇరుపక్షాల వారూ బలా బలాలు చూపించుకున్నారు. మొదట కొద్దిగా కేకలతో ప్రారంభం అయిన ఆ యుద్ద కాండ తిట్లూ, శాపనార్ధాలూ, మొత్తుకోళ్ళ తో సాగి కర్రలు కర్రలు విరిగిపోయేవరకూ నచ్చి అక్కడ తీర్పు, పంచాయితీ జరిగి అంతటితో ఆగిపోయింది. ఆ కుటుంబం వాళ్ళు ఏ రోడ్డు మీద అయినా తటస్తితే అనుకోని విధంగా అయినా సరే ఇవతలి వాళ్ళు నోటికి వచ్చిన బండ బూతుల్ని వాగ్రూపం లో వర్షపాతం లా కురిపిస్తారు. సౌదామిని మొదట్లో ఏడ్చి ఈవిధంగా జరిగినందుకు రమేష్ ని పర్వవసానం తెలియ జెప్పమనేది. అమరేంద్ర చక్రవర్తి తన కొడుక్కి జరిగిన పెళ్లి పెళ్లి కాదనే పంచాయితీ మరొకటీ లేవదీశాడు. రెండో సారైనా కావలసిన ధనాన్ని సేకరించి పెళ్లి చేయాలని అతని సంకల్పం. రమేష్ ఈ కాలపు చాలామంది యువకుల్లా ఉడుకు రక్తం చల్లబడ్డాక కాలర్ పైకి ఎగదోసి, పాంటు జేబులో, చేతులు పోనిచ్చి ఠీవిగా నిలబడి, ఆ పైన మీసం మీద చేయి వేసి, తన ప్రతాపానికి తను మురిసిపోయే వ్యక్తిత్వం లేని మనిషి కాదు. స్వయంగా పెంకులు కప్పిన ఇళ్ళలో మధ్యతరగతి కుటుంబీకుల గాధలు విని, బాధల్ని అర్ధం చేసుకుని, ధనం లేకపోయినా మమతలతో నిండిపోయిన ఆ హృదయాల్ని తరిచి తరిచి చూసి, అందులో సుస్థిరంగా స్థానం సంపాదించు కుని డబ్బుకి గోలీ కొట్టిన మనిషి. తండ్రి చివాట్లు అతన్ని అంట లేదు. అయన ఈ యుక్తులు అతడి పై పనిచేయలేదు. అయన ధనాగారం సారించి బాణం వదిలి వంగ దీయలేదు. అతడు నిశ్చలంగా నిలబడి గుండెల మీద చేయి వేసుకుని. తన బాహువుల్లో చల్లని రక్షణ ఇస్తూ సౌదామినిని వక్ష స్థలానికి అడుముకుని స్వేచ్చా వాయువు పీల్చుకున్నాడు.
వీధి వాకిట వాలు కుర్చీలో వెనక్కి వాలి పేపరు చదువుతూ భార్య అందిస్తున్న టీ తో బాటు ఆవిడ అందాన్ని కూడా అరమోడ్పు కనులతో గ్రోలుతూ అప్పటికి పేపరు కింద పెట్టేడు రమేష్ చక్రవర్తి. ఎదురుగా ఉన్న పేము కుర్చీ లో కూర్చుని ఇంటి విషయాలు మాట్లాడుతున్నది సౌదామిని. చిన్న సైజు డాబా ఇంటి చుట్టూ ప్రవహీ గోడ , రెండు అడుగుల మేర బంతి పూల చెట్లతో , గులాబీ, సంపంగి మొక్కలతో రమణీయంగా అమర్చి పెట్టుకున్నాడు ఉన్నంత లోనే ఇంటిని కళాత్మకంగా చేసుకుంటూ. గేటు తలుపు తెరుచుకున్న శబ్దం కాగానే భార్యా భర్త లిద్దరూ అటు వైపు దృష్టిని మళ్ళించి అప్రతిభులయేరు. సంధ్య చీకట్లు పడేందుకు ఇంకా వ్యవధి ఉంది. రమేష్ చక్రవర్తి కనుబొమ్మలు దగ్గర పడ్డాయి. "తమ్ముడు....తమ్ముడు వస్తున్నాడు, సౌదామినీ! మనింటికి తమ్ముడు రావడం ఏమిటీ?' అతనికి ఆశ్చర్యం వేసింది.
సౌదామిని మన్మోహన్ ని చూపులతోటే ప్రేమ పూర్వకంగా ఆహ్వానించింది.
రమేష్ లోనికి వెళ్లి మరో ఫేము కుర్చీ తీసుకు వచ్చి తన పక్క కుర్చీ పక్క వేశాడు. తమ్ముడు అడుగులు ముందుకు వేసి వస్తుంటే అతని భ్రాత్రూహృదయం కట్టలు తెంచుకుని, రక్తాన్ని గంగా ప్రవాహం లా మునకలు వేయిస్తుంటే రెండు చేతులూ చాపి కౌగలించుకుని , "తమ్ముడూ...తమ్ముడూ!" అన్నాడు అస్పష్టంగా.
ఇద్దరి కళ్ళూ చేమ్మగిల్లెయి. సౌదామిని తెరల చాటు నుంచి వచ్చే కన్నీటిని లోలోపలికి పంపేసింది. రమేష్ కూర్చున్నాడు, మన్మోహన్ కి కుర్చీ చూపిస్తూ.
.jpg)
"అమ్మ బావుందా? నాన్నగారు కులాసాగా ఉన్నారా? కాలేజీ నుంచేనా రావడం? విశేషాలేమిటి?"
"అయ్యో! అతనికి మంచి నీళ్ళయినా ఇవ్వనియ్య కుండా మీ ప్రశ్నలు ఏమిటండీ?" అన్నది సౌదామిని లోపలికి వెడుతూ.
మన్మోహన్ చెప్పనా, వద్దా అని సంశాయిస్తున్న వాడిలా ఆగాడు. రమేష్ అడిగాడు గ్రహించి.
"మరేం లేదన్నయ్యా. ఈశ్వర చంద్రుడు మామయ్య ఈ ఊరు వచ్చేరు. నీకా సంగతి తెలీదా?"
రమేష్ నవ్వాడు. "తెలియకేం? ఊళ్ళో లేను నేను ఇన్నాళ్ళూ. నిన్ననే వచ్చాను. మీ వదిన చెప్పింది. గిరిజని నువ్వు చూశావా?"
బుర్ర అడ్డంగా తిప్పేడు లేదన్నట్లు.
"ఇప్పుడు నువ్వు అక్కడి నుంచేనా వస్తున్నది?"
అవునన్నట్లుగా తల ఊపాడు.
"మావయ్యా ఈ ఊరు దేనికి వచ్చినట్లు?"
"తెలీదు. అన్నయ్యా, నీకో సంగతి చెప్పాలనుంది. ఇది నీవల్లే అవుతుంది. నువ్వు ఇందులో జోక్యం చేసుకోవాలన్నయ్యా!" అన్నాడు తదేకంగా చూస్తూ.
"విషయం చెప్పు, తమ్ముడూ. నువ్వు ఇంత దూరం పని పెట్టుకుని వచ్చినట్లు రావడంలో అర్ధం ఉందని గ్రహించెను. నువ్విలా మా ఇంటికి రావడం నాన్నగారు చూస్తె నీ భవిష్యత్తు ఏమౌతుందో గ్రహించావా? మనిషికీ, డబ్బుకీ ఉన్న అవినాభావ సంబంధాన్ని విడమరిచి నేను చెప్పనవసరం లేదు. మనిషికి జీవగర్ర లాటిందది. అన్నయ్య ఒక్కడికే పాస్తులు దక్కడం నేను సహించలేను. వేడిలో ఏదైనా చేయవచ్చు. నన్నపార్ధం చేసుకోకు. నువ్వు ఇలా నా ఇంటికి వచ్చేవంటే నా కడుపు నిండి పోదు, తమ్ముడూ. నా రక్తం లో రక్తానివి. చిన్నవాడివి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేవరకూ తప్పదు మన మధ్య ఈ ఎడబాటు!"
