ప్రేమ చటుక్కున ముందుకువంగింది "సుధాకర్ అంటున్నావేమిటి
"నా దగ్గర దాచకు. నేనంతా ఎరుగుదును అతను నీకు రాసిన ఆ తరం చూచాను..."
"వదినా?" అంటూ లేచి నుంచుంది ప్రేమ. "నాకు వచ్చిన ఉత్తరం చూశావా! అన్న కోడలి అసహ్యం మిళితమై వింతైన కంఠం ధ్వనించిన- ఆ పిలుపుకు లేంది మెదలకుండా చూస్తోంది.
ప్రేమ వ్రేళ్ళు చీర కొంగును మెలిపెడుతున్నాయి. పెదిమలు పాలిపోయి సన్నగా కంపిస్తున్నాయి కళ్ళు అప్పటికప్పుడే ఎరుపెక్కాయి. ముఖం ఎర్రగా అయిపోయింది. "నా బీరువా వెతికావన్నమాట. అసలు నా గదిలోకి నిన్ను వెళ్ళమనటం నాదే పొరపాటు......ఛీ....ఛీ....నువ్విలాంటి దానివనుకోలేదు. ... ఎన్నని ఏం లాభం? ఉత్తరం నేనే జాగ్రత్తగా పెట్టుకోవలసింది"అన్నది కసిగా.
గబుక్కున వెనుదిరిగి ఇంట్లోకి వెళ్ళబోయింది.
"ప్రేమా-ఆగమ్మా"
ప్రేమ వినిపించుకోలేను. వెనక్కి తిరగకుండానే అంది "నువ్వే మీ విశదీకరించ నవసరంలేదు. సమర్ధించుకో నక్కర్లేదు" ఒక్కడుగు వేసింది. రేవతి మళ్ళీ పిల్సి చేత్తో ఆగమన్నది.
"ఇలావచ్చి కూచోమ్మా సమర్ధించుకోను - విశదీకరించను" అన్నది. ప్రేమ ఆగింది. జరిగిందంతా చెప్పింది. "ఇదీ జరిగిన విషయం. అంతేగానీ ఏదో వెతుకుదామని నేను ప్రయత్నించలేదు.... ఆ వుత్తరాన్ని అక్కడే పెట్టాను...ఈ మాత్రానికే నువ్వు నన్ను బాధపెట్టావు. అయినా తప్పు నాదే భరించాలి. ఆమె తల వంచుకుంది. క్రిందపడిన వుత్తరాన్ని అలాగే తీసిపెట్టవలసింది తెరచి చూచేదాక అది ఉత్తరమని నాకు తెలియదు ప్రేమా..."
"కవరులో ఉత్తరాలుండక మరేముంటాయి?"
"ఏమైనా ఉండొచ్చు. ఫోటోలు! కాగితాలు, ఉత్తరాలు, న్యూస్ పేపర్ కట్టింగ్స్. డబ్బు ఏదైనా వుండొచ్చు.....చెప్పాను కదా ఎప్పుడూ చర చర పుస్తకాల్లోంచి పడ్తే ఏమిటో అనుకున్నాను.....ఒకవేళ నీ పుస్తకాల్లో అది పడినట్లయితే తెరవకుండా వుంచేద్దు మో నీకూ గుర్తు లేని వస్తుందో ఎక్కడుండి పోయిందేమో?
"సరేలే విసుగ్గా అంది ప్రేమ.
భరించరాని నిశ్శబ్ధం వారిద్దరి మధ్యా వికారంగా నిల్పింది. కాసేపటిక్రితం కోపంవచ్చి ఇంట్లోకివెళ్ళి పోవాలనుకున్నదికూడా మరచి అలాగే అచేతనంగా కూర్చుంది ప్రేమ!
రేవతి ఆమె నట్టే చూస్తూ "అతనెవరు ప్రేమా!" అన్నది చాలా మెత్తగా తనమీద అసహ్యం కోపం పోవడానికి ఇదే మార్గం.
"అదంతా ఇప్పుడు చెప్పలేను ఎవ్వరికైనా చెప్పగలనేమోగానీ నీకు మాత్రం చెప్పలేను.
రేవతి అక్కడే కూచుంది. ప్రేమ మన్నించటం లేదు. ఈ సంభాషణలో తనని వదినా అని పిలవలేదు. ఎంతో కఠినంగా మాట్లాడింది! హద్దూ పద్దూ లేకుండా మాట్లాడింది. కాని అందుక్కారణం గ్రహింపుకు రాగానే ఆమె హృదయం ఆందోళన చెందింది. ఆమె మాటల తీరునుబట్టి చూస్తే తను తన స్థానాన్ని అతిక్రమించినట్లు లెక్క.....నువ్వు ఏమీ లేనిదానివి. నావల్ల నీకీ స్థితి వచ్చింది: అన్నభావన ఆమె మాటల్లో విబ
ిడీకృతమై వుంది. ప్రేమ తనచుట్టూ కంచె వేసింది. దాన్నతిక్రమించే ప్రయత్నం చేసినందుకు కాబోలు కంపలో పడి బాధపడ్తోంది?
అయినా తనేం చేసింది?
"అతనెవరు?"
అతన్ని ప్రేమ ప్రేమించినట్లయితే చెప్పొచ్చుగా? ఎందుకంత రహస్యం. ఆ దాపరికం తనదగ్గరేట : దేనికో! ఎవ్వరికీ చెప్పొద్దు వదినా-అంటే తను తప్పక దాచివుండేదే కదా.
రేవతి ఆలోచిస్తోంది. ఏదో అపశ్రుతి విన్పిస్తోంది. తననెంత చులకన జేసి తీసిపారేసినట్లు మాట్లాడింది! ఎంత సంస్కారహీనంగా ప్రవర్తించింది.....నీకు జెప్పను- అని ముఖంమీద అనేసి వెళ్ళిపోయింది. ఆ చెప్పే తీరులో ఎంతద్వేషం- అసహ్యం దాగి వున్నాయో తను గ్రహించ గల్గింది.
మరుసటిరోజు తెల్లవారి వదినను పిలవమని తల్లి చెప్పిన మాటను తీసేయలేక రేవతి గదిలోకెళ్ళింది. రేవతి పడుకుని వుంది గానీ నిద్రపోవటం లేదు పాలిపోయిన ముఖం కాంతి విహీనంగా అగుపించింది.
"అమ్మ పిలుస్తోంది" అని వెళ్ళిపోయింది ప్రేమ.
తన నెంతగా అసహ్యించుకుంటోందో ప్రేమ. గోడకు చెప్పినట్లు చెప్పి వెళ్ళిపోయింది! రేవతి నెమ్మదిగా లేచివెళ్ళింది.
ఆ సాయంత్రం ఇంటికొచ్చేసరికి తెలిసింది. రేవతి పుట్టింటి కెళ్ళిపోయిందని.
ఒకరోజు మధ్యరాత్రి అన్న గోపాల్ రావటం ప్రేమ నాశ్చర్యపర్చింది "ఇలా వచ్చావేం అన్నయ్యా అంది"
రేవతికి నొప్పులట. ట్రంక్ కాల్ చేశారు.... వచ్చేశాను....ఏం కబుర్లు?" ఆందోళనగా అన్నాడు. "ఏమైనా కబురు తెలిసిందా మీకు?"
హడావుడికి సుబ్బరామయ్య వచ్చాడు. ఆయన కుర్చీలో కూచుంటూ అన్నాడు "తెల్లవారి వెళ్ళింది మీ అమ్మ. చూచి వస్తానంటూ వెళ్ళిన మనిషి ఇంతవరకు జాడలేదు సాయంత్రం కులాసాగా వుందిని కబురొచ్చింది. నిన్నటినించి కాస్త నలతగా వుందట"
"ఎప్పటి మాట మీరు చెప్పేది?"
"ఎనిమిది గంటలప్పుడు భోజనం చేశావా?" ఆ ప్రశ్న తానడగనందుకు ప్రేమ సిగ్గుపడింది.
"అంతా అయింది....మీరెళ్ళి పడుకోండి, నేనలా వెళ్ళివస్తాను" వదిన విషయం నాకు చెప్పలేదేం నాన్నగారూ" అంది ప్రేమ.ప్రేమకు పరీక్షలు. ఇవన్నీ చెప్పవద్దని మీ అమ్మ అంది......కాస్త కష్టమైన కాన్పట. నువ్వెక్కడ ఇదై పోతావో అని భయపడింది" అని సుబ్బరామయ్య లోపలికి వెళ్ళాడు.
"నాకెందుకు భయం!" అనుకుంది ప్రేమ "వెళ్ళి నిద్రపో అమ్మా" ఆనాడు గోపాల్ సోఫాలో పడుకుంది ప్రేమ. దాదాపు మూడుగంటలకు ఎవరో గట్టిగా పిలుస్తూ వచ్చారు. గోపాల్ గబగబ బైటికెళ్ళాడు.
ఆ వచ్చినవాళ్ళు ప్రక్కింట్లో వున్న ఆఫీసరు.
"ఆ....మీరే ఉన్నారు కదూ....అమ్మాయి పుట్టిందట తల్లీ. బిడ్డా క్షేమం అట. ఇప్పుడే ఫోన్ చేశారు..... కంగ్రాట్యులేషన్స్"
అంత రాత్రి శ్రమ తీసుకుని వచ్చినందుకు కృతజ్ఞతలు తెల్పాడు గోపాల్. తెల్లవారేంతవరకు కనిపెట్టుకుని కూచోటానికి గోపాల్ మహా ఇబ్బందిపడి పోతూంటే ప్రేమకు కోపంకూడ వచ్చింది.
పాపను చూచేందుకు వెళ్ళింది బొద్దుగా ముద్దుగా, ఎర్రగా వున్న పాపను చూచి రేవతిని పలుకరించకుండానే వచ్చేయబోయింది. కానీ రేవతే పలకరించింది.
"పాప ఎలావుంది ప్రేమా?"
"మా అన్నయ్య బిడ్డలంతా రత్నాలే అంది నవ్వు ఎరుపు తెచ్చుకుంటూ.
అప్పుడే గదిలో అడుగుపెట్టాడు గోపాల్.
"రేవతీ-ఎలావుంది....బాగా అలసిపోయావా?"
ప్రేమకు వెళ్ళిపోవాలని వుంది.
వాళ్ళేం మాట్లాడుకుంటారో నెమ్మదిగా లేచివెళ్ళిపోయింది. వదినంటే తనకూ అభిమానమే. కాని ఆ లేఖ చదవటంవల్ల తప్పు జరిగిపోయింది. దానికి వదినను తనుక్షమించలేదు. అంత విశాల హృదయం తనకు లేదు. ఈ ప్రేమకథ పూర్తయిసుధాకర్ తనూ భార్యాభర్తలైతే మళ్ళీ స్నేహితులయ్యే అవకాశం వుందేమో కానీ అన్నయ్య పెద్దవదినను ఇంత త్వరగా మరిచిపోయి రేవతిని యింత అనురాగంతో చూడడం ఆశ్చర్యంగా సహించలేనంత ఎబ్బెట్టుగా వుంది. ఇలా తనలోని ఈ వక్రబుద్ధి లోతుగా వేరు పాతుకు పోయినట్లు పాతుకుపోతుంటే ప్రేమ గది వెలుపలికి వచ్చి ఏమి చేయటానికీ తోచక అలాగే నిల్చుంది. రేవతి చెల్లి రాధ ప్లాస్కు పట్టుకొచ్చింది. ప్రేమను చూచి మందహాసం చేసింది. ప్రేమ పెద్ద యిరకాటంతో పడిపోయింది. తెచ్చి పెట్టుకున్న మందహాసం సుఖానికి కళను చేకూర్చలేకపోయింది.
"అలా వున్నారేంవదినా? మేనల్లుడు పుట్టలేదనేనా! మా అక్కయ్య క్కూడా కొడుకు పుట్టలేదని బాధగానే వుంది.
"ఉన్నారుగా యిద్దరు! ఆ స్వరంలో కరుకుదనానికి రాధ విస్తుపోయింది. లోపలినుంచి గోపాల్ రావటంతో కొంత తేలికైందివిషయం.
8
పెద్ద స్టేషన్ రావటంతో గోలగోలగా వుంది. ఎవరో ప్రేమను తట్టి లేపారు. ఆమె ఆలోచనల కంతరాయం కల్గింది గబుక్కున లేచి కూచుంది. పెట్టె చీకటిగా వుంది. చిన్న బ్లూ లైటు మాత్రం వెలుగుతోంది. ఆ చేయి తన భుజంమీద పడింది. ఎవరో తెలిసికొంది ప్రేమ. నెమ్మదిగా చేతిని తొలగిస్తూ "ఇట్లా వచ్చావేం?" అంది ఇంకా మత్తుగా.
"పేషన్ వచ్చిం- ఏమైనా కావాలా?"
ప్రేమకు నవ్వువచ్చింది. తమ నిద్రపోకపోయినా అందరి దృష్టిలో తమ నిద్రపోతోంది. నిద్రపోతున్న మనిషిని లేవటంలో - అర్ధం ఏమిటి?
"ఏ- వద్దు- వెళ్ళి పడుకో.....ఎవరైనా లేస్తారు -
సుధాకర్ ఆమె చేతిని అందుకోబోయాడు. ప్రేమ కనుబొమలు చిట్లించి రగ్గులో చేతులు దాచుకుంది.
"ఎందుకొచ్చినట్లు పొడిగా అడిగింది.
"ప్రేమా- ప్రేమా ఆవేశంగా అన్నాడతను, "నీ కోసం వచ్చాను నిన్ను ఒక్కసారి తాకాలని."
"నన్ను ముట్టుకోటానికింకా నీ కధికారం లేదు. నేనింకా నీదాన్ని కాలేను" అని అంతలోనే మార్దవం తెచ్చుకొని "అంతమాత్రం నిగ్రహించుకోలేవా? ..... వెళ్ళిపడుకో మన నిశ్చయాన్ని గుర్తుంచుకో." ప్రేమ దగ్గర మెడలవరకు లాక్కుని వెనక్కువాలింది. కొన్ని క్షణాలు సుధాకర్ అక్కడే తటపటాయిస్తూ నుంచుని గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడు.
ప్రేమ రెండుచేతుల్లో ముఖం దాచుకుంది. ఏమిటిది? హృదయంలో ఏదో వెలితి! తను ఏదో పొందలేక పోతున్నదా? వివాహానికి పూర్వం పొందే అనుభవాలు మధురతరంగా వుంటాయ్.....నిజమేనేమో? మాటిమాటికి తనకింత నిగ్రహం ఎక్కడినించి వస్తోంది? తనను తాకాలని వచ్చే సుధాకర్ ను దూరంగా ఎలా వుంచగలుగుతోంది? నిజానికి అతడు భర్త కావలసినవాడు. అగమనేది అతడు. ఆజ్ఞాపించేది అతడు. అలాంటి వాడు దొంగచాటుగా రావడం ప్రేమకు ఇబ్బందిగా వుంది. సరదాగా ఇతర విషయాలు మాట్లాడి కాలం గడపవలసిన సుధాకర్ తనకే ధైర్యం చెప్పి అనునయంతో మాట్లాడవలసినది పోయి ఎప్పటి కప్పుడు అల్పుడిలా పరుగెత్తుకురావటం ఆమెకు నచ్చలేదు.
సుధాకర్ వెళ్ళిపోయాడుగానీ ఆమె హృదయంలో ప్రవేశించి అశాంతిని రేకెత్తించాడు కళ్ళుమూసుకుంది. ఆ కనుపాపల్లో అతను నిల్చిపోయాడు. ఏమిటి బాధ.
తెలతెల వారుతుండగా లేచి ముఖం కడుక్కుంది ముఖం తుడుచుకుని రాగానే అక్కడ ఫ్లాస్క్ కనబడింది. అప్రయత్నంగా సుధాకర్ బెర్త్ వైపుగా తొంగి చూచింది అతడు లేడు. ప్రేమ హృదయం సంతోషభరిత మైంది. పెట్టెమీద కూచొని కాఫీ పోసుకుని త్రాగుతూ సుధాకర్ కోసం నిరీక్షిస్తూంది. పాపం రాత్రి కసిరి పంపేసింది. ఏమనుకున్నాడో క్షమించమనాలేమో!
ప్రేమకు మధురమైన తలంపులు వచ్చాయి. ఇంకొన్నాళ్ళకు భార్యా భర్తలుగా వాళ్ళిద్దరూ ఇలాగే ప్రయాణం చేస్తారు. అప్పుడు....అప్పుడు? సుధాకర్ రావటంతో తలంపులన్నీ కరిగిపోయాయి ముఖ ప్రసన్నంగా చేసుకుంది.
"చాలా థ్యాంక్స్.... కోసం రాలేదుగా? క్షమించాలి. అతనేమీ అవలేదు మిగిలిన కాఫీ అతనికి అందిస్తూ "నీవు తాగు నాకింత చాలు అంది. ఫ్లాస్క్ అందుకుంటూ ఆమె చేతిపై తన చేయి వేసి క్షణం వుంచి మృదువుగా నొక్కి ఫ్లాస్క్ తీసుకొని వెళ్ళీపోయాడు. ప్రేమ హృదయం తేలికపడింది తనలో తాను నవ్వుకుంది.
అందరూ నిద్రలేచారు. రోజూ తమతో తిరుగుతున్న విద్యార్ధి నులను నిద్రమొఖాలతో చూడటం - ముస్తాబౌతుంటే చూచీ చూడనట్లు చూడటం జుత్తు విరబోసుకుంటే అందంగా వున్నానా లేదా అది జుట్టా లేదా అని పరీక్షగా చూడటానికి ఆ వేపు రావటం ఇత్యాదిని చేస్తుంటే ఆడపిల్లలకి నవ్వుగా వుంది.
