Next Page 
ఆరాధన పేజి 1

 

                                ఆరాధన
                                                                ---కోమలాదేవి

                           

    జి. టి. ఎక్స్ ప్రెస్ శరవేగంతో పయనిస్తోంది. చెట్లు, చేమలు, కొండలు, మిట్టలు, వాగులు వెనుకబడిపోతున్నాయి. వెన్నెల కాంతిలో శ్వేత వస్త్రాలంకృతమైన పృథ్వి ప్రశాంతంగా, గంభీరంగా వుంది.    
    రైల్లో సెకండ్ క్లాస్ బెర్త్ మీద పడుకుని కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు డాక్టర్ జాన్ జయ కుమార్. అతని ఛాతీమీద ఉమర్ ఖయాం రుబాయీల పుస్తకం వుంది. ఉన్నట్లుండి కిటికీలోంచి చూచాడు. ప్రకృతి ఎంత నిర్మలంగా శాంతంగా వుంది! ఆ ప్రశాంతం అణుమాత్రంగానైనా తనలో లేదు. ఎందుకని? తను తప్పునని చేయబోతున్నాడా? తొందరపడుతున్నాడా? ఆవేశంలో చేయరాని పని చేయబోతున్నాడా!
    పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నాడు.
    ఆ పేజీలోని పంక్తులను రెండు మూడుసార్లు చదువుకున్నాడు.
    గతము గతమ్మె ఎన్నటికి
    కన్నుల గట్టదు, సంశయాంధ
    సంభ్రుతము భవిష్యర్ధము సఖీ.
    అనే భావాన్ని స్ఫురింపజేసే పద్యభాగాన్ని మననం చేస్తూ కళ్ళు మూసుకున్నాడు- దీర్ఘంగా విశ్వసించాడు. ఎంత  పొరబడ్డాడు కవి! నిన్న లేదు - రేపు లేదు - కానీ అవిలేవని మానవుడు నిశ్చింతగా వుండలేడే? గతస్మృతులు -మధుర భావనలు, భావి జీవితపు తాలూకు కోర్కెలు లేనిదే మానవుడు కాజాలడేమో! ... నిన్నను ఒక పేషెంట్ తన చేతుల్లో ప్రాణం విడిచాడు. అది తను మరచిపోలేదు-అతని బాధ తనను వే టాడుతూనే వుంది. తన అశక్తతకు తానెంతో నొచ్చు కుంటున్నాడు. డాక్టర్లు వీటి కతీతులన్న వారెవరు? ..... ఔను "రేపు" వుంది - "రేపు" లేకపోలేదు. ఈనాడు తనకేమీ లేదు - కానీ రేపు తన కోర్కెలు సిద్ధించే పర్వదినం..... రేపే ఆమెను చూడబోతున్నాడు. తమ భవిష్యత్తు ఎలా రూపొందునో  అనే భయం - ఎన్నో అనుమానాలు. ఈ క్షణంకోసమేనా మనిషి జీవించేది!
    "రేవు" లోని పరమార్ధం తనకీ అవగాహనం అవుతుంది కాబోలు?
    ఆమె హృదయంలో మెదలగానే ఆనందంతో పొంగిపోయాడు. మంజుల మృదు మధుర కంఠతా ఇంపుగా కర్ణాలను సోకింది. ఎంతో హాయి అనిపించింది. ఆ కంఠం తనను వెంటాడు తున్నట్లే భ్రమ! హృదయంలోని అలజడి - అశాంతి తగ్గిపోయింది.
    కుమార్ కళ్ళు మూసుకున్నాడు.
    హృదయంలో మలచుకున్న, మంజుల సుందర ప్రతిమకళ్ళలో మెదిలింది ఆకాంక్షతో తనవైపే ఆరాధనా పూర్వకంగా చూస్తున్న ఆ విశాల వినీల నయనాలు, పాలరాతి నునుపు దినాన్ని పొందుపర్చుకున్న కోమలమైన చెక్కిళ్ళలో ప్రతిఫలిస్తున్న అరుణిమ. శిల్పి కళాఖండాన్నిస్ఫురింపజేసే ఆమె రూపం అతని కెంతో తృప్తిని ప్రసాదించింది.    
    ఇందులో పొరపాటంటూ ఏమీ లేదు. "మంజు - నాది"
    
                           *    *    *

    మెడ్రాస్ సెంట్రల్ లో రైలు ఆగింది. తను వస్తున్నట్లు ఎవ్వరికి తెలియదు కడకు మంజుకు కూడ. తనను చూడగానే ఆమె ఎంత ఆశ్చర్య పోతుందో- అనుకుని - సంతోషంతో రైలు దిగాడు.
    సామాను సర్దుకుంటూ లెదర్ బాగ్ ను అందుకోటానికి వంగిలేచే లోపల ఎదురుగా కనుపించిన సుందర వదనాన్ని చూచి చకితుడయ్యాడు కుమార్.
    ఆమె ముఖం అనందంతో గులాబి పువ్వులా వికసించి వుంది - కానీ బాగా చిక్కిపోయింది. సంపంగి మొగ్గలాంటి ముక్కు మరీ స్పష్టం గాను. విశాల నయనాలు మరీ విశాలంగాను అగుపించాయి కుమార్ కు. ముఖం జాలి ప్రేమలతో నిండిపోయింది.
    చటుక్కున బాగ్ క్రిందపెట్టి ఆమె హస్తాల్ని తన చేతుల్లోకి తీసుకొని క్షణంసేపు ఆమె కళ్ళలోకి చూచాడు. అమెకళ్ళు తారకలై నై- ఆరా ధిస్తున్నట్లు చూచింది.
    "మంజూ - నే నొస్తున్నట్లు - ఎలా తెలుసు?"
    "నిన్నటితో నా పరీక్షలు ఆఖరు. ఇవ్వాళ తప్పక వస్తారని ఊహించుకుని వచ్చాను మన హృదయాలు - తలపులు ఒకటైనప్పుడు మీరు వస్తారనుకుని రావటంలో గొప్పేంలేదు.
    "నిన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాలని ఎంతో ఉవ్విళ్ళూరి వచ్చాను"
    నేను మిమ్మల్ని ఆశ్చర్యంతో ముంచెత్తాలనే వచ్చాను"
    ఇద్దరు నవ్వారు.
    "నిన్ను చూస్తుంటే నాకీ ప్రపంచంలో పొత్తు లేనట్లే వుంది."
    "మిమ్మల్ని చూస్తుంటే నా కసలు యింకేమీ అగుపించదు"
    ఆమె కళ్ళు ఆర్ద్రాలయ్యాయి చటుక్కున ళ్ళ చాలనుకుంది కుమార్ ఆమె హస్తాన్ని మృదువుగా నొక్కి వదిలి పెట్టాడు కూలి వెంట రాగా యిద్దరు బైటికి నడిచారు.
    "ఎక్కడికి? వెళ్దాం మంజూ టాక్సీలో కూచుని అడిగాడు.
    "మీ ఇష్టం" ఆమె అతనికి సమీపంగా జరిగి కూచుంది.
    హోటల్ పేరుచెప్పి వెనక్కు చేరగిలబడి మంజుల చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ స్పర్శ వారికేదో నూతనానుభూతిని కల్గిస్తోంది. ఏదో శక్తి వారిని ఏక చేస్తోంది. మంజుల కుమార్ వైపు చూస్తోంది ఉండి ఉండి అతడు ఆమెను చూస్తున్నాడు. వారి ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి.
    హోటల్ లో దిగి గదిలోకి వెళ్ళాక గాని ఆమె నోరు విప్పలేదు.
    "ఈ రోజంతా యిక్కడే వుండి పోదామా-"
    "ఒద్దు అలా వెడదాము. నాకు అలసటగా లేదు."
    కుమార్ స్నానంచేసి వచ్చి తలదువ్వుకుంటున్నాడు. ఆమె కుర్చీలో కూచుని కాళ్ళు ముడుచుకుని తదేక దృష్టితో కుమార్ ను చూస్తోంది. అద్దంలోంచి ఆమెను అప్పుడప్పుడు గమనిస్తున్న కుమార్ హృదయంలో వేయి కుసుమాలు వికసించినై.

              
    బాయ్ కాఫీ తెచ్చిపెట్టాడు.
    మంజుల కప్పులలో పోసి ఒకటి అందించింది. ఆమెకు ఎదురుగా కూచుని కాఫీ త్రాగుతూ అడిగాడు.
    "ఓరల్ ఏలా చేశావు మంజూ."
    "బాగానే చేశాను. ప్రొఫెసర్ విశ్వనాధన్. ప్రొఫెసర్ రాబర్ట్ సన్ ల మాటలను బట్టి బాగా చేసినట్లే మొదటి రెండు ప్రశ్నలను ఆన్సర్ చేసేటప్పుడు భయం వేసింది. తర్వాత భయం ఆగిపోయింది పందు దొరికందని వాళ్ళు నన్ను ముప్పుతిప్పలు పెట్టలేదు బహుశః మన ఎగ్జామిసర్ నా పట్ల సానుభూతి చూపటంవల్లనేమో" అంది వారిపై కృతజ్ఞతగా........
    "ఐతే - డాక్టర్ మంజులా సత్యనారాయణ రావు - మీ రిప్పుడేం చేయదలచుకున్నారు?" అతడు ఆసక్తితో ప్రశ్నించాడు.
    "మీరేం చెయ్యమంటే-ఆ" ఆశగా చూచిందామె.
    "మంజూ.....మంజూ....నాకోసం యింతత్యాగం చేస్తావా?" ఉద్రేకంతో అన్నాడు.
    ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. రెప్పలు టపటప లాడింది నెమ్మదిగా అంది. "నా త్యాగం ఎంత? నేను ఎవర్నీ ఒదులుకోటాని కిష్టపడలేదు వాళ్ళే నన్ను వదిలేశారు....మీ కోసం ఏదీ చేయమన్నా చేయటానికి సిద్ధంగా వున్నాను....కానీ నన్ను మాత్రం వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపించకండి ...." ఆమె చెంపల మీదుగా కన్నీరు కారుతోంది.
    "నా మంజూ.... నా మంజూ -" అంటూ మోకాళ్ళూని ఆమె కళ్ళను తుడుస్తూ అన్నాడు. "నువ్వులేని నా జీవితం వ్యర్ధం మంజూ నిన్ను వెళ్ళిపొమ్మని ఏ పరిస్థితుల్లో కూడా చెప్పలేను. నాకు ఎవ్వరూ లేరు. పెదతండ్రి ఉన్నాడు. అతడు కడు వృద్ధుడు, నిన్ను పెళ్ళి చేసుకోటంలో నేను ఎవ్వరికీ దూరంకాను. నన్ను గూర్చి చింతించేవారు లేరు నీ సంగతి వేరు. ఆలోచించే కొలది నీవు నన్ను వివాహం చేసుకుంటే నీ కెన్ని కష్టాలు - మానసిక వ్యధకు లోనౌతానో తలంచుకుంటే నా కెంతో బాధగా ఉంటుంది. మీ అమ్మా, నాన్నగారు మాటను కాదని నాతో రమ్మని చెప్పటానికి సంకోచిస్తున్నాను....నన్ను మర్చిపోగల్గితే..." మంజుల కుమారీ తలమీద తనతలను ఆనించి వెక్కివెక్కి ఏడ్చింది. అతడు మౌనం దాల్చాడు.    
    "నాలో ప్రాణం వుండగా మిమ్మల్ని మరువటం అంటూ వుండదు. ఆనాడు మూడు సంవత్సరాల క్రితమే మీ ప్రేమచే బంధింపబడ్డాను. మీకు గుర్తులేదూ? ఆ రోజు చెయ్యి విరగ్గొటుకుని వస్తే మీరే అంతా చేశారు, మీ నోట్సులు, పుస్తకాలు యిచ్చారు ....మీరే అన్నారు మనం ఒకరికొరకు ఒకరం సృష్టింపబడ్డామని ఆమేనని సెలవలకి యింటికి వెళ్ళి మిమ్మల్ని చేసుకుంటానంటే - వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ రోజే యిల్లు విడిచి వచ్చేశాను. మీ కాక నన్ను ఆదరించిందెవరు? ఈ రెండు సంవత్సరాలు నన్ను చదివించిందికూడా మీరే కదా? పైగా ఈ విషయం మీకు. నాకు తప్ప మరో ప్రాణికే తెలియనివ్వకూడదని కట్టడిజేశారు.... ఇంతజేసిన మిమ్మల్ని మరిచిపోగల్గితే నేను మనిషినిగాను....నేను మనస్ఫూర్తిగా మీ అర్ధాంగిని కావడానికి సిద్ధంగా వున్నాను" ఆమె చలించిపోయింది.
    కుమారి జేబులోంచి ఉంగరం తీశాడు. ఆమె కళ్ళు తుడుచుకుంది ఆనందపారవశ్యంతో ఒకరి నొకరు చూచుకున్నారు ఆమె ఎడమచేతి వ్రేలికి ఉంగరం తొడిగి మృదువుగా చుంబించాడు.


Next Page 

WRITERS
PUBLICATIONS