Previous Page Next Page 
మిధ్య పేజి 6

                               
    కూతుర్ని చేర బిలిచి తల మీద చేయి వేసి, "పిచ్చి తల్లీ!' అన్నాడు ప్రేమ పూర్వకంగా. "మొదట్లో అతన్ని చూస్తె చాలు అనిపిస్తుంది. తరవాత ఒక్కసారి మాట్లాడితే ఏమి అనే ఊహ కలుగుతుంది. ఇంత జరిగాక ఈ నరంకుశతత్వాన్ని ఎదురు కొని అతన్ని చేరుకో గలవా , అమ్మా?"
    గిరిజ కళ్ళల్లో నీళ్ళు తిరిగి బొటబొట రాలి పడసాగాయి.
    "ఏడవకు, ఏడ్చి లాభం లేదు. మనమేమీ అభిజాత్యాన్ని చంపుకుని వాళ్ళ వాకిలి ముందు బిచ్చానికి నిలబడలేదు. కలకత్తా లో నాకు తెలుసిన వాళ్ళు చాలామందే ఉన్నారు. ఈ పెన్షన్ డబ్బులు, ట్యూషన్లో అక్కడ దొరక్క్ పోవు. ఆ మాటకి వస్తే ఇక్కడకన్నా అక్కడే హాయిగా బ్రతకగలం. రేపు పొద్దుట అతడు వస్తే వారం లో మనం వెళ్ళిపోగలం ఈ వారం అతన్ని నీతో కలవ నివ్వకుండా చూసుకో."
    తండ్రి తన శ్రేయోభిలాషి. ఇంతే తెలుసును గిరిజకి. పరాయి వాళ్ళ మమతల గోడల దుర్భేద్యాన్నిస్వయంగా చూసి అవగాహన చేసుకోగలిగే శక్తి ఉండి ఎలా నమ్మగలదు అన్యాయపు బందావ్యాలని? తండ్రి కధలు కధలుగా చెప్పే చిన్ననాటి స్నేహాలు, పరిణామాలు, సంఘం తల్లితండ్రులు , ఐశ్వర్యం -- వీటి మూలంగా ఏ విధంగా విడిపోయి చీలిపోయి దుఃఖ భాజనాలయేయో పదిహేనో ఏటే తెలుసుకుంది. తండ్రి కలకత్తా లో గడిపిన మనిషి. తల్లి కలకత్తా వాసిని. అక్కడే..... అక్కడే చిన్ననాటి ప్రేమికులు.... ఇంక ఆలోచించ లేదు. తల దించుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది. తెంచు కోవాలను కున్న బందా లంత త్వరగా తెగిపోయేవికావు. కొలిమి లోకాలిన నిప్పు మీద కొట్టిన సుత్తి దెబ్బలకి ఇనుము గట్టి పడుతుందే కానీ నీరు కారిపోదు. ఎంతో ప్రయత్నం తో విడదీయలాని పెద్దలు ఒక వైపు నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు నుంచి ఎద్దడిగా ప్రవహించే వరద వెల్లువలా అనురాగం హృదయపు టంచుల్ని దాటుతున్నది. కన్నీరు కార్చి మనసు దిటవు పరుచుకోవాలనుకున్నది గిరిజ. కానీ సాధ్యపడలేదు. ఆడుకున్న గుజ్జన గూళ్ళు, చెవి మెలేసి తన మీద అధికారాన్ని చలాయించిన హరికృష్ణ మోహన రూపం మెదడు లో ప్రవేశించి గిలిగింతలు పెడుతుంటే కిమ్మన లేక పోతుంది. కాలం మారింది. మనుషులు పూర్తిగా పురోగమిస్తున్నారు. తల్లిని ఎదిరించే సాహసం అతడికి ఉండక పోతుందా? గిరిజ ఆలోచనలు గతి తప్పి అసుర సంధ్య వేళ నిద్రాదేవి ఒడిలోకి చేర్చాయి.
    ఆటరవాతే తెల్లవారింది. తోలి కోడి కూయడం, రైతులు నెల మీద కర్ర తాటిస్తూ కిర్రు చెప్పుల శబ్దంతో పొలాల వైపు బయలుదేరడం , తండ్రి ఉన్న రెండు గొడ్లని అదిలించి మేత వేస్తుండడం తో మెలుకువ వచ్చింది గిరిజ కి. నిద్రపోతున్న పిల్లని ఈశ్వర చంద్రుడు లేపాడు కాదు. నిద్రలో ఉన్న సుఖం నిజ జీవితంలో కూతురు పొందలేదని ఆయనకి తెలుసును. గిరిజ లేచి మొహం కడుక్కుని ఉట్టి మీద పాలు ఎర్రగా కాచి తండ్రికి 'టీ' కలిపి, తను కాఫీ నోటి ముందు ఉంచుకునే సరికి తెల్లగా తెల్లవారిపోయింది. పక్కింటి దగ్గిర టాక్సీ ఆగడం, అందులోంచి మూర్తీభవించిన పురుషత్వంలో హరికృష్ణ లోపలికి వెళ్ళడం, అటుగా వచ్చిన గిరిజ చూడడం ఈశ్వర చంద్రుడు చూసేడు. నోటి దగ్గర గ్లాసు కిటికీ దగ్గర పెట్టేసి కిటికీ ఊచల్ని పట్టుకుని వెర్రి దానిలా అతని వైపు చూడసాగింది . వెనకగా వచ్చి కూతురు భుజం మీద చేయి వేసి, "తప్పు!" అన్నాడు ఈశ్వర చంద్రుడు.
    గిరిజ తెప్పరిల్లి వంట ఇంట్లోకి వచ్చేసింది. పొయ్యి మీద ఎసరు పడేసి స్నానం చేసి వచ్చి అంటుకోకుండా వేధిస్తున్న కొబ్బరి మట్టల వైపు దిగులుగా చూడసాగింది. కడుపులో దుఃఖాన్ని వెలికి తీసుకు వచ్చే యత్నం లో పొయ్యిలో సరుకు బిగుసుకుని గిరిజ కళ్ళ లోకి మంట ల్లాంటి పొగ కమ్మించ సాగింది.
    తండ్రి వాకిట కూర్చుని భోజనానికి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. పన్నెండు గంట లవుతుండగా గిరిజ ఆయన్ని కేక వేసింది. పీట వాల్చి ఆకూ వేసి పదార్ధాలని వడ్డించి, తండ్రి సరసనే కూర్చుంది. వంకాయ కారం పెట్టిన కూరలో ఉప్పు సంగతి మరిచి పోయింది. అయన ముద్ద చేసి కూతురు నోటికి రివాజుగా అందించ గానే నివ్వెర బోయింది. ఆలోచనల మధ్య అన్నం ననుచాయ పడటం, కూరలో ఉప్పు మరిచిపోవడం జరగడంతో సిగ్గుతో తల దించుకుంది. "ఫరవాలేదు , తల్లీ!' అన్నాడాయన కూతురు శిరస్సు మీద చేయి వేసి.
    సాయంత్రం నీరెండ తగ్గిపోయి సంధ్య పై పైకి వచ్చేసి ప్రపంచాన్ని చుట్టేసింది. ప్రశాంతమైన ప్రకృతి లో తోట మధ్య సిమెంటు చప్టా మీద కూర్చుని శరత్ బాబు నవల తిరగేస్తుంది గిరిజ. శేఖర్ మెళ్ళో లలిత బంతి పూల మాల వేయడం, అతను తుళ్ళి పడడం, లలిత పరధ్యానంగా ఉండగా ఆ మాలే అతను వేసి క్రతువు పూర్తీ చేయడం ఇప్పటికి చాలాసార్లే చదివింది గిరిజ. ఆ శేఖర్ కి, లలితకీ మధ్య అనుబంధం లో ఐశ్వర్యం కూడా అడ్డు గోడగా నిలబడింది ఒకప్పుడు. ఒకవేళ.....గిరిజ ఆలోచనలు నిరాశను కమ్ముకున్నాయి. పశ్చిమాన నెలవంక రాగానేసంధ్య పరుగు పరుగున పారిపోయింది. గిరిజ పుస్తకం తీసుకుని లేచి నిలుచుని వెళ్ళు లెక్క  పెట్టుకో సాగింది. ఐదు రోజుల తరవాత శన్యుష్ట సమయంలో తండ్రి ప్రయాణం ఖాయం చేశాడు. ఈలోగా ఒక్కసారి హరికృష్ణ ని చూడగలిగితే?  
    గిరిజ అంతరంగం లో సాగర మధనం ప్రారంభ మయింది. చెట్లూ, చేమలూ, తోటలూ ఇవి తప్పమరో నేస్తాన్ని ఎరగని ఆ పిల్ల మనో వీధిలో మరో ప్రాణికి తన గాధ చెప్పుకోవాలనే ఆరాటం అంతకంత కు ఆకాశాన్నంటుతున్నది. వడివడిగా అడుగులు ముందుకు వేసి హరికేన్ లైటు తుడిచి సంధ్యాదీపం వెలిగించి భగవంతుడి ముందు మోకరిల్లింది. రెండు సెకెండ్ల తరవాత "మామయ్యా!" అన్న కంఠస్వరం విని తనతో ప్రమేయం పెట్టుకోకుండా గుండెల మోత చెవుల్లోకి ప్రతిధ్వనిస్తుంటే హాల్లోకి వచ్చింది. పట్నపు వాతావరణాన్ని కౌగలించు కుని సూట్ లో దిగిన హరికృష్ణ ను క్షణం పరికించి చూసింది.
    "గిరిజా....గిరిజా, పొద్దుటి నుంచీ వస్తావేమో అనుకున్నాను, రాలేదేం? నన్ను చూసేందుకు వచ్చి వాకిట్లో ముండునువ్వే కనిపిస్తావను కున్నాను. ఈ పద్దతు లేప్పటి నుంచి నేర్చుకున్నావు?'అతను విరిగిన కుర్చీలో కొద్దిగా ఇబ్బందిగా కూర్చుంటూ అడిగేడు.
    గిరిజ మాట్లాడలేదు. వంట ఇంట్లోకి వెళ్లి పొయ్యి రాజేయడం లో నిమగ్ను రాలై పోయింది. ఈశ్వర చంద్రుడు సాయంత్రపు షికారు కు వెళ్లి గ్రుహోన్ముఖుడు కాలేదు అప్పటికి.
    "గిరిజా!' హరికృష్ణ పిలిచేడు. ఎంతకీ గిరిజ రాకపోవడంతో వంట ఇంట్లోకి వెళ్లి పీట వాల్చుకుని గిరిజ పక్కనే కూర్చుని ఆమె చేతిలో విసన కర్ర అందుకుని తను విసురుతుంటే గిరిజ లాక్కుంది.
    "నామీద అలిగావా , గిరీ? నేనేం చేశాను? ఇప్పుడు వచ్చేశానుగా! పొద్దుటి నుంచి అమ్మ నన్నుకదల నియ్యలేదు. ఇప్పటికి వీలు చిక్కింది."    
    గిరిజ కనురెప్పలు పైకెత్తి అతని వైపు చూసింది.
    నిష్కల్మషంగా ఉన్నాయి అతని చూపులు. "ఈ ఏటితో పరీక్ష లయిపోతాయి. గిరీ. రాజమండ్రీ లాంటి ప్రదేశం లో ఇల్లు కట్టుకుని హాయిగా ఉండాలనుంది." అన్నాడు.
    గిరిజ అప్పటికీ మాట్లాడలేదు. హరికృష్ణ వస్తాడని తెలిసిననాటి నుంచీ అతని తల్లి చివాట్లు వేసేవరకూ అతని కోసం మాటలు ముత్యాల హరాల్లా పేర్చి దండ గుచ్చినది అతని మెడలో వేయాలని. కానీ మధ్యలో కధ అడ్డం తిరిగింది. ముత్యాల సరాలు తెగిపోయాయి. ఎదురుగా కూర్చున్న అతను పరాయి మనిషిగా కనిపిస్తున్నాడు. అతనీతో ఏ విధంగా సంభాషణకు ఉపక్ర మించాలో తెలియడం లేదు.
    "మాట్లాడవెం , గిరీ?' అతను ఆశగా కళ్ళలోకి చూస్తూ అడిగాడు.
    "ఏం మాట్లాడను?" పైకి అని లోలోన అనుకుంది. "నీతో మాట్లాడేందుకు ఇప్పుడు నాకు సాహసం లేదు!' అంది.
    "మాటలే లేవా?"
    ".........."
    "పోనీ పరీక్ష లేలా రాశావు?"
    "బాగానే రాశాను."
    "క్లాసు వస్తుందా?"
    "అనుకుంటున్నాను."
    అంతవరకూ సహనం వహించిన అతడిలో ఒక్కసారి కోపం కట్టలు తెచ్చుకుంది. "నాతొ మాట్లాడటం ఇష్టం లేదా నీకు? నువ్వెవరివో తెలుసా?'అతని కళ్ళు చండ్ర నిప్పులు చెరిగే అగ్ని శిఖలా మారిపోయాయి.
    "నేను....నేను గిరిజని."
    "ఎంత ధైర్యం! గిరిజట, గిరిజ. నువ్వు నా కేమౌతావో తెలుసుకునే ఈ మాట అంటున్నావా!"
    "ఆ," గిరిజ లో ధైర్యం తన్నుకు రాసాగింది.
    "నువ్వు నాకు కాబోయే భార్యవి." అతను సూటిగా చూస్తూ అన్నాడు.
    గిరిజ పెదాలు వణికేయి. క్రమంగా నిర్జీవ శిలా ప్రతిమలా మారిపోయి, అతని వైపు చూడసాగింది.
    "మాట్లాడవేం?' అతను ఆమె రెండు భుజాలను కుదిపి కళ్ళలోకి చూస్తుంటే పగలబడి నవ్వింది గిరిజ. ఇంకా ఇంకా నవ్వుతుంటే "నీకు గానీ పిచ్చెక్క లేదు కదా!" అన్నాడు అసహనంగా.
    "ఏదీ మళ్ళీ అను. నేను నీ భార్యనా? గమ్మత్తుగా ఉంది. మా దగ్గర తగినంత ధనం లేదు. కులంలో వెలివేయబడ్డ మనుషులం. దేనికీ, హరీ, వేళాకోళం ఆడతావు!"
    "గిరిజా!' అతను -- చేతులు వదిలేశాడు. అప్రతిభుడై వింటున్నాడు.
    "మీ అమ్మతో సంప్రదించి మన పెళ్లి ఏర్పాట్లు చేస్తావా , హారీ?"
    "అమ్మకి నువ్వంటే ప్రాణం, గిరీ. నిన్ను వదులు కుని నేను....నేనెలా బ్రతక గలను?"
    "పిచ్చి భ్రమ! లోకం చాలా విసృతంగా ఉంది. మీ వంశం లో సదాచారాలూ, సంప్రదాయాల మధ్య పెరిగే పిల్లని కట్నంతో తెచ్చుకోవచ్చును. మీ అమ్మని ఒక్కసారి అడిగి రేపు వచ్చి కనిపించు, హరీ!"
    "నువ్వు రావా'?"
    "రాను."
    "ఎందుకని?"
    "అదంత ప్రస్తుతం కాదు!"
    హరికృష్ణ లేచి నిలుచున్నాడు.
    "కాఫీ తాగి వెళ్ళు, హరీ!"
    "వద్దులే. కడుపు నిండి పోయింది ఇప్పటికే" అతను గాలి వాటుగా అనేసి మెట్లు దిగాడు. వీధిలోనే ఈశ్వర చంద్రుడు ఎదురయేడు'. అతనికి నమస్కారం చేసి, "వస్తాను మామయ్యా"అంటూ సాగిపోయేడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS