గిరిజ తనదేలా అవుతుంది? మన్మోహన్ అగ్నిసాక్షిగా పెళ్ళాడిన ఇల్లాలు. అతను మంచివాడు కనక గిరిజ అడ్రసు ఇస్తూ ఉత్తరం వ్రాసి తగిన ట్రీట్ మెంట్ తీసుకోమన్నాడు. డబ్బుని గుప్పించినా గిరిజ, తన స్నేహితురాలు ఆపరేషన్ సమయంలో తన పక్కన ఉంటె ఆ శాంతి చాలదూ ఈ జీవితానికి? బ్రతుకంతా చేదుగా గడిపినా చివరి ఘడియల్లో పొందే తృప్తి కి అర్ధం విడమరిచి తను చెప్పగలడా? హి భగవాన్! గిరిజ రాకపోతే ప్రానాలిలా గిరిజ తపనతో పోవలసిందేనా? ప్రపంచం లో దురదృష్ట వంతు డేవరూ అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆత్మీయుల కోసం విలపించే సమయంలో వాళ్ళు చేరువలో ఉండీ దూరం అయిపోతే అంతకన్నా దురదృష్టం మరొకటి ఉంటుందా అని జవాబు చెప్పేవాడు. అతని కనుకోలుకల్లో అశ్రు బిందువులు నీటి ముత్యాల్లా మెరుస్తున్నాయి. క్షణం అవి అక్కడే దోబూచులాడి చెంపల మీదికి జారిపోయేయి.
"హరీ!" శ్యామల అతని పక్కగా మంచం మీద కూర్చుని, వీపు మీద చేయి వేసి తన వైపు తిప్పుకుంది. అతను కళ్ళు తెరిచినా ఆ కళ్ళలో కాంతులు లేవు. అవి ఆరిపోయే ముందు వెలిగే దీపాల మాదిరి ఉండి ఉండి మెరుస్తున్నాయి. శ్యామల అతడిని ఆప్యాయంగా తన వైపు మరోసారి తిప్పుకుని, "నీ గిరిజ వచ్చింది, హరీ. నువ్వింక దిగులు పెట్టుకోకూడదు. నీకేం లోటు? చెల్లెల్ని మించి నేనున్నాను. స్నేహితురాలు గిరిజ ఉంది. అందరినీ మించి అమ్మ ఉంది. అయన వస్తున్నారు ఇటు. వెనకాల ఎవరున్నారో చూడు. చూడాలి. ఏదీ, ఒక్కసారి కళ్ళు తెరు" అన్నది.
హరికృష్ణ కళ్ళు మూతలు పడిపోతున్నాయి. విజయకుమార్ వెనక చిట్టిబాబు వేలు అందుకుని నడుస్తున్నాడు. వాడి వెనక తల్లీ, తండ్రి. ఆ తరవాత ఆ తర్వాతే అతనికి ఎంత ప్రయత్నించినా మసక మసక గా తప్ప ఆ వ్యక్తీ అసలు రూపం అగుపించడం లేదు. సన్నగా పొడుగ్గా...."గి..రి...." అతని పెదాలు వణుకుతూ వల్లిస్తున్న మాటలు గొంతు లోంచి ఊడి రావడం లేదు. అతని కళ్ళల్లో మరోసారి నీళ్ళు కమ్ముకున్నాయి. మహేశ్వరి కొంగులో మొహం దాచుకుని ఏడుస్తుంటే "నేనున్నానత్తయ్యా . హరికి ఏమీ కాదు ధైర్యం తెచ్చుకోవాలి మీరు" అని ఓదార్చింది. మహేశ్వరి ఆశలు తిరిగి చిగురించసాగేయి.
అతని కా రాత్రి పూర్తిగా తెలివి లేదు. మరో రెండు రోజులకి ఆపరేషన్ వాయిదా పడింది. మరునాడు అతను మగత నిద్రలో నవ్వుతూ కలావరించసాగెడు: "నువ్వు నన్ను అనవసరంగా అంటున్నావు. నేనేం దేవదాసు ని కాను. తాగేవాళ్ళందరూ దేవదాసులే అయితే ఇంక అయినట్టే....."
"నో. ఒట్టు. ఇంక మీదట తాగను. తాగితే చూడు. టి.బి. వచ్చేసింది. ఆపరేషన్ చేస్తే పారూని నేనెలా చూడగలను?
"నవ్వకు, శ్యామలా. అచ్చు పొరపాటు. పారు కాదు. గిరిజ. గిరిజ కి దూరం అయి వెళ్లిపోతుంటే మనసు గాలిలో తేలిపోతుంది సంతోషంతో.
"చెల్లెలంటే నీలా ఉండాలి. కొట్టకుండా, తిట్టకుండా చాకచక్యంతో నా అలవాటుని నువ్వే మన్పించేవు. లేకపోతె ఆ సూర్యనారాయణ తో శారద ఇంట్లో జీవితం గడిపి శరీరాన్ని కుళ్ళ బోడుచుకునే వాడిని. నాకిప్పుడే రోగాలు లేవు. చూడు, ఎంత ఆరోగ్యంగా ఉన్నానో?"
హరికృష్ణ మగత లోనే ఏడుస్తాడు. "నాకు పాటలు రావు, శ్యామలా, సీసా పట్టుకుని పాడేందుకు. ఏం పాడమంటావ్? ఎప్పుడో, ఎక్కడో కవి హృదయాన్ని సిరా చేసి, మెదడు భావాలు చేసి రాసిన పాట రేడియో లో విన్నాను. అది పాడమంటావా?" హరికృష్ణ సగం కళ్ళు తెరుస్తాడు. వెంటనే మగత లోకి జారిపోతూ, "వేదాంతపు వీధి చివర వేడెక్కిన మైలు రాయి విరిగి ముక్కలై....పోయెనే....నాకు రాదు. లీలగా విన్నది గుర్తుకు రావడం లేదు. నేనీ పాటని పూర్తీ చేయలేను. బ్రతుకే అర్ధంతరంగా ఆగిపోతుంటే అప్ట్రాల్ పాటో లెక్కటోయ్!" అంటాడు.
"గిరిజ అందకుండా వెళ్ళిపోయింది. చివరి కొమ్మని పూచిన పువ్వు చేతికి అందలేదట. ఎంత బాగుందో ఉపమానం , చూశావా?" అంతే. ఆ తరవాత హరికృష్ణ మాట్లాడలేదు. డాక్టర్ వచ్చి ఇంజక్షన్ నిచ్చి పడుకో బెట్టింది.
మరునాడే ఆపరేషన్. అపరేషన్ కి ముందే హరికృష్ణ కోలుకున్నాడు. అతని కళ్ళు వెతక నవసరం లేకుండా తల దగ్గిర నిలుచున్న గిరిజ అతని తల మీద ఆప్యాయంగా చేయి వేసి, "నేనున్నాను. నీకేం భయం లేదు. పెద్ద పెద్ద ఫారిన్ డాక్టర్లు నీకు ఆపరేషన్ చేస్తున్నారు. నీకు ప్రాణ భయం లేదు" అన్నది.
అతను కృతజ్ఞత తో తృప్తిగా చూసి నిట్టుర్చేడు. స్ట్రిచ్చర్ ని తీసుకుని ఆపరేషన్ దియేటర్ లోకి వెళ్ళేరు. సుమారు మూడు గంటల ఆపరేషన్ లో అందరి ప్రాణాలూ గుప్పిట్లోనే ఉన్నాయి. ఆపరేషన్ విజయవంతం కావడం అంత సులభం కాదని అందరికీ తెలుసు. అయినా ఆశ మనిషిని ప్రాణం పోసి నిలుపుతుంది. మూడు గంటలు మూడు యుగాలుగా మాదిరిగా గడిచేయి. అప్పుడే డాక్టర్లు నవ్వు మొహాలతో బయటి కొచ్చేరు. గిరిజ చేతిని అందుకుని మనస్పూర్తిగా చెప్పుతుంటే ప్రాణాలు లేచి వచ్చేయి.
కళ్ళు తెరిచి నీరసంగా తన వారందరినీ చూసి నవ్వేడు హరికృష్ణ. మహేశ్వరి గిరిజ కి దగ్గిరగా వచ్చి "నీ మేలు మరిచి పోలేను. చిన్నదానివైనా నాకుజ్ఞానో దయం తెప్పించేవు. నిన్నే కష్టపెట్టేను" అన్నది.
"నాదేం ఉంది! నేను మీకు తోడుగా వచ్చెను. హరికృష్ణ బ్రతికింది ఆ డాక్టర్ల చేతుల్లో" అన్నది విరక్తిగా.
"కాదు. నీరాకే వాడికి ప్రాణం పోసింది. నువ్వే రాకపోతే ఈ డాక్టర్ల ప్రయత్నాలు అంత సులభంగా ఫలించేవి కావు" అన్నది కంట తడితో. హాస్పిటల్ లో హరికృష్ణ మరో పది పదిహేను రోజులు ఉండవలసి వచ్చింది. మహేశ్వరి మాత్రం అతనికి తోడుగా ఉండిపోయింది. డిశ్చార్జి ఆయె ముందు వస్తామని చెప్పి జగన్నాధం , అరుంధతి, శ్యామల, విజయ కుమార్, చిట్టిబాబు వెళ్ళిపోయేరు.
గిరిజ హరికృష్ణ మంచం దగ్గర కాస్సేపు కూర్చుని "ఆలోచిస్తూ మళ్ళీ ఆరోగ్యం పాడు చేసుకోకు. తల రాతల్ని తప్పించుకోలెం మనం. అయిపొయింది మరి తిరిగి రాదు. నన్ను గురించి ఆలోచనలు నీ కంత శ్రేయస్సుని ఇవ్వవు. స్నేహితురాలిగా ఎప్పటికీ ఉంటాను. వెళ్ళే ముందు తప్పకుండా మద్రాసు వచ్చి మా ఇంట్లో ఉండు. ఇంతకూ మించి నిన్ను కోరేది ఏమీ లేదు." అన్నది. అప్పటికే ఆమె గొంతు గద్గాదికమైపోయి కనుపాపలు కన్నీటి తెరల చాటున మిలమిల లాడుతున్నాయి చేప, పిల్లలు నీటిలో ఉన్నట్లుగా.
అతను లేచి కూర్చున్నాడు. మహేశ్వరి తప్పిదం చేసిన మాదిరిగా తల దించుకుంది. హరికృష్ణ గిరిజ వైపు తిరిగి ప్రశాంతంగా అన్నాడు: "నన్నెందుక , బ్రతికించేట్లు చేయమన్నావు వాళ్ళని? నేను పోవడం లో నష్టం లేదు కద?"
"నష్టం!' వ్యంగ్యంగా నవ్వింది గిరిజ. "నీ ఒక్క ప్రాణం ఎవరికీ లాభం లేకపోయినా నీకోసం ఇంకా అమ్మ బ్రతికి ఉంది. ఆవిడతో నువ్వు మాట్లాడడం లేదు. భగవంతుడు నిమిత్త మాత్రంగా అత్తయ్య ని ఉపయోగించుకుని మన జీవితాలు ఒకటి కాకుండా చేశాడు. నువ్వది పూర్తిగా మరిచిపోయి ఇందుకు అత్త బాధ్యురాలన్నట్లు ప్రవర్తిస్తున్నావు."
హరికృష్ణ కూడా నవ్వేడు. అతని నవ్వు చాలా చురుగ్గా తగిలింది. వేదాంత ధోరణి లో నవ్వే ఆ నవ్వు నిర్వచనం తెలియలేదు గిరిజ కి.
"నేను నీకు తత్త్వం కానీ, గీతోపదేశం కానీ చేయడం లేదు, హరీ. నేను నీ చిన్ననాటి నేస్తాన్ని. ఈ విషయం మరిచిపోక పొతే మాత్రం మా ఇంటి కి రా. నేను వెళ్లొస్తాను" అన్నది మహేశ్వరి దగ్గరా, అతని దగ్గరా సెలవు తీసుకుంటూ.
హరికృష్ణ తల పంకించి ఊరుకున్నాడు.
గిరిజ కారులో వెళ్ళిపోయింది మహేశ్వరి ని కూడా ఆహ్వానించి.
కాలం ఎప్పుడూ ఒకే విధంగా పరుగులు పెట్టదు.
నదీ ప్రవాహం ఎప్పుడూ ప్రశాంతంగా కదిలిపోదు. ప్రకృతి ధర్మం అంటూ ఒకటి ఉన్నాక ఆ విధంగా జరగకుండా పోదు. నిలువెత్తు కొండలు ఏ ప్రకృతి ప్రలయాట్టహాసానికో అగాదాల్లోకి కూరుకు పోతాయి. సముద్రాల అలకల్లోలా లవుతాయి. ఝుం ఝూం మారుతాలు ప్రపంచాన్ని ముంచేయగలవు. నేడున్న మనిషి రేపు ఉండక పోవడం లో అధర్మ మేమీ లేదు. నిలువెత్తు పచ్చని చెట్లు పిడుగు పాటు కి నెల కూలుపోవచ్చు. ఆ చెట్టు భవిష్యత్తు ని కొన్ని యుగాలు కాకపోయినా కొన్ని తరాల వరకూ చిత్రించుకొని తృప్తి పడ్డ ఎదుటి వ్యక్తికీ ఆశని పాతం కావచ్చును. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. వర్షాకాలంలో మబ్బులు పట్టి కుంభ వృష్టి కురిపించడం ప్రకృతి ధర్మం. మెరుపులు మెరిసి పిడుగులు అదిరి పోయేట్లు నేలకు రాసుకు పోవడం దాని ధర్మం. ఒక్కోసారి అకాల వర్షాల్లోనే పిడుగులు పడినా అందులో విపరీతం ఏమీ లేదు. ఇంతకీ మన్మోహన్ పూర్తీ చేసుకున్న చదువు విమానం నేల కూలడంతో ప్రకృతి లో కలిసిపోయింది. గిరిజ నుదుటి వ్రాత అనుకోవడం లో తప్పేమీ లేదు. విషయం విని కుప్పలా కూలిపోయింది గిరిజ. కన్నవారూ, తోడ బుట్టిన వారు, అప్తులూ, అందరూ వచ్చేరు. ఎవరు వచ్చినా గిరిజ దుఃఖాన్ని కొనగోటి తో మీటి వేయలేరు. రమేష్ తల్లడిల్లి పోయేడు. తను వెళ్ళిపోతూ గిరిజ బాధ్యతలన్నీ రమేష్ కి ఒప్పగించేడు మన్మోహన్. మహేశ్వరీ, పరమేశ్వరీ అందరూ వచ్చేరు. తెల్లని బట్టల్లో మూర్తీభవించిన శోక దేవతలా ఉన్న గిరిజ ని ఓదార్చి ఊరడించేందుకు భయపడిపోయేరు. మన్మోహన్ అకాల మరణం వినడానికే నమ్మశక్యం కావడం లేదు. శవాన్ని చూసినా మనిషి పోయేడనే తృప్తి ఉండేది. కానీ, అతని ఆచూకీ ఏ కీకారణ్యం లోనో, ఏ మహా సముద్రం లోనో అంతూ దరీ లేకుండా పోగానే ఎవరికి వారే గుండెలు పగిలిపోయేలా విలపించేరు. పది రోజులు గడిచేక ఎవరి దారిన వాళ్ళు ఆత్మీయు లనబడేవాళ్ళు అందరూ వెళ్ళిపోయేరు. అత్తగారు తనతో బాటు కలకత్తా రమ్మన్నది. పెద్ద కొడుకు సతీష్ మరదలి దగ్గరగా వచ్చి, "చూడమ్మా, వాడు పోయేడనీ, నిన్ను అల్పంగా చూస్తామనీ అనుకోవద్దు. మా తమ్ముడు మనిషివి నువ్వు. నిన్ను మరో తమ్ముడిలా చూసుకుంటాం. నీకు ఏ ఇబ్బందీ రానివ్వను. వాడి తాలుకూ భాగం తీసుకుని నవ్వు అమ్మతో ఉండవచ్చును." అన్నాడు.

గిరిజ రమేష్ వైపు చూసింది. రమేష్ కల్పించుకుని అన్నగారితో అన్నాడు: 'ఆవిడకి నా ఇంట్లో ఉండాలనుంటే నాకూ అభ్యంతరం లేదన్నయ్యా. తమ్ముడు పోయేడు వాడి గుర్తును మిగిల్చి, మేము ముందు నుంచీ అలవాటు అయిన మనుషులం. మీ దగ్గిర కొత్త అని కాదు. ఉద్యోగం మానేసి అక్కడికి వచ్చి ఏం చేస్తుంది? ఇక్కడే ఉండనీ, అన్నయ్యా. నీకేదైనా ...."
"నాకలాంటి అభ్యంతరాలు లేవు, తమ్ముడూ. గిరిజ ఎక్కడున్నా తన సుఖాన్ని ఆశించే వాళ్ళం. ఇప్పుడు సుఖానికి అర్ధం లేదు. గతాన్ని గుర్తుకు తెచ్చుకోకుండా సుఖం మాట వదిలేసి కష్టపడకుండా ఉంటె అంతే చాలు!' అన్నాడు మనస్పూర్తిగా. ఇందుకు తల్లి కూడా ఇంకేమీ ఆటంక పరచలేదు.
