Previous Page Next Page 
మిధ్య పేజి 3


    భోజనం చేస్తున్నప్పుడు మరోసారి భర్తని కదిపింది భువనేశ్వరి. "ఎదుగుతున్న ఆడపిల్ల గుండెల మీది కుంపటి లా ఉంటున్నదనే సంగతే మీకు అప్రస్తుతం లా ఉంది. ఊళ్ళో దాని ఈడు పిల్లలు పెళ్ళిళ్ళ యి తిరుగుతున్నారు. ఇది కానీకి కొరగాని దానిలా గంగిరెద్దు లా వాళ్ళ ఇంటి చుట్టూ తిరగడం నాకేం నచ్చలేదు. దాని ఎదుటే నన్ను చులకన చేస్తూ మీరు దాన్ని వెనకేసుకు వస్తుంటే అది ఏకు మేకై గుచ్చు కుంటుంది. మీకు స్తోమత లేదని తెలిసీ నేనెందుకు బాధపెట్టడం? మా తమ్ముడి కిచ్చి...."
    "భువనేశ్వరీ!' అయన గొంతు కొండ రాళ్ళ ని బ్రద్దలు చేసే బర్మాలా ఉంది. "ఒకసారి కడిగిన కాలు మరోసారి కడగడం మా వంశం లో లేని విషయం. నీ తమ్ముడే కనక నీకు సానుభూతి ఉండవచ్చు. కానీ.... పదమూడేళ్ళ వారతో దాని బ్రతుకు ముక్కలు చేసే కసాయి వాడిని కాను నేను. నీ తమ్ముడు పేరు మోసిన ప్లీడరై నంత మాత్రం లో నేను ధనాశకు లొంగి పోతాననుకోవద్దు. దానికి ఈడై న వాడిని చూసి నేను....... నేనే పెళ్లి చేస్తాను, భువనేశ్వరీ. ఈ కళ్ళకి రెప్పలు దూరం కాకపోతే ఆ రోజు నువ్వే నన్ను ఆకాశాని కెత్తుతావు. పదమూడేళ్ళ ఈశ్వర్ తో అది ముచ్చటగా ఆడుకుంటుంటే నీకు ఏమీ అనిపించడం లేదూ?"
    అయన ప్రశ్నకి భువనేశ్వరి అవాక్కయి డంగై పోయింది. "ఏమిటి మీరనేది! ప్రొద్దున్న కీ, రాత్రికి జరుగుబాటు అయేందుకు రెక్కలమ్ముకుని బ్రతుకుతున్న మనకీ, సిరిసంపదల తో తులతూగే ఆ ఈశ్వర్ ఇంటికీ సాపత్యమా? లేని ఆశలు మనం కల్పించుకుని పిల్లకి మద్దతు ఇవ్వడం వివేకం అయినని కాదు. పసిది, అభం శుభం తెలియనిది. దాని ఎదుటే ఇలా మాట్లాడడం భావ్యం కాదు."
    ఆవిడ మాటలు పూర్తిగా విని వేదాంతి లా చిన్న నవ్వు విసిరేసి, "అలాగే. నీ ఇష్ట ప్రకారమే నడుచు కుంటాను. చూడు! పిల్లని మాత్రం పంజరం లో బంధించాలని ప్రయత్నం చేయక -- ఎగిరే ప్రయత్నంలో పంజరం పగిలి పోగలదు." అన్నాడు.
    మహేశ్వరీ ఈశ్వర్ ల ఆటపాటల తో కాలం కళ్ళెం లేని గుర్రం లా పరుగులు పెట్టసాగింది. నరేంద్ర పురం లో హైస్కూలు చదువు ముగించి పట్నం బయలుదేరాడు ఈశ్వర్.
    దాదాపు నాలుగైదు సంవత్సరాలు గా ఇంట్లో పిల్లి మాదిరిగా తిరిగే మహేశ్వరీ రాకపోకలు క్రమంగా తగ్గిపోసాగాయి. ఈశ్వర్ తల్లి భావానికి మహేశ్వరి పట్ల ప్రగాడమైన అభిమానం ఉంది. ఈడేరి పల్లెవాటు వేసుకుంటూ యౌవనం లో అడుగుపెట్టి ప్రకృతి ప్రసాదించిన అపురూప లావణ్యం తో తిరిగే మహేశ్వరి ని తన ఇంటి కోడలుగా చేసుకోవాలనే స్త్రీ సమాజం అయిన ఉబలాటం ఉండేది.
    భర్తకి తాంబూలం చిలకలు అందిస్తూ రెండు సార్లు ఆ విషయం ఎత్తి వదిలేయడం , అందుకు చందీరావు దగ్గిరి నుంచి సమాధానం రాకపోవడం, మెట్ల వరకూ వచ్చిన మహేశ్వరి విని వెనుతిరిగి వెళ్ళిపోవడం జరిగేవి.
    స్కూలు ఫైనలు కూడా చదవని మహేశ్వరి పల్లెటూర్లో మామిడీ, పనసా, సపోటా తోటల మధ్య చెలిమి పేర చేసిన స్వైర విహారం తలుచుకుని కిటికీ గుండా శూన్యా కాశం లోకి చూస్తూ తనలో తను నవ్వుకునేది. తల్లి బియ్యం కడిగి ఇమ్మన్నప్పుడు బావి నూతి పళ్ళెం  దగ్గిరికి వచ్చి అక్కడ నుంచి ఎదురు ఇంటి పెరటి గోడ  దగ్గిర విస్తారంగా పెరిగి ఫలభారంతో నెలకి వంగిపోయే మామిడి చెట్టుని తదేక ధ్యానంతో చూస్తూ, చిన్ననాటి ఈశ్వర్ చేష్టలు నెమరు వేసుకుంటూ, తనని తాను మరిచి, సర్వం మరిచిపోయి గంటల తరబడి కూర్చుండి పోయేది. భువనేశ్వరి కూతురి పరధ్యానాన్ని ఏనాడూ గమనించలేదు. ఒక్కగానొక్క బిడ్డ అని అపురూపంగా చూసుకోవడం వరకే ఆవిడకి తెలుసును. మద్రాసు మహానగరం లో చదువు సంధ్య ల్లో మునిగిపోయిన ఈశ్వర్ కి ఉత్తరం వ్రాస్తే చదువుకుని కోసమే నిరీక్షిస్తూ తన ఆరాధన లోనే ఊపిరి పోసుకుంటున్న విషయమే తలెత్తేది కాదు.
    కొడుకు సెలవులకి ఇంటికి వస్తాడని సంబరంగా చెప్పింది భవాని. మహేశ్వరి మౌనంగా విన్నది. ఆవిడ ఆ పిల్ల తల మీద చేయి వేసి, "మామిడి చెట్టు ఎక్కుతా వేమిటి, మహేశ్వరీ!" అని అడిగింది నవ్వుతూ.
    మహేశ్వరి తల దించుకుంది.
    చందీరావు ప్రచండ రౌద్రమూర్తి లా మెట్ల మీంచి కేక పెట్టాడు. మహేశ్వరి అదిరిపడింది. ఆయన దగ్గరగా పిలిచి దోషికి శిక్ష విధించే తీరుగా మహేశ్వరి ని శాసించేడు.
    "నువ్వూ, మా నాన్నా ఆస్తి పాస్తులకి ఎర వేసి ఉంచినట్లున్నారు. ఈశ్వర్ నా ఒక్కగానొక్క బిడ్డ. ఐశ్వర్య వంతుల సంబంధం వెదికి తీసుకువచ్చి నేనే సగర్వంగా నలుగురూ నాలుగు కాలాల పాటు చెప్పుకునే విధంగా భూవభొంతరాలు దద్దరిల్లేటట్లు పెళ్లి చేస్తాను. చిన్నప్పటి స్నేహాలు పెరిగి పెద్దయేక పెళ్ళికి దారి తీయాలనే రూల్ ఏమీ లేదు. నువ్వు పేద పిల్లవి. అయినా ఇంత దగ్గర సంబంధం చేసుకోవడం మా ఇంటా వంటా లేని ఆచారం. నువ్వు వాడిని మరిచి పోవాలి. రేపు వాడు వస్తాడు. వాడి కంటికి కనిపించడం నేను సహించలేను. ఒకవేళ ఆ విధంగానే జరిగితే పర్యవసానం చాలా అసహ్యకరంగా ఉంటుంది.
    "ఈ ఊళ్ళో నే కాదు, మొత్తం తూర్పు గోదావరి జిల్లాలో నాకున్న పరమతి నీకు తెలియనిది కాదు. మీ నాన్న ఉద్యోగం తీయిస్తే మీ బ్రతుకు లేమిటో ఆలోచించు!"

                                     
    "మామయ్యా!" తెల్లబోయి చూడసాగింది మహేశ్వరి.
    "నువ్వా విధంగా పిలుస్తుంటే నాకు నరనర నరకం అనుభవిస్తున్నట్లుంది. చిన్నప్పటి నీ కేక అలవాట యెందుకు నేను కారణం కాదు, ఈశ్వర్ తల్లి భవాని. చిన్న పిల్లవనే సదుద్దేశ్యంతో ఆనాడు భరించెను ఆ సంబోధనని. కానీ, నేను ఇప్పుడు ఆ పిలుపే వినలేను. రేపు నువ్వీ ఇంటికి వచ్చేందుకు వీలులేదు!" అది చండ శాసనమే అయింది మహేశ్వరి పాలిట.
    తూరుపు రేఖలు తెల్లబడక ముందే ఎదురింటి కారు హరన్ మోత వినిపించడంతో చటుక్కున తెలివి వచ్చింది మహేశ్వరి కి. తలుపులు తెరచుకునే ఉన్నాయి. తల్లి వీధి వాకిలి కసుపు ఊడ్చి ముగ్గు పెడుతున్న శబ్దం వినిపిస్తుంది. ముగ్గు కర్ర అరుగు మీద కర్రు కర్రు మంటూ చప్పుడు చేస్తుంది. తండ్రి అప్పటికే నిద్ర లేచి పొలం గట్టు వైపు షికారు వెళ్లినట్టున్నాడు.
    ఒక్క ఉదుటున వెళ్లి ఆ ఇంటి ముందు వాలాలనే కోరికకి ఉరి బిగించింది చందీరావు రంపపు కోతల్లాంటి అజ్ఞ. కళ్ళనీళ్ళు అస్పష్టంగా కదిలేయి. పెరటి ద్వారం గుండా తలుపు సందులోంచి చూడసాగింది. లావుగా, ఎత్తుగా, బలంగా , విశాల వక్షః స్థలం తో నవీన పద్దతుల్లో ముస్తాబై లోపలికి వెళ్ళిపోతున్న ఈశ్వర్ కనిపించగానే గుప్పిట్లో గుండెల్ని బిగించి సలుపుతున్న బాధ ననుభవించింది. సాయంత్రం వరకూ వీధి వాకిలి వైపు నిర్నిమేష దృక్కులతో చూడసాగింది. గాలి వాటుకు తలుపు కదిలి నప్పుడల్లా మహేశ్వరి మనసు వశం తప్పి అటు నిలిచి పోయేది.
    సాయంత్రం షికారు నుంచి వచ్చిన తండ్రి భోజనాల దగ్గిర కూతుర్ని అడిగేడు: "ఏమమ్మా, ఈశ్వర్ వచ్చేడుట పొద్దుట. నువ్వు వెళ్లి చూశావా?"
    భువనేశ్వర్ అందుకుంది: 'అది ఇల్లు దాటలేదు.  పొద్దున్న వచ్చిన మనిషి మనింటికి రాలేదేమో?"
    "దూర ప్రయాణం కదా. బడలీ ఉంటాడు. మనింటి కెందుకు రాడు, భువనేశ్వరీ? మహేశ్వరీని చూడకుండా ఉంటాడా?"
    వీధి వాకిలి తుడుస్తున్నప్పుడు భువనేశ్వరీ తలెత్తి చూసింది. భర్త పక్కన కొంచెం దూరంలో చతికిలి బడి వడ్డిస్తూ అన్నది; "ఇప్పుడు ఈశ్వర్ ని మరెక్కడైనా చూస్తె పోల్చు కోలేక పోయేవాళ్ళం. ఎంత ఎదిగి పోయేడనీ! దొరల బిడ్డలా ఉన్నాడు. తల్లిని పోలినందుకు అందంగా చాలా బావున్నాడు."
    ఆవిడ కళ్ళు హరికేన్ లాంతరు వెలుగులో తళతళ లాడాయి. పసిగట్టి దుర్గా రాం అన్నాడు: "నువ్వు మొదటి నుంచీ నా మాట కాదంటూనే అన్నావు. నేను చెప్పలేదూ-- అమ్మాయి అదృష్ట వంతురాలని. మన తల్లి లక్ష్మీదేవి ని కౌగలించు కుని పుట్టింది."
    చీకట్లో క్రీ నీడగా ఉన్న ప్రదేశం లో మహేశ్వరి కళ్ళలో నీళ్ళు జలజల రాలి విస్తట్లో పడడం తల్లితండ్రులు ఇద్దరూ గమనించలేదు. దుఃఖాన్ని దిగమింగు తుంటే ముద్దా దిగేందుకు వీలు కావడం లేదు.
    "అరె! మజ్జిగ పోసుకోకుండా లేచి వేడుతున్నావెం, మహేశ్వరీ?" అన్నది తల్లి.
    తండ్రి చిన్నగా శబ్దం చేస్తూ నవ్వేడు. "నేను మంచి రోజు చూసి ఇన్సూర్ చేసిన ఐదు వేలూ, ఇల్లు తనఖా పెట్టి ఆ డబ్బూ మొత్త మైదారు వేలు కట్నంగా ఇస్తానని చెబుతాను. వాళ్ళకీ ఇష్టం అయే ఉంటుంది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS