Previous Page Next Page 
మిధ్య పేజి 2


    "మహేశ్వరీ!" అతని మాటలు పూర్తీ కాలేదు. బలంగా గురి చూసి ఇనుప గుండు ఆవిడ గుండెల మీదికి  విసిరినట్లయింది. "నా పేరు...." అనుకోకుండా అన్నది.
    అతను అప్పుడు ఇటు వైపు తిరిగాడు. "నీ గొంతు గుర్తు పట్టేను. నువ్వే ఈ జమీకి అధికారిణి వని మొన్నమొన్ననే తెలిసింది. ఇంత రాత్రి ఇలా ఎందుకు వచ్చేవు?"
    "ఈశ్వర్!' పెదాలు ఆ ప్రయత్నంగా కదిలేయి. మహేశ్వరి స్థాణువైపోయింది. నిలువెల్లా మూర్చ వచ్చినట్లు కదిలిపోసాగింది.
    "పాపని తీసుకు వెళ్ళవద్దు. అక్కడే ఉంచేయి. నేను ఇన్నాళ్ళూ అపురూపంగా చిత్రించుకుని ఆరాధించిన వ్యక్తీ అసలు రూపు బయట పడింది. నేను విన్నది అబద్దం అనుకున్నాను. నిజం కాకూడదని ప్రార్ధం చేసు దైవాన్ని, మహేశ్వరీ...." అతను బాధగా అన్నాడు. "మరిచి పోవాలనుకుంటున్న నన్ను మళ్ళీ పాత జ్ఞాపకాలని తవ్వి బాధ పెడుతున్నావు. వెళ్ళిపో, మహేశ్వరీ. వెళ్ళు. పాపని అలాగే వదిలేసి వెళ్ళు. ప్రాప్తం ఉంటె దక్కుతుంది. లేదా ......నేనేమీ చేయలేదు."
    "వెళ్ళను!" నిశ్చలంగా జవాబు చెప్పింది మహేశ్వరి. "పాపని వదిలి వెళ్ళను నేను. నువ్వే ఈ ఇంటి యజమానివని తెలిస్తే రాకపోయేదాన్ని. నిద్రలో ఉన్న నన్ను లేపి బలవంతాన పంపెరాయన. అలాచేసి ఉండకపోతే ఇలా నీకు కనిపించి ఉండేదాన్ని కాదు. ఆయనకి సమాధానం ఇవ్వాలి. తల్లి లేనిదని నిర్లక్ష్యంగా వదిలి వెళ్ళిపోయెందుకు నేనేమీ మగవాడినీ కాను, ఈశ్వర చంద్రుడినీ కాను! " గిరుక్కున తిరిగి, "పద, రంగా!" అంది మహేశ్వరి. పాప పొత్తిళ్ళ ల్లో వెచ్చగా , హాయిగా నిద్ర పోతుంది. అతను దీర్ఘంగా నిట్టూర్చాడు. ఆ నిట్టుర్పు లో వేదన కానీ, నిరాశా నిస్పృహ లు కానీ మహేశ్వరి కి ఆ క్షణం లో అనవసరంగా నే తోచింది.
    ఇల్లు చేరుకొని మెట్లు ఎక్కి అంతవరకూ తన రాక కోసం నిరీక్షిస్తున్న భర్త చేతులకి అందించింది పాపని మహేశ్వరి.
    చంద్రశేఖరం పరిశీలనగా చూస్తూ "ఎంత చక్కగా ఉంది!" అని తెల్లగా బొద్దుగా ముప్పై-- రోజులైనా నిండని పాపని పరీకిస్తూ భార్య మొహంలోకి చూశాడు.
    "అవును, తండ్రి లాగే చక్కనిది!' మహేశ్వరి మనసులోనే అనుకుంది.
    "పేరేమిటో కనుక్కున్నానా, మహేశ్వరీ?" అతను అడిగేడు.
    "గిరిజట."    
    "చక్కటి పేరు!"
    "పిల్లలాగే!" అన్నది నవ్వి.
    "పాప తల్లి...? " అతను అర్దోక్తి లో ఆగిపోయేడు. "పురిటి లోనే పోయిందిట!"
    "అతనెవరు? మన ఊరికి కొత్తగా వచ్చినట్లున్నాడు. నువ్వేరుగుదువా అతన్ని?' చంద్రశేఖరం ఇంటికి వచ్చే చాలామందే మహేశ్వరికి తెలుసు. ఆ ఉద్దేశ్యంతోనే అడిగేడు.
    "అతను నాకు బాగా తెలుసును.' మహేశ్వరి భర్త పక్కనే చోటు చేసుకుని కూర్చుంది.
    చంద్రశేఖరం కనుబొమ్మలు ముడిచి భార్య మొహం లోకి ప్రశ్నార్ధకంగా చూశాడు. "నీకు తెలుసునా? అదెలా, మహేశ్వరీ? అతనీ ఊరువాడు కాదె? పైగా , బెంగాలీ వాడని అందరూ అంటుంటే విన్నాను."
    "బెంగాలీ వాడు కాదు, బ్రాహ్మణుడే. ఆంధ్రుడు."
    'ఆంధ్రుడా?!" ఆశ్చర్యంగా ఉంది చంద్ర శేఖరానికి.
    "అతను ఈశ్వర చంద్రుడు. మా ఊరి వాడు."
    చిన్నగా నవ్వి "నువ్వు పొరబడి ఉంటావు, మహేశ్వరీ. అతని పేరుతొ ఉన్న మరో వ్యక్తీ మీ ఊరు వాడు అయి ఉంటాడు." అన్నాడు.
    మహేశ్వరి కొంగు ముఖానికి అడ్డం వేసుకుని వెక్కిళ్ళు పట్టడంతో అతను తల పైకెత్తి భార్య వైపు చూశాడు.
    "ఎన్నోసార్లు చెప్పెను. మీరు నా కధ విన్నారు కాదు!' అతను భుజం మీద చేయి వేసి ముఖాన ఉన్న కొంగు తొలగించి , జాలి ధ్వనించే చూపులతోనే ఆవిడను ఒదారుస్తుంటే అంత దుఖం లోనూ అన్నది. "మీ మంచితనానికి పరిధులు ఉండాలి. కానీ.....మించిన మీ మంచితనం చూస్తుంటే నాకు చచ్చిపోవాలమంది."
    "ఛ! అవెం మాటలు!నీగతం నాకు అనవసరం. నన్ను నీడలా అంటి పెట్టుకుని మానవ మాత్రులు చేయని సేవ చేస్తున్నావు. చాలదా?"
    "లేదు. మీరలా కప్పదాటు వేస్తె బ్రతికి ఉన్నంత కాలం నేను ఏడుస్తూనే ఉండాలి. దైవం కనికరించి మీకన్నా ముందే నేను వెళ్ళినప్పుడు కూడా నా అంతరాత్మ కి శాంతి ఉండదు. నేను పెళ్ళికి ముందే ఈ విషయాన్ని మీతో ముఖాముఖి చెప్పాలను కున్నాను కానీ నాకా అవకాశం కల్పించేరు కాదు మీరు...." మహేశ్వరి కన్నీరు ఆవిడతో ప్రమేయం లేకుండా వరద వెల్లువలా ప్రవహిస్తూనే ఉంది.
    అతను అన్నాడు. "పాపకి పాలు పట్టు, మహేశ్వరీ చంటిది కదా!"
    మహేశ్వరి లేచి వెళ్ళ బోతుంటే చేయి అందుకుని వారించేడు. "హరికృష్ణ కి ఏడాదే కదా నిండింది? వాడికి ఇవ్వగా లేనిది కళ్ళయినా పూర్తిగా తెరవని చిన్నపిల్ల కదా దీనికి ఇస్తే తప్పేం?"
    మహేశ్వరి భర్త మొహం లోకి చూసింది. ప్రశాంతంగా యోగ ముద్రలో ఉన్న మహామనిషి లా ఉన్నాడతను . :ఇవ్వు మహేశ్వరీ!"
    భర్త అజ్ఞ మీరే సాహసం మహేశ్వరి కి లేదు. అతను దేవుడు. అంతే తెలుసును ఆవిడికి. ఏడుస్తూ నిద్రపోయిన పాప ఉన్నట్టుండి దుఃఖం వల్ల వెక్కు తున్నది. ఒళ్లోకి తీసుకుని కొంగు అడ్డం వేసుకుంది మహేశ్వరి. "తల్లి స్పర్శే ఎరగని పసిది ఈ వెచ్చని కౌగిలి కి అంతు తెలియని ఆనందాబుధి లో తేలి ఉంటుంది బహుశా' అనుకుంటున్నాడు. అక్కడే కూర్చుని చూస్తున్న చంద్రశేఖరం. పిల్లాడిని తీసి మంచం మీద పడుకో బెట్ట బోతుంటే , "వద్దు మహేశ్వరీ. పాపని పక్కలో వేసుకో" అన్నాడు.
    "మీరు..మీరు...!" భర్త వైపు చిత్రవధ ననుభవిస్తూ చూసింది. "మీరు నన్ను చాలా బాధపెడుతున్నారు. ఇది....ఇదెవరో తెలుస్తే మీరిలా చేయమంటారా?"
    'ఎవరైతేనేం, మహేశ్వరీ! పసిపిల్లల రూపంలో దేవుడు సాక్షాత్కారం చేస్తుంటే!"
    "ఇది నా బద్ద శత్రువు కూతురు!" గుండెలు చీల్చుకుంటూ అన్నది మహేశ్వరి. "నా కళ్ళలో కారేది కన్నీరు కాదు. ఇది రక్తపు బిందువులు. మీరు గమనిస్తారా ఆ సంగతి? ఈ పగా ద్వేషం ఇప్పటివి కావు. ఎనిమిదేళ్ళ నాటివి."
    అతను మౌనంగా ఊరుకున్నాడు. పిల్లని నక్కలో వేసుకుని, అక్కడే పీఠం వేసుకుని కూర్చున్న భర్త పాదాల మీద చేతులాన్చింది. గతం కళ్ళ ముందు తిరుగుతుంటే అలలు అలలుగా ఊహలు చెదిరి చివరికి పొత్తు కుదిరి, ఏకం అయి ప్రవహిస్తుంటే ఆ ప్రవాహం లో తను ప్రయాణం చేస్తూ భర్త కి చేయూత నిచ్చి తనతో పాటు బయలుదేర తీసింది మహేశ్వరి.
    'త్వరగా అన్నం పెట్టెయమ్మా. ఇప్పుడే వస్తాను." చిన్నారి మహేశ్వరి తల్లి భువనేశ్వరి ని తొందర చేయసాగింది.
    హల్లో కూర్చున్న తండ్రి లెక్కలు కట్టిపెట్టి, "దేనికమ్మా తొందర?' అని ప్రశ్నించేడు. అయన ఆ ఊరి పోస్టాఫీసు లో వచ్చే కార్డునీ, కవర్ల నీ పూర్వం బట్వాడ చేసేవాడు. క్రమంగా అయనకి ప్రమోషన్లు వచ్చి ప్రస్తుతం పోస్టు మాస్టరు అయేడు. బొత్తిగా పల్లెటూరు అయిన "వానపల్లి" తూర్పు గోదావరి జిల్లాలో గోదావరీ మాత చల్లని నీడలో పచ్చని పొలాలలో , పాడి పంటలతో లక్ష్మీ దేవి నిలయంలా ఉంటుంది.
    "నాకోసం కాచుకున్నాడు , నాన్నా!" పోస్టు మాస్టరు దుర్గారాం కి సమాధానం ఇచ్చింది కూతురు. అప్పటి కా పిల్ల వయసు తొమ్మిదీ, పదీ సంవత్సరాల మధ్య ఉంటుంది. గుండెల మీదికి జాకెట్టు లో మోకాళ్ళు దాటి పట్టాలు పాంజీవు లూ ముద్దు పెట్టుకుంటున్న పరికిణీ తో, అమాయికత్యాన్ని మూట గట్టె మొహంతో చాలా అందంగా , ఆకర్షణీయంగా ఉన్న మహేశ్వరీ వానపల్లి లో ఆడపిల్లలందరికీ రాణి లాంటిది. ఆ పిల్లని ఆకర్షించిననాడుకొత్తగా ఆ ఊరు వచ్చిన రిటైర్డ్ ఆఫీసర్ చందీరావు గారి కొడుకు ఈశ్వర చంద్రుడు.
    "భువనేశ్వరీ, అమ్మాయికి అన్నం పెట్టేయి. ఈశ్వర్ ఎదురు చూస్తున్నాడుట!' కళ్ళ జోడు ముక్కు మీంచి సర్దుకుంటూ భార్యని కేకేవేశాడాయన.
    భువనేశ్వరి ముఖ మండలం వివర్ణమై పోయింది. ఆవిడ పెరిగిన పల్లె సీమలో పదేళ్ళు వస్తున్న ఆడపిల్ల మగపిల్లడితో మాట్ల్దాడడం అనేది చాలా ఎబ్బెట్లు అయిన విషయం. మొక్కై వంగనిది మ్రానై వంగదు అన్న వతులో నాలుగు గోడల మధ్యా సనాతనా చారాల మధ్య ఉక్కు కడ్డీ ల్లాంటి నియమ నిష్టలతో పెరిగిన ఇల్లాలు. తండ్రి కుదిర్చిన సంబంధం చాలా ఉన్నతమైనదనీ, అతడు అందగాడనీ, ఆస్తి పరుడనీ విని తన అదృష్టానికి తనే పొంగిపోయింది. కాలు మోపిన పదేళ్ళ లో ఉన్న మాగాణీ సుక్షేత్రాన్ని కొంత అలక్ష్యంతోనూ, మరికొంత దయా ధర్మాల తోనూ మిగిలింది పొగాకు, నల్ల మందు వ్యసనం తోనూ భర్త హారతి కర్పూరం లా హరింప జేస్తే ఒంటి నున్న బంగారు నగలన్నీటి నీ వస్త్ర మాదిరే అయి వలచి ఇచ్చింది. ఆడపిల్లకి పెళ్లి చేయాలనే సమస్య ఆవిడ ప్రాణాలనే ఎక్కువగా తోడేస్తున్నది. పిల్ల పెళ్లి ప్రసంగం ఎత్తి నప్పుడల్లా అతనా విషయాన్ని చాలా తేలికగా తీసుకుంటూనో, "కాలం మారింది, భువనేశ్వరి. పూర్వం లా పిల్లకి ఇప్పుడు పిల్ల ముక్కుకి తాడు బిగించడం లేదు ఎవరూ. మన పిల్లని చదివించుదాం. పెద్ద చదువు చదివితే దాని భవిష్యత్ అది నిర్ణయించు కుంటుంది.' అనేవాడు. తల్లీ, తండ్రీ ఈ విషయాన్ని తన ముందే ఎత్తడం చిన్నారి మహేశ్వరి కి సంబరంగా ఉండేది. మహేశ్వరి తో స్నేహం ప్రారంభించి అప్పటికి ఏడాది పూర్తీ కాలేదు ఈశ్వర్ కి.
    మహేశ్వరీ ఊహల పల్లకిలో పట్టు పీతాంబరం తో  ఈశ్వర్ కదిలేవాడు. తలంబ్రాలు , జీలకర్రా, బెల్లం, మరేమిటో బుక్కా చల్లడం వంటివి అతను చేస్తున్నట్లు చిత్రించు కునేది. పిల్లల సహజాతం పోగొట్టు కోకుండా 'అమ్మా నాన్న' ల అట ఆడినప్పుడల్లా ఆ ఆటలకన్నిటికీ అధిపతి ఈశ్వర్ నాన్నగా, తను అమ్మగా చేలమణీ అయేది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS