Previous Page Next Page 
మిధ్య పేజి 28


    కొందరి జీవితాలు వడ్డించిన విస్తరిలా ఉంటాయి. మరికొంత మంది తమ విస్తర్ని తామే భర్తీ చేసుకునే ప్రయత్నం లో సఫలు లౌతారు. మరి కొంతమంది రెండూ చేయలేరు. ప్రపంచం లో పాపిష్టి డబ్బు కెంత విలువ ఉన్నదో మద్యానికి అంతే విలువ ఉంది. హరికృష్ణ సికింద్రాబాద్ క్లబ్బు, గొల్ఫు క్లబ్బు, హుస్సేన్ సాగర్ క్లబ్-- ఇలా ప్రఖ్యాతి గాంచిన క్లబ్బుల్లో ఇదివరకు కేవలం మెంబరుగా ఉండి పెద్ద పెద్ద కంపెనీ డీలర్స్ కి , ప్రొప్రైటర్ ;లకీ పార్టీలు ఇచ్చేందుకే వెళ్ళేవాడు. అతని అంతస్తూ, స్థాయీ రోజు రోజుకీ పెరుగుతూ డబ్బు రూపాయల్లోంచి వందల్లో కి, వేలల్లోకి మరిపోగానే అతడు కొంత విరక్తి భావంతో, మరికొంత వ్యసనానికి బానిస అయి , ప్రపంచం మీదా, తల్లీ , గిరిజ మీదా కక్షతో తనని తాను దిగజార్చు కుంటూ మరో మెట్టు, మరో మెట్టు క్రిందికి దిగిపోతున్నాడు. కొండ శిఖరాగ్రాన జారిన బండ మాదిరి అతని స్థితి అధోగతి పాలు కాసాగింది. త్రాగడం, తినడం సమానంగా ఉన్నంత కాలం కొంతలో కొంత శరీరం దృడంగా నే ఉంటుంది. స్నేహితుల దయ వల్ల అతనీ మధ్య తినడం కూడా నేర్చుకున్నాడు. అతను తన జీవితం గురించి ఆలోచించే ప్రయత్నం చేయడు. అటువంటి సమయాన్నే సృష్టించుకోడు ఆ మాటకి వస్తే. తల్లి ఎన్నో ఉత్తరాలు రాసింది. కంపెనీ లో టైపిస్టు లకి కొదవ లేదు. వాళ్ళ చేత వ్రాయించి 'హరి' అని సంతకం చేయడం అతని పెద్ద సమస్య కాదు.
    మహేశ్వరి కొడుకు దీనావస్థ కి తనని తానూ తిట్టుకుంది. కొడుకు భవిష్యత్తు మలుపు తిరిగి శ్యామలతో కొత్త పంధాలు త్రొక్కుతుందనుకున్నది. కానీ ఆవిడ అనుకున్నట్లు ఏమీ జరుగలేదు. తన పగ ప్రతీకార రూపం జార్చి చివరికి కాలకూట విషం వెదజల్లుతూ తననే కాటేయ వస్తుంది. ఆవిడ కన్నీటికి ఆనకట్టలు లేకుండా పోయేయి. ఎవరి నుదుటి వ్రాతలు వారివి అని సరిపెట్టు కోలేక పోతుంది. కావాలని కొన్నిసందర్భాల్లో పెద్దలే పిల్లల వ్రాతల్ని తుడిసి వేస్తుంటారని వాపోయింది. హరికృష్ణ ఇంటికే రావడం మానేశాడు. ఒకటి రెండు సార్లు జగన్నాధం గారికి ఉత్తరం వ్రాసింది. జవాబు లో ఆశకి ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. ఆవిడ కన్నకడుపు కలవరించి పోసాగింది. గిరిజ అవివాహిత గా ఉన్నట్లితే స్వయంగా తనే వెళ్లి ఆ పిల్ల ముందు నిలబడి భిక్ష వేడుకునేది. కానీ... ఏది జరుగలేదు.
    శశి నవ్వింది. హరికృష్ణ వైపు చూస్తూ. హరికృష్ణ తలపుల్లో అప్పుడప్పుడు తల్లి తొంగి చూస్తుంది. పాషాణం లా మారిపోయిన అతడి హృదయం ఎప్పుడు   ద్రవీ భూతం చెండుతుందో అతడికే తెలియదు.
    కంపెనీ డైరక్టర్ల ని ఆహ్వానించడం, ఉచిత రీతిని సత్కారాలు చేయడం, మర్యాద కోసం, డిగ్నిటీ కోసం, గొప్ప గొప్ప పార్టీలు ఇవ్వడం-- ఇది హరికృష్ణ వంతు. విజయ కుమార్ పెట్టుబడి పెడతాడు. తమ్ముడిని కంపెనీ లో హరికృష్ణ దగ్గర తర్ఫీదు కోసం ఉంచేడు. ఆ తరవాత తెలిసింది. అతడు విజయకుమార్ స్వంత తమ్ముడు కాడనీ, తండ్రికి దూరపు బందువనీ. ఆలోచనలు తెంపుతూ అన్నది శశి; "ఈ వేళ గుప్తా అండ్ కంపెనీ వాళ్ళు వస్తామని ట్రంక్ కాల్ చేశారు పార్టీకి, నేను రాను , సర్!"
    హరికృష్ణ దిగాలు పడి తేరుకున్నాడు. కంపెనీ కి కుడి భుజం లాంటి శశి రాకపోతే తన కెంత నష్టం! "నీ వల్ల నాకు చాలా లాభం కలిగింది, శశీ. ఈ ఒక్కసారికే నాతొ పాటు క్లబ్బు కి రా!"
    శశి అతని వైపు చూస్తూ, "నేను మీ సెక్రటరీ నని చెబుతారు. అది ప్రతిసారీ జరుగుతున్నదే ఆడపిల్ల అంటే..... నేను విడమరిచి చెప్పాలా, సర్, మీకు? మా ఇంట వృద్దులైన తల్లిదండ్రులు నన్ను నమ్మి ఇక్కడికి పంపిస్తున్నారు. నేను ప్రతీసారి మీతో క్లబ్బు కి రావడం, ఇంట్లో అబద్దం చెప్పడం నాకే కాన్షస్ ఒప్పుకోవడం లేదు.
    "మిమ్మల్ని ఎదిరించి మాట్లాడుతున్నానని మీరు బాధపడుతుండవచ్చు కానీ....తప్పదు. నిజం నిష్టూరంగా కనిపించకుండా ఎలా ఉంటుంది? ఒక్క మాట అడుగుతాను -- నిజం చెబుతారా?" అన్నది.
    "అడుగు. ఒకటి కాదు , ఎన్నైనా అడుగు!"
    "హు.' చిత్రంగా నవ్వింది శశి. అందాల రాశి ఒంటి నిండా చీర కట్టుకుని నుదుట గుండ్రటి బొట్టుతో అణువణువూ స్త్రీత్వాన్ని నింపుకుని నడుస్తుంటే ఆఫీసులో ఎవరూ కూడా దృష్టి మరల్చు కోలేరు.
    హరికృష్ణ ఆ పిల్ల వైపు చూశాడు 'చెప్పమన్నట్లు.
    "ఇదే మీ చెల్లెలయితే ఆర్ధికంగా దెబ్బతిన్న పరిస్థితుల్లో తప్పనిసరిగా ఉద్యోగం చేయవలసి వస్తే ఆరు గంటల వరకూ ఆఫీసులో ఉండి క్లబ్బులకి. వినోదాలకీ ఆఫీసులో బాస్ తో కారుతో తిరుగుతూ ఉంటె మీరేం చేసేవారు?"
    జరిక్రుష్ణ తటపటాయించి , "ఉహించి చెప్పడం కష్టం, శశీ" అన్నాడు.
    "తప్పించు కోకండి, సర్. ఇందులో ఊహాగానానికి అతీతమైనదేమీ లేదు. ఇదే మీ చెల్లెలైతే ఏం చేసేవారు?"
    "ఉద్యోగం మానిపించి ఇంట్లో కూర్చో బెడతాను." హరికృష్ణ ఇచ్చిన ఆ ఒక్క సమాధానం గురి చూసి విసిరిన బాణం వచ్చి ఎదలో గుచ్చుకున్నట్లు తల్లడిల్లి పోయింది. "నిజం ఎంత విషం లా ఉంటుంది? మీరు ఒప్పుకున్నందుకు మనస్పూర్తిగా అభినందిస్తున్నానుసర్. నేనూ సాటి ఆడపిల్లల్లాంటి దాన్నే. నాకే ఓ అన్నయ్య ఉంటె మీ లాగే ఇంట్లో కూర్చో బెట్టేవాడు కానీ నాకు లేదా అదృష్టం. ఇంటికి పెద్ద పిల్లనై పుట్టి కన్న తల్లితండ్రుల ఋణాన్ని తీర్చుకోవలసిన అవసరం కూడా ఉంది. సిగ్గు విడిచి అంటున్నాననుకోకుండా ఉన్నట్టయితే ఒక్క మాట అడగనా, సర్?"
    "నేను వినేందుకు సిద్దంగా ఉన్నాను."
    "మీరు అవివాహితులు. సెక్రెటరీ నని చెప్పుకుని తిరగడం నాకు బాగా లేదు. నేను మీకు సహధర్మ చారిణి గా ఉండేందుకు తాగనా సర్?" ఆ మాట అని రెండు చేతుల్లోనూ మొహం దాచుకుని పెద్ద పెట్టున ఏడవసాగింది.
    హరికృష్ణ డంగై పోయేడు. నిశ్చేష్టుడయేడు. తెల్లబోయెడు. అతని మనసు మరీ స్థాణువై పోయింది. శశి ఆడపిల్ల. అయినింటి ఆడపిల్ల కుండే ఆత్మాభిమానం, పరువు ప్రతిష్ట ల ప్రసక్తీ ఆ పిల్లకి కూడా ఉన్నాయి. అతను కిమ్మనకుండా ఉండిపోయేడు. ఆఫీసులో ఐదు గంటలకే పని ముగించి పని వాళ్ళు వెళ్ళిపోయేరు. పని ఒత్తిడి కారణంగా శశి ఉండి పోవలసి వచ్చింది. అతడికి యౌవనం లో ఉన్న శశి పట్ల మరో అభిప్రాయం లేదు. అతని యౌవనం మమతల మూకుడు లో మాడీ మసి బొగ్గు అయిపొయింది. ఇప్పుడా శరీరంలో రసానుభూతి లేదు. భావ కంపన లేదు. ఒళ్ళు గగుర్పాటు లాంటివి చెందడం లేదు. స్పర్శ లో పొందే అత్యంత మనోహరమైన స్పందన లేదు. అతను కేవలం నిర్జీవ శిలా ప్రతిమలా బ్రతుకుతున్న జీవచ్చవం లాంటి మనిషి. మనసుండీ శిలగా మారిపోయిన మోడు జీవి. శశి లాంటి రంభ కళ్ళ ఎదుట తారట్లాడినా అతని పురుషత్వం మెలుకొదు. శశికి కావలసింది ఆఫీసులో తను చేసే పనికి ప్రతిఫలంగా ముట్టజేప్పే డబ్బు చాలనీ, తనతో బాటు ఆ పిల్లకి కూడా అంతస్తు పెరుగుతుందనీ అనవసరంగా ఊహాగానం చేసి పొరబాటు  అంచనా వేసుకున్నాడు. కానీ యౌవనానికి కావలసింది మరో యౌవనపు స్పర్శ అనీ ప్రకృతి సహజం అయిన కోర్కెని స్త్రీ ఎన్నడో గానీ వెల్లడి చేయలేదనీ ఇప్పుడు అంటే ఈ క్షణం లో గ్రహించి అప్రతిభుడయి పోయేడు. ఏమని సమాధానం ఇవ్వగలదు? తన మనసులో దీపం లా అనునిత్యం వెలిగే ఒకానొక జ్యోతి నీడలో మరో ప్రాణిని చేర్చడం అసంభవం అని ఏ విధంగా వెల్లడి చేయగలడు? అతను నెమ్మదిగా లేచి శశి తల మీద చేయి వేసి, "నన్ను క్షమించు శశీ! అడదంటే అటబోమ్మలా ఆడుకునే వ్యక్తిని కాను. మనసు తెలియక నేను అపసవ్యంగా ప్రవర్తించి ఉంటె నన్ను మనస్పూర్తిగా మన్నించు. నేను....నిన్ను పెళ్లి చేసుకోలేను" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS