అపర్ణ చడీ చప్పుడూ లేకుండా పెళ్లి చేసుకుంది. కాలేజీ లో తనతో బాటు చదువుకుంటున్న వైష్ణవుల పిల్లడిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. సాధారణంగా సమాజం లో అబ్బురాలు దాగవు ఎంత దాచాలని ప్రయత్నం చేసినా. శ్రీహరి ఈ విషయం విని ఆ రాత్రికి రాత్రే కారులో ఆ పిల్లడి ఇంటికి వెళ్లి తలుపు తట్టెడు. చీకటితో ప్రపంచాన్ని కప్పేసిన సూర్యభగవానుడు మరో పది గంటలకి కానీ బయటికి రాడు. చీకటి ప్రకృతి ని కప్పేస్తే డబ్బుతో సమాజం కన్ను గప్పాలని ప్రయత్నం చేశాడు శ్రీహరి. చిన్నసైజు మేడ లాంటి ఆ ఇంట్లో ప్రవేశించిందుకు మొదట్లో అతను భయపడ్డాడు. అయినా ధైర్యంగానే అడుగు వేసి తలుపు తట్టెడు. చీకట్లో తన కోసం ఎవరు వచ్చేది ఒక విధంగా అవగాహన కాలేదు శ్రీకంఠం నికి. తలుపు తెరిచి "ఎవరూ?" అని ప్రశ్నించేడు. గూట్లో హరికేన్ లాంతరు టేబిల్ దగ్గరగా ఉంది. ఆ క్రీనీడ తలుపుని తోసుకుని వచ్చి శ్రీహరి మొహం మీద పడగానే అతను తెప్పరిల్లి "మీరా!" అన్నాడు.
శ్రీహరి మొహం చిందులు తొక్కే రుద్రుడి లా ఉంది. అతని కళ్ళు నిప్పు కణాల్లా ఉన్నాయి. అతని ముక్కు పుటాలు రోషంతో యెగిరి పడుతున్నాయి. అతని ఎదురు రొమ్ము అవమానభారంతో ఎగసి పడలేక క్రుంగి పోతున్నట్లు కనిపిస్తుంది. అతను నిలువెల్లా కోపోద్రేకంతో వణికి పోతున్నాడు.
"రండి!' శ్రీ కంఠం కోంత ప్రయత్నం చేసి ఆహ్వానించెడు.
"లోపల కూర్చుందుకు రాలేదు నేను. నీతో మాట్లాడాలని వచ్చెను."
"ఆ విషయం గ్రహించెను. చెప్పండి....వీధిలో నిలబడి మాట్లాడడం ఉచితం కాదు అనిపిస్తోంది."
"నువ్వు చేసిన పని కన్నా అనుచితమైందే అంటావా ఈ పని?"
శ్రేకంఠం పేలవంగా నవ్వాడు. "నేను అనుచిత మైన పని చేయలేదని నాకు తెలుసు."
"ఈ ఊళ్ళో నా పేరు ప్రతిష్టలు నీకు తెలియనివి కావు. ఎంత ధైర్యంతో నువ్వా సాహసం చేశావో గ్రహించేవా?"
"ఆ!"
"నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను. కానీ పిచిక మీద వజ్రాయుధం పనికి రాదని ఆలోచిస్తున్నాను. మించిపోయింది లేదు. నాపరువు నడి వీధి కేక్కక ముందే నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపో. నీకు కావలసినంత డబ్బు ఇస్తాను."
అతను నవ్వాడు శ్రీహరి మాటలకి.
"నేనెవరినో తెలుసా?"
"శ్రీహరి!"
"ఎంత ధైర్యం!"
శ్రీహరి చాచిన చేతిని అవలీలగా క్రిందికి దించేస్తూ "ఒక దెబ్బ వేసేముందు పది దెబ్బల్ని భరించగల్గె మనిధైర్యం ఉండాలి. మీకా స్తిర్యం లేనప్పుడు చేయి ఎత్తడం సబబు కాదు" అన్నాడు.
"సబబు, బెసబబు తెలిసినవాడివే అయితే నువ్వు నాకెందుకీ అపకారం చేశావు?"
"మీ అమ్మాయిని నేను నలిపి నాశనం చేయలేదు. పెళ్లి చేసుకున్నాను. నాతొ బాటే జీవితాంతం సుఖ పెట్టగలననే ధైర్యం నాకు ఉంది!"
"నన్నూ, నా కుటుంబాన్నీ సర్వనాశనం చేశావు. సంఘం లో తలెత్తు కొనివ్వకుండా చేశావు. ఈ సమాజం మమ్మల్ని వెలివేస్తే చూసి ఆనందిచాలనా నీ ఉద్దేశ్యం?"
"కాదు."
"మరి?"
"పగ."
"పగా! నా మీదా? నీకు నేనేం ద్రోహం చేశాను? అసలు నువ్వెవరివో నాకు తెలియదే!"
"తెలుసుకోవాలని ఉందా?"
'శ్రీహరి అవునన్నట్లు బుర్ర ఊపాడు.
"ఆడదాన్ని విలాస వస్తువుగా ఉపయోగించుకునే నైజం మీకు ఎన్నో ఏట అబ్బింది?"
శ్రీహరి మొహంలో చిరునవ్వు గర్వంగా లాస్యం చేసింది.
"ఆడది త్రాచు పాము లాంటిది . మీరు మీ సుఖం కోసం ఎంతమందిని బలి పెట్టారో ఏనాడైనా తీరికగా అలోచించేరా? మీ కసలు తీరిక ఏదీ? ఉన్న తీరిక సమయం వ్యర్ధంగా ఖర్చు పెట్టేస్తుంటే?"
"నాకా అవసరం లేదు."
"ఎందుకనీ?"
"నేను విలాస పురుషుడిని. కులాసాగా బ్రతకడం నా అదృష్టం. డబ్బు పడేసి బజార్లో ధర పలికిన వస్తువుని కొనడం లో తప్పేమీ లేదు."
"మీరు అంతకుమించి ఏ పనీ చేయలేదా?"
"లేదు!"
"లేదు!"
"మీరిలా రండి." శ్రీ కంఠం రెండు చేతుల తోనూ అతన్ని బలవంతంగా లోపలికి తీసుకు వెళ్ళాడు.
"ఏమిటీ నిర్భంధం?" చిరాకుగా ప్రశ్నించాడు శ్రీహరి.
"మీ మీద నా పగకి కారణం కనుక్కోవాలని లేదా?"
అతను తలెత్తాడు. "నువ్వు చెప్పేది నాకు బోధపడడం లేదు."
"మీకు ఈవిడ తెలుసా?" మంచం మీద చిక్కి శల్యం అయిపోయి ఆస్థి పంజరం లా అతుక్కు పోయిన మనిషిని శ్రీ కంఠం చూపించేడు. శ్రీహరికి వెంటనే గుర్తుకు రాలేదు. ముడతలు పడి, బెంగతో ద్రిగ్గుల్లి పోయిన ఆవిడ మాంసం కుళ్ళి పోయింది. ఒకప్పుడు రంభా ఊర్వశిలను తలదన్నే అందం పరికించి శ్రద్దగా చూస్తె కనిపిస్తుంది ఆవిడ మొహం లో.
"ఈవిద ఎవరో నాకు తెలియదు."
శ్రీ కంఠం పిడికిలి బిగించి, అపర్ణ తండ్రి వై బ్రతికి పోయేవు. నువ్వే ఇందుకు కారణం అని నాకు తెలుసు. కానీ అపర్ణ నీలాంటిది కాదు. అమాయకురాలు. నేను నలిపి నాశనం చేయగలను. కానీ, నీలాంటి పశువుని కాను. నేను మనిషిని." అన్నాడు.
"చూడు శ్రీ కంఠం! నీకు కావలసింది తీసుకో."
శ్రీహరి తెరిచిన పర్సు లోంచి కాగితాలు అతడి నెత్తినే వెదజల్లుతూ , "ఆవిడ మా అక్క , నిన్ను వలచి మోసపోయింది. నిన్ను నమ్ముకుని పువ్వులా నీ పాదాల కింద నలిగి ఇప్పుడు రాలిపోతుంది. డబ్బు పెట్టి కొనగల తాహతు నీ కున్నా మానం, అభిమానం అమ్ముకుని బ్రతికే జాతిలో పుట్టలేదు మా అక్క రాజ్యలక్ష్మీ."
"రాజ్య...లక్ష్మా!" శ్రీహరి కుప్పలా కూలిపోయేడు. అతనికి స్వాస్థ్యం తప్పింది. ఏనాటి రాజ్యలక్ష్మీ? ఇంకా బ్రతికి ఉంటుందని ఇలా తమ్ముడి చేత ప్రతీకారం చేయిస్తుందనీ అతను కలనైనా ఊహించలేదు. కాలేజీ లో చదివే రోజుల్లో ప్రేమ లేఖలు రాసి, దాసాను దాసుడై నట్లు నటించి నమ్మించి దగా చేసి హైదరాబాదు నుంచి పారిపోయి వచ్చేసి ఆ విషయమే మరిచి పోయేడు.
"నిప్పులాంటి ఆడదాన్ని తొక్కితే చాలదా మరి." నేను పెద్ద వాడినయ్యాను . ఇక్కడికి వచ్చెను. నీ మీద ప్రతీకారంతో నీ కూతుర్ని దగా చేయాలను కున్నాను. కానీ....మానవత్వం మసి అయిపోలేదు నాలో. మర్యాదగా బయటికి వెళ్ళు!' అతను కోలుకునే వరకూ పరిచర్యలు చేసి కఠినంగా వెళ్ళగొట్టెడు శ్రీ కంఠం.
అపర్ణ అతని పాదాల దగ్గర కూర్చుండి పోయింది. "నువ్వు...నువ్వెంత మంచివాడివి!" అన్నది.
"అక్కా!" అతను అపర్ణ ని చేత్తో లేవదీసి అక్కగారి దగ్గరికి వెళ్ళాడు.
ఆవిడ తలెత్త లేకపోయింది. నీరసంగా ఉన్న ఆవిడ గొంతులో ఎక్కడో నూతి లోంచి వినవస్తున్నట్లున్నాయి మాటలు. "ఏమిటి, తమ్ముడూ?"
"నన్ను క్షమించక్కా!"
ఆవిడ బలవంతంగా కనురెప్పలు పైకెత్తింది. 'ఏమిటన్నట్లు?' చూస్తూ.
"అపర్ణ ని పెళ్లి చేసుకున్నానక్కా. దగా చేసి ప్రతీకారం తీర్చుకోలేక పోయాను!"
ఆవిడ తమ్ముడి తల మీద తృప్తి గా చేయి వేసింది. ఆ కన్నుల్లో నీరు బలవంతంగా ఊరసాగింది. గుండె మీద ఎడమ చేతిని ఉంచుకున్నది తృప్తి పడిన దాని మాదిరి. అపర్ణ కళ్ళ వైపు ఓ సారి, తమ్ముడి మొహం లోకి ఒసారీ చూసి నీరసించి పోయినదానిలా గోడ వైపు తిరిగి పడుకుంది. అక్క సుఖం కోసం తమ్ముడు సముద్రాలని ఈదగలడు. అక్క కోరికల్ని కూల్చిన మనిషిని నిలువెల్లా కూల్చేయ గలడు. అది ఏ కొదరుల అపురూపమైన బాంధవ్యం. అతను కళ్ళు తుడుచుకుని , 'అక్క ఎలా ఉండేదో ఒకప్పుడు నీకేం తెలుసును, అపర్ణా! కాలేజీ ఆవరణ లో కూచిపూడి, భరతనాట్యం చేస్తూ అబినయిస్తే చాలు, ఆ రోజుల్లో ఇసక రాలక పోయేవారు జనం. "మగువా, చెలియా' అని అక్క కోసం సంగీతం నేర్చుకున్నాను నేను. ఇంటర్నేషనల్ ఫేం కావాలి అక్కకి. ఇదే నా ఆరాటం. కాలు జారి కాలు పోగొట్టుకుంది. అందుకే నాకీ పగ!' అని అతను చెప్పడం ఆపేసి "నిన్ను మాత్రం దగా చేయలేను" అన్నాడు దృడంగా.
అపర్ణ పెళ్లి కావడంతో శ్రీహరి గ్రామం లో మొహం తిప్పుకోలేక భార్యతో సహా కాకినాడ వెళ్లిపోయేడు. అన్నపూర్ణ అన్నగారిని కౌగలించుకుని బావురుమంది. అమరేంద్ర చక్రవర్తి చెల్లెల్ని ఓదారుస్తూ "లలాట లిఖితం!' అన్నాడు.
* * * *
