"నీకేమైనా మతి పోయిందా, హరీ! నువ్వనేదేమిటి? నన్నెందుకురా బ్రతికి ఉన్నన్నాళ్ళూ ఏడిపించుకుని తింటావ్? నీకు నేనేం అపకారం చేశాను? నన్ను ఇలా మభ్యపెట్టి నువ్వేం బావుకోవాలను కున్నావు? శ్యామల నీకేమౌతుంది? నా కళ్ళలోకి చూసి చెప్పు. దాని మీద నీకు మనసు లేకుండానే చేల్లెలనే దృష్టి తోనే తీసుకు వచ్చేవా ఇంత దూరం?" ఆవిడ ఉబికి వస్తున్న కన్నీటిని ఆపే ప్రయత్నం చేయలేదు. బ్రతుకులో దేని కోసమో ప్రాకులాడి ఏదేదో సాధించాలనుకున్న ఆవిడ గుండెల్లో కరుకు కత్తిని దిగేసినట్లు గా బాధ పడింది. ఆడపిల్ల పచ్చగా, కనుల పండువుగా కనిపిస్తే వయసులో ఉన్న కొడుక్కి ఈడూ జోడూ అని మురిసి పోయినట్లే మహేశ్వరి కూడా ఊహ లోకం లో ఉప్పొంగి పోయింది. కానీ కొడుకు తన అంచనాల్ని తలకిందులు చేసి తన ఆశా సౌధాల్ని నేలమట్టం చేయగానే ఆకాశం లో గర్వంగా,మ స్వేచ్చగా విహరించే విహంగం తాలుకూ రెక్కల్ని కూల్చి వేయగా నేలమట్టం అయినట్లు విలవిల్లాడి పోయింది. అతను భోజనం పూర్తీ చేయకుండానే కంచంలో చేతిని కడిగేసు కున్నాడు. "నన్ను క్షమించమ్మా. ఇన్నాళ్ళూ శ్యామల నాకేమౌతుందో నాకే తెలియక తికమక పడిన వాడిని. ఇప్పుడు మతిపోయిన మనిషి కొని తెచ్చుకున్న మతి లా నేను విపరీతంగా ఏమీ ప్రవర్తించడం లేదు. శ్యామల నాకు చెల్లెలే అవుతుంది. కావాలంటే దాన్నే అడుగు." అంటూ లేచి వెళ్లిపోయేడు. శ్యామల మౌనంగా భోజనం పూర్తీ చేసింది. మహేశ్వరి అడిగేందుకు, జవాబులు రాబట్టు కునేందుకు ఏమీ లేదు, ఆవిడ నిశ్చలంగా శూన్యాకాశం లోకి చూస్తుండి పోయింది.
మరునాడు శ్యామల బస్సు ఎక్కుతుంటే వెలికి ఉంగరం తొడిగి, నుదుట కుంకుమ పెట్టించి కొత్త చీర ఇప్పించింది ముత్తైదువతో.
ఆవిడ మనసులో ఎటువంటి సంచలనం జరుగుతున్నదో శ్యామల కి అనూహ్యమని పించింది. చీర కట్టుకుని వంగు ని నమస్కరిస్తుంటే మాత్రం ఆ పిల్లని లేవనెత్తి గుండెల్లో కి చేర్చుకుని, "నావన్నీ తప్పుడు అంచనాలు. నీ మనసు తెలుసుకోలేక పోయాను. నలుగురూ అడుగుతుంటే నీ ఇష్టంతో నిమిత్తం లేకుండా 'నాకోడలు' అని చెప్పెను. ఉద్దేశ్యం నీది ఎలాంటిదో తెలుసుకోకుండా నేను చొరవ చేసి నీ మీద అనాదికారాన్ని పెంచుకున్నాను. క్షమించమని అడిగేందుకు నువ్వు చిన్నదానివి. ఎప్పుడైనా గుర్తుకు వస్తే, తూర్పు గోదావరి డెల్టా ప్రాంతంలో నీ కోసం "ఓ అమ్మ' ఉన్నదని జ్ఞాపకం పెట్టుకో" అన్నది. అంతలోనే ఆవిడ మనసు మూగవోయినట్లయింది. శ్యామల 'అమ్మ, అమ్మ" అన్నది పెదాలు కదులు తుండగా. బస్సు దూరం అయిపోతుంటే వెనుతిరిగి చూసింది శ్యామల. మేడ మీద నిలుచుని కోన గోటితో చెక్కిలి మీద జారే కన్నీటి ని మీటుతుంది మహేశ్వరి. శ్యామల కళ్ళు చేరువులయేయి.
"నువ్వు....నువ్వు కూడా ఎడుస్తావన్నమాట!' హరికృష్ణ అంటుంటే "ఊ" అంది భారంగా.
* * * *
హైదరాబాదు చేరుకున్నాక హరికృష్ణ రెండు రోజులు జగన్నాధం ఇంట్లో ఉన్నాడు. అరుంధతి పలకరిస్తుంటే ఆదివరకు తల దించుకుని వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు అలా చేయడం లేదు. అరుంధతీ, శ్యామలా మధ్య తను కుర్చీ వేయించుకుని గంటల తరబడి బాతాఖానీ కొడుతున్నాడు. కాబోయే మరిది స్నేహం వల్ల, ఆ విధంగా మాట్లాడుతున్నాడనుకుని మురిసి పోయింది అరుంధతి. తన చెల్లెలి అదృష్టానికి ఆవిడ కడుపు నిండిపోయింది.
హరికృష్ణ ఆ రోజు మామూలుగా శ్యామల ని తీసుకుని పబ్లిక్ గార్డెన్ వైపు మళ్ళించేడు కారుని. దారిలో ఏదీ మాట్లాడేందుకు విషయం దొరకలేదు. కారు పార్కు చేసి , గార్డెన్ లో ప్రవేశించి లాన్ మీద కూర్చుంటూ అడిగేడు: "నువ్వు చెప్పింది చేస్తాను." అతని గొంతులో గిరి గీసిన గాంబీర్యం తప్ప మరి తొణుకు, తొట్రు పాటు లాంటిది లేదు.
"నేను చెప్పింది చేస్తారా?" శ్యామల రెట్టించింది.
"ఆ, అక్షరాలా!"
"వేర్రిదానిలా ఒకసారి నవ్వి "నదిలో దూకమన్నా దూకేందుకు సిద్దంగా ఉన్నారన్న మాట. మంచిది చూడండి." అని కాస్సేపు ఆగి అతని ముఖం లోకి చూసింది.
"చెప్పు!"
"అయితే మీకు స్వంతంగా ఆలోచించుకునే శక్తి అభిప్రాయం లేవంటారా?"
"అంటే?"
"ఎన్నాళ్ళు మీరీ అరువు తెచ్చుకున్న బ్రెయిన్ తో బ్రతక గలరని?"
"నాకు అర్ధం కావడం లేదు, శ్యామలా!"
"చూడండి , జీవితం గురించి చాలా తేలిగ్గా తీసుకుని ఎలాగైనా బ్రతకవచ్చు అనుకుంటారుట కొందరు. కాదు, ఇలాగే బ్రతకాలనే నిర్ణయంతో ఉంటారుట మరి కొందరు!"
"అయితే?"
"మీరు రెండింటికి చెందలేదు!"
"నన్నేం చేయమంటావు, శ్యామూ?"
"మీకు తోచిందేదో చెబితే నేను సంతోషిస్తాను. నన్ను అనవసరంగా దబాయిస్తున్నారు."
"లేదు, లేదు, " కంగారుగా అన్నాడతను.
"ఏది లేదు? దబాయించడం లేదనకండి. మీరు మనసులో చేసుకున్న నిర్ణయం బయట పెడితే నేను ఎగతాళి చేస్తానని ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ తో భయపడుతున్నారు అనవసరంగా. మీ ఊహలు, ఉద్దేశ్యాలూ నేను గ్రహించెను. మీ నిర్ణయం నాకు తెలుసును!"
"ఏమిటి?"
"మీరు కలకత్తా వెళ్ళబోతున్నారు."
అతను డంగై పోయేడు. నోట మాట రానివాడిలా కళ్ళు అప్పగించి శ్యామల వైపు చూడసాగేడు.
"మీరు చేసేది మంచి పని అని నాకు తోస్తున్నది. ఒకరు నిష్కల్మష హృదయంతో అభినందించి మెచ్చిన పని పదుగురికి న్యాయంగా తోచక పోదు. అందుకే అన్నారు పదుగురాడు మాట అని. మీరు వెళ్ళడం నా కెంతో ఆనందంగా ఉంది. మీకక్కడ జయమే కానీ అపజయం ఉండదు. వదినని తీసుకుని తిన్నగా మా ఇంటికే-- బావ ఇంటికి రావలసిందిగా నేను కోరుతున్నాను. మరో మాట." శ్యామల కాస్సేపు ఆగింది. అతను ప్రశ్నార్ధకంగా చూశాడు. ఆ పిల్ల సిగ్గుతో మొహాన్ని దాచుకుంది. అతనికి బొత్తిగా అంతు చిక్కలేదు. రెండు చేతుల్నీ తన చేతుల్తో విడదీసి ఆ మొగ్గ లాంటి ఎరుపు రంగు పులుముకుని, సున్నితంగా ముట్టుకుంటే మాసి పోతుందేమోనని భ్రమించే మొహాన్ని తేరిపార చూశాడు.
"మీకా సంగతి కొద్ది కాలంగా చెప్పాలను కుంటుంటే మీరు అవకాశం ఇచ్చేరు కారు."
"చెప్పు, శ్యామూ!"
"ఇందులో మీ సహాయం కొంత కావాలి.'
"నేనున్నానమ్మా నీకు, చెప్పు, ఏం చేయమంటావు?"
"మరేం లేదన్నయ్యా." శ్యామల నోట్లోంచి అనుకోకుండా వెలువడిపోయిందా మాట. అతను సంబరంగా చూశాడు. శ్యామలకి చటుక్కున గుర్తుకు వచ్చింది. నిజమే, హృదయం చెప్పే బాసల్ని నాలుక ఎంత చప్పున అందిస్తుంది! "నీకు విజయ కుమార్ తెలుసు కదా?"
"అదేమిటి? తెలుసా అని నెమ్మదిగా అడుగుతున్నావా? అతనూ, నేను బిజినెస్ చేస్తున్నాం, కదూ, తల్లీ! ఆ అయితే విషయం చెప్పు." హరికృష్ణ అమాయకంగా అడుగుతుంటే చిరాకు పడింది శ్యామల. "అన్నీ 'ఓ' నుంచి 'ధం' వరకూ చెప్పాలి నీకు. అర్ధం చేసుకోలేవా?' క్రమంగా ఏకవచన ప్రయోగం చేయడం లో కూడా బిడియ పడలేదు.
"చెప్పమ్మా. విజయకుమార్ తెలుసు. ఏమైంది?"
'అతన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నాను!"
"వ్వాట్....అతడు మనవాడు కాదె!"
"అంటే?"
"తెలుగు వాడు కాదు. మహారాష్ట్రుడు . తల్లి కన్నడీ ఆవిడ."
"అయితే?"
"మీ నాన్నగారికి తెలుస్తే?"
"నాన్సెన్స్! అయినా నీలాంటి ఇడియట్ తో ఏమిటి చెప్పడం!"
"కులం మనదే అనుకో. అయినా భాష వేరు కదా అనే మాటకి అన్నాను!"
"ఛ! ఇంత మీన్ గా ఆలోచిస్తావను కోలేదు. ఇదేం ప్రేమ వ్యవహారం అనుకుంటున్నావా?"
"మరేమిటి , తల్లీ. నువ్వు అతన్నే చేసుకోవడం లో అర్ధం తెలీడను కోకు!" అతను ఎగతాళి చేయసాగాడు.
"మరే , పాపం!' శ్యామల అంతలోనే గంబీరంగా మారిపోయి, "చూడన్నయ్యా! మనుషులు ఎవరు ఎలాంటి వారో నాకు తెలియదు కానీ అతను మాత్రం మామూలు మనిషి కాదు!" అంది.
"రెండు కొమ్ములూ. నాలుగు తలలూ, ఆరు చేతులూ, ఇంకా...."
"మొదటిసారి మన ఇంటికి వచ్చినప్పుడు చూసేను. తరవాత అతను నాలుగైదు సార్లు కోఠీలో కనిపించేడు. ఆఖరికి ఒక రోజున సినిమా హల్లో కాబోలు కనిపించీ......"
"ఏమమ్మా అంత గుర్తు లేదా?"
"లేకేం? జ్ఞాపకం వచ్చింది. దీపక్ మహల్ లో కనిపించేడు. అప్పుడే అన్నాడు...."
"ఏమనేవిటి?"
"పప్రేమ పాఠాలు వర్ణించలేదు. సమయం వస్తే మీ బావతో కన్సల్ట్ చేస్తాను. నీకు నేనంటే ఇష్టమా అని అడిగాడు!"
"నువ్వు అయిసులా కరిగిపోయి అవుననేసేపు బసవన్న లా . అవునా?"
"ఏం కాదు."
"మరి?"
"ఆలోచించుకుని చెబుతానన్నాను!"
"మరెప్పుడు చెప్పావు?"
"నేను చెప్పక ముందే అతను మరోసారి కనిపించి నీ త్రాగుడు మానిపించి, నిన్నో దారిలో పదేశాక నన్ను చేసుకుంటానన్నాడు."
"నాకూ, అతనికీ ఏమిటి సంబంధం?"
"స్నేహం!"
హరికృష్ణ కళ్ళు చెమర్చాయి. "ఇంకా ఏమన్నాడు శ్యామలా?' అన్నాడు కుతూహలంగా.
"నీ బాధ్యత నాకు అప్పగించేడు!"
"ఎందుకనీ?"
"స్త్రీలు చేయగలిగినంత సులభంగా పురుషులు చేయలేని పనులు కొన్ని ఉన్నాయి కనక."
"అంటే?"
"అతను మగవాడు. నిన్ను మానిపించే ప్రయత్నం లో తనూ ఆ అలవాటుకి బానిస అయిపోయే ప్రమాదం ఉంది. స్త్రీల విషయం లో లేదటు వంటి ప్రమాదం!'
"అచ్చా!"
"నిన్ను మార్చగలననే ధైర్యం నాకు ఉండేది. కానీ నువ్వే ఆపోహ పడ్డావు. ఆత్మీయుడిని బాగుచేసే ప్రయత్నం చేస్తే అందుకు పెళ్ళే కారణం అననవసరం లేదు. నాది గ్రాండ్ సక్సస్!' శ్యామల సగర్వంగా అతని వైపు చూసింది.
"గిరిజ నాతొ మాట్లాడు తుందంటావా?"
"ఎందుకు మాట్లాడదు?"
"కోపంతో , రోషంతో , ఆవేశంతో....."
"ఏదేదో చేస్తుందంటావు. అంత అవివేకి అనుకోను నేను!'
"చెప్పలేం , స్త్రీ బుద్ది...."
"ప్రణయాంతకః" శ్యామల అతని మాటల్ని పూర్తీ చేసింది.
"అయినా ఎన్నేళ్ళ మాట?" హరికృష్ణ సాలోచనగా అన్నాడు.
"పెళ్లి అయి ఉంటుందంటావా?"
"కాకుండా ఉంటుందా ఇన్నేళ్ళు?"
"ఒకవేళ అయిందని తెలుస్తే వెంటనే రైలేక్కేయి.
"లేకపోతె కలుసుకుని మాట్లాడు."
"అరె! అప్పుడే చీకటి పడిపోయింది. మరి వెడదామా?"
"నీకు చెప్పిన సంగతి ఇంట్లో అప్పుడే తెలియనీయకు."
"ప్రమాణం చేయమంటావా?"
"వద్దు. నీ మాట మీద నమ్మకం ఉంది."
"థాంక్స్, ఆపాటి బిలీఫ్ ఉంటె!' అతను కారు స్టార్టు చేశాడు. అతని మనసు పందిరి అల్లుతుంది. రంగురంగుల పల్లకి లో ఎదురెదురుగా గిరిజా, తనూ..... కారు మలుపులు తిరుగుతుంది యాంత్రికంగా. అతను ఉత్సాహంగా రేసు కోర్సు లో పరుగు పెట్టిస్తున్నట్లే నడుపుతున్నాడు.
దీపాలు వెలిగాయి నాలుగు వైపులా. అరుంధతి మేడనిండా లైట్లు వెలిగించి చెల్లెలి కోసం ఎదురు చూస్తుంది. " కాఫీ తాగి మళ్ళీ వెళ్లు!' శ్యామల మాటలు కొత్తగా, వింతగా వినిపించేయి. అరుంధతి కళ్ళు చిట్లించి నిజాన్ని చూస్తూ కూడా నమ్మలేని దానిలా ఆ మాటల్ని మరీ మరీ మననం చేసుకుంటుంది.
"అక్కా!' శ్యామల లోపలికి వచ్చి, "రేపు అయన కలకత్తా వెడుతున్నారు." అన్నది.
"నువ్వు కూడా వేడుతున్నావా? మీ బావ వెళ్ళమన్నారా?"
"లేదక్కా. ఇంక నేను అతనితో వెళ్ళే పని లేదు."
"అంటే?"
"అంటే ఏమీ లేదు. కాలేజీ లు తెరిచేరు. అందుకూ!" ఇప్పుడు శ్యామల బి.ఏ ఫైనలు పరీక్షలు రాయబోతున్నది.
అరుంధతి 'అలాగా!" అని ఊరుకుంది.
