Previous Page Next Page 
ఉన్నతశిఖరాలు పేజి 20


    రెడ్ క్రాస్ సంస్థ సహాయంతో అట్లా ఈ బిడ్డ ఇండియాకు వచ్చాడు ఇంత కష్టపడి వచ్చిన ఈ బిడ్డను ఈ రోజంతా ఎవరి సుఖంకోసంగాని త్యజించలేము గోపాల్. ఆనాడు, ప్రాణాలరచేతిలో పెట్టుకుని పలాయన మౌతున్న రోజున డుంబా మరణిస్తాడేమో అనుకున్న తరుణంలో నా భార్య ఈ బిడ్డతల్లి గర్భంమీద రెండుచేతులువేసి రక్షిస్తానని అభయ ప్రమాణం చేసిందే. ఆ వాగ్ధానం మరచిపోయేమా! ఈ కొడుకులకోసం కాదూ. వాళ్ళు అన్ని అగచాట్లు పడింది! ఈకొడుకు లకు మంచి భార్యలు రారేమో అని ఆ బిడ్డను వదిలిపెట్టేటంత హీనులము కాముబాబూ.

                               *    *    *

    ఆయన అశ్రుపూరిత నయనాలను అంగవస్త్రంతో తుడుచుకుంటుంటే ఆమె ఏకధారగా కన్నీరు కారుస్తూ కూచుంది.
    ఆ దృశ్యాన్ని చూచి గోపాల్ చలించిపోయాడు. అతని హృదయం బాధగా మూల్గింది. లేచి నుంచుని అతన్ని ఓదార్చాడు. "మీరు చేసేది ప్రశంసనీయం. మరెవరికీ సంజాయిషీ చెప్పనక్కర్లేదు. ధైర్యంగా వుండుండి ఆయన గోపాల్ వైపు నిశ్చల దృక్కులను ప్రసరించవేశాడు తల ఆడించి అన్నాడు "వాడు వస్తాడు- మేము అందరికీ దూరమై పోతాము. ఈ ఇంట పిల్లనిస్తే వంశ గౌరవం అడుగంటు తుందని వీళ్ళకు ఎవరూ పిల్లనివ్వటానికి ముందుకు రారు. అందుకని ఆ బిడ్డను పెట్టుకుని మేము వేరుగా వుండి వండుకుని తింటే ఏ సాధక బాధలూ వుండవు.... వేరే వూళ్ళో ఉద్యోగాలు దొరికి వెళ్ళిపోతే మరీ మంచిది... అని ఇలా అనుకుంటున్నాం బాబూ. కన్న తర్వాత వాళ్ళకు పెళ్ళిచేసి గృహస్తులను చేయటం మన బాధ్యత. అది నెరవేరాలి. మా కెన్నో లోపాలున్నాయి. ఉమ్మడిగా వుంటే- పిల్లడిని జాలి, ప్రేమ లత చూడాలని వాళ్ళ కెందుకుంటుంది? వాడిని చూస్తేనే అసహ్యించు కోవచ్చు కదా? అందుకని దూరంగా వుంటే స్వతంత్రంగా వుంటే మంచిదని ఒక నిర్దారణకు వచ్చాము. గోపాల్ మౌనంగా కళ్ళలో సుడులు తిరుగుతున్న అశ్రువుల్ని ఒత్తుకున్నాడు.
    "గోపాల్ మీ చెల్లెలి పెండ్లి సంగతి బాగా ఆలోచించండి-తొందర పడొద్దు.
    "ఈ యింటి కోడలు కావడానికి మాచెల్లెలు ఎన్ని నోములు నోచిందో. మా ప్రేమలతకు ఇంతకంటే మంచి సంబంధం ఎక్కడా దొరకదు. మావయ్యగారూ ప్రేమ అదృష్టవంతురాలు. మీకు అంగీకారమని మాట యివ్వండి మామయ్యగారూ" అన్నాడు గోపాల్.

                                  20

    తోటలో కూర్చున్నది ప్రేమ. వసంత ఋతువు ఆఖరు రోజులు తోటంతా విరగబూసింది. పిచ్చి మొక్కల దగ్గర్నుంచీ పూలమొక్కల వరకూ అన్నీ సంతోషంతో పరవశించి కనుమించాయి తన మనస్సే ఇన్నాళ్ళూ ఒక్క పిచ్చిమొక్కలా గాలితాకిడి. వానతాకిడి తగిలి వడిలిపోయి ఆకులురాలిస్తే. ఇప్పుడీ వసంతకాలం తన మనస్సునుకూడా విరగబూయించి పరిమళాలు వెదజల్లుతున్నది. అంతేనా?.....ఆమెకు చిరునవ్వు వచ్చింది.    
    నిరంజన్ వచ్చాడు. హాలులో అలికిడి అయినప్పుడే తాను అక్కడికి వెళ్ళి కూర్చుందామని అనుకున్నది. అతని ఠీవీ ఆకారం చూచి మనసునిండా సంతోషం పేరుకున్నా ఏదో కారణంవల్ల అతన్నిచూసి సిగ్గువేసింది. అతను కళ్ళతో పలుకరించినప్పుడు ఆ చూపు తన గుండెల్లో దూరిపోయి తనను మెత్తగా స్ప్రుశించటం-ఎంత మధురమైన అనుభూతి?
    డోర్ కర్టెన్ సందులోగుండా అతన్ని ఒకసారి క్షణంలో సగం సేపు చూచిందితాను. అప్పుడతను నాన్నగారితో మాట్లాడుతూ కళ్ళు యిటు తిప్పాడు. అతని సంభాషణ లో వృత్తం మీద ఇతరుల క్షేమ సమాచారం మీద వున్నప్పటికీ అతని మనసు తనపైనే వున్నట్లు ఆ క్షణంలో సగంవేపు కలసినచూసినసాక్ష్యం. అతనిని తోటలోకి పిలవాలని అంత ప్రలోభం కలిగింది. కాని తనకు చెయ్యి ఆడలేదు. కనీసం కళ్ళతోనైనా సంజ్ఞ చేయాలంటే జరగలేదు. మనసంతా మధురమైన భావాలతో నిండిపోయి మాట కొరవడింది! సిగ్గు ముంచుకొచ్చింది. అతని సంభాషణలో తన విషయం ఏమైనా వస్తుందేమోనని పొంచి విన్నదితాను. అతడు చాలా గడుసుగా- తెలివిగా. సంబాపేరు శంభూ అని మార్చినట్లూ, ఇంట్లో రెండు వాటాలు వేసుకోవటం రెండు వాటాలలోనూ విడివిడిగా సదుపాయాలు చేస్తున్న విషయం అన్నీ చక చకా మాట్లాడేస్తున్నాడు.
    నాన్నగారు అతన్ని తాంబూలాలు పుచ్చుకోవడం విషయమై అడిగితే అవన్నీ పూర్వకాలం వారు నమ్మకం ఏర్పడటం కోసం ఏర్పరచినవి. ఈ ఇరుపక్షాలలోను అలాంటి సందేహం లేకపోవడంవల్ల అది కేవలం అనవసరమని తన అభిప్రాయం చెప్పాడు. నాన్నగారు తప్పక అవి జరగాలి అని అన్నప్పుడు అతడు మొండికేసి ఆయనకు కోపం తెప్పిస్తాడని తాను ఎంతగా భయపడి పోయిందో- అతను గడుసుతనంలో గడుసుతనం వొలికిస్తూ పెద్దవారిని కష్టపెట్టడం తన పద్ధతి కాదని. లాంఛనంగా జరుపవలసివస్తే దానికి పెద్ద అభ్యంతరం వుండదని తెలియజేశాడు?
    హఠాత్తుగా తోటలో కొత్త పరిమళాలు ప్రవేశించి నట్లయింది తల త్రిప్పి చూచింది ప్రేమ. ఆరడుగుల దూరంలో చిరునవ్వుతో నిలిచివున్నాడు నిరంజన్. డార్క్ కలర్ పంట్లాములో నల్లని ఫుల్ హాండ్సు టీ షర్టు టక్ చేసుకుని ఠీవి వలకబోస్తూ తన వద్దకు వచ్చాడు. తట్టుకోలేని భావాలతో గుండె బరువెక్కి- నిమిషానికి నూట ముప్పదిసార్లు కొట్టుకోవడం ప్రారంభించింది. మనసు మధుర భావాలతో కృతజ్ఞతతో నిండి అతని గుండె బరువెక్కి, నిమిషానికి నూటముప్పదిసార్లు కొట్టు కోవడం ప్ర్రారంభించింది. మనసు మధుర భావాలతో కృతజ్ఞతతో నిండి అతని దిక్కుకు బాహువులు జాపి ఆహ్వానించమంది. ముఖాన మాత్రం దాచుకోలేని ఆనందం పరిపూర్ణమైన హాస్యంగా రూపుపోసుకున్నది.
    నిరంజన్ ఒక చేత్తో పువ్వు పట్టుకొని దగ్గరగా వచ్చాడు. నిశ్శబ్దంగా చిరునవ్వునవ్వి నిలుచున్నాడు.
    అతను ఏమీ మాట్లాడడేం?- అని తొందర పడ్డది ప్రేమ మనసు.    
    "మీ బ్రదర్ వెళ్ళిపోయారా? అని పలకరించాడు నిరంజన్.
    "ఊఁ అని తల వూపింది ప్రేమ ఆ శబ్దం ఆమెకే వినిపించలేదు"
    "మీ కందరికీ చాలా థేంక్స్" అన్నాడు నిరంజన్.
    "ఎందుకు?"
    "మీ బ్రదర్ రావడం. సంబా సంగతి పూర్తిగా నాన్నగారు చెప్పటం- అన్నీ ఎంతో కాకతాళీయంగా సుళువుగా జరిగించేరు. లేకపోతే అవన్నీ చెప్పటం మీ ఆమోదం పొందటం చాలా కష్ట మయ్యేది కదా ఎంతో నేర్పుగా అన్ని పనులు సంభాషణలూ చక్కబెట్టించావు. నీకు హార్టీ థేంక్స్"
    "మీకు నేను థాంక్స్ చెప్పలేదు- చాలా ఆలస్యం చేశాను. క్షమించాలి నన్ను" అన్నది ప్రేమ ఎటోచూస్తూ.
    "నాకెందుకు థాంక్స్!?" అన్నాడు నిరంజన్. ఏమీ ఎరుగనట్లుగా ప్రేమ నేను చెప్పనన్నట్లుగా తల వూపింది. మళ్ళీ వెంటనే ధైర్యం తెచ్చుకొని "ఎందుకో మీకు తెలీదా?" అన్నది. చిరునవ్వుతో నూరు అర్ధాలు పొదిగి.    
    "ఓ? అన్నాడు నిరంజన్. ఆమె దగ్గరగా వచ్చి కూర్చున్నాడు "నాకు కావలసిన వస్తువు నేను చెడిపోకుండా కాపాడుకొంటూ కూడా ఒక పెద్ద శ్రేష మంటావా, ప్రేమా?.....ఒకరికి మనం చేసే మేలులో ఎప్పుడూ కొద్దో గొప్పో స్వార్ధం దాక్కుని వుంటుంది.... జాన్ రస్కిన్ చెప్పినట్లు లవ్ ఆఫ్ ఎడ్మిరేషన్" కూడా ఉండివుండవచ్చు-
    ప్రేమ మాట్లాడలేదు, ఆమె పరవశమంతా ఆ చిరునవ్వులో దాక్కుని ఉండిపోయింది.
    "శంభూవిషయం మీ అమ్మగారికీ నాన్నగారికీ మీ కందరికీ ఆమోద మేనా ప్రేమా? అన్నాడు నిరంజన్.
    ప్రేమ చిరునవ్వు క్రమంగా ఇనికిపోయింది "ఊ" అన్నది, మేమందరం ఆ విషయమంతా విని ఎంతో చలించిపోయాము మానవత్వం ఉండేవారెవరైనాసరే-వ్రేలెత్తి చూపలేనిది ఆ విషయం.
    "మరి అసలు విషయం అడగని మరచాను నేనంటే. నీకు .... ఇష్టమేనా? ఆ మాట నీవు ఎవరితోనైనా స్పష్టంగా చెప్పినట్లులేదే" అన్నాడు నిరంజన్ గడుసుగా నవ్వి.
    ప్రేమ అతనివైపు ఓరగా చూచింది. చిరునవ్వు నవ్వింది. అది సమాధానమేనని ఆమె ఉద్దేశం.
    "నీ మనసు విప్పి చెప్పు ప్రేమా" అన్నాడు నిరంజన్- "పరిస్థితులన్నీ తెలిసి నేను నీమీద ఎలాంటి అభిప్రాయం కల్గించానో-"
    "చెప్పమంటారా?" అన్నట్లు చూచింది ప్రేమ. నిరంజన్ ఆమె దగ్గరగా వచ్చాడు. ఆమె అరచేతిని అడ్డుకొని సున్నితంగా రాయసాగాడు. ఆ పాణిగ్రహణ స్పర్శ ఆమెలో రక్తప్రవాహ వేగాన్నినాలుగురెట్లు చేసింది?
    "ముందు ఇక్కడ-" రెండోచేత్తో తన హృదయం వైపుచూసి "మీరు నాకు చేసిన ఉపకారంపట్ల కృతజ్ఞత - తర్వాత ఆరాధన... .... ఇప్పుడు .... ....... అబ్బా- నేను చెప్పలేను-"
    "థేంక్స్ ప్రేమా. చాలా ధన్యుణ్ణి." నిరంజన్ పారవశ్యంతో ఆమెచేతిని పైకెత్తి మెల్లగా ముద్దుపెట్టాడు. ప్రేమ ఆ చెయ్యిని అలాగే వదిలి మిగిలిన శరీరమంతా గులాబి మొగలా ముడుచుకు పోతూ ఉంటే మధురభావం అనుభవించింది.        నిరంజన్ హాయిగా నవ్వాడు.
    "ప్రేమా - వెళ్ళొస్తాను- రేపురానా?" ఆ చేతిని వదలకుండానే ప్రపంచంలోని చిలిపి తనమంతా ప్రోగుచేసిన కళ్ళతో చూస్తూ భావగర్భంగా అడిఅగాడు.
    "ఉహు.... రావద్దు" అంటూ పెదాలు బిగించింది ప్రేమ,
    "అంటే రమ్మనమనేగా అర్ధం?"
    "ఉఁహుఁ. నాకు తెలీదు"
    "అంటే తెలుసనగా?"
    ప్రేమ మాట్లాడలేదు.    
    "కోపం వచ్చిందన్నమాట.... ఐతే నిజంగా నేరాకూడదు" ప్రేమ నవ్వింది "మీకీవిద్యవుందని నాకు తెలుసు, మనసున సైతం గ్రహిస్తారని. కాదుకాదు. చదువుతారనికూడా తెలుసు.... రేపు సాయంత్రం ముందుగా రావాలి మరి.
    "ఎందుకు?"
    ప్రేమ బుంగమూతిపెట్టి చేలని విసురుగ లాక్కోబోయి ఓడి పోయింది వెంటనే నిరంజన్   చేతిలో తన ఎడమచేయిపెట్టి అతన్ని ఆరాధనాపూర్వకంగ చూస్తూ అంది.

                                     
    "ఎందుకా? అమ్మానాన్న. రేపు సాయంత్రం మంచిరోజని మీ యింటికి వెళ్ళారుట. అక్కడ పెళ్ళిచూపులకని మీరుండదలిస్తే వుండండి.. నాకేం ఫరవాలేదు. ఒక పాటపాడు బాబూ-వంట చేతవునా? మా పిల్లకు వంటరాదు.... నీకు అల్లికలు వచ్చునా?..... ఏదీ అలా నడుపునాయనా- అంటుంటే అన్నీ చేసి చూపించదల్చారంటే ... గడుసుగా మాట్లాడుతూవుంటే నిరంజన్ తీయగానవ్వాడు. ఆ నవ్వులో కొంత పరిహాసం వుంది. ప్రేమ తలొంచుకుని రెండుచేతుల్లో ముఖం దాచుకుంది.
    కాసేపు తీయని నిశ్శబ్దం.
    "చాలసేపైంది. ఎవ్వరు రాలేదే!" అన్నాడు నిరంజన్ ఎవరు వస్తారు.....నాన్న షికారు వెళ్ళారు అమ్మి వంటచేస్తున్నట్లుంది. "ఐతేమరి కాసేపు కూచోనా?"అంటూ కవ్విస్తూ చూచాడు. ప్రేమ నవ్వింది. నేలకింది వారిద్దరికి మధ్య మూడుగీతలు గీచింది. "కూచోండి గానీ ఆ మూడు గీతలు దాటి రాకూడదు."
    "ఈ గీతలు ఎన్నాళ్ళో నేను చూస్తాగా" అని లేచాడు నిరంజన్.
    నిరంజన్ వెనుదిరిగి చూసుకుంటూ వెళ్ళాడు ప్రేమ పరస్పరం పరిపూర్ణంగా వున్నా ఆవేశం తొణకని ఆ సమయం. ఆ మధుర సన్నివేశాన్ని తలంచుకుంటూ హాలులోకి నడచివచ్చి సోఫాలో కూచుంది. ప్రేమ పెదవి తడిచేసుకుంది. శరీరమంతా వెచ్చగా వున్నది.
    
                            *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS