19
కాంగోలో విప్లవం జరిగిన దినాలవి. ప్రజల్లో విచక్షణా జ్ఞానం నశిచింది ఎవరి జాతి వాళ్ళను వాళ్ళే చంపుకోటం ప్రారంభించారు విదేశీయులంతా అటూ శత్రువులే అయ్యారు, వారినాయకులను కూడా వారు నమ్మలేకపోయారు లుముంబా ఆ రోజుల్లోనే హత్యచేయబడ్డాడు. రక్త పాతాని చూచి ఆనందించటం వారి దినచర్య అయిపోయింది. అక్క డెక్కడో ఒక నాయ ని చంపి, అతని కాలేయాన్ని పీక్కుని ముక్క లుగా చేసి భక్షించారని చెప్పుకున్నారు గూడా......ఆ రోజుల్లో మేమంతా అక్కడే ఉన్నాము. ప్రాణాలు చేతబట్టుకుని తలుపులు, కిటికీలు మూసుకుని ఇళ్ళల్లోనే కాలం గడిపాము. రెండు దినాలు బైటికెళ్ళకుండా వుంది గట్టాము.
మాకు రాబర్ట్ నెల్సన్ అనే బెల్జియం దేశస్థుని కుటుంబానికి స్నేహం కలిసింది. ఆయన చాలా మంచివాడు నిరంజన్, నరేన్ లు, వారి పిల్లలు కలిసి ఆడుకోవటంతో స్నేహం మొదలైంది. తర్వాత ఆడవాళ్ళు సన్నిహితులయ్యారు. ఆయనకు ఒక హోటలుండేది రెండు పెట్రోలు బంక్ లుండేవి, చాలా పెద్ద ఎస్టేట్ వందలాది కూలీలుండేవారు. మా స్నేహం దినదినాభివృద్ది కాజొచ్చింది. తలంచుకుంటే మాకే వింతగా వుంటుంది. ఒకసారెప్పుడో సరళకు టైఫా యిడ్ వచ్చినప్పుడు మాతోపాటు ఆ దంపతులుకూడా రాత్రింబవళ్ళు వంతులేసుకుని సరళ దగ్గరుండేవారు. వారికి నలుగురూ మగపిల్లలే కావటంవల్ల సరళను చాల ముద్దుగా చూచుకునేవారు. మారెండు ఇళ్ళలో ఆరుగురు మగపిల్లల్లో సరళ ఒకత్తి అందరు కలసి ఆడుకుంటే చూడముచ్చటగా వుండేది. సరళకు బెల్జియమ్ భాషలో పద్యాలు నేర్పేది. కథలు చెప్పేది. అందమైన ఫ్రాకులకు ఎంబ్రాయిడరీ కుట్టువేసేది వాళ్ళ స్నేహితులు కూడా మాస్నేహాన్ని చూచి ఆశ్చర్యపోయేవారు.
మా యింట్లో ఖమీనా అనే ఆయా వుండేది. నరేన్, నిరంజన్ లు పుట్టినప్పుడు మా యింటికొచ్చింది. వాళ్ళనాన్న మానాన్న ఎస్టేటులో పని చేశారుట! ఆమెకు అన్ని పనులు తెలుసు, చురుకైనది. తెలివి గలది. పని మీద నేను దూరప్రాంతాలకు వెళ్తే ఆమె అత్తయ్యను కనిపెట్టుకునే వుండేది. పని వాళ్ళెంతమంది వున్నా. ఎవరూ లేకపోయినా ఆమె ఒక్కతే వుందంటే ధైర్యంగా వెళ్ళేవాడిని.
సన్నగా పొడవుగా వుండేది. నీగ్రోల అంచనాల ప్రకారం ఆమె అందమైనది చిన్నజుబ్బా-మోకాళ్ళ క్రిందకు దిగిన లంగా వేసుకునేది. కొన్నాళ్ళుపోయాక మావాళ్ళనుచూచి చీర కట్టుకోడం సరదా అనిపించింది కాబోలు చీర కట్టుకోవటం నేర్పి మొదలుపెట్టింది. పిల్లల్ని తోటలో త్రిప్పటం సీతాకోక చిలుకల్ని పట్టివ్వటం కాయలు పిందెలు కోసివ్వటం మొదలు ఈత, గుర్రపుస్వారి. బాణాలు వేయటం కూడా నేర్పేది. ఒక్క రోజు అయినా రాకపోతే పిల్లలు నిరుత్సాహపడిపోయేవారు.
ఆమెకు పెళ్ళయిందిగాని భర్త ఎక్కడికో వెళ్ళినట్టు చెప్పేది. ఒకనాడు ఉన్నట్లుండి అతడు తిరిగి వచ్చాడు. ఆమె ఆనందం చెప్పనలవికాదు. అతనికి అక్కడే ఉద్యోగం ఏదైనా యిప్పించమని బ్రతిమాలింది. ఉద్యోగం వుంటే స్థిరంగా ఉంటాడని ఆశ. మరుసటి రోజు భర్తను పిల్చుకొని వచ్చింది. అతన్ని చూచి నిర్ఘాంతపోయాము అతడు నీగ్రోలా లేడు. చామనఛాయలో వున్నాడు. తీర్చిదిద్దిన కనుబొమలు ముక్కు పెదవులు జుట్టు నుదురు వాళ్ళతీరే. కానీ రంగులోని మార్పు ఆమె ముఖంలో ఎంతో కళను తెచ్చిపెట్టింది. అతడి పేరు డుంబా.
వీళ్ళనాన్న ఒక బెల్జియం సోల్జర్ లెండి" అంది ఖమీనా మా ఆశ్చర్యానికి నవ్వుతూ అతడు డ్రైవ్ చేయగలడని తెలిసింది. వెంటనే పనిలో పెట్టుకున్నాను.
ఖమీనాకు సంతానం లేదు. రెండుసార్లు గర్భస్రావం అయింది. పిల్లలు కలగరేమోనని దిగులు.
ఇరవై సంవత్సరాలు మాదగ్గరే వుండి అతి సన్నిహితుడై పోయారు ఆమె క్షణం లేకపోతే ఇంట్లో పనులు ఏవీ అయ్యేవికాదు.
నీగ్రోలచేత పనులు చేయించుకుంటామని మా మీద కోపం చూసిన వారున్నారు. కాంగోలో మనవాళ్ళు చాలా తక్కువ. అక్కడి వాళ్ళు ఎవరైనా సరే వారితో స్నేహంగా వుండి వాళ్ళసహాయం తీసుకోక పోతే జీవించటం కష్టం.
పిల్లలు పెద్ద వాళ్ళయిన తర్వాత వీళ్ళ అవసరం అంతగా లేదు. కానీ ఆమెను పొమ్మనలేక పోయాము.
మా ఇంటికి ఫర్లాంగు దూరంలో - అంటే లియోపాల్ద్ విల్ కు సమీపంలోనే చిట్టడివి. భూమధ్య రేఖా ప్రాంతంకదా- సంవత్సరం అంతా వర్షాలు- చిక్కటి అడవి మా యిల్లు వూరికి దూరంగా వుండేది. పెద్ద తోట. కొబ్బరి చెట్ల నిండుగా వుండి కలకలలాడేది...ఫర్లాంగు దూరంలో ఒక కలప మండీ దాని వెనుక చిన్న చెక్క ఇల్లు. ఆ ఇంట్లో వాళ్ళుండే వారు. ఎంత తప్పు చేసినా వారిద్దరి కఠినంగా చూచేవాళ్ళంకాము తప్ప త్రాగి వాడు సమయానికి కార్ గాని వాన్ గాని తేకపోయినా నేను చూచీ చూడనట్లు వూరుకునేవాడిని. ఖమీనా అతని తప్పును వెంటనే కనిపెట్టి మన్నించమని కోరేది. ఒకసారి పిల్లలంతా ఆడుతూ తోటలోనికి వెళ్ళారు. అందరు వచ్చినా నరేంద్ర రాలేదు. సంధ్య వేళ దాటింది. మా ఆరాటం. భయం చెప్పనలవికాదు. ఆయా ఒక్క పరుగున వెళ్ళింది. దివిటీలు పట్టుకుని నలు మూలల వెదుకుతున్నారు. నిరంజన్ వచ్చీరాని మాటలతో "కుక్క" "కుక్క" అన్నాడు. కుక్క తీసుకెళ్ళిందో - ఏమో! మాకు గుండెలదరిపోయాయి. జీప్ లో - డుంబా మా కెదురొచ్చాడు. అతని చేతిలో నరేంద్ర జుబ్బా రక్తంతో తడిసినది వుంది, మీ అత్తయ్య కెవ్వున అరచి స్పృహ కోల్పోయింది, తోటలో పిల్లలు ఆడుకుంటూ పరుగులెత్తు తుండగా, తోడు వెళ్ళిన నౌకరు చెట్టు క్రింద గుర్రు పెట్టి నిద్రపోయాడు పిల్లలు దెబ్బలాడుకున్నారు కాబోలు దెబ్బలు తగిలి నరేంద్ర స్పృహ తప్పి పడిపోయాడు. పిల్లలు భయపడి ఎక్కడి వారక్కడ పారిపోయారు. నరేంద్రను కుక్క చెట్ల గుబుర్లలోకి లాక్కుపోయింది. ప్రసవిస్తున్న రక్తం కోసం కాబోలు. నిరంజన్ నౌకర్ని లేపగానే వాడు అందరితోపాటు నరేంద్ర కూడా వచ్చి వుంటాడని ఇంటికొచ్చేశాడు. నరేంద్ర రాలేదని తెలియగానే డుంబా పరుగులమీద వెళ్ళాడుట ఆ దెబ్బలకు. కుక్క పీకుడుకు నరేంద్ర అసలు బ్రతుకుతాడనుకోలేదు. నరేంద్రకు దెబ్బలు మానడం. మనఃస్థితి బాగుపడడం నెల రోజులు పట్టింది. అన్ని రోజులూ డుంబా, ఖమీనా వాడిని ఎత్తిదించలేదు. ఆ సంఘటనను మే మెన్నటికి మర్చిపోలేము. ఆ రోజున డుంబా ఏ మాత్రం ఆలస్యం చేసినా నరేంద్ర బ్రతికేవాడుకాడు-

ఒక రోజు రాత్రి పనులన్నీ ముగించుకుని ఆయా వెళ్ళిపోయింది. నేను తలుపులన్నీ నేనున్నాయో లేదో చూచి అప్పుడే పడుకున్నాను.
ఎవరో ధన ధనమని తలుపు తట్టారు. తలుపు తీయకముందు ఎవరు? అని అడిగాను- ఆ స్వరం ఖమీనాది- తలుపు తెరిచాను. ఆమె వెనుక డుంబా నుంచుని వున్నాడు.
నేను తలుపుకు అడ్డంగా నుంచుని వుంటే లోపలి కెళ్ళమని సైగజేసింది. నేను జరిగాను. వాడు లోపలికొచ్చి తలుపు వేశాడు. డుంబా ఎప్పుడు మాట్లాడడు. వాడి ముఖం కవచంలా భావ సంచలనం లేకుండా వుంటుంది.
ఆయా నెమ్మదిగా చెబుతోంది లుముంబాను ఎవరో హత్య చేశారు. కల్లోలాలు రేగుతున్నాయి మీరు వెంటనే వెళ్ళిపోవాలంటున్నాడు డుంబా డుంబా బొంగురు గొంతుతో అన్నాడు.
"మీ స్నేహితులు చాలామంది వెళ్ళిపోతున్నారు. మీరు అవసరానికి డబ్బుండాలి కదా! ఇప్పుడే సరిహద్దు దాటి వెళ్తున్నాను. డబ్బు- ముఖ్య మైన విలువగల వస్తువులివ్వండి పెట్టి వస్తాను. అక్కడ నా స్నేహితులున్నారు. ఫ్రెంచి కాంగో చేరవేస్తే అవసరమొస్తే క్షణంలో దాటివేయవచ్చు."
నాకు కోపం వచ్చింది. అసలేం జరుగుతోందీ చెప్పకుండా ఇంత డబ్బు ఇంత ముఖ్యమైన విలువగల వస్తువులతని కెలా అప్పగించను? ఏం జరిగింది కటువుగానే అడిగాను. ఖమీనా ముఖం రాయివలె అయింది. "మీకు అనుమానంగా వుంది కదూ! మీ స్నేహితులు రాబర్ట్ నెల్సన్ ఇక్కడి కొస్తున్నారు-"
దేనికి?
"తలదాచుకోటానికి. నెమ్మదిగా సరిహద్దు దాటడానికి" నా ఒళ్లంతా చల్లబడింది. కుర్చీలో కూచున్నాను.
"వీళ్ళకెవరికైనా మీరు ఆశ్రయం యిస్తారు. అటువంటి వారు మాకు విరోధులు. మీ కటువంటి పరిస్థితి రాకముందే చల్లగా దాటిపోతే మంచిది.
నాకు పరిస్థితి అర్ధమైంది. వాళ్ళ ప్రియ తమ నాయకుని హత్య చేయించింది యూరోపియన్లు- బెల్జియన్ లు అని వారి భావం? అట్టివారికి ఆశ్రయమిస్తే మేము శత్రువులవుతాము. ప్రజావెల్లువ మా పైకి మళ్ళుతుంది.
వెళ్ళిపోవాలి. వెంటనే పారిపోవాలి. అదీ తక్షణ కర్తవ్యం. డుంబా ఆవేశంగా మాట్లాడుతున్నాడు. లుముంబాను గూర్చి వాళ్ళకు ఉన్న పవిత్ర భావాలు. లుముంబా ఆదర్శాలూ వాగ్దానాలూ వల్లెవేశాడు సగంలో హత్య గావింపబడ్డ ఆదర్శం జాతిని మేల్కొలిపి రెచ్చగొట్టింది. నా మిత్రుడు నెల్సన్ గూఢచరి అని ఆ ఉద్యమ నాయకులు భావించారు.
