Previous Page Next Page 
ఉన్నతశిఖరాలు పేజి 16


    ప్రేమ మళ్ళీ నిశ్శబ్దంగా కూర్చుంది. గీత క్షణం ఆగి, అన్నది "నిరంజన్ అంటే మీ అమ్మా నాన్నా వాళ్ళకు సదభిప్రాయం వుంది కదా? .... వారికి ఇదంతా చెప్పి ఏదైనా చేయించగలరా?"
    "అంటే"
    "కనీసం లలిత- నరేంద్రలు ఇక్కడ చూసుకునే ఏర్పాట్లు లాంటివి..........ప్రేమ మౌనం దాల్చి అదోలా చూస్తుంటే గీత చటుక్కున ఆపుచేసింది. "ప్రేమా! అలా వున్నావేం!"
    "నిరంజన్ అంటే మా యింట్లో కూడా సదభిప్రాయం లేదు."
    విస్తుపోయింది గీత.
    "అంటే మీవారెవ్వరికీ కూడా నిరంజన్ గూర్చి ఏమీ తెలియదన్న మాట. అతను నీకెంత సహాయం చేసింది ఒక ఘోరమైన విపత్తు నుంచి నిన్ను ఎలా రక్షించింది ఏమీ తెలియదన్నమాట! ప్రేమా ఇటుచూడు...ఇది దాగుడు మూతలు కాదు....నీ వివాహ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇప్పుడే మీ అమ్మగారు చెప్పారు! ఏమిటిది? ఎందుకిలా జరుగుతోంది? ....నా ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పు నీకు నిరంజన్ అంటే ఎటువంటి అభిప్రాయం వుంది?"
    "ప్రేమ గీత కళ్ళల్లో కొక్కక్షణం చూచి మళ్ళీ దృష్టి మరల్చింది ఆమె కపోలాలు క్రమ క్రమంగా ఎరుపెక్కాయి. అర్ధనిమీలిత నేత్రాలతో ముఖాన్ని ప్రక్కకు తిప్పింది. పెదిమలపై దరహాసరేఖ కదలాడుతోంది.
    అతి మెల్లగా అంది..."అమ్మావాళ్ళ నొప్పించవలనేమో.
    ఆ మాటతో నిరంజన్ అంటే ప్రేమకు ఇష్టమేనని గీతకు స్పష్టమైంది.    
    "మరి నీ అభిప్రాయం అడగలేదా. మీ అమ్మానాన్నా?"
    "నాన్న అడిగారు గానీ - అమ్మ అడిగేదేమిటని తీసిపారేసింది..."
    "నువ్వు వూరుకున్నావు - అంతేగా-" వెటకారంగా అంది సీత.
    "నేనే ఒక నిశ్చయానికి రాలేకపోయానప్పుడు."
    "ఇప్పుడు?!"        
    "నీకు తెలుసుగా? మళ్ళీ అడగటం దేనికి?"
    "అయితే మరి ఈ సంగతంతా మీ అమ్మా నాన్నలకి నచ్చచెప్పునువ్వు చెప్పలేకపోతే మీ అన్నయ్యకు ఇవన్నీ వివరంగా ఉత్తరం వ్రాయి. రేవతి అక్కడ ఉండనేవుందికదా!" అన్నది గీత.
    "నిజం అన్ని విషయాలు సవిస్తరంగా అన్నయ్యకు రాసేస్తాను...
    "ఆ నీగ్రో పిల్లాడి గూర్చికూడారాయి. అది చాలా ముఖ్యం."
    ప్రేమ కలం కాగితంవెతికి పట్టుకుని కూచుంది.
    "బెస్ట్ ఆఫ్ లక్ ప్రేమా- వస్తా మరి."

                                17

    "నరేన్ సంబా ఎలా వుంటాడో"
    నరేన్ తలతిప్పి నిరంజన్ కేసి చూశాడు.
    "నాకూ వాడిని ఎంత త్వరగా చూద్దా మా అని ఆదుర్దాగా వుంది. ఆయా ఆ రోజులు. ఆ సంఘటనలు అన్నీ గుర్తుకు వస్తున్నాయి" అన్నాడు నరేంద్ర: దూరంగా సముద్రంలోకి చూస్తూ.    
    స్టీమర్ రాకకు ఒక రోజు ముందుగానే బొంబాయి చేరారు. అన్నదమ్ములిద్దరూ. మూడు రోజులు వారిద్దరూ కలిసిన ప్రయాణంలో ఎంతో సన్నిహితుడై ఎన్నో విషయాలు చర్చించుకున్నారు.
    ఈ ప్రపంచంలో, ఈ సమకాలీన సాంఘిక పరిస్థితుల్లో, వారికి వుండే సమస్యలు అతి చిత్రమైనవి. ఆకారంలేని సంఘం వారిని అన్ని వైపుల నుండి ఎదుర్కొంటున్న తాకిడి! వారికి భయాన్ని కంటే ఆశ్చర్యాన్ని. అసహ్యాన్ని కలిగిస్తున్నది.
    ఆ కుటంబం ఎవరికి. ఏ విధంగానూ హాని చేయకపోయినా పది మంది కలసినచోట వారి ప్రసక్తి తప్పని సరిగా వచ్చేది. వారినిగూర్చి ఎవరికీ తెలిసింది వారు పూర్తిగా చెప్పిన తర్వాత. "మాకెందుకులే" అని విరక్తి ప్రకటించడం పరిపాటి అయింది.
    పెద్ద ఓడ అందంగా, గుంభనంగా దూరాన్నుంచి దగ్గరకు రావడం, అది గమనించడం చాలా మంచి అనుభవం. అలా చూస్తూ నిల్చున్నారు ఆ అన్నదమ్ములిద్దరూ.
    "అన్నయ్యా........"నరేన్ కళ్ళలో వింతకాంతి క్షణకాలం మెరసి మళ్ళీ సందేహ మేఘాలు వెలిశాయి "వీడిని తీసుకెళ్ళితే ఎంత రభస జరుగుతుందో జనానికి కొన్నాళ్ళవరకు చెప్పుకొందుకు విషయం దొరికిందన్న మాటే.
    "కొన్నాళ్ళ వరకేమి, కొన్నేళ్ళ వరకు- 'నిరంజన్ నవ్వులో ఆనందం లేదు. అది లోకంమీద అసహ్యంతో అతడు నవ్విన నవ్వు. తన కసిని కక్కిన నవ్వు.
    ఓడ దగ్గరవుతున్నది. ఉత్కంఠ పెరుగుతున్నది.
    ఈ నీగ్రో అబ్బాయిని గురించి లోకులు చాటున. ఎదురుగా అడిగిన సందేహాలు చేసిన పరిహాసాలు, జ్ఞాపకం రాసాగాయి ఒక్కొక్కరికి. ఒక భారతీయ కుటుంబం కొన్నాళ్ళు ఆఫ్రికాలోవుండి రావడం. వాళ్ళు ఏదో విశ్వాసం కారణంగా ఒక ఆఫ్రికన్ బాలుణ్ణి తమతో సాకడం ఈ సంఘానికి విచిత్రంగా కనబడనీ కాని. ఇది మంచిపని. మంచిపనికి ఎదురయ్యే ఆటంకాలన్నీ దీనిని ప్రతిఘటిస్తాయి. గాంధీ మహాత్ముని అంతటివాడు ఈ ఉద్యమంలో ఎన్నో కష్టనష్టాలకు తలవొగ్గినప్పుడు, సామాన్య సాహస ప్రక్రియలుగల తమలాంటి యువకులకు ఇది పెద్ద దుస్సాహసంగా కన్పించవచ్చు. దీని వలన కొన్ని ఆపదలుకూడా కలగవచ్చు అన్నిటికీ సిద్ధపడాలి, అనిపించింది ఆ అన్నదమ్ములిద్దరికీ, ఆ క్షణాన.
    రోయ్" మంటూ ఓడ అదిరింది. ఎవరి ఆలోచనల్లో వారు మునిగి వున్నారు. ఓడ సమీపానికి రాగానే కళ్ళెత్తి ఆత్రంగా చూచారు.
    ఓడ లంగరు వేశారు. అన్నదమ్ములిద్దరూ మెట్లెక్కి డెక్ ముంగిట నుంచున్నారు. వారి హృదయాల్లో ఉత్కంఠ పేరుకుంది.
    స్టీమరులో సందడి అధికంగా వుంది. జనం బిల బిలమంటూ దిగుతున్నారు, పావుగంట గడచిన తరువాత ఒక "స్టీవర్డెన్" అటు ఇటూ చూసుకుంటూ వస్తోంది. ఆమె వీళ్ళిద్దర్నీ చూచి సంశయంతో సమీపించింది. మీరు ఎవరికోసం వచ్చారో తెలుసుకోవచ్చునా? అంది.
    మేము సంపాలనే నీగ్రో బాలుడికోసం వచ్చాము- అతడు....పోర్ట్ నుండి రావాలి ఇవిగో. ఎంబసీనించి- రెడ్ కాస్ నించి వచ్చిన పత్రాలు" ఆమె చిరునవ్వుతో. 'దయచేసి నాతోరండి" అంటూ లోపలికి దారిచూపింది. వారుముగ్గురూ ఒక విశాలమైన పార్లర్ లోనికి వెళ్ళారు. మధ్యలోవున్న టేబుల్ దగ్గర ఒక ఆఫీసర్ కూర్చుని వున్నాడు. నిరంజన్ నరేంద్ర లిద్దరూ అతన్ని సమీపించి ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. ఆఫీసర్ భారతీయుడే. అతను పత్రాలన్నింటినీ చూస్తున్నాడు. అన్నదమ్ముల కళ్ళు క్షణం అధికారి చేతులవైపు క్షణం తలుపుమీద, తిరుగుతూ వున్నాయి. పిల్లవాడిని తేవటానికి ఆస్టీవర్డెన్ వెళ్ళింది. ఇప్పుడో అప్పుడో రావాలి? తలుపుకొట్టిన సన్నటి శబ్దం అయింది. అతను "కమీన్ అన్నతర్వాత తలుపు తెరుచుకుంది. మొదట స్టాకింగ్ వేసిన చిన్నకాలు ఆగుపించింది. క్షణం ఊపిరి బిగబట్టినట్లుంది వాళ్ళకు. అత్యాతురతతో ముందుకు వంగి చూస్తున్నారు. రెండుక్షణాలు పట్టలేదు పిల్లవాడు తలుపుదాటి గదిలోకి రావటానికి."అహ్" అని విస్తుపోతూ శ్వాస ఎగరేసేరా ఇద్దరు?
    పిల్లవాడు. తమను రక్షించిన ఆయా కొడుకు- స్వచ్చమైన ఆఫ్రికా జాతి వనితకొడుకు. తమకంటే తెల్లగా వున్నాడు! తలమీద అర్ధ అంగుళం పొడవు జుత్తుంది. అది నల్లగా చిక్కగా వంకీలు తిరిగిన జుత్తు ముక్కు చప్పడిముక్కు.
    అన్నదమ్ములోకరిముఖాలొకరు చూచుకున్నారు తడారిననోరు ఏమీ పలకనివ్వలేదు.
    ఆమె వాడిని నడిపించుకుంటూ తెచ్చింది. నిరంజన్ ముందులేచి కుడిచేయి చాపాడు. ఆ పిల్లవాడు ఎగాదిగా చూచి బిత్తరచూపులను ఆమె వైపు మళ్ళించాడు. ఆమె మెల్లగా ఏదో చెబుతోంది." బిగ్ అంకుల్ - స్మాల్ అంకుల్- లిటిల్ - లిటిల్ అంకుల్. గుడ్ బోయ్- షేక్ హాండ్" పొడిపొడి అక్షరాలలో మాట్లాడుతోంది. పిల్లవాడు ఆమెవైపు చూస్తూనే చేయిచాపాడు. నిరంజన్ వాడి బుల్లిహస్తాన్నందుకుని క్షణం పట్టుకుని నరేంద్రకు అందించాడు. నరేంద్ర చేయి మెలగావూపుతూ "గుడ్ యీవినింగ్" అన్నాడు.    
    పిల్లాడు భయంతో ఇటుదిరిగి "గుడ్ ఈవెనింగ్" అంటూనే మళ్ళీ ఆమెవైపు తిరిగి ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు.
    నిరంజన్ ఆఫీసరుతో మాట్లాడుతున్నాడు.
    నరేంద్ర జేబులోంచి చిన్నకారు. ఒక తుపాకి, ఒక బంతితీసి వాడి కిచ్చాడు. వాడి ముఖం ఆనందంతో వికసించింది. కాని మరుక్షణం భయంతో నరేంద్ర వైపు చూచాడు. ఆమె భయం పోగొడ్తూ ఏదో చెబుతోంది.    
    చివరికి నరేంద్ర బిస్కెట్ ప్యాకెట్ అందిచ్చాడు.
    పిల్లవాడు లొంగలేదు.
    నిరంజన్ కాగితాల నన్నింటినీ పదిలపర్చుకున్నాడు.
    ఆమెవైపు చూడకుండా- "మీరు వెళ్ళిపోతే పిల్లవాడిని తీసుకెళ్తాను." అన్నాడు. ఆమె బిడ్డ చెంపలు నిమిరి నెమ్మదిగా లోనికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన పది నిమిషాలకు నిరంజన్ వాడి చేతిని మృదువుగా పట్టుకుని "ఆంటీ దగ్గర కెళ్దామా? అన్నాడు.
    గోధుమ రంగు కనుపాపలను అటు ఇటు త్రిప్పి తలూపాడు. ఆఫీసరుకు చెప్పి బైటి కెళ్ళారు. చిన్న ట్రంకు పట్టుకుని నుంచున్న కాబిన్ బాయ్ దానిని వాళ్ళకప్పగించి డబ్బు తీసికొని వెళ్ళిపోయాడు. నరేంద్ర ట్రంకు పట్టుకుని నడుస్తున్నాడు. నిరంజన్ చిన్నవాడిని ఎత్తుకో బోయాడు?
    "ఆంటీ- ఆంటీ" అంటూ దిక్కులు చూస్తున్నాడు. పిల్లవాడి దీన ముఖం చూచి ఇద్దరు బాధపడ్డారు.
    "ఆంటీ దగ్గరకే వెళ్దాం-"

                            *    *    *

    రైలు స్టేషన్ లో ఆగింది. అచ్చమైన నీగ్రో బాలుని కోసం వెదుకుతున్న తండ్రి కండ్లకు వీళ్ళు వెంటనే అగుపించలేదు.
    నిరంజన్ ------ ఎత్తుకుని తండ్రి కెదురు వచ్చాడు.
    ఆయన నోరు కొద్దిగా తెరచి విస్తుపోయి తేరిపార చూచారు.
    "వీడు- వీడు ఆమె కొడుకేనా?....పొరబాటున మారిపోలేదు కదా?
    చిరునవ్వు నవ్వాడు నిరంజన్. ఆయన ఆపిల్లాడిని ఎత్తుకున్నారు.    ఆవిడ ముఖంలో చిరపరిచితమైన రూపం కానవస్తోంది. రంగు కళ్ళు రంగు జుత్తు. పెదిమలు నుదురు చెవులు ముక్కు వేరుగా వుండొచ్చు గానీ చూడగానే ఆ ముఖంలో ఏదో తెలిసిన రూపం కొట్టవచ్చినట్లగుపిస్తోంది. ఆ ముక్కు అంతా తల్లిదే వాడిని పరీక్షగా చూస్తూవుంటే ఆయన కళ్ళలో నీరు నిండుతోంది. "ఇక వెళ్దాం రండి నాన్నా" అంటూ నరేంద్ర హెచ్చరించాడు. ఆయన నెమ్మదిగా నడుస్తూ కన్నీరు ఒత్తుకున్నారు.
    ఇల్లు చేరగానే అంతా క్రొత్తగా వుంది. నీళ్ళు ఇల్లు వదలి ఐదు రోజులే అయినా ఆ గృహంలో ఎన్నో మార్పులు జరిగినట్లు కానవస్తోంది. నిరంజన్- నరేంద్రులు ఒకరి ముఖాలొకరు చూచుకుంటూ నుంచుండి పోయారు.
    తోటలో దూరంగా కట్టిన ఔటిహౌస్ లోనించి తల్లి గబగబ వచ్చింది "పిల్లాడు మారిపోయాడా" అన్న ప్రశ్న ఆమెకూడా వేసింది. కానీ ఆమెకు దెలుసు బిడ్డ మారలేదని.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS