Previous Page Next Page 
ఉన్నతశిఖరాలు పేజి 15

                   
    ఇప్పుడు ఆమె ముఖం నిర్మలంగా వుంది. మనసు ప్రశాంతమైంది.
    "నిన్న సాయంత్రం నిరంజన్ మా యింటి కొచ్చాడు.... అని ఆగింది గీత. నిరంజన్ అనగానే ప్రేమ కళ్ళు మెరుస్తాయని పరీక్షగా చూస్తూనే వుంది" వాళ్ళ తమ్ముడు నరేంద్రుడు, మా చెల్లిని చేసుకుంటే బావుంటుందని తన అభిప్రాయమట"
    "నీ వేమన్నావు?"
    "ఈ పెళ్ళిళ్ళ పేరయ్య పని ఎప్పటి నుంచి" అనడిగాను...దాని కేం చెప్పాడో తెలుసా?.....ఆఫ్రికాలో వున్నప్పటినించీనట!"
    ప్రేమ విస్తుపోయి వింటోంది వేర్వేరు శాఖలకు జెందిన వీళ్ళకు పెళ్ళిచేయబోతున్నారా! దానికి వాళ్ళవాళ్ళ పెద్ద లంగీకరిస్తున్నారా? ఆశ్చర్యంగా వుంది ప్రేమకు. ఆద్యంతం వినాలన్న కుహూహలం ఎక్కువై వరుసగా ప్రశ్నల వర్షం కురిపించింది.'        గీత హాయిగా నవ్వింది "పెద్దలమాట అటుంచు. ముందు నాకే ఆశ్చర్యం వేసింది. నన్ను తన వాదనాశక్తితో మెప్పించాడు. నేను ఒప్పుకోగానే ఆపైన మిగిలిన భారం నాపైన వేశాడు ఇప్పుడు. మాఅమ్మా నాన్నల్ని ఒప్పించే భారం నాపైన వుంది. మొత్తానికి తెలివిగల వాడు!"
    ప్రేమకు గతంలోని సంఘటనలు స్మృతిపథంలో మెదిలాయి రేవతిని తీసుకోమని అడిగినప్పుడు-ఆచారం తనపై మోపాడు ముందు తన కన్నీ విశదపర్చి తనలో నమ్మకం పుట్టించి పెద్దవాళ్ళు అనుమతించేలా చేయవలసిన బాధ్యత తనదేనని చెప్పాడు ఇప్పుడుకూడా గీతకు అదే ఆదేశించాడు గీత అంతపని చేయగలదా!
    "మీ చెల్లిని వాళ్ళెప్పుడు చూచారు? అసలిదంతా ఎలా మొదలైంది?"
    "మనం టూర్ కు వెళ్ళినప్పుడు మాట్లాడుకోవటానికి ఏమీ సంగతులుండేవికావు. ఒకరోజు ఎందుకో మా కుటుంబ విషయాలన్నీ చెప్పాలని పించింది. మా సమస్యలు -చాలీచాలని జీతాలతో పడ్తున్నబాధలు. పెళ్ళి కావలసినపిల్లలు, వాళ్ళ మూలంగా దుర్భర మవుతున్న జీవితాలు-ఏమేమో చెప్పాను... ఆనాటి మా సంభాషణ నేను మర్చిపోలేను.
    "ఏం చెప్పావేమిటి?"

                                16

    గీత తండ్రి హైస్కూల్లో మేష్టారు చాలీచాలని జీతం. ట్యూషన్లతో వచ్చే ఆదాయంతో గుట్టుగా సంసారాన్ని ఈదగల్గుకున్నాడు. ఆయనకు ముగ్గురు కూతుళ్ళు, అందరికన్నా పెద్దది - పుష్పరేఖ "ఆమెకు పెళ్ళి చేయటానికి ఐదువేల కట్నం యివ్వవలసి వచ్చింది. ఆ ఐదువేలివ్వటానికి పల్లెటూళ్ళోవున్న స్వంత పెంకుటిల్లు అమ్మాల్సి వచ్చింది. ఇల్లు పోయిందన్న విచారం సర్ధుకోకముందే కూతురు వైధవ్యం ప్రాప్తించి సంతానంతో సహా పుట్టిల్లు జేరింది ఒకకొడుకు ఒక కూతురు తప్ప ఆ భర్తనుంచి ఆమెకు ఏమీరాలేదు. రెండవది గీత, చక్కగా చదువు కుని ప్రతి సంవత్సరం పాసవుతూ వచ్చింది. అందర్లోకి తెలివిగలది. చురుకైనదీను. ఆకర్షణీయమైన ముఖంతో ఎప్పుడూ నవ్వుతూ సరదాగా మాట్లాడుతూ పదిమందిలో నేర్పుగా మెలగగలదామె స్కూల్ ఫైనల్ నించీ ప్రేమ గీతలు క్లాస్ మేట్స్ వారి స్నేహలత ఆకులు తొడిగి పుష్పించిన రోజుల్లో సహవిద్యార్ధినులు అసూయపడ్డారంటే ఆశ్చర్యం లేదు!
    గీత మంచి మార్కులు తెచ్చుకోవటంతో ఆమెపై చదువు అది సులభమైంది. స్కాలర్ షిప్ వచ్చింది.
    ఆమెను యూనివర్శిటీ లో చేర్చారన్న మాటేగాని అందువల్ల ఆ తల్లిదండ్రులకు ఆనందం ఎంత స్థాయినందుకున్నదో - మరోహ దెస అంతగా దిగులుపడిపోయారు. అంత చదువుకున్న పిల్లకు తగిన సంబంధం చేయలేకపోతే తలవంపులు ఈ సమాజంలో చదువుకున్న పిల్లలకి పెళ్ళిళ్ళు కావటం కష్టతరమై పోతోంది. కాని గీత వుత్సాహాన్ని చూసి వారు మరి మాట్లాడలేకపోయారు. తాయారమ్మ గీత కాలేజీలో జేరిన కొన్ని రోజుల వరకు మహా దిగులుపడి పోయింది. తండ్రి ధైర్యంగా దినాలు గడుపుతున్నాడు.
    గీత తర్వాత మరొక ఆడపిల్ల ఆమెపేరు లలిత ముగ్గురిలోకీ చక్కని రూపు కలది. బి.ఎ. చదువుతోంది.ఆ తర్వాత ఇద్దరు కొడుకులు ఇద్దరు పి. యు. సి. చదువుతున్నారు.
    పట్నవాసం - ఇందరినీ చదివించటం - బ్రతుకు చెడి సంతానముతో ఇల్లు చేరిన కూతురు. ఇదంతా కూడి మోయలేని బరువైంది రఘువరంకి, ఎవరి చదువు మాన్పించాలి? తెలివిగా చదువుతూ ముందుకెళ్తున్నవారిని అడ్డగించలేకపోయాడు. పోనీ అడ్డగించి-అంతటితో ఆపుజేయించి వివాహం చేయగలడా! ఏమో - అదీ అనుమానమే!
    గీత మొదటి సంవత్సరం ఆరు నెలలు చదివాక ఒక సంబంధం వచ్చింది. వాళ్ళెవరో కాదు. గీతకు స్వంత - నత్త కొడుకు, వాళ్ళు వీళ్ళకంటే ఆర్ధికంగా ఓమెట్టు ఎక్కువ, రఘుపతికి తాయారమ్మకు మనసులో ఏముందోగాని, పైకిమాత్రం ఏమి ఆశలేనట్లే వుండేవారు.
    ఉన్నట్లుండి ఒకరోజు గీతవాళ్ళ అత్తయ్య రావటం ఆమెతో పాటు కొడుకు వెంకటేశ్ కూడా రావడం చాలా ఆశ్చర్యపడ్డారు. వెంకటేశ్ కొత్తగా ఉద్యోగంలో చేరాడు. మందులకంపెనీలో మెడికల్ రిప్రజెంటెటివ్ గా చేరాడు.
    అత్తయ్య ఏమీదాచలేదు. అంతా సూటిగానే అడిగింది. గీత చదవాలి. తప్పక చదవాలి. వారికే అభ్యంతరం లేదు కానీ చదివించటం మటుకు రఘుపతే చూచుకోవాలి, రెండో విషయం దాదాపు అయిదు వేలు డబ్బుకావాలి. ఆడబిడ్డలకు ఏ కొరత కల్గరాదు. కోరితే పదివేలివ్వగల వారొస్తారుగానీ స్వంత మేనకోడలని రేటు తగ్గించారు. పెళ్ళి వెంటనే చెయ్యాలి. పిల్లవాడు తిరుగుతుంటాడు కాబట్టి పెళ్ళి ముఖ్యం. రఘుపతికి అన్నీ సవ్యంగానే వున్నట్లుగా అనిపించింది. కానీ డబ్బు దగ్గర కొచ్చేసరికి నెత్తిమీద పిడుగు పడినంత పనైంది, ఆడపిల్లను కన్నందుకు బ్రతిమాలాడు, కానీ, ఆమె దయ దల్చిందికాదు. ఒక్క పైసా క్రిందికి దిగలేదు.
    గీతకు బావంటే ఇష్టమే- అది అంతవరకే- అతని భార్య కావటానికి చిన్న త్యాగాలు చేయటానికి సిద్ధంగానే వుంది. కానీ అతడి కివేమీ పట్టలేదు అమ్మ "ఊఁ" అంటే తాళికట్టటానికి. ఆఁహఁ' అంటే అవతలికి దాటి పోటానికి సంసిద్దుడై వున్నాడు. ఆ పరిస్థితి చూచి గీతకెంతో అసహ్యం వేసింది! ఈ యుగంలో ఇలాంటి వారుంటారా! బావ అంటే జాలివేసింది. ఎంత పిరికివాడు! అది పిరికితనమా స్వార్ధమా సంకుచిత స్వభావమా, చేతకానితనమా.
    లలిత బి. ఎ. పరీక్ష పాసయ్యింది. ట్రైనింగ్ చదివించాలనుకున్నాడు రఘుపతి. ఆడపిల్లలయినా చేతికందితే తన కష్టాలు గట్టెక్కుతాయనుకున్నాడు.
    రెండు మూడుసార్లు రఘుపతి వాళ్ళింటికి నిరంజన్ వెళ్ళాడు అప్పుడెప్పుడో లలితను చూచాడు.
    "ఆనాడు ఎందుకో నిరంజన్ తో హృదయం విప్పి మాట్లాడాను. మాలాంటి కుటుంబాలలో విద్యకు విలువలేదన్నాను డబ్బులేక పెళ్ళి కాదు- పెళ్ళి కాదని చదివిస్తే- చదివించారని పెళ్ళికాదు చదివిన పిల్ల ఆర్జిస్తుందన్న సదుపాయమైనా చూచుకోరు పశువును బేరంజేసినట్లు బేరం జేస్తారు.... పెద్దలంగీకరిస్తే మంచిదే కానీ.....గీత" కళ్ళలోనీళ్ళు తిరిగాయి కంఠం బొంగురుపోయింది గుటకలు మ్రింగుతూ మెల్లగా అంది "లలితకు పెళ్ళిచేయకుండా అయినా ఊరకుంటారుగానీ" పెళ్ళికి ఒప్పుకోరు" "ఎందుకు?"
    "ఎందుకేమిటి. వాళ్ళు పుట్టిపెరిగింది అంతా పైదేశంలో. అంతే కాదు తిరిగొచ్చాక ప్రాయశ్చిత్తం చేయించుకోలేదు. వాళ్ళింటి ఆడపిల్ల పరిశ్రమ ఎవరినిచ్చి చేశారంటావు? అతని తల్లిదండ్రులు వేర్వేరు కులస్తులు.... అంతకన్నా ముఖ్య కారణం తెలుసుగా? - వారి కుటుంబంలో మడీ తడీ ఆచారం లేదు అందరితో సమానంగా వ్యవహరిస్తారు."
    "నిరంజన్ ఊళ్ళోలేడు?" అని విషయం మార్చింది. గీత, ప్రేమ నిశ్శబ్దంగా కూర్చుంటే బాగాలేక
    "ఎక్కడి కెళ్ళాడు?"
    "బొంబాయి వెళ్ళాడు. నిన్న సాయంత్రం నాకు చెప్పటానికొచ్చాడు. ఆఫ్రికానించి ఒక పిల్లాడొస్తున్నాడుట. ఆ అబ్బాయిని తీసుకురావటానికెళ్తున్నట్లు చెప్పాడు?"
    ప్రేమ ఆరాటం అధికమైంది.
    "ఎవరా అబ్బాయి? వీళ్ళ బంధువా?"
    గీత తల అడ్డంగా ఆడించి వూరుకుంది. ప్రేమ ఆమె నిశ్శబ్ధాన్ని సహించలేక పోయింది. గీత చేయి పట్టుకుని రెట్టించి అడిగింది.
    "చుట్టంకాదు ఒక  నీగ్రో బాలుడు"
    "ఆఁ" అంటూ ఆమె చేతిని వదలివేసింది ప్రేమ. ఎవరా నీగ్రో పిల్లాడు? ఎందుకొస్తున్నాడు? ఆ పిల్లాడిని ఏం చేస్తారు? ఒకవేళ హిందూ దేశం చూసింది పంపేస్తాడేమో? లేదా వాళ్ళ స్నేహితుడేమో! కొన్నాళ్ళుండి తిరిగి వెళ్ళిపోతాడేమో.
    "ఆ అబ్బాయి ఎన్నాళ్లుంటాడేమిటి!"
    "మూడేళ్ళ పిల్లడు, ఇక్కడే వుంటాడు. వీళ్ళు పెంచుకో బోతున్నారు"
    రెండు చేతుల్లో ముఖం పెట్టుకుంది ప్రేమ. గీత నవ్వింది. "ఇప్పుడు చెప్పు. ఈ వివాహానికి అమ్మా నాన్నా అంగీకరిస్తారంటావా? .... మనవాళ్ళే దైన సహిస్తారేమో గానీ పోయి పోయి నీగ్రో పిల్లాడిని పెంచుకుంటే సహించలేరు ఆ పిల్లాడిని ఇక్కడికి రప్పించటానికి ఏన్నర్ధం నుంచి శ్రమపడ్తూ ఉన్నారుట. రెడ్ క్రాస్ సంస్థ ద్వారా చివరికి సాధించగల్గారు."
    "అనాధ శరణాలయంలో వేస్తారేమో!" ప్రేమ అనుమానంతో అంది.
    "ఉహు. వారింట్లోనే ఉంచుకో బోతున్నారు"
    "ఎంతకాలం వరకు?"
    "ఏమో! ఐదేళ్ళవరకు - లేక పదేళ్ళవరకు, ఆ తర్వాత - జ్ఞానం తెలిసి ఇది పరాయిదేశం అని తెలిసికొన్న తర్వాత తిరిగి పంపించి వేస్తారేమో? అదంతా కొన్ని సంవత్సరాల తరువాత జరిగే విషయం ప్రస్తుతం జరగబోయేది ఎల్లుండికి - అంటే మరి మూడు రోజుల కంతా నిరంజన్ ఆ పిల్లాడితో వచ్చేమాట ఖాయం!"   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS