Previous Page Next Page 
మిధ్య పేజి 15


                                     
    ఆ సాయంకాలం నెలా రెండు నెలల మధ్య కాలంలో ఆరుబయట గార్డెన్ చెయిర్ లో కూర్చుని ప్రశాంతంగా వీచే చల్ల గాలిని పీల్చుకుంటున్నాడు హరికృష్ణ. చిట్టిబాబు మొక్కాలకి నీళ్ళు పోస్తానని మారాం చేస్తుంటే అరుంధతి చెల్లెల్ని పిలిచి వాడితో బాటు మొక్కలకి నీళ్ళు పోయామని చెప్పింది. గేటు దగ్గర హరికృష్ణ కి ఎదురుగా గులాబీ మొక్కలు మాత్రం నీళ్ళు పోసేందుకు మిగిలి పోయేయి. శ్యామల తటపటాయిస్తుంటే "అటు రా, పిన్నీ, " అన్నాడు కుడి చేత్తో నీళ్ళ పైపు నీ, ఎడం చేత్తో శ్యామల కొంగు నీ పట్టుకుని. శ్యామల తప్పని సరిగా వెళ్ళవలసి వచ్చింది. హరికృష్ణ చిరునవ్వు నవ్వి, "గుడీవినింగ్ మిస్" అన్నాడు.
    "గుడీవినింగ్" అన్నది శ్యామల ముక్తసరిగా.
    "ఈ మధ్య ఊళ్ళో లేరా? కనిపించలేదు. ఏ ఊరు వెళ్ళేరు?' అన్నాడు హరికృష్ణ.
    "ఎక్కడికీ వెళ్ళలేదు. పరీక్షలని పైనే ఉండేదాన్ని చాలా మటుకు.
    "అలాగా! పరీక్షలు బాగా వ్రాశారను కుంటాను!"
    "........"
    "సెంటర్ ఎక్కడ?"
    "మా కాలేజీ లోనే. మీరీ వేళ ఇంట్లోనే ఉన్నారేం?" అన్నది శ్యామల అతని వైపు చూస్తూ.
    "అంటే?" అని అడిగేడు అర్ధం కాని వాడిలా.
    "రోజూ మీరీ వేల్టికి వెళ్ళిపోతుంటారని నౌకరు చెప్పేరు."
    "అమ్మ ఉత్తరం రాయలేదు. డబ్బు పంపలేదు!"
    "అందుకే వెళ్ళ లేదన్న మాట. డబ్బు కావాలంటే అక్క ఇచ్చేది కద!"
    "ఇప్పుడు అవసరం లేదండి. ఇలా గాలి పీల్చు కుంటుంటే హాయిగా ప్రాణానికి రిలీఫ్ గా ఉంది."
    "నేను ఇప్పుడే వస్తాను. చిట్టి బాబు బట్టలు తడుపు కుం'టుంటాడు. తోటకి నీళ్ళు పోయడం అయిపొయింది. వాడికి అక్కకి అప్పగించి మరీ వస్తాను."
    "తప్పకుండా వస్తారా?"    
    "అలాగే, సార్!" చిట్టిబాబు పని పూర్తీ చేసుకుని లాన్ మీద పైపు పడేసి నడుము కి రెండు చేతులూ అన్చుకుని శ్యామల కోసం ఎదురు చూస్తున్నాడు. అక్కకి సవతి కొడుకనే త్రునీకార భావం శ్యామల లో ఎప్పుడూ లేదు. పక్కన పెట్టి పచ్చగా కోడి పిల్లల్లో పిల్లగా పెరిగిన శ్యామల వాడి ముద్దు మాటలకి, తల్లిని పోలి పుట్టి అందంగా ఐదేళ్ళ కే దృడంగా ఉండి ఉన్న నీళ్ళకి ఒకటి రెండు ఏళ్ళు ఎక్కువగా కనిపించే వాడంటే అక్కలాగే తనూ ప్రాణం పెట్టింది. "అయిపోయిందా , చిట్టీ?" అని అడిగింది.
    "పద, పోదాం, పిన్నీ. అమ్మ పిలుస్తుంది!" అన్నాడు ముందు దారి తీస్తూ.
    శ్యామల తిరిగి వచ్చి హరికృష్ణ ఎదురుగా ఉన్న మరో కుర్చీలో కూర్చుంది. అతను నెమ్మదిగా అన్నాడు. "థాంక్స్, మీరు వెంటనే వస్తారనుకోలేదు."
    "అక్క మీకు ఇవ్వమన్నది" ఆన్నది వంద రూపాయల నోటు అందిస్తూ.
    "దేనికి? మీరు అడిగారా?"
    "అవును."
    "ఏమని?"
    "అతను వీధిలో వెర్రి మొహం వేసుకుని కూర్చున్నాడు. తాగేందుకు డబ్బు లేదుట. నువ్వు ఇవ్వు అక్కా అం అడిగెను."
    "ఏమిటి మీరనేది?" హరికృష్ణ కంగారుగా ప్రశ్నించేడు.
    "ఉన్నమాటే అంటున్నాను. తప్పేం ఉంది? నా ఇష్టాన్ని మీరు కాదనలేరు కదా?"
    "ఏది మీ ఇష్టం?"
    "నేనిలా నోటికి వచ్చినట్లు వాగడం?"
    "శ్యామల గారూ!"
    "పట్టుకెళ్ళాండి, సర్. మళ్ళీ మా బావకి అణా పైసలతో తీర్చేద్దురు గాని. ఆ అమృతాన్ని సేవించి వచ్చి స్వర్గానికి వెళ్ళండి."
    "నా బాధ మీరు అర్ధం చేసుకుంటే ఇలా అనరు."
    "ఏమిటండి మీ బాధ?" శ్యామల కరుకుగా అన్నది.
    శ్యామలని చూస్తుంటే ఎంతో కాలం నుంచి తెలిసిన మనిషిలా , హృదయం లోకి చేర్చుకుని ఊరడించి మానసుని చల్ల బరిచే అత్మీయురాలుగా, చల్లగా చూసే దేవత గా కనిపించ సాగింది. అతడు చేష్టలు దక్కిన వాడిలా పరికిస్తూండి పోయాడు కొంతసేపు.
    "అలా చూస్తారేం? నేను మనిషిలా కనిపించడం లేదా?' శ్యామలలో కొత్త మనిషితో మాట్లాడుతున్నాననే జంకు ఏ కోశానా లేదు. కొన్ని నెలల క్రితం ఆ ఇంట్లో బావగారి మంచితనాన్ని అర్ధం చేసుకోకుండా డబ్బుని గడ్డి పోచకన్నా హీనంగా చూస్తున్న ఆ మనిషికి పరికించి చూస్తుంటే అరికాలి మంట శిరస్సు కి ఎక్క సాగింది. ఏమిటీ బాంధవ్యం? తన అక్క ఇంటికి తను ఆశ్రితురాలై వచ్చినట్లే తన బావ స్నేహితుడు వచ్చి ఉంటాడు. ఇద్దరికీ చెరో గమ్యం ఉంది. ఇద్దరి పైనా ఒకరి పై మరొకరికి మాట లనుకునేందుకు కానీ, దూషించుకునేందుకు కానీ అధికారాలు ఉన్నాయి. తనని బావ పొమ్మన్నా, అతడిని అక్క వెళ్లి పొమ్మన్నా యధావిధి గా తమ ఇళ్ళకి పోవలసిన వాళ్ళే. బావ అద్దం లాంటి మర్మం లేని మనసుని అర్ధం చేసుకుని ప్రవర్తించని హరికృష్ణ పట్ల జుగుస్పాభావం కలిగింది! 'నువ్వెవరివి అతడిని నా ఇంటి నుంచి వెళ్ళ గొట్టేందుకు?' అని ప్రశ్నించి బావ నిలదీసి అడిగితె తక్షణం ఆ ఇంటికి 'గుడ్ బై' చెప్పగలదు. పూర్తిగా నిర్ణయానికి వచ్చేక ఏ పని నైనా సులభంగా , ధైర్యంగా చేసేయవచ్చునేమో . 'ఆ ఇంతకీ మీ బాధ ఏమిటో చెప్పేరు కాదు!"
    హరికృష్ణ మొహం నీలి మేఘాల నావరించు కున్న ఆకసం మాదిరి అయింది. అతడు గతం లోకి వెడుతూ వర్తమానం లో పక్షవాతం వచ్చి ఆభాగం పూర్తిగా స్వాధీనం లో లేనట్లు డీలా పడిపోతున్న వాడిలా కనిపించేడు. శ్యామల జావ కారిపోలేదు. ఒక ఆడదాని కోసం సర్వమూ పోగొట్టుకున్న సామ్రాట్టు లా ఏడ్చే మగవాడంటే అసహ్యించు కుంటుంది.
    "నేనూ , గిరిజ ప్రాణ స్నేహితులం."
    "అయితే?"
    "గిరిజ నా చిన్ననాటి స్నేహితురాలు."
    శ్యామల నవ్వుతూ చప్పట్లు కొట్టడం ప్రారంభించింది. కొంచెం ఆగి అన్నది."మీ స్టోరీ బాగుంది. నేను అప్పుడే అనుకున్నాను, ఇదేదో లౌ ఎఫైర్ అని!"
    "మీరు తేలికగా తీసేస్తున్నారు!"
    "అబ్బే! అలాంటిదేం లేదు. నా కసలు తేలికా బరువూ తెలియనే తెలియవు. ఒట్టు నిజం అండీ. మీరు చెప్పేది చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది."
    "నన్ను అట పట్టిస్తున్నారు మీరు. నేను లౌ ఎఫయిర్ లో పడి కాదండీ ఇలా అయిపోత."
    "దబాయించకండి . చూడండి. మీరు త్రాగడం ఎప్పుడు నేర్చుకున్నారు?"
    "ఈ ఊరు వచ్చేక."
    "అంత క్రితం?"
    "నే నేరగనండి."
    "మీకీ అలవాటు ఎవరి వల్ల అబ్బిందో చెబుతారా?"
    "కంపెనీ కోసం సిప్ చేయడం లో తప్పేం ఉందండి?"
    "అరె? ఎంత మాట? స్నేహితుల చలవ చాలా బాగా పని చేసింది. సిప్ చేసినా తప్పులేదు. గొంతు వరకూ పుచ్చుకుని తృప్తి చాలకపోతే అందులో మునిగినా తప్పు లేదు."
    "మీరు ఇరానికల్ గా మాట్లాడుతున్నారు."
    "అది సరే. ఎంతవరకూ వచ్చెం....ఆ జ్ఞాపకం వచ్చింది. గిరిజా మీరూ స్నేహితులు. అప్పుడేమైంది?"
    "వాళ్ళు చాలా బీద వాళ్ళు, మా ఇంటి పక్కనే ఉండేవారు.
    శ్యామల నవ్వింది. "మొదటి రోజు మిమ్మల్ని చూసినప్పుడు బావని అడిగెను-- ఈ దేవదాసు ఎక్కడ దొరికాడని? అయితే నా అంచనాలన్నీ సెంట్ పర్సంట్ కరెక్టన్నమాట. ఇంటి పక్కన పేద పిల్లతో వియ్యం అందడం ఏమిటి? నన్ను చంపి నువ్వీ పెళ్లి చేసుకో అని అమ్మ-- నాన్న లేరని తెలిసింది లెండి-- అని ఉంటారు. మీరు హటాత్తుగా వచ్చేశారు. గిరిజ  పెళ్లి ఓ వృద్ద జమీందారు తో అయిపొయింది. మీరు ఇంకా చంద్రముఖి కోసం వెళ్లలేదేం?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS