Previous Page Next Page 
ఉన్నతశిఖరాలు పేజి 13


    కాగితాలు  కాలుతూ ఉండేవరకు ప్రేమకు చప్పున స్ఫురించింది. అది బహుశా గీత నీలగిరినుండి తనను గురించి వ్రాసి ఏర్ మెయిల్ లో పంపి వున్న సుదీర్ఘ లేఖ అయివుండవచ్చు.
    వదినా! ఉత్తరం...అది.....గీత వ్రాసిందేనా? ఆగు....కాల్పకు"
    రేవతి చిరునవ్వు నవ్వింది. "అక్కడ జరిగింది యథాతథంగా నీకు తెలుసు. గీత చూచింది గనుక ఆమెకు తెలుసు. రాసింది మా కొరకు మేము తెలియ వలసినంత తెలుసుకొన్నాను? ఇక ఇట్లాంటిది కాగితం మీద ఉండరాదు."
    కాగితాలు కాలిపోయాయి.
    "ఈ భారం వహించినందుకు నువ్వు గీతకు వందనాలర్పించవలసి వుంది." అన్నది రేవతి చిరునవ్వు తెచ్చుకుంటూ.
    "గీతకు కాదు. నీకు. సరళకు. నిరంజన్ కు అందరికీ! నేను మీకందరికీ ఋణపడివున్నాను వదినా నన్ను మీరందరూ క్షమించాలి మీ మేలు మరచిపోను ఈ దయా ఋణం నే నెన్నటికీ తీర్చుకోలేను" అన్నది ప్రేమ పరవశించి.
    "మేం అందరం నిమిత్తమాతృలం గీత దగ్గరుండి భారం అంతా వహించింది. ఆమెనే నువ్వు థాంక్ చెయ్యాలి.
    -అవును గీతను థాంక్ చేయాలి అనుకున్నది ప్రేమ.

                                  14

    హైదరాబాద్ లో అడుగుపెట్టిన మరుక్షణం గీతకు ఆరాటం అధికమైంది. ఇంటికెళ్ళిన రోజునే ప్రేమ ఇంటికి బయలుదేరింది.
    గీతను చూడగానే ప్రేమ ముఖం వికసించింది. ఎదురుగా వెళ్ళి గీతను కౌగలించుకోవాలని "ఈ జన్మలో మీ అందరి మేలు నీమేలు మర్చిపోలేను గీతా... ఇదంతా మీరు పెట్టిన భిక్ష" అని చెపుదామని ఆదుర్దా పడింది. గీత ముఖంలో ఆశ్చర్యం ప్రస్ఫుటమైంది "రా గీతా!" అన్నది ఆప్యాయంగా గీత నవ్వుతూ "ఐతే నీ కన్ని సంగతులు తెలిశాయన్న మాట వదిన ఉందా? "ఊహూఁ" మొన్ననే వెళ్ళిపోయింది. నిన్ను కలుసుకుని ముఖాముఖి మాట్లాడాలని ఉందట. ఈ సారి వచ్చినప్పుడు తప్పక కలుస్తానని చెప్పమంది....."
    "అయ్యో-ఆమెతో కాసేపు ముచ్చటిస్తే నాకెంతో హాయిగా వుండేదని ఆశ పడ్డాను. "అమ్మానాన్నా ఏమంటారు" వాళ్ళే మీ అనటం లేదుగాని నేనే అనబోతున్నాము? "ఏమైంది? ఏమంటావు?" "నాకిక కాలేజీకి రావాలని లేదు చదవాలని లేదు....."గీత తేరుకునేసరికి కొంతసేపైంది. ప్రేమ రెండు భుజాలను గట్టిగా పట్టుకుని వూపింది. ఇన్ని సంవత్సరాల కష్టం వృధాకావాలసిందేనా? ఇంకా రెండు నెలలకు పరీక్షలు....ఇంత నిస్పృహ దేనికి ప్రేమా? ఎలాగూ ప్రిపరేటరీ హాలిడేస్ యిస్తారు, ప్రయత్నం చేయలేవూ?" ప్రాధేయపడింది.
    "నా బాధ నీ కర్ధం కాదు..."
    "ఎందుక్కాదు" ఎదురు ప్రశ్న వేసింది గీత. "అయిందేదో అయిపోయింది. దాన్ని పట్టుకు వ్రేలాడితే దానిజీవితం మాటేమిటి? ఇలా వున్నావంటే నీ అదృష్టం - చదువు మానేస్తే నీ ఓటమిని అంగీకరిస్తున్నావన్న మాట - ఒక చవటను దుర్మార్గున్ని ప్రేమించి అదెంత పొరపాటో గ్రహించినతర్వాత నిన్ను నీవు నిగ్రహించుకుని మర్చి పోవటానికి మారుగా పదేపదే తలచుకుంటూ కుమిలి పోతుంటే అతగాడికి నాల్గు కొమ్ములొస్తాయి. ఎందరిని మోసగించాడో తలంచుకో - ఎందరికి ఆశ చూపుతున్నాడో ఎందరి జీవితాలను నాశనం చేశాడో ఎన్నిసార్లు నిన్నే నాశనం జెయ్యాలని వచ్చాడో- ఎంత నీచంగా ప్రవర్తించాడో-అదంతా గుర్తుకు వస్తే నీ కసహ్యం వేయటం లేదూ? ఆ దుష్టుడి బారినించి తప్పించుకున్నందుకు నీవు గర్వపడాలి. ఇదంతా ఒక పీడకలగా భావించి నువ్వు మామూలుగానే వుండాలి... ఇంకా అట్లాగే వున్నావేం? కాలేజీకి రావాలి. అవును నా కర్ధమైంది...తిరిగి... అతడొచ్చి...క్షమించమంటే... నీ హృదయం కరిగిపోతుంది- "అంతేనా?..." గీత కటువుగా అంది "గీతా!" అరచింది ప్రేమ "నా మనసు విరిగి పోయింది గీతా.... అతడ్ని చూడటానికే అసహ్యం వేస్తోంది...నేనతడ్ని చూడలేను...నేనురాలేను" గీత తల అడ్డంగా ఆడించింది." నువ్వు నా కాలిగోటికి సమానం- నా దృష్టిలో నువ్వు పురుగుతో సమానం అన్నట్లుండాలి నీ ప్రవర్తన, మనసు దిటవుచేసుకొని నా శక్తిని చదువు మీద. కేంద్రీకరించి నా కొద్దిరోజులు గడుపు గొప్ప ధ్యేయం ఏదీకూడా క్షుద్రమైన ఆటంకంవలన వృధాకావటం మంచిదికాదు....ఆలోచించుకో అమ్మా-నాన్న వాళ్ళకుమాత్రం కారణం ఏమని చెప్పావు?
    ప్రేమ మౌనంగా వుండిపోయింది. చేతుల్లో ముఖాన్ని దాచుకుని తీవ్రంగా ఆలోచిస్తోంది. ఆమెవ్రేళ్ళు కొద్దిగా వణకుతున్నాయి. ఉచ్చ్వాస నిశ్వాసాలు అతి నెమ్మదిగా వస్తున్నాయి. కొంత సేపటికి చేతులు తప్పించింది. గీతవైపు చూడలేదామె.
    "నాకు చేతకాదు నీకు చేత నవుతుంది. ఎంతో బలవత్తరమైన కోర్కెను అదుపులో వుంచగల మహాశక్తి నీలో ఉన్నది. అటువంటి దానివి నీకిదొక్క సమస్యా - లేదు ప్రేమా - అనవసరంగా ఇరకాటంలో పడ్తున్నావు....నీవెంట నేను లక్ష్మి సదావుంటాము. నీకేం భయంలేదు. అసలు అతగాని నీవు మాత్రం అణుమాత్రంగానైనా నష్టపోరాదు. లేనిపోని ఆలోచనలతో మనసు పాడుచేసుకోకు..."
    ప్రేమ అనుమానంతో గీతవైపు చూసింది. ఆమె ముఖం గంభీరంగా ప్రశాంతంగా వుంది.
    "అయితే రావచ్చునంటావా? ఇంత జరిగాక కూడా నా పక్షాన ఆలోచించే వారుంటారంటావా?
    "అవును ప్రేమా అందరూ నీ పక్షమే- ఎన్నో పుకార్లు లేచాయి. ఏవేవో అనుకున్నారు, నువ్వు అచేతనగా పడి ఉంటే చూచానని చెప్పాను నా మాటలు వాళ్ళు నమ్మలేదు. వాళ్ళు ఏదో జరిగిందని ఊహించారు ఎవరెలా ఊహించినా సత్యం సత్యమే.
    నీకు కావలసిన వాళ్ళెవరికి నీపైన తేలిక భావం లేదు. నేను, లక్ష్మి మేమంతా నిజం తెలిసిన వాళ్ళం ఉండగా నీకేం భయం." ముఖ్యంగా నిరంజన్ కు నిజం తెలుసు. దేనికి?
    "ఏమిటే గీతా నీ వాగుడు. ఇప్పుడు నిరంజన్ ప్రసక్తి దేనికీ"
    గీత ముఖంలో కాంతి తగ్గింది. ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచి పొడిగా అన్నది" అవును ప్రేమా నా వాగుడు ఈరోజు కొంచెం అర్ధం లేనిదిగానే ఉంది..... ..... నా మనస్సు దేన్నో దాచుకోలేక బాధ పడుతోంది. అందువల్ల నా మాటలు-"
    ప్రేమ అనే ధోరణి చూచి భయపడిపోయింది. "దేన్నో దాచుకోలేక-" అంటున్నది గీత "ఏమిటి గీతా: సరిగ్గా చెప్పు"
    "నిరంజన్ విషయం-
    "అవును నిరంజన్ విషయం...?"
    గీత ఎందుకలా బిగుసుకు పోతున్నది? ప్రేమ ఆమె ముఖంలో కనబడే మబ్బులు చూడలేక పోతున్నది నిరంజన్ ఆమెను పెండ్లి చేసుకొన్నాడా? లేక నిరంజన్ వల్ల ఆమెకు కూడా ఇట్లాంటి అవమానమో అత్యాచారమో జరిగిందా - ఛీ-అలా అయివుండదు.
    గీత ఉన్నట్లుండి ముఖం ప్రక్కకు తిప్పుకుంది.
    'చెప్పు గీతా-నేనీ సస్పెన్సు భరించలేను"
    "నిన్ను....నిన్ను....నిరంజన్ ప్రేమిస్తున్నాడు" ప్రేమ దిగ్భ్రమచెంది శిలా ప్రతిమయైంది. గీత కళ్ళలోకి తీక్షణంగా చూస్తోంది....కపోలాలు పాలిపోయాయి. అదరుతున్న పెదిమలు గాలికి రెపరెప కపోలాలు పాలిపోయాయి. అదరుతున్న పెదిమలు గాలికి రెపరెప కపోలాలు పాలిపోయాయి. అదరుతున్న పెదిమలు గాలికి రెపరెప లాడుతున్న గులాబిరేకుల్లా వున్నాయి. సంపంగి మొగ్గల్లాంటి వ్రేళ్ళతో పెదిమలను అదుముకుంటోంది. ఆమెకు నమ్మశక్యం కావటంలేదు. పెదిమలను అదుముకుంటోంది. ఆమెకు నమ్మశక్యం కావటం లేదు. గట్టిగా కళ్ళు మూసుకుంది. గీత-నిరంజన్ లు ప్రేమించుకోవటంలేదూ? అది కేవలం నటననా? ....మరైతే నిరంజన్ ను గూర్చి మాట్లాడే టప్పుడు గీతకు అంత ఆవేశం ఎందుకు? ఆమె కళ్ళలో ఆ తళుకెందుకు? పలుకుల్లో ఆ ప్రసన్నత ఎందుకు.....కాలేజీకి రాగానే అతన్ని చూడాలని గీత కళెందుకు ఆతృతతో వెదుకుతుంటాయి. అతనిపైన తన ఉన్న తాభిప్రాయాలను అందరి సమక్షంలో ప్రత్యేకంగా ఎందుకంటుంది! గీత నిరంజన్ ను ప్రేమించటం లేదూ! నిరంజన్ ఈ టూర్ లో ప్రత్యేకంగా ఆమెతో అతి సన్నిహితంగా తిరగలేదూ! దీని భావం ఏమిటి? తన్ను పరేక్షించాలని గీత ఈ విధంగా మాట్లాడుతోందా? "గీతా .... ఏమిటి నువ్వంటున్నది?" ప్రేమ నవ్వింది. ఆ నవ్వులో జీవం లేదు. "ఆశ్చర్యంగా వుందా? ఎందుకూ? నీకు తెలీదూ? మీకుటుంబంలో సన్ని హితంగా వుండాలని సరళ పుట్టిన దినానికి మనందరినీ ఆహ్వానించటం నాంది.... నీ ఆనందంకోసం టెన్నిస్ పోటీల్లో పాల్గొనలేదు...అప్పట్లో సుధాకర్ ఓడిపోవటం నీ కిష్టం లేదు. నువ్వు చూడలేవు. విన్నా క్లిష్టపరిస్థితిలో ఇరికించటం ఇష్టంలేక - విరమించుకున్నాడు....నీవు సుధాకర్ చేతిలో ఏమైపోతానో నని నిన్ను నాతో చాటుగా కనిపెట్టి నీవు సుధాకర్ చేతిలో ఏమైపోతనోనని నిన్ను నాతో బాటుగా కనిపెట్టి వున్నది ఎందుకు? నిన్ను కాపాడుకోవడానికేగదా!"
    ప్రే....మ.....ప్రే...మ....మరి గీత మాటేమిటి? ఒక్కసారిగా భరింపరాభి, అనుభవించలేని వార్తతో దాన్నిగూర్చి ఆలోచనతో నీరసం వచ్చింది. తేజోవిహీనమైన ముఖాన్ని కొంగుతో తుడుచుకుంది. నిస్సత్తువతో గొణిగింది.    
    "ఏమిటి గీతా? ఇదంతా ఏమిటి? అన్నది. "ఆమె మనస్సులో ప్రశ్నలు అడగరానివి....మరి.....మరి....నీ మాటేమిటి? నువ్వు.....గీతా నిన్ను నిరంజన్ ప్రేమించటం లేదూ....నువ్వతన్ని నీ హృదయంలో భద్రపర్చుకొని ఆరాధించటం లేదూ?...
    గీత లేచి నుంచుంది. సంధ్య చీకట్లు అలము కుంటున్నాయి? గదిలో దీపం వేయలేదు. వాతావరణం స్తబ్దంగా వుంది.... గీత వెళ్ళి కిటికీ ఊచలు పట్టుకుని నుంచుంది. కొన్ని క్షణాలు గడిచాయి ఆకాశంలో నక్షత్రం ఒక్కగా నొక్కటి ప్రకాశిస్తోంది?
    ఆమె చటుక్కున వచ్చి ప్రేమ దగ్గర కూచుంది.
    "నువ్వు నమ్మవని నాకు తెలుసు కాని నిరంజన్ ఈ భారం నాపైన మోపాడు. నేను చెప్పేశాను...
    ప్రేమ ఆమె భుజంమీద బలంగా చేయివేసింది.
    "నువ్వు....నువ్వు.....నువ్వూ నిరంజన్." ఆ ప్రశ్నకు భాష లేదు.
    "అదంతా నటన ప్రేమా! అంతా నటన....అలా నటించడం ఎంత కష్టమైందో నీకు తెలుసు?.....ఒక వ్యక్తిలోని ఉత్తమ గుణాలను గొప్ప తనాన్ని. విశాల హృదయాన్ని చూచి ఆరాధించంలో తప్పులేదు. ఆవ్యక్తి క్షేమాన్ని సర్వదా కాంక్షించటం అంతకన్నా నేరంకాదు.
    ప్రేమా....అతన్ని నేను సోదరునిగ భావించాను. అంతకన్నా నిరంజన్ పై నాకు వేరే అభిప్రాయంలేదు. అతని గురించి నీదగ్గర గొప్పగా మాట్లాడావంటే అదంతా నీకోసమే....నీకవన్ని తెలియాలని- అతని గూర్చి ప్రతి విషయం నీకు తెలియాలని నీ మనసు అతనివైపు త్రిప్పాలని అలా చెప్పేదాన్ని ... ప్రేమా... కాని నీవు సుధాకర్ విషయంలో చూసిన శ్రద్ధ అతని పట్ల చూసేదాని కావు నిరంజన్ నీకు పరాయి వాడిగానే నిల్చిపోయాడు గానీ....నీవు అతనికి ఆరాధ్యదేవత వైనావు"
    ప్రేమ ఏమీ అనలేకపోయింది. ఆమెకంతా అయోమయంగా వుంది తల వంచుకుని శూన్యంగా చూస్తున్నది. గదిలో అంధకారం. హృదయంలో విశ పులుముకుంది. ఒక్క ఆశాకిరణం చొరబడటం లేదు. అంతా చిమ్మ చీకటి! ప్రేమ కూచున్న స్థలంలో సన్నని ఆక్రందన! గీత ఒక్క పరుగున వెళ్ళి ఆమెను పట్టుకుంది. సమయం మించి పోతే ఏమీ చెప్పలేననుకుంది. 'రేవతి వదినకు...సరళకు ముందునించీ తెలుసు. కాని వారుగా వచ్చి నీకీ విషయం తెల్పటానికి సంకోచించారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS