Previous Page Next Page 
మిధ్య పేజి 13


    "గుడ్ మార్నింగ్, బావా! మీ దేవదాసు లేవలేదు. ఒక్కసారి లేపి వస్తారా?" బాబు కూడా లేచేశాడు . అతనొక్కడే..."
    "అలాగే!' జగాన్నాధం సమాధానం ఇచ్చి మెట్లెక్కి వెళ్ళాడు. అప్పటికి రాత్రి నిద్ర లేని కారణం గానూ, మోతాదుకు మించి పుచ్చుకోవడం వల్లా ఆదమరిచి నిద్రపోతున్నాడు హరికృష్ణ. జగన్నాధానికి మనస్సు ఒప్పుకోలేదు నిద్ర లేపెందుకు. అయినా మరదలు అతనికి ప్రాణం తో సమానం. సాధారణంగా దొరిలే హాస్య ధోరణి అతను ఆ పిల్ల దగ్గిర చేయడు. ఆ పిల్ల మరదలనీ, కొన్ని కొన్ని మాటల్ని ఉపయోగించి వేళాకోళం చేయడం తన బర్ట్ రైట్ అనీ అతనికి తెలిసినా అతడి అంతరంగం ఒప్పుకోదు.  పైగా "ఏమిటోయ్ జగన్నాధం! ఆ పిల్ల ఈడు పిల్లలుండే వయసు నీది?" అంటుంది పరిహాసంగా. అతను అప్పుడప్పుడు తనని గురించి సింహవలోకనం చేసుకుంటూ "ఎంత అపరాధం చేశాడు అరుంధతి పట్ల' అనుకుంటూ ఉంటాడు. తను చేసిన పొరపాటు కి ప్రాయశ్చిత్తం లేదు కనక అరుంధతి కుటుంబాన్ని ఆదుకుని ఆత్మతృప్తి పొందుతుంటాడు. శ్యామల ని ఉద్యోగానికి రప్పించి ఆ పిల్ల తెలివి తేటలకు ముగ్ధుడై భార్య వారిస్తున్నా వినకుండా పి.యు.సి లో చేర్పించాడు. శ్యామల సైన్సు చదవలేననీ సైకాలజీ ఆప్షనల్ తీసుకుంటా ననీ అంటే అన్నిటికీ సరే అని "ఊ' కొట్టి నెలనెలా మామగారికి శ్యామల ఉద్యోగం చేసి గడిస్తుందని ఆశపడ్డ తల్లికి తప్పనిసరిగా వంద రూపాయలు పంపుతూనే ఉన్నాడు. అతని ఆలోచనలు కట్టుబడి పోయేయి. ఇల్లు ఎగిరిపోయేలా "జగమే మాయ, బ్రతుకే మాయా!" అని పాడుతుంది శ్యామల.
    హరికృష్ణ వీపు మీద చేయి వేసి, :హరీ!" అని పిలిచేడు అనునయంగా. పది నిమిషాలు కష్టపడితే కాని అతడు లేవలేదు. లేచేక సిగ్గు పడుతున్న వాడిలా తల దిన్చుకుంటూ, "నన్నెప్పుడు తీసుకువచ్చేవు? "వెల్, వింటాను' అన్నాను. అప్పుడేనా? ఇక్కడికి తీసుకు వచ్చేవు. అయినా ఇక్కడికా నువ్వు తీసుకు రావడం?' అన్నాడు లేచి నిలుచుంటూ.
    "మరేం ఫరవాలేదు. ఈ ఇంట్లో వాళ్లకి ఇలాంటివి కొత్త కాదు.' జగన్నాధం పళ్ళ పొడి అందించి క్రిందికి దారి చూపించాడు వెనకే తనూ నడుస్తూ.
    బాత్ రూమ్ లోకి వెళ్లి మొహం కడుక్కుని నీళ్ళు పోసుకుంటున్న హరికృష్ణ కి 'జగమే మాయ' పాట వినగానే గుండె జారినట్లయింది. ఇవతలకి వచ్చేక "బ్రేక్ ఫాస్టు ' కు కూర్చుంటుంటే ఆ పాట అంత కంతకు స్థాయి ఎక్కువ కావడం అతను చేతిని నోట్లో ఉంచేయడం గమనించి జగన్నాధం "శ్యామూ!" అని కేకేశాడు."
    శ్యామల అక్కడికి వచ్చి "ఏం బావా?' అన్నది.
    హరికృష్ణ రెప్పవేయడం మాని చూడసాగేడు. మేలురకం వాయిల్ చీర కట్టుకుని అదే రంగు జాకెట్టు వేసుకుని భుజాల వరకూ వ్రేళ్ళడుతున్న గుత్తుల్లాంటి వంకులు తిరిగిన రెండు జడలతో , పసిమి రంగుతో నుదుట పొడుగు పెట్టుకుని చిరునవ్వు నవ్వుతున్న శ్యామల అతని చూపుల్ని నిలిపేసింది. కొలమొహం వెనకాల గర్వం గిరిగిరీ సట్లు కనిపిస్తుంది.
    "ఇతనే నమ్మా రాత్రి నువ్వు అడిగేవు ఎవరిని? హరికృష్ణ. నా క్లోజు ఫ్రెండ్!" జగన్నాధం మరదల్ని కూడా పరిచయం చేశాడు.
    చాలా బుద్ది మంతురాలి మాదిరి చేతులు రెండూ జోడించి, నమస్కారం అండి." అన్నది.
    హరికృష్ణ సమాధానం ఇచ్చేడు.
    అరుంధతి వచ్చి నమస్కారం చేశాక జగన్నాధం పరిచయం చేశాడు. కొన్నేళ్ళు గా జగన్నాధం హైకోర్టు లో తన పనిని వదులుకుని స్వంతంగా బిజినెస్ ప్రారంబించేడు. నీతి యుతంగా సాగి రెండుకు రెండురెళ్ళయే ఏ పనిలో అయినా అతను చేతులు కలిపి స్నేహాలు చేశాడు. క్రమంగా అతని పరిధి పెరిగి అందులో స్నేహితులతో బాటు ధనం కూడా మూటలు మూటలు గా సాక్షాత్కరించసాగింది.
    హరికృష్ణ హృదయం అరుంధతి ని చూశాక కలుక్కు మంది. ఏ విషయం లోనూ తీసిపోని ఆ పిల్ల జగన్నాధాన్ని చేసుకోవడం బాదే అనిపించినా మూర్తీభవించిన మంచితనంతో తనను తానే సాటి అనిపించుకున్నాడు . అందుకు హరికృష్ణ మనసు తేలిక పడ్డది కూడా. అక్క చెల్లెళ్లిద్దరూ కవల పిల్లల మాదిరి ఉన్నారు. అరుంధతి వస్తూ వస్తూ ఐదేళ్ళ పిల్లాడిని చేతికి ఆసరా ఇచ్చి నడిపించుకు వచ్చింది. హరికృష్ణ వైపు వాడు చూస్తుంటే "మావయ్య" అన్నది.
    జగన్నాధం , శ్యామల కబుర్ల తో, మధ్య మధ్య అరుంధతి పలకరింపుతో ఫలహారాలు పూర్తీ అయేయి.
    రెండూ, మూడు , వారం, పది హీను నెలా గడిచేసరికి హరికృష్ణ ఆ ఇంట్లో కొత్తవాడిగా మసలడం మానేశాడు. ముందు గదిలో తను ఉంటూ ఆ గదిని అనుకుని అన్ని సౌకర్యాలతో ఉన్న ఆఫీసు గదిని వాడుకుంటూ రాత్రప్పుడూ తాగేసి వచ్చి పడుకోవడం అలవాటు చేసుకున్నాడు. జగన్నాధం ఏమీ అనలేదు. అతనికి మనిషిని మలుచుకునే విధానం బాగా తెలుసును భార్య విషయంలో తప్ప.

                                    
    శ్యామల ప్రొద్దుటే లేచి అతని గది ముందు నిలుచుని "కాఫీ, సర్!' అంటుంది.
    పది గంటలు దాటాక మునుపు తను కాలేజీ కి వెళ్ళిపోతూ "భోజనం రెడీ, సార్!' అంటూ మెట్లు దిగుతుంది. హరికృష్ణ ప్రొద్దుటే లేచి టిఫిన్ తీసుకోడు. మస్తుగా తాగి సుష్టుగా నిద్రపోవడం వరకే అతడికి తెలుసును.
    శ్యామల సాయంత్రం కాలేజీ నుంచి గదిలోకి అడుగుపెడుతూ "కాఫీ, సార్!" అంటుంది.
    హరికృష్ణ మనసులో అనునిత్యం దీనాతి దీనంగా కనిపించే మొహం మచ్చుకి కనిపించడం లేదు. కనుల పండువు గా ఒళ్ళు నిండిన వస్తువులతో వృద్దుడైన భర్తతో లంకంత ఇంట్లో ఇల్లు నిండిన పిల్లలతో గిరిజ రూపం కనిపిస్తుంది. వెంటనే మనసు చీత్కారం చేస్తుంది. డబ్బుకు అమ్ముడు పోయిన దానితో నీకేమిటి లెక్క" అంటున్నట్లు. ఈ మధ్య అతను ఇంగ్లీషు నవలలు తెచ్చుకుని పగలంతా వాటితో కాలక్షేపం చేస్తున్నాడు. జగన్నాధంతో డబ్బు విషయం, విజయ కుమార్ తో పార్ట్ నర్ షిప్ గురించి చర్చించడం ఆ విధంగా చేయడం తప్ప మిగతా కాలం ఇంట్లోనే గడిపి వేస్తున్నాడు.
    ఆరోజు కృష్ణాష్ణమి. హరికృష్ణ ప్రొద్దుటే లేచి స్నానం చేసి గదిలో పడుకుని గతాన్ని తవ్వుకోసాగాడు. గిరిజ తనతో చాలాసేపు పేకో, చదరంగ మో ఆడి అసహనాన్ని మరిపించేది . ఇప్పుడిది?' అనుకోగానే కళ్ళు చేమర్చేయి.
    అతని ఆలోచనలకి అంతరాయాన్ని కలిగిస్తూ ఇంట్లో పాట వినిపిస్తూ అప్పుడే ఆగిపోయింది. హల్లో అరుంధతీ, శ్యామలా మాట్లాడు కుంటున్నారు. అరుంధతి చెల్లెల్ని మందలిస్తుంది.
    "నీకు ఈ పాట తప్ప మరోటి రాదా, శ్యామలా? రోజల్లా చెవులు చిల్లులు పడుతున్నాయి వినలేక. ఊరుకుందు బాబూ నీకు పుణ్యం వస్తుంది!"
    శ్యామల ఘోల్లున నవ్వింది. "అయ్యో అక్క! జనం ఈ పాటే పాడుకుంటుంటే నువ్వేమిటి చేదుగా పెడుతున్నావు మొహాన్ని?"
    "జనం జోలి మనకెందుకు? మనకి నచ్చింది మనం చేయాలి. ఇదేమైనా ఆడవాళ్ళు పాడేపాటా ఏమైనానా?"
    "అక్కా, మన దేవదాసు ఇంట్లో ఉన్నాడా?"
    "నేను చూడలేదు."
    "నువ్వు ఆబద్ధం ఆడుతున్నావు. నేను అతన్ని ఏడిపించడం నీకు నాగా లేదు, అవునా?"
    అరుంధతి గొంతు గాద్గాధికం అయింది. "వద్దు, చెల్లీ. మనకీ వేళాకోళలు , పరిచయాలూ వద్దు. మన హద్దుల్లో మనం ఉందాం. మగవాళ్ళని రెచ్చ గొట్టడం న్యాయం కాదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS