Previous Page Next Page 
మిధ్య పేజి 11


    "ఓహో!' అని తల పంకించాడాయన.
    అపర్ణ సోఫాలో కూర్చుని అతని రాకను నిర్లక్ష్యంగా గమనిస్తుంది.
    "పనిమీద వచ్చేవా?" శ్రీవారి మరో ప్రశ్న వేశాడు.
    "లేదు. చూసి పోవాలని పించింది." మన్మోహన్ ప్రత్యేకించి శ్రీహరి ఇంటికి రావడం లో అంతరార్ధం వేరే ఉంది. గరీఫా రోడ్డు మీద చాలావరకు అతను తారట్లాడు తుంటాడు. రమేష్ తో చేయీ చేయీ కలిపి అల్లుడు కూడా సంఘ సంస్కరణ చేసి తన నోట పచ్చి వెలక్కాయ పడేస్తాడెమోననే భీతి అతనికి ఎందుకో కలిగింది. తీరా ఆ భావం కలిగినాక అతను ఆ ప్రాంతాలకి వెళ్ళకుండా ఉండలేక పోతున్నాడు. ఈ విషయం తాడి తెట్టేక్కిన వాడికి తలదన్నే వాడు మరోవాడుంటాడనే రీతిలో మన్మోహన్ గమనించక పోలేదు. అతడు ఎత్తుకు పై ఎత్తు వేసే శకుని లాంటి మేనమామ ఆటని కట్టించాలానే ప్రయత్నంలో ఉన్నాడు. అపర్ణ నే పెళ్లి చేసుకుంటే ముక్కుకు తాడు పోసి లాగాలని మనసులో దీక్ష పెట్టుకున్నాడు. మేనమామ దైవం అనుకూలించి ఇంట్లో కనిపించగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది మన్మోహన్ కి.
    శ్రీహరి గుంభనంగా మేనల్లుడి కి చదువుతున్నాడు. మన్మోహన్ కాసేపు కూర్చుని ఇంటి దారి పట్టెడు. ఎనిమిది గంటలు కావస్తుంటే గడప ఎక్కిన కొడుకుని చూసి ఉగ్రరూపం దాల్చి వీరనరసింహవతారమూర్తి అయేడు అమరేంద్ర చక్రవర్తి. "ఇప్పటిదాకా ఎక్కడి కెళ్లావోయ్? అడిగేవాళ్ళు లేరని స్వయంగా వ్యవహారాలూ నడిపించాలని నువ్వూ అనుక్కుంటున్నావేమిటి? ఎక్కడి నుంచి వస్తున్నావు?' తండ్రి గర్జనకి గుండెలు జారిపోయేయి. నిబ్బరంగా అన్నాడు మన్మోహన్: "కాలేజీ నుంచి వస్తూ వస్తూ పెద్దమ్మ ఇంటికి వెళ్లాను. ఇప్పుడు మావయ్య ఇంటి నుంచి వస్తున్నాను."
    రెండో సామాధానం అతన్ని చల్లబరిచేసింది. తన కొడుకు కాబోయే భార్యతో కాలక్షేపం చేసిందుకు వెళ్ళడం ఆయనకే మాత్రం ఆక్షేపణ లేదు. మేనత్త మేమమామ పిల్లలు. రేపో మాపో పెళ్లి కావలసిన వారు. అయన మెట్లెక్కి తన గది వైపు వెళ్ళిపోతూ కొద్దిగా హెచ్చరించేడు. "రేపటి నుంచీ నువ్వీ వెల్టికి రావడం నాకు నచ్చదు. పైగా పెద్దమ్మ ఇంటికి ఇకపై వెళ్ళనవసరం లేదు. ఈశ్వరుడి కూతురు ఎదిగినది. లోకం నోరు మూత వేసుక్కోర్చోదు నువ్వు ప్రతి రోజూ అక్కడ హాజరు అవుతే!"
    మన్మోహన్ పుస్తకాలు షెల్ఫులో పడేసి హల్లో సోఫాలో కూలబడి పోయేడు. పెద్ద వదిన కుముదిని విసవిస లాడుతూ వచ్చింది. రాత్రి పూట భువనేశ్వరి మెడ మెట్లు దిగి రాలేదు. ఈ మధ్య రెండో కొడుకు వెళ్లి పోయేక ఆవిడని దిగులు ఆవరించుకుని శరీరాన్ని మరి రెండు రెట్లు ఎక్కువ చేసింది. సాయంత్రం ఆవిడకి భోజనమో, ఫలహారమో మెడ మీదికే కోడలు పంపుతుంది. భర్తకి వడ్డించినప్పుడు ఆ సమయానికి మరిది ఉండక పొతే ప్రచండ కాళి అవుతుంది. నౌకర్లు ఒకళ్ళో ఇద్దరో తప్ప ఆ ఇంట మరెవ్వరూ వడ్డనకీ కానీ, వార్పు కి కానీ లేరు. ఇందుకు అమరేంద్ర చక్రవర్తి సుతరామూ ఒప్పుకోడు. నడమంత్రపు సిరి అతన్ని తలకిందులు చేసింది. వైదిక బ్రాహ్మణుడైన అమరేంద్ర చక్రవర్తి తండ్రి మొదటి ప్రపంచ యుద్ధం పూర్తీ కాకమునుపే నవాబుల కొలువు కూటం నుంచి తప్పుకుని కలకత్తా కి మకాం మార్చెడు. అయన ఆ కాలం లో హైదరాబాద్ లో క్షుణ్ణంగా ఉర్దూ వ్రాయడం, చదవడం నేర్చుకుని కొన్నేళ్ళు హాయిగా కాలాన్ని గడిపేడు. రానురాను హిందువుల ప్రాబల్యం తగ్గిపోవడంతో తప్పనిసరిగా భార్యతో ఆ ఊరు వదిలిపెట్టి కర్మకాండలు , పెళ్లి పేరంటాలూ చేస్తూ కలకత్తా లో జీవితం గడపడం ప్రారంభించేడు. నైదుషం మహాదేవ శాస్త్రి పేరు చాలా మందికి తెలిసిపోయింది. బొడ్డున బంగారు వశ్యం కాయతో, నడి నెత్తిన ఆడదానికి సారిపోయే సిగ ముడితో నుదట విభూది ఎరేఖలతో నలుపు రంగులోని నిగనిగలాడుతూ భారీ శరీరంతో చూడగానే సద్భావం కలిగేటట్లు కనబడే అయన అరవై సంవత్సరాలు రాకమునుపే పక్షవాతం తో మంచం పట్టి ఒక్కగానొక్క కొడుకునీ చేసేది లేక చక్రవర్తి కుటుంబానికి చెందిన నీల కంఠనికి దత్తత ఇచ్చేశాడు. అప్పటికే అయన భార్య స్వర్గస్తు రాలు కావడం వల్ల , పిల్లాడు ఆలనా పాలనా లేని వాడవడం వల్ల ధనానికి బానిస అయిపోయేడు. మరో ఐదేళ్ళ కి అయన కన్ను మూయడంతో నీల కంఠం దంపతులు పిల్లాడి పట్ల అనురాగాన్ని మోతాదుకు మించి మరీ పెంచారు. చెడు సహవసాలూ అలవాట్లూ అబ్బకపోయినా అమరేంద్రచక్రవర్తి చక్రవర్తి కుటుంబం, ఆ వంశం నాలుగైదు తరాలు చాతీ మీద చేయి వేసుకుని సుఖంగా గడిపే విధంగా ధనాన్ని ఆర్జించి పెట్టి, ఇలా చేయడం లో లోభత్వాన్ని నరనరం లోనూ జీర్ణించు కున్నాడు. కోడలు కుముదిని అయన తత్త్వానికి మండిపడుతూ అప్పుడప్పుడు కారాలూ మిరియాలూ మారుతూ ఎదటి వాళ్ళని అందులో ముంచేస్తుంది.
    "ఈ రాత్రి నువ్వు నిక్కి నీలిగి వస్తే పెట్టేందుకు ఇంట మరి నౌకర్లు లేరు. అందరికీ నేను నౌకరు కన్నా కనా కష్టంగా కనిపిస్తున్నాను. ఇప్పటి వరకూ నీ కోసం పడిగాపులు గాచి మీ అన్నయ్య ఇప్పుడే భోజనం ముగించేరు. నువ్వు రోడ్లు సర్వీ చేసి వస్తావని ముందుగా చెప్పి వుంటే అయన ఆకలితో నీకోసం ఎదురుచూసే వారు కాదు. పద, నాయనా , బోజనానికి. గయ్యాళి దానిలా నోరు చేసుకోవడం నా పని అయిపొయింది." అన్నది.
    ఏ మాత్రమో ఆకలిగా ఉంటె శ్రీహరి ప్రశ్నల కి, తండ్రి ఉరుముల కీ హరించుకు పోగా మిగిలినది వదిన గారి అదిలింపు లకు హటాత్తుగా ఆకాశం లోకి ఎగిరిపోయి కడుపు నిండిపోయింది. "నా కిప్పుడేమీ వద్దు, వదినా. ఆకలిగా లేదు. వస్తూ వస్త్గూ శ్రీహరి మావయ్య ఇంట్లో ఫలహారం చేసి వచ్చెను." అన్నాడు.
    కుముదిని రెట్టించి అడగలేదు. మెల్లగా వెళ్లి పోయింది. మన్మోహన్ కి కాసేపు అయాక యదార్ధం గుర్తుకు వచ్చి కడుపులో ఎలకలు పరుగులు తీయడంతో కాళ్ళు లేని సత్తువని తెచ్చుకుని వంట ఇంటి వైపు దారి తీశాయి. డైనింగ్ టేబిల్ మీద దోమలు వారి ఏకచ్చత్రాదిపత్యంగా రాజ్యం ఏలుతున్నాయి. కంచం లో వడ్డించుకుని అడుగూ బోడుగూ పదార్ధాల్ని యాంత్రికంగా గొంతులోకి తోసి, నోట్లో నీళ్ళు వంచుకుని మెల్లగా వాటిని కడుపు లోకి పంపించి లేచేసరికి టైము పదిన్నర దాటిపోయింది.
    పుస్తకాలలో తల దూర్చినా మెదడు వాటి సారం గ్రహించలేక పోతుంది. ఆవలిస్తూ పరుపు మీద పరుండి పుస్తకాన్ని గుండెల మీద ఉంచుకుని బలవంతంగా కనురెప్పలు విడదీసి చదువుతూ చదువుతూనే నిద్ర పోయేడు.

                           *    *    *    *
    ఇప్పుడు ఈశ్వర చంద్రుడు కి నాలుగైదు ట్యూషన్లు దొరికాయి. అతని చేతిలో నాలుగు రాళ్ళు గలగల మంటున్నాయి. పెద్దమ్మ కి ఆర్ధికంగా సహాయం చేస్తే ఒప్పుకోదు కనక ఆ నెల్లో వచ్చిన డబ్బుతో మంచి నేత చీర ఒకటి కొని ఇచ్చి తృప్తి పడ్డాడు. కాలేజీ లు తెరిచి అడ్మిషన్ల హడావిడి లో మునిగి పోయింది యూనివర్శిటీ. గిరిజ పెరల్ బక్ నవలని చదువుతూ మంచం మీద నుంచి హటాత్తుగా దృష్టిని తప్పించింది. ఎదురుగా అపరిచిత వ్యక్తీ నిలుచుని లోపలికి వచ్చేందుకు సందేహిస్తున్నాడు.
    "ఎవరు కావాలి మీకు?' అనండి గిరిజ బయటికి వచ్చి.
    అతను క్షణం మాట్లాడలేక పోయాడు. అందరూ అందంగా ఉంటుందనే ఈ పిల్ల గురించి విని "ఓహో" అనుకున్నాడే కానీ మరీ ఇంత అసమాన సౌందర్యంతో వెలిగిపోతుందనుకోలేదు . బంగారు తీగలా సన్నగా పొడుగ్గా రివాటు లా ఉన్నది. అతను వెంటనే దృష్టి మళ్ళించుకుని "మరేమీ లేదు. ఈశ్వర చంద్రుడు మావయ్యతో పని ఉండి వచ్చెను. గిరిజ మీ పేరేనా?' అని ప్రశ్నించేడు.
    "నాన్న వీధిలోకి వెళ్ళేరు. పెద్దమ్మ తెలిసిన వాళ్ళింటికి వెళ్ళింది. ఇంట్లో ఎవరూ లేరు నేను తప్ప. మీ పేరు చెబితే నాన్న రాగానే ఇల్లు గుర్తు చెప్పండి పంపిస్తాను." అన్నది. ముప్పై అయిదేళ్ళ అతను ఆ పిల్ల తెలివి తేటలకి ముగ్దుడయేడు. 'నేను ఒంటరిగా ఉన్నాను కనక మీరు ఇంట్లోకి వచ్చేందుకు వీలు లేదు . దయచేయండి అని ఎంత మర్యాదగా అన్నది.' అని మనసులో అనుకుని పైకి, "నా పేరు రమేష్ చక్రవర్తి. నాన్నగారు వస్తే గరీఫాలో ఉంటున్నాననీ, నా దగ్గిరికీ రమ్మనీ చెప్పమ్మా" అన్నాడు వీధి లోంచి వీధి లోకే వెళ్ళిపోతూ. పైజమా , గ్లాస్కో లాల్చీ తో నుదుటి మీదికి అల్లరి చిల్లరగా పడే క్రాపింగ్ తో అతను మర్యాదస్తుడిలా కనిపించేసరికి గిరిజ నొచ్చుకుంది. 'నేనెంత పని చేశాను! లోపలికి రమ్మని కూర్చో మనవలసినది!' అనుకున్నది ఒకటికి రెండు సార్లు. మలుపు తిరిగి కనుమరుగు అయేవరకూ వీధిలో నిలబడి చూస్తూనే ఉంది. కొంతసేపటి కి ఆ దృష్టి కి అందే దూరం లోంచి ఈశ్వర చంద్రుడు వస్తున్నాడు. గిరిజ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. అయన దగ్గరగా వచ్చేక కూతుర్ని ప్రశ్నించేడు: "ఏమమ్మా, నా కోసమేనా ఎదురు చూస్తున్నది?"
    "నాన్నా, అయన రమేష్ చక్రవర్తిట. నీతో పని ఉండి వచ్చేరుట. రమ్మని చెప్పమన్నారు. గరీఫా లో ఉంటున్నారని చెప్పేరు." అన్నది.
    ఈశ్వరచంద్రుడు ఆశ్చర్య పడ్డాడు. తనతో రమేష్ కి ఏం పని? ఏదైనా ట్యూషను కుదిర్చి ఉంటాడు. మనసులోనే అనుకుని వెనక్కి మళ్లేడు. గిరిజ తృప్తిగా నిట్టూర్చింది.
    వీధిలో నిలుచుని ఈశ్వర చంద్రుడి కోసమే ఎదురు చూస్తున్నాడు రమేష్. మొహం నిండా నవ్వు పులుముకుని, "మీకు శ్రమ కలిగించెను , మావయ్యా. రండి , లోపలికి." అన్నాడు ఆహ్వానిస్తూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS