"ప్రేమా?-ఎంత కాలం ఇలా నన్ను బాధ పెడ్తావు? నన్ను కనికరించవా? ఇటు చూడు-నా హృదయం మీద చేయివేసి చూడు - ప్రేమా- ప్రేమా అంటూ అనుక్షణం నీ కోపం తపిస్తోంది. ఎందుకింత జంకుతావు? నా మీద నమ్మకం లేదా? ఈ వాతావరణం చూడు, ఇంతటి శుభ సమయాన్ని జారవిడుద్దామా? ప్రేమా- ఇంకొక్క నాల్గునెలలు. నీవు నాదానవై పోతావు....ఎందుకీ భయం"
"నాలుగు నెలలేగా!" ప్రేమ లేచి నుంచుంది జాలిగా చూస్తూ. రెండు చేతులు కట్టుకుని నుంచుంది. ఆమెకు వెర్రికోసం వచ్చింది- అసహ్యం వేసింది కూడా! బలవంతాన చిరునవ్వు తెచ్చుకొంది" ఈ నాలుగునెలలు గడిచిపోనీ కూడదా! ఇంత కాలం ఆగాము ఈ కొద్దినెలలు ఆగలేమా!..... ఎన్నోసార్లు అనుకోలేదూ.......ఇటువంటి తొందర వద్దని! ఇక్కడ ఇంకొక్క క్షణం ఆగినా నాకు కష్టంగా వుంటుంది. వేరే ఏదైనా కబుర్లు చెప్పు. అదేమి దురదృష్టమో నన్నుచూడగానే నీ తలపులు వక్రమార్గంలో పయనిస్తాయి.... నా మనసు బెదురుతుంది. భీరువునై పోతాను.....వద్దు సుధాకర్.... నిన్ను విడిచి వెళ్ళటం కష్టం నాకు.....ఆ అవసరం రానీయకు.....అమ్మయ్యో ఏమిటలా చూస్తూన్నావ్.....భయంగా వుంది. ఎందుకా చేతిరుమాలు......మాట్లాడవేం.
సుధాకర్ పేలవంగా నవ్వాడు. తలపంకించి లేచి నుంచున్నాడు. క్షణం తదేకంగా ప్రేమకేసి చూశాడు. భుజాలెగరేసి రెండు చేతులు పైకెత్తి. గాల్లో ఆడించాడు. అతని ముఖం కరుగ్గా అయింది. ఏదో కఠినంగా నిశ్చయించుతున్నట్లు ఒక్కసారి బిగిసిపోయాడు. ప్రక్కనున్న బండమీదుంచిన రుమాలు నందుకుని ముఖాన్ని తుడుచుకుంటూ కఠినంగా అన్నాడు. "వెళ్ళిపో ప్రేమా- వెళ్ళిపో.... నా ఎదురుగా వుంటే....నాకు పిచ్చి.... నేనేం చేస్తానో నాకే తెలియదు.
ప్రేమ నివ్వెరపోయింది. ఏదో ప్రమాదం జరుగుతుంది. అనుకుంది. పారిపోగలిగితే బాగుణ్ణు....పంచి చేత బట్టుకుని గబగబ అడుగు లేసింది. నాలుగడుగులైన వేయకముందే వెనుకనుండి ఏదో ఆమెమూతి చుట్టూ ప్రాకింది. అరవటానికి కూడ వీలులేక గిలగిల్లాడింది. ఆమె రెండు హస్తాలను వెనక్కు వెరిచి పట్టుకున్నాడు సుధాకర్. బెదరిపోయిందామె. ఆమె నతడు గమనించటంలేదు. జేబులోంచి సన్నటి త్రాడుతీసి ఆమె చేతుల్ని కట్టేశాడు ప్రేమ హృదయం మీద సమ్మెటతో బలంగా ఎవరో కొట్టినట్లయింది.
అతని ముఖంలో ఎన్నడూ చూడని కఠినత్వం. మొరటుదినం. వికారంగా అగుపించాయి. ఆమెను బరబరా లాక్కెళ్ళి రాతిమీద కూర్చుండ బెట్టాడు. అతని ముఖంలోకి చూస్తున్న ప్రేమ నయనాల శ్రుపూరితాలైనవి.
సుధాకర్ ఇంత నీచానికి దిగజారిపోయాడన్న అనిర్వచనీయమైన వ్యధ. తనకేం సంభవించనున్నదో అన్నభయం. అతడి ముఖంలో ద్యోతక మౌతున్న పశుత్వానికి తన అసహ్యం జుగుప్సతో ఇవన్నీ కరిగి కన్నీరయ్యాయి.
అతడు వికారంగా నవ్వాడు. వికృతంగా అతిభయంకరంగా మారిన ఆ ముఖాన్ని చూడలేక కళ్ళు మూసుకుంది. మూతలు పడిన రెప్పల్లోంచి అశ్రుధారలు వేడిగా చెంపలమీదుగా కారిపోతున్నాయి." కళ్ళుకూడా మూస్తే బావుంటావు ప్రేమా. గంతలు కట్టేదా?" అతను మాట్లాడుతూ వుంటే కంపరంగా వుంది. అతడు ఆమెకు దగ్గరగా అతి దగ్గరగా వచ్చి నుంచున్నాడని ఆమె కళ్ళుమూసుకున్నా గ్రహించగల్గింది. ఏమి చేస్తాడోనని ముడుచుకుపోయింది. అతడు విరిచి విరిచి మాట్లాడసాగాడు. "ఎన్నిసార్లు నీ కోసం వచ్చాను. సౌమ్యంగా వచ్చాను. బోధనపర్చాను. నా మీద ప్రేమ వుందంటూనే నా కోర్కెను నిరాకరించావు.... ప్రతిసారి ఎంతో చాకచక్యంతో తప్పించుకున్నావు. నీ శీలం కాపాడుకున్నాననే ఆనందించావు గాని నా కోర్కె నన్ను కాలుస్తోందని గ్రహించలేకపోయావు నన్నింత బాధకు గురిచేసిన నిన్ను వదుల్తానా? అందంగా సుకుమారంగా అపురూప లావణ్యంతో నన్ను వెర్రెత్తించావు. ఇది నేనింకదాచలేను దాచలేను. ప్రేమా. ఇది నాకు పరీక్ష ఈ పరీక్షలో నువ్వే ఓడిపోయావు. నేను ఆగను.... ప్రేమా! అతడి వాగ్దోరణి ఆగగానే కళ్ళుతెరిచి అతనికేసి తేరిపార జూచింది ప్రేమ సుధాకర్ ఆ కళ్ళలోకి మత్తుగా చూచాడు. అతని కళ్ళలో కామంతో మండే విస్ఫులింగాలు ఆమెను దహించి వేస్తున్నాయి. "నన్ను తప్పించుకోలేవు ప్రేమా.....ఇంతవరకు నిన్ను వదిలానంటే నేనెంత మంచివాడనో ఊహించుకోగలవు!"
అతని మాటలు ముఖ కవళికలు ఆమెను నిలువునా అసహ్యంలో ముంచుతున్నాయి.
సుధాకర్ సుడిగాలిలాగా విజ్రుంభించి ఆమెను రెక్క పట్టుకుని లేపాడు. అణగి మణగిన శక్తి ఒక్కసారి మేల్కొంది ప్రేమకు. బలాన్నంతా కూడగట్టుకుని తన అసహ్యాన్ని, క్రోధాన్ని బహిర్గతపరుస్తూ గిల గిల్లాడిపోయింది. ఆమె విడిపించుకోవటానికి ప్రయత్నించే కొలది అతని పట్టు బలమైంది. నభిక్షత ధాటికి తాళలేక ఆమె బాధగా మూల్గింది.
"నువ్వీ మాత్రం ఎదురు తిరుగుతావని నాకు తెలుసు....నువ్వు అరచినా నిన్ను రక్షించే దిక్కు లేదు."
అసలే పెనుగులాట అలవాటు లేదు ఈ కాస్తకీ ఆమెలోని శక్తి నశించింది. ఒక్కసారి ఆమె వ్యతిరేకించటం మానేసింది తూలుతూ అతను లాక్కెళ్ళిన వైపుగా రెండడుగులు వేసింది. సోలి పడిపోయింది.
సుధాకర్ ఆమె మీదికి వంగి మెల్లగా ఆమెను క్రింద పరుండబెట్టి కట్లు విప్పసాగాడు.
* * *
9
కళ్ళు తెరిచేసరికి వింత వింత దృశ్యాలగుపడుతున్నాయి పేసుకు.
ఆకాశంలో దూది పింజెల్లా తేలిపోతున్న మబ్బు తునకలు గాలికి అల్లల్లాడుతున్న చిరుకొమ్మలు చూచి అనుమానంతో కళ్ళు అటూ ఇటూ త్రిప్పింది. అంతలోకి ఏదో జ్ఞాపకంరాగా బాధగా. దుఃఖంగా హృదయం వేయి ప్రక్కలైపోయేలా మూల్గి కండ్లు మూసుకొంది.
"ప్రేమా ప్రేమా- ఇలా చూడు" ఏదో ఆప్యాయమైన స్వరం- ప్రేమ భయంగా. ఆశగా కళ్ళు తెరచింది. ఎదురుగా జాలితో నిండిన గీత ముఖం అగుపించింది. ప్రేమ దుఃఖం పొంగిపోయింది. రెండు చేతుల్లో ముఖం దాచుకుంది. కట్ట తెగిన చెరువులా భోరున ఏడ్చేసింది. గీత ప్రేమ చెవికి దగ్గరగా వంగి లాలనగా - మెల్లగా అంది.
"ఏం లేదు ప్రేమా నిశ్చింతగా వుండు - నీకేం అన్యాయం జరగ లేదు ఆ మాటలు వికృతంగా వినిపించాయి. "నీకు కాబోయే భర్తే నిన్ను ఏదో చేస్తే నీకు అన్యాయమేమిటి" అని సమర్దించినట్లు వినిపించింది.
"అతను నీ కట్లు విప్పుకుండగానే మా కంట పడ్డాడు. పిరికివాడు! మమ్మల్ని చూచీ చూడ్డంతోనే పారిపోయాడు." అయినా, పిచ్చిదానా? అంతమందిమి ఉండగా... "పోనీలే పాపం చూడవే! కళ్ళు తెరు!"
"నా బ్రతుకంతా పాడైపోయిందే- ఎవరెవరు చూశారు?"
"నేనూ లక్ష్మి వస్తున్నాం. అదృష్టవశాత్తు అది వేరేధ్యాసలోవుంది. బఠానీలు తింటూ కూచుంది.....నిరంజన్ ను అటుపంపి. నేను ఈ వైపుగా వచ్చాను. ఆ వెధవ పారిపోయిన తర్వాత లక్ష్మిని కేకేశాను. ఆమె ఎంతో దూరంలేదు.....ఆత్రాడు. ఆచేతి రుమాలు వుండచుట్టి పొదల్లో పారేసి లక్ష్మి సాయంతో నిన్ను లేవనెత్తాను. ఇద్దరం కలసి మోసుకొచ్చాం. ఎంతో సేపటికి జవాబు వచ్చింది. నిన్ను ఏమైనా కొండపురుగు కుట్టివుంటుందని అందరం అనుకున్నాము.....నువ్వు అలాగే ఏదో కల్పించి చెప్పు. ఇంత లోకి మిగిలిన వాళ్ళు గాబరాగా వచ్చారు. వారి వెనక వగర్చుతూ వాళ్ళ ప్రొఫెసర్ వచ్చారు.
"ఏమైందమ్మా....ఆమాత్రం ఇంగితజ్ఞానం లేకపోతే ఎలా? ఆడని లాంటి ఈ తోటలో ఒంటరిగా దూరంగా వెళ్ళొద్దని ముందే చెప్పలేదూ...ఆఁ?....అసలు ఏమైంది? అన్నాడు ప్రొఫెసర్. ప్రేమను కూచోబెట్టి కాఫీ యిచ్చారు.
ప్రేమ పేలవంగా నవ్వింది. .... అక్కడ చెట్లలో అలికిడైతే భయపడి పోయాను .... ఎవరో అడవి మనిషిలా - కోరలూ కొమ్ములూ కనబడ్డాయి. కొద్దిగా భయం అభినయిస్తూ చెప్పింది.
భలే పనే! చూడండి అందరూ ఇకమీదట కట్టుగా జట్లు జట్లుగా వెళ్ళండి......గాని ఒంటరిగా వెళ్ళకండి, మరీ దూరంగా పోవద్దు.....ఈ అడవిలో క్రూర జంతువులు కూడా తటస్థపడొచ్చు వెరీబాడ్, వాళ్ళంతా కాటేజ్ గేట్ సమీపించగనే అక్కడ గోలగోలగా వుంది, ఎందుకు? ఏమైంది. అందరూ ఇదేప్రశ్న వేస్తున్నారు.
"సుధాకర్ క్రిందపడ్డాడు.....కాలు బెణికి నట్లుంది"
ప్రేమ. "ఆఁ?" అంది.
"మధ్యాహ్నం రెండుగంటలకు తలనొప్పిగా వుందని వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేస్తూ ఆ కొండమలుపు దగ్గర రాయితట్టుకుని పడిపోయాడు"
"అవును తలనొప్పి అనే నెపంతో బయలుదేరి తనదగ్గర కొచ్చాడు..." అనుకుంది ప్రేమ. "బాగా నొప్పి జేసిందా?" "లేదుగానీ- అంత సునాయాసంగా నడవలేకపోతున్నాడు. బాగా నొప్పిచేసే వుండాలి. పైకి అంత బాధలేదనే అంటున్నాడు.... కానీ బాగా బాధపడుతున్నాడు" "చూచివద్దాం పదండి" అంటూ బయలుదేరారు కొందరు. గీత ప్రేమకు ఏదో అవమానం జరిగిందని పసికట్టింది. ఆమెను విడిచి వెళ్ళకుండా అక్కడే కూర్చుంది. ఆ రాత్రి వారిద్దరినీ నిద్రాదేవి కసరికొట్టింది? యూకలిప్టస్ చెట్టునానుకుని ప్రేమ కూచుని వుంది. ఆమె ముఖం పాలిపోయి కళావిహీనమై వుంది. ఆ చూపుల్లో ఆకర్షణలేదు. శూన్యంలోకి చూస్తున్న దానిలా వుంది! చెదిరిన ముంగురులు తేలిగ్గా కదుల్తూ ముఖంమీద పడుతూ వుంటే ఆమెకు కోపం వచ్చింది. రెండు చేతులతో వాటిని జుట్టులో బిగించి చేతులు కట్టుకుని కూచుంది. "ప్రేమా- అసలేం జరిగింది!..... కొంత వరకు అర్ధం చేసుకున్నాననుకో- నాతో చెప్పవా?.... నీకు కష్టంగా ఉంటే చెప్పకు. పోనీ-"
ఆ ఒక్కమాటతో కళ్ళు గంగా గర్భాలయ్యేయి ప్రేమకి. వెంటనే గీత ఒడిలోకి వొరిగిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. గీత ఆమెతల నిమురుతూ జాలితో నిండిన హృదయంతో ప్రేమ చెబుతున్న దాన్ని వింటోంది.
"గీతా.... నువ్వు నిరంజన్ తో అలా వెళ్ళానని మా అందరికీ తెలుసు. ఎందుకో ఆ క్షణంలో ప్రతి ఒక్కరం ఏకాంతాన్ని కోరాము. శాంతి నేనూ కొంతసేపు తిరిగాము. డైరీలో నోట్స్ రాసుకుంటుంటే శాంతి అలా వెళ్ళొస్తానంటూ వెళ్ళిపోయింది. చిన్నగుట్ట ప్రక్కన కూచుని ప్రకృతిలో లీనమైపోయింది. అది గమనించిన నేను ఇంకాస్త దూరం వెళ్ళాను ... అక్కడ క్రూరజంతువు లుంటాయన్న భయంలేక పోయింది... కాని. క్రూరజంతువుకన్నా క్రూరమైన జంతువు నన్ను బలి గొనాలని చూసింది. ప్రేమ అంతటితో ఆపి మౌనంగా రోదించింది.
గీత ఏమీ మాట్లాడలేదు.
"గీతా! ఆంక్ష విధించింది అతడు......ఏకాంతంగా దొరికితే చాలు ఏదో నేరంమోపి నన్ను బాధించటం అలవాటైంది. పెళ్ళికిముందు ప్రేమ ప్రకటన పనికిరాదని ముందుగానే చాలాసార్లు చెప్పాను. ఎప్పటి కప్పుడే తలాడించి వెళ్ళిపొయ్యేవాడు .... ఏమి చెప్పను.....చెప్పకూడని వుదంతం చెప్పవలసి రావడంతో మళ్ళీ మళ్ళీ గుర్తురావడంతో ఆమె మరొకసారి వెక్కి వెక్కి ఏడ్చేసింది. కాని ఏడ్పు రాగానే ఏడో ఉపశమన మందింది. ఆ తర్వాత ఏం జరిగిందో, అనుకుంటే ఒళ్ళు వణుకుతుంది. నా చుట్టూ వున్న వాళ్ళని వదిలి ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తోందే - గీతా నీకు తెలుసు.....ఏం జరిగింది? నువ్వు అక్కడికి ఎలా వచ్చావు? ఆలస్యం కాకముందే వచ్చావా? నాకు నిజం చెప్పవే గీతా! నువ్వు దేవతవే గీతా..."
"నువ్వు ఒక్కసారి పెద్దగాకేక వేశావు....తెలుసా?.....అప్పటికి నేను దగ్గరే వున్నాను. నిరంజన్ కూడా వున్నాడుకదా నీకేం ఆపదొస్తుంది అనుకొని జవాబివ్వలేదు! అంతలోనే ఏదో తట్టింది. నిరంజన్ ఉండగా నీకు ఆపద కలక్కపోతే మరి నువ్వు కేకవెయ్యడ మెందుకు. అని వెతుక్కుంటూ వచ్చేసరికి నువ్వు రాతి మీద తెలివి తప్పినట్లు పడివున్నావు. కాని ఒక్కసారిగా నా గుండె పిరికితాంతో వణికింది. నేనూ ఆడదాన్నే - అతను తెగించినవాడు, మగవాడు! నన్ను కూడా కట్టిపడేస్తే, వెంటనే కాస్త అవతలికి వెళ్ళి చక్కగా వున్న పొదల మాటునుంచి బిగ్గరగా అరచాను. అక్కడ నిరంజన్ లేకపోయినా ఒక మగవాడి పేరుపెట్టి అరుద్దామని బుద్ధి పుట్టింది. నిరంజన్..... త్వరగా రా...... ఇక్కడ చక్కటి ఆకులు పూలు వున్నాయి......నిరంజన్.......లక్ష్మీ......అంటూ కేకలు వేయటం ప్రారంభించాను. "వస్తున్నా" అంటూ వాళ్ళు తలొక వైపునుంచీ జవాబు లిచ్చారు. ఆ సవ్వడి ఆసరాతో నేను ముందుకి దూకాను. నేను రాగానే అతడు నన్ను చూచి తడబడి పక్కగా పారిపోయాడు నేను నిన్ను ఒళ్ళోకి తీసుకుని మళ్ళీ వాళ్ళొచ్చే వరకూ అరుస్తూ అతని రుమాలు త్రాడు పొదల్లోకి విసిరేశాను. నిమిషాల మీద లక్ష్మి శాంతి పరుగెత్తుకుంటూ వచ్చారు. నిన్ను ఆ విధంగా హ్కోసి నోటమాట రాక నిలబడిపోయారు ఏదో అడవి మృగం కనబడి భయపడినట్లున్నావని, నేను రావటం నువ్వు స్పృహ కోల్పోవటం ఒకేసారి జరిగాయని చెప్పాను.....ఇదొక పీడ కలలా భావించి మర్చిపో ప్రేమా - ఇదీ ఒకందుకు మంచిదే. ఇంకా నయం! పెళ్ళయిన తర్వాత అసలు రంగు బయట పడివుంటే నీకు, విముక్తే లేకపోయేది కదా నీ పాలిట దేవుడున్నాడు. లేకపోతే......మించిపోయాక ఎవరేం చెయ్యగలరు? ప్రేమ వింటోంది, గీత చెప్పేమాటలు, అర్ధమవుతున్నాయి. సుధాకర్ కూ తనకూ ఇంతతో సరి అని చెబుతోంది గీత-
