Previous Page Next Page 
నింగిలోని సిరిమల్లి పేజి 44

    "నాకేం కాలేదు మావయ్యా! మనస్సూ, శరీరమూ రెండూ సరిగా వున్నాయి బుద్ధీ సక్రమంగానే పనిచేస్తోంది"!
    "మరేమితమ్మా ఈ మాటలు!" అసహనంగా అడిగారు అందరూ కుతూహలంగా వింటూ వుండడంతో అది అయన స్టేటస్ కి భంగకరంగా అనిపించింది.
    "అవును మావయ్యా! సుధాకర్ కి యింతకు పూర్వమే పెళ్ళయిపోయింది. అతను మళ్ళీ నన్ను పెళ్ళీ చేసుకుందుకి సిద్దపడుతున్నాడంటే అది కేవలం మీ కోసం __మీ తృప్తి కోసం!"
    మృదులా! ఆకాశంలో నిండు చందమామాలాటి వాడు సుధాకర్! అతని మీద అభాండాలు వేయటానికి ఎవరికీ మనసోచ్చింది? ఎన్ని గుండెలున్నాయ్ యిలా ప్రేలటానికి? కోపంతో అయన కళ్ళు, ముఖం అగ్ని శిఖలా వున్నాయి.
    "బాగా చక్కగా పోల్చావు మామయ్యా! ఆ నింగిలోని జాబిల్లిలో మచ్చవున్నట్టే యితని జీవితంలోనూ మచ్చవుంది. ఇఅతను కళింకితుడు __ మావయ్యా నీ కొడుకు నువ్వనుకున్నంత అమాయకుడెం కాదు!"
    మృదులా!" గర్జించారు అయన. ఆమె తలిదండ్రులు కూడా వారింప చూశారు.
    "అవును ! నిజం చెప్పాలంటే అతనికి పెళ్ళికావటమే కాదు నిన్ను తాతయ్యని కూడా చేశాడు!"
    "స్టాఫిట్ ! గర్జించాడు సుధాకర్. నాన్నా ఈ పెళ్ళి నాకిష్టంలేదు. నిశ్చితార్దం కేన్సిల్ చేయండి. నన్నింతగా అవమానం పాలు చేసిన ఈమెకి తగిన సత్కారం చేద్దాం. దెబ్బకి దెబ్బ!"
    "సుధాకర్!" నింపాదిగా పిలిచాడాయన . అంతదాకా మృదుల మాటలు నమ్మి నమ్మనట్టుగా వున్న అయన కొడుకు కోపం చూడగానే, ఆ అర్ధంలేని వాగుడు వినగానే ఇందులో ఏదో వుందనుకున్నాడు.
    "ఏమిటి నాన్నా!"
    "నువ్వు నిజం చెప్పాలి!" అడిగాడు మధిరప్రసాదు.
    "నిజమా!" ఆశ్చర్యంగా అడిగాడు.
    "యస్! అయ్ వాంట్ ట్రూత్!
    "ఏది నిజం నాన్నా?"
    "సుధాకర్ ! ఇది చిన్నపిల్లలా వ్యవహారం కాదు. ఆశామషీకాదు. నువ్విప్పుడిక్కడే నిజ్హం చెప్పెయ్యాలి. అదెంత భయకంరమైన దైనా సరే! మృదుల చెప్పిందే నిజమయితే ఆ అమ్మాయి ఎక్కడ? ఆ బేబీ ఎక్కడ? లేదా అదంతా అబద్దం అయితే చెప్పు __ ఈ పెళ్ళి కాన్సిల్ చేస్తాను మరో సంబంధం చూస్తాను!" జడ్జిమెంటులాగా అన్నారాయన. అయన ముఖం నిండా బిందువులు అణిముత్యాల్లా మెరుస్తున్నాయి బి.పి పెరుగుతున్న మనిషిలా వున్నారు.
    "మామయ్యా! మీరు ఎగ్ సైట్ కాకండి. టికెట్  యీజీ!" అంది. మృదుల లేచి వెళ్ళి ఆయన్ని సోఫాలో కూర్చోబెట్టి, చల్లని డ్రింక్ తాగించింది.
    అంతా అబద్దం!" మళ్ళీ అరిచాడు సుధాకర్.
    "పోటోలు సాక్ష్యాదారాలు! నవ్వు టఫ్ రికార్డ్ లో చెప్పిన చిలక పలుకులు తూగని గుర్తులు!" నవ్వుతూ అంది.
    "నాన్నగారూ అప్పుడు విజయవాడలో, నాతో చదువు కున్న అమ్మాయిని కాదని తెచ్చారు కదా నన్ను మళ్ళీ ఆమెని ఎనిమిదేళ్ళకి హైదరాబాదు లో చూశాను. నాలో ఆమెపైవున్న ప్రేమ మళ్ళీ చిగిర్చింది. ఆమెకూడా అన్నేళ్లుగా నాకోసం అలాగే వుందనుకున్నాను  అలా నమ్మించింది. ఇద్దరం శాస్త్రోక్తంగా కాకున్నా, చట్టరిర్యా కాకున్నా వెంకటేశ్వర స్వామి ముందు __ చిక్కడపల్లిలో దండలు మార్చుకున్నాం,
    కొన్నేళ్ళు కలసిమెలసి తిరిగేం __
    అయితే ఆమె మోసగత్తె __ ఆమెకి నాదబ్బు మీద దృష్టే తప్ప __ నాపై ప్రేమ లేదనిపించింది నేన్నున్నప్పుడు నాతో తిరిగింది. నా కనుమరుగైతే ఆమె వరుసకి బావ అయిన అతనితో తిరిగేది. అతను అక్కడికి వచ్చేవాడట ఎప్పుడూ__
    ఆమెకి నేల తప్పింది నిజమే! కానీ ఆమెపై నాకు విశ్వాసంలేదు. దాదాపు సంవత్సరంగా నేను ఆమెని కలుసుకో లేదు తలచుకోలేదు. పూర్తిగా మరచిపోయాను. నీటి, నిజాయితీ లేని ఆడదాని కోసం నేనెందుకు బలికావాలి! నాకు ఆ అమ్మాయి అక్కర్లేదు ఆ అమ్మాయే కాదు __ ఇప్పుడిక ఎవరూ అక్కర్లేదు!"
    అందరూ అతని మాటలు విని విభ్రాంతులై కూర్చోండి పోయారు. ఎవరికీ నోటమాటరాలేదు. సుధాకర్ నిస్సత్తువుగా తలవాల్చక వుండిపోయాడు.
    "మామయ్యా!"
    తలెత్తి చూశారాయన
    "సుధాకర్ సగమే చెప్పాడు . అది పూర్తి నిజం కాదు"!
    కనుబొమలు ముడి వేశారాయన.
    "నువ్వు చూస్తానంటే ఆమెని. యిప్పుడే పిలిపిస్తాను!"
    "ఇక్కడే వుందా?"
    "అం ,,
    క్షణకాలం మౌనం వహించారాయణ. తీర్పు చెప్పాబోతున్న జడ్జిలా వుండిపోయారు. కొద్దిసేపయ్యాక "మృదులా! ఆ పని చెయ్!" అన్నాడు నిశ్చల కంఠంతో.
    మృదుల లేచివెళ్ళి ఫోన్ చేసింది.
    అందరూ నిరీక్షస్తూ కూర్చున్నారు.
    మరో అరగంటకి సుజాత మల్లేశ్వరి, జానికమ్మగారు. రాఘవయ్యగారు, కళ్యాన్ నాగరాజు వచ్చేశారు.
    ముందు సుజాత తను కథ చెప్పింది. కళ్యాన్ తనవిషయాలు వివరించాడు. నాగరాజు తను సుధాకర్ కి ఏమేం చెప్పింది ఎందుకోసం చెప్పింది వివరించాడు.
    జానికమ్మ, రాఘవయ్యగారు పదేళ్ళ తమ మనివ్యద విన్నవించుకున్నారు.
    క్షీరసాగర మధనం సమయంలో పరమశివుడిలా అంతా విన్నారు అయన.
    కోడలి వేపు చూశారు ! అవును ఆ చూపులో అయన కవితని యింటి కోడలిని చూసినట్టుగా చూశారు. ఆ ఆప్యాయత, ఆత్మీయత ఆ గౌరవం అన్నీ ఒక్క క్షణంలో గ్రహించుకుంది ఆమె.
    "మామగారూ!"
    ఆ పిలుపే అయన జీవననాడి స్పదించిన చేసింది. అయన కళ్ళు వెలుగులని చిమ్మేయి. అది గమనించిన  అక్కడి వారందరికీ అయన నిర్ణయమేమిటో అర్దమైపోయింది.
    దాదాపు పది సంవత్సరాల నిషిద్ధపరదాయమూ, సంవత్సర కాలం అనుభవించిన వియోగమూ, పుత్రిక పుట్టక తను పడిన క్షోభ, ఆ పిల్ల భవిష్యత్తుకోసం  తను పడిన పాట్లు, ఈ మూడు నెలలుగా తను కన్న బిడ్డకై తపించిన తపనా అంతా కన్నీటిమయం చేసి చెప్పింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS