అతన్ని నమ్మించాలి కళ్యాణ్! మనం ఎంత చెప్పినా అతను వినడేమో! బుధవారం అతనికి మ్రుడులతావు నిశ్చతార్డం చేస్తున్నారు మధిర ప్రసాదు గారు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు అతన్ని డేష్ చేయాలి! నలుగురిలో తల వంచుకునేలా చేయాలి! పోటోలు, టఫ్ రికార్డ్ తో అతను పలికిన ప్రేమ పలికులు అందరిలో వినిపించాలి! అప్పుడు డిగి వస్తాడేమో గురుడు!"
సాలోచనగా తల పకించాడు కళ్యాణ్.
"పదండి వెళదాం! వాచ్ మెన్ గేటు వేసేస్తాడు!" అందికవిత. ముగ్గురూ లేచి గేటుదాటి రోడ్డు పైకి వచ్చారు. వాళ్ళిద్దరూ సెలవు తీసుకున్నారు. కవిత తన గది వైపుగా నాలుగడుగులు వేసింది.
కారు హారన్ విని ప్రక్కకు తప్పుకుంది. కీచుమంటూ కారు ఆగింది. కళ్ళుమూసుకుని నడవకపోతేకాస్త జాగ్రత్తగా నడవరాదూ! రోడ్డు మీద కళలు కంటూ నడుస్తున్నావా?" ఖంగున మ్రోగింది కంఠం.
విస్మయంతో విభ్రంతితో చూసింది. ఆ పరిచితమైన కంఠం విని _ సుధాకర్ అతను! అతనూ కవితని గుర్తించేడు.
"నువ్వా?"
"అం నేనే!"
"ఇప్పుడు __ యిక్కడకు __ ఎందుకొచ్చావిక్కడికి?" కఠినంగా అడిగాడు.
"హుం నన్ను మా బ్యాంక్ వాళ్ళు మీ పుణ్యమా అంటూ ట్రాన్స్ ఫర్ చేశారు!" అంది.
అంతలో కారు ఆగటమూ కవిత నుంచోవటమూ ఆ బ్రేక్ వేసిన శబ్దమూ విని, అట్టే దూరంగా వెళ్ళని కళ్యాణ్ ప్రమాదం జరిగిందనుకుని వచ్చాడక్కడికి పరుగు పరుగున. "కవితా!" అంటూ పిలిచాడు. ఆదుర్దాగా కార్లో ఎవరున్నదీ గమనించకుండా.
ఆ పిలుపుకి ఇద్దరూ చూశారు అటు!
"ఓ హీరోగారూ ! మీరూ యిక్కడే వున్నారన్న మాట! గుడ్! అయితే యిద్దరూ యింట దాకా పార్కులో చెత్తా పట్టా లేసుకుని షికార్లు కొట్టేరన్నమాట!"
ఆ వ్యంగ్యం బాణంలా దూసుకెళ్లింది అయితే అది గాయం చేయలేదు. కోపాన్ని కలిగించింది. "సుధాకర్!" గర్జించింది కవిత. "కాస్త నోరు సంబాళించుకో!"
ఉన్నమాట అంతే అంత వులుకెందుకు. ఇప్పుడు యిద్దరూ ఏకంగా కాపురం పెట్టొచ్చే! ఎందుకలా విడివిడిగా వుంటున్నట్టున్నారు!" మనస్సులో ఈర్హ్యా రగులుతోన్న ఆమెని బాధించాలని బాధతో అన్నాడతను.
షటప్ అరిచాడు కళ్యాణ్.
"ఓం!" పళ్ళు కొరికాడు "కీచాకుడిలా తయారయింది కాక యింకా నోరేత్తున్నావా? నేనిప్పుడు తలచుకుంటే యీపళాన నిన్ను పాతెయ్యించగలను. టేక్ కేర్! అయాం సుధాకర్!"
కళ్యాణ్ ఏదో అనబోయాడు "బావా! నువ్వూరుకో?" అంది నింపాదిగా. ఆమెకి ఎక్కడలేని నెమ్మదితనం వచ్చింది. అతను నోరెత్తలేదు. ఇద్దర్నీ ఓ క్షణంపాటు చూసి "ఛీ!" అని అసహ్యంగా అనేసి కారు స్టార్టు చేసుకుని వెళ్ళిపోయాడు సుధాకర్.
"ఇదీ ఒకందుకు మంచిదే! " అన్నాడు అంతదాకా కారు వెనుకే నించునున్న నాగరాజు.
ఆ మాటకి యిద్దరూ తెల్లబోయారు.
"రేపు జరగబోయే నాటకానికిది నాంది!"
"అంటే!"
అతన్లో నీపై ప్రేమ యింకా చావలేదు. అందుకే ఆ వ్యంగ్యోక్తులు! నిజంగా అతను నిన్ను మరచిపోయి __ నిన్ను జీవితనుంచి దూరంచేయలానే అనుకునివుంటే నిన్ను యిలా అవమాన పరచడు. తనది కాదనుకున్న దానిపై ఎవరికీ అభిమానం వుండదు."
కవిత మాటాళ్ళేదు.
"కవితా! అతన్లో అభిమానం, అసూయ వుంది. పరిస్థితుల్నే విశ్వసించాడు. మనిషుల్నీ నమ్మలేకపోయాడు. అందుకే అతను నిన్నూ __ సుజాతినీ __ మృదులనీ పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు!"
"ఇప్పుడింకేవరిని చేసుకుంటాడో!"
"అతనికి రీస్టార్ట్ యిచ్చే స్త్రీ శావాలిప్పుడు నిజంగా ప్రేమించింది నిన్నొక్కత్తినే __ సుజాత అతన్నిష్టపడితే __ పెళ్ళి చేసుకుందా మనుకున్నాడు. ఆమె శీలాన్ని అనుమానించే పరిస్థితులు వచేసరికి, తండ్రి చూసిన మృదుల మెళ్ళో తాళి కట్టేందుకి సిద్దపడ్డాడు. అతను పసి పిల్లాదిఉ కంటే అన్యాయం. అతను మానసికంగా స్థిరచిత్తుడు కాడు"
కవిత మాటాళ్ళేదు. ముందుకి కదిలింది.
20
నిశ్చతార్డ౦ ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు మధిరప్రసాదు ఊళ్ళో ప్రముఖులు బంధువులు అంతా వచ్చారు. ఫలహారాలు ముగిశాయి. సుధాకర్ సోఫాలో తండ్రి ప్రక్కన కూర్చుని వున్నాడు. అతని మిఖంలో వెతికితే ఎక్కడో విషాదచ్చాయలు అంతరంగా తరంగాల్ని౦చి ఎగిసి వస్తున్నట్టు కనిపించాయి. ఎంత వుత్సాహంగా వున్న అది తెచ్చి పెట్టుకున్నట్టు ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. సహజ విసర్గ సుందరమైన సంతోషం అక్కడ కనిపించటంలేదు. డాక్టర్ మృదుల ఎదుట సోఫాలో తల్లి ప్రక్కనే కూర్చుంది. ఆమెకి మరో వైపున వదినగారూ, ఆమె నానుకుని అన్నగారూ, అటు ప్రక్క తల్లి నానుకుని తండ్రి కూర్చున్నారు. నిశ్చితార్దానికిముహూర్తం యింకా కొన్ని నిమిషాలు వుంది. శాస్త్రీగారు పెళ్ళికి తేదీ, ముహూర్తం నిశితనంగా పరిశీలిస్తూన్నారు.
"మావయ్యా!"
మృదుల పేరూ, మనస్సూ, ప్రవర్తనే గాదు పలుకు కూడా మృదుమధురంగా వుంటుంది.
"ఏమ్మా?" నవ్వుతూ అడిగారాయన.
"ఇప్పుడీ నిశ్చితార్ధం యిలాగే ఆపేస్తే నష్టమేమిటి?" చిరునవ్వుతోనే అంది.
"ఇప్పుడేమిటమ్మావేళాకోళం!"
"వేళాకోళం కాదు మామయ్యా! నన్ను యింతకు పూర్వమే పెళ్ళయిపోయిన వ్యక్తిని పెళ్ళి చేసుకోమంటావా?" సూటిగా అయన కళ్ళలోకి చూసి అడిగింది.
అయన చప్పున మృదుల దగ్గరకి వచ్చాడు. చేయి పట్టుకుని "అనారిగ్యమ్గా వుండ మృదులా!" అని ప్రశ్నించారు అందోళనగా.
