Previous Page
నింగిలోని సిరిమల్లి పేజి 45

    చివరికి అయన పాదాలపై వాలిపోయింది.
    కన్నీరు తుడుచుకుని, ఆమె కన్నీరు తుడిచాడు ప్రేమగా లేవనెత్తి.
    "నువ్వు నమస్కరించవలసింది నాకు కాదమ్మా! ఇన్నాళ్ళూ గ్రహణం పట్టిన ఆ సుధాకర్ కి!"
    వంగి నమస్కరించబోయిన ఆమెని మధ్యలోనే అపేడు సుధాకర్.
    "కవితా!" నన్ను మన్నించు"! అన్నాడు.
    తల అడ్డంగా ఆడించింది కవిత.
    అందరి కళ్ళూ సంతోషాన్నివర్షించాయి,
                                       21
    చంద్రసేనమ్మగారికి ఆ కౌంపౌండ్ లో ఆడుగెట్టటానికే ఎలాగో వుంది. ఆమెకి విషయాలన్నీ పూర్తిగా వివరంగా తెలిశాయి. ఆమె ముఖ మాటపడుతూ వస్తానంటే జనికమ్మగారు చూశారు "రా ! పిన్నీ!" అంటూ పిలిచారు. ఇక తప్ప లేదు అమేకి.
    నేరుగా సుజాత యింటికే వెళ్ళిందామె వెనగ్గా వెళ్ళింది జానికమ్మ, ఆమె వాకిట నుంచుంది.
    "సుజాత, నేను తొందర పడ్డానమ్మా నన్ను క్షమించు సాటి అడదాన్నై కూడా నిన్ను అనరాని మాటలన్నాను."
    తన మామూలు నవ్వుతో పలకరించింది. రండి రండి. నేనప్పుడే చెప్పాను రాజుగారితో నా మనస్సులో ఆ మాట లేం లేవు. మీరేం చింత పడకండి!" అంది.
    "హమ్మయ్య! రక్షించావు. ఇప్పుడు చేప్పు. మా అబ్బాయిని చేసుకుందుకు నేకేమయినా అభ్యంతరమా! వాడేమో నిన్ను తప్ప చేసుకొనన్నాడు నాకూ సంపూర్ణంగా యిష్టమే."
    సుజాతకేం చెప్పాలో తోచలేదు.
    "సుజాతా!" పిన్నిగారువచ్చారు లోపలిరండి అసలు మా కవిత నివ్వాలనుకున్నాను. అలా అయ్యాక సరిత నివ్వాలనుకున్నాను. అదేమో మావయ్యని చేసుకొన్ని భీష్మించుకొంది. ఇక కళ్యాణ్ కే ముడిపెట్టాలి. అంచేత నువ్వయినా నా తమ్ముడిని చేసుకొమ్మా!"
    సుజాతకి అలాగో అనిపించింది కూర్చోండి! కాఫీ కలిపి తెస్తానంటూ లోపలి వెళ్ళి కాఫీ తెచ్చింది.
    "బంగారంలాంటి కాఫీ రోజూ నీ చేత్తో తాగే అదృష్టం కలిగిందమ్మా!" అంది చంద్రసేనమ్మ.
    "అమ్మమ్మా! నువ్వు డైలాగులు తప్ప మామూలు మాటలు మాటాడవా? నీకేమీ కాఫీ, మావయ్య కేమో గడ్డపెరుగు కావాలి. మీరూ ఇక్కడికే మారిపొండి!" అంది అప్పుడే వచ్చిన సరిత.
    "నోర్ముయ్యవే రాస్కెల్!" అంటూ వచ్చాడు నాగరాజు. అతని వెంటే కళ్యాణ్, రామలింగయ్యగారు వచ్చారు.
    "అంతా కట్టకట్టుకుని వచ్చారనుకుంది సుజాత.
    ఇదిగో సుజాతా నాకు మొదటినుంచీ చూస్తెప్రతి నాయుకుడిని చూసినట్టుగా వుండేది. కానీ యిప్పుడు హీరో అయిపోయాడు. సుధాకర్ ని చూసినప్పుడల్లా హీరోగారిని దర్శించినట్లుగా వుండేది. సడన్ గా అయన ఉపనాయుకుడై పోయాడు తన అనుమానంతో నా మాట విని నువ్వు హీరోయిన్ వికామ్మా.
    అందరూ ఫక్కున నవ్వేరు ఆ మాటలకి
    "నేనూ కొన్ని విలన్ పనులే చేశానండీ! కళ్యాణ్ తో ప్లాన్ వేశాను. సుధాకర్ కి యీమెని గురించి చాలా చేదుగా చెప్పాను. ఆయనేమో ఫైరైపోయాడు. చెడమడా తిట్టేసి, వీళ్ళ నాన్నగారికి ఏకంగా వుత్తరమే రాశాడు!"
    "ఓహొ!" అనుకుంది సుజాత.
    పదండి లోపలికి! మన అమ్మాయి వద్దకి మనం వెళ్ళటానికి సిగ్గుపడితే ఎలా? తప్పయిపోయింది నిజమే! ఇప్పుడు  ఒప్పెసుకోవడానికి పదండి!" అంతా ఆ మాటలకి వాకిలివైపు చూశారు.
    సుజాత తండ్రిగారు ముఖమాటపడుతూ లోపలి వచ్చారు. అయన వెనుకే సంప్రదాయంతో వున్న సౌందర్య లక్ష్మిలా వచ్చింది ఒకామే.
    "పిన్నీ సంతోషంగా పిలిచింది సుజాత. ఆమె తండ్రిని చూడగానే "నాన్నా!" అని పిలిచింది అనందా౦తిరేకంతో.
    "సుజాతా!"
    "హమ్మయ్య!" కన్యాదాత కూడా వచ్చేశారు. ఏమండీ నాపేరు రామలింగయ్య మీ అమ్మాయి పనిచేసే ఆఫీసులో మేనేజర్ని. ఇతను నాగరాజు. మా ఆఫీసులోనే సేక్షనాఫీసరు. మీ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు. తెగ ప్రేమించేసి, యీమేని దక్కించుకునేందుకి నానాయాతనలు పడ్డాడు జానకమ్మగారికి వేలువిడిచిన తమ్ముడు!"
    అయన ముఖం విప్పారింది. కూతురి వేపు చూశాడు. సుజాత తల వంచుకుంది. ఆమె ముఖంలో యిష్టాన్ని చదవ గలిగిన అయన నడిచి వెళ్ళి సుజాత చేయి అందుకుని నాగరాజు చేతిలో వుంచేడు.
    అది చూసిన రామలింగయ్యగారు అందరి నవ్వుల మధ్యా అన్నారు. "శుభమస్తు!"
                  ___౦ అయిపోయింది  ౦ ___                     


 Previous Page

WRITERS
PUBLICATIONS