Previous Page Next Page 
నింగిలోని సిరిమల్లి పేజి 41

    అతనివల్ల మా తల్లితండ్రులు గుంటూరు వచ్చారనీ, చౌదరిగారు నేను వూరెళ్ళిపోయిన విషయం చెప్పగా మౌనంగా తిరిగిపోయరనీ వాళ్ళకి గుంటూరులో నా కొచ్చిన కీర్తీ ప్రతిష్టలు బాగా తెలిసిపోయాయనీ ప్రస్తుతం నేను పేరయినా తెలియని అ గ్రంధసాంగుడితో లేచి వెళ్ళిపోయానని అనుకుంటున్నారనీ విని నివ్వెరపోయాను వల వాలా ఏడిచేశాను. కన్న వారితో తగాదా తప్పదనుకున్నానే కానీ యిలా బ్రతుకులో మళ్ళీ ముఖం చూపించే అవకాశం వుండదనుకున్నాను.
    అంతలో వచ్చాడు అతను. మమ్మల్నీద్దర్నీ అనుమానంగా చూశాడు. నా కంధంతా చెప్పి అతన్ని పరిచయం చేశాను. ఏమీ అనలేదు. ఈ రాత్రే కళ్యాణ్ మద్రాసు వెళ్ళిపోయాడు.
    మరుసటి రోజే నా బ్రతుకు తెల్లారిపోయింది బజారుకి వెళ్ళిన అతన్ని అతని తల్లిదండ్రులు వలపన్ని పట్టేసి తమ వూరు లాక్కెళ్ళారు కొటీశ్వరుడూ, సంఘంలో పరువు ప్రతిష్టలూ వున్న ఓ యువకుడు కాలేజీలో చెడ్డపేరు తెచ్చుకున్న అమ్మాయిని పెళ్ళి చేసుకోవటం వాళ్ళకినచ్చలేదు. అందుకే బలవంతంగా లాక్కెళ్ళారు.
    ఆ విషయం నాకు మూడో రోజున ఉత్తరం ద్వారా తెలసి హతాశురాలయ్యాను.
    అటుగోయ్యి __ ఇటు నుయ్యి! అది పాతసామెత! అప్పుడు నాకు అటు గోదావరి __ ఇటు కృష్ణ కనిపించాయి. దేన్లో దూకినా నా అవశేషాలు కూడా కనిపించవు. అదే నిశ్చయించుకున్నాను.
    అయితే మూడు రోజుల తర్వాత ఓ నిర్ణయాని కొచ్చాను. చావకూడదు. న అబ్రతుకు నేను బ్రతకాలి! నా గత చరిత్రలో పాటు ఆ బంధువుల దృష్టిలో చనిపోవాలి! ఆ నిర్ణయంతో కట్టుగుడ్డలు, వస్తువులు కొన్ని కృష్ణ ఒడ్డున పేట్టి, హైదరాబాదు రైలేకేశాను.
                        *    *    *    *
    నవల చదువుతున్నట్టుగాను, కథవింటున్నట్టుగావుంది సుజాతికి. వినేకొద్దీ ఆమెకి కవితపై జాలి పెరగసాగింది.
    "హైదరాబాదు లో వుద్యోగంలో చేరాక __ వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో సీటు సంపాదించుకున్నాక జీవితం గాడిలో పడిందనుకున్నాను. అయితే మళ్ళీ ఎనిమిది సంవంత్సరాల తర్వాత జీవితం యీ మలుపు తుందనుకోలేదు. నేను!"
    "ఏం జరిగింది?"
    "మళ్ళీ అతను కనిపించాడు ఓ రోజున!"
    "అతనేనా?" ఆశ్చర్యంగా అడిగింది సుజాత.
    "అం దురదృష్టం అతని రూపంలో కనిపించింది కోఠీలో బస్సు డిగి, బస్సుమారి ఎక్కబోతున్నాను. అప్పుడు వినిపించింది. అతని కంఠం__"
                                                                        18
    "కవితా!"
    ఎన్నో రోజులు గంటలకొద్దీ వందలకొద్దీ అలా మధురంగా పిలిపించుకున్న పేరు __ అతీయని గొంతుక __ చప్పున మెట్లెక్కే దాన్నల్లా వెనుదిరిగి చూసి బస్సుదిగేను.
    అతను ఓ కారులో కూర్చుని పిలిచి, నేను బస్సు దిగగానే కారు దిగేడు. వాడి వాడిగా వచ్చాడు. మనిషి కండపట్టేడు. అందంగా, హుందాగా పెరిగిపోయాడు. సం గ్లాస్ కళ్ళజోడు __ సూట్ దర్జాగా వున్నాడు.
    "ఇన్నేళ్ళు ఎక్కడున్నావు?" అతని గొంతులో అప్పటి ఆత్మీయత ఆతురతతో పాటు తొంగి చూసింది.
    ఆ లాడ్జివిడిచి __ ఆదేశంవిడిచి __ అందర్నీ విడిచి యిలా వచ్చాను!" నా గొంతు నాకే కఠినంగా వినిపించింది.
    అయాం సారీ కవితా! ఉత్తరం రాశానుగా! నేనే పరిస్థితుల్లో లాక్కుపోబడ్డానో. పద! అన్నీ వివరంగా చెబుతాను. ఈ రోడ్డు మీద ఎందుకు?"
    "మళ్ళీ లాడ్జింగ్ కేనా?"
    "తప్పదు కదా! నేనిక్కడికి ఆఫీసు పనిమీద వచ్చాను దయచేసి నాతోరా! అంతా వివరిస్తాను. నా తప్పు లేకపోతె క్షమించు __ లేదా శిక్షించు. ఒకమాట చెబుతాను. నువ్వు నమ్మేట్టయితే __ నేనింకా నీ స్మృతులు వదలలేక పెళ్ళే చేసుకోలేదు_"
    ఆ మాటలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఇప్పుడు నాపై నాకు విశ్వాసం వుంది. అతనితో వెళితేనే౦? అనుకుని కారేక్కాను. అతని ప్రక్కన కార్లో కూర్చోగానే నా ఒళ్ళు పులకరించింది పాడు శరీరం సుజాతగారూ! ఇది ఒక్కోసారి మనస్సుని కాదని ప్రవర్తిస్తుంది. నా కనిపించింది. అంతరాంతరాల్లో అతనిపై నాకు విశ్వాసం, ప్రేమ పూర్తిగా నశించి పోకుండా ఎక్కడో లేశ మాత్రంగా మిగిలిందని. అందుకే అతన్ని మళ్ళీ నమ్మేను. స్వర్గాన్ని అందుకుంటున్నా నానుకుని ఆ లాడ్జింగ్ లో అతనితో గడిపెను.
    పది రోజులు అలా గడిపాము అతను హైదరాబాదు వచ్చిన పని పూర్తియింది. తిరిగి ఊరికి ఈ ఊరికే వెళ్ళి పోవాలి. డ్యూటీకి రిపోర్టు చేయాలిట.!
    నాకు మల్లె భయం వేసింది. అయితేనేం ఇప్పుడు అడ్రసు దొరికింది. అతని వద్దకు వెళ్ళగలననిపించింది. అతన్ని పూర్తీనమ్మకంతో సాగనంపేను.
    తర్వాత అతనక్కడికి, నేనిక్కడికీ చాలా సార్లు వచ్చాము. కలిసుకుని భార్యాభర్తలుగా గడిపాము. ఈ ఊరికి ట్రాన్స్ ఫార్ కోసం కూడా అప్లేకేషణ్ పెట్టించాడు. ఇక్కడ మా బ్యాంక్ బ్రాంచీ వుంది.
    అదేం చిత్రమో ! కళ్యాణ్ మా బ్రతుకులో కాకతాళీయంగా తారసిల్లేడు. ఆ రేండుసార్లూ మా విడిపోవటానికి కారణం అయ్యాడు. అందులో అతని తప్పులేదు. విధి ఆడిన తమాషానాటకం అది.
    అయన ఆరోజు మళ్ళీ హైదరాబాద్ వచ్చేడు. నాకు నెల తప్పిందని చెప్పాను. అయన చాల అనందించాడు. నాకు శారీ ప్రజంట్ చేయాలని షాపింగ్ కు కదిలాడు.
    అక్కడే కళ్యాణ్ కనిపించాడు.
    చాలా ఏళ్ళ తర్వాత కలసిన ఆత్మబంధువు. అమ్మా నాన్నల విషయం కనుక్కోవాలి. సవిత, చంద్రమణి, శశిఎలా వున్నారో అడగాలి. తాహ తాహ లాడిపోయాను. అక్కడే గబగబా మాటాడెను.
    ఆయనలో అనుమానం బీజంగా నాటుకుంది. అక్కడ ముభావంగా వున్నాడు. ఆ రాత్రే తిరిగి యూవూరోచ్చాడు. మళ్ళీ నెలకి వచ్చాడు. నేనూ కళ్యాణ్ కూర్చుని మాటాడుకుంటున్నాము. మాకేం తెలుసు అయన కుళ్ళుబుద్ధి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS