"హు మేలు! ఏం మేలు జరిగింది. వాళ్ళకి దూరం కావటం నాకు మంచి జరిగినట్టా? అసలెందుకు మీరా పని చేశారు? నా బ్రతుకుతో ఆడుకునే హక్కు మీ కెవరిచ్చారు?" అసహనంగా అరిచింది.
"అలా ఎందుకు చేశానో చెబితేవింటారా శాంతంగా!"
"చెప్పండి!"
ఆమె చెప్పసాగింది.
17
నేను జానికమ్మగారి పెద్దకూతురిని కవితని. నన్ను బాగా చదివించాలని మా నాన్న గుంటూరులో వదిలేశారు. అక్కడ చౌదరి గారింట్లో వుంటూ చదువుకునేదాన్ని, పల్లెపట్టణమూ కాని మధ్య తరగతి యింట్లో పుట్టిన నాకు గుంటూరు వాతావరణం కొత్తగా వింతగా వుండేది.
నేను ఇంటర్ పూర్తీచేసి బి.ఏలో చేరిన సంవత్సరమే మ కాలేజీలో చేరాడు ఓ కొత్త విద్యార్ది, ఎక్కడో ఇంటర్ చదివి అక్కడికి వచ్చాడు. అతని డ్రస్సూ, బిహేవియర్ , స్టయిల్ ఆఫ్, వాకింగ్, హేర్ స్టేయిల్, టాకింగ్ స్టెయిల్ అంతా వింతగా వినూత్నంగా వున్నాయి.
మా అందరి మధ్యావిశేషంగా విచ్చేసిన యువరాజులా వుండేవాడు. అతన్నంతా ప్ర్న్స్ ఆఫ్ వేల్స్ అనేవారు. ఇన్ని మానరిజమ్స్ తో పాటు భగవంతుడు అతనికి అందాన్నీ యిచ్చాడు. మనుషుల్నీ యిట్టే ఆకర్షించే చూపులు. స్పురద్రూపం అతనిసొత్తు. అతనికి డబ్బుక్కోదవలేదు. భగవంతుడు అతనికి మంచి గోమ్తుకా యిచ్చాడు.
ఇంతెందుకు? అతను ఆకాశంలో చుక్కుల మధ్య సుధాకరుడిలా వుండే వాడు మా మధ్య __ సహజంగా అందరిలాగే ఆకర్షితులయ్యాను. ముందు మాట మాటా కలసింది. ఆపైన స్నేహం కలిసింది. మనుసులు కలిశాయి. సినిమాలు షికార్లూ స్నేహబీజం ఫైనలి యరయఎసరికి మా ప్రేమ వ్ర్స్ఖ్యంగా ఎదిగింది.
ఫైనలియర్ ఎగ్జామ్ యిక నేల రోజులున్నాయనగా ఓ సంఘటన జరిగింది.
ఓ రోజు మేము విజయవాడ వెళ్ళి దుర్గాని చూసి, సినిమా చూసి లాడ్జిలో ఓ రోజు గడిపి గుంటూరు వచ్చేసరికి గుంటూర్లో ఎ కాలేజి గోడపై చూసినా నా పేరే కనిపించింది సర్వ అసభ్యంగా హీనటి హీన్మగా రాశారు. నన్నో నీతిలేని దానిలాగా దుష్టురాలిల విచ్చల విడిగా తిరిగే దానిలా రాతలు రాశారు. ఇంత చేసి చిత్రంగా అతని పేరు ఎక్కడా లేదు. అతనికి భయపడ్డారో , అతన్ని రంగంలోకి లాగలేదు,అంత దుఃఖంలోనూ అదే నాకు కలిగిన చిన్న తృప్తి!
ఆ రోజే కాదు ఆ వారమంతా నేను బజారు ముఖం కానీ, కాలేజీ ముఖం కానీ చూళ్ళేదు. చౌదరిగారి భార్య వచ్చి కేక వేసింది, బుద్ధులు చెప్పింది. ఇళ్ళు కదలకుండా కట్టుదిట్టం చేసింది. ప్రిన్సిపాల్ యింటికి ఫోన్ చేసి చెడామడా తిట్టేరు. పరీక్షలు మెదలయ్యే వరకూ కాలేజికి రావద్దన్నారు. నాలో నేను సిగ్గుతో చచ్చిపోయాను.
నాన్నగారికి అమ్మకి ఈవిషయం తెలియకుండా జాగ్రత్త పడ్డాను. ఆ రెండు నెలలూ అతన్ని కలుసుకోవటానికి ఎంతో ప్రయత్నించాను అతను ముఖం చాటేశాడో లేదో అప్పట్లో నాకు తెలియదు.
పరీక్షలు పూర్తయిన రోజున కాలేజి గేట్లో అతనికోసం ఎదురుచూస్తూ నుంచున్నాను. ఆఖరికి అతను దొరికాడు. నన్ను చూడగానే విప్పారిన ముఖంతో దగ్గరిగా వచ్చాడు.,
ఇతర్ల సూటిపోటి మాటలు లేక్కించకుండా ఇద్దరం ఓ చెట్టుక్రింద నుంచున్నా౦.
"ఇన్నాళ్ళు రాణివాసం చేశావేం?" అన్నాడు.
చురుక్కుమనేట్టు చూశాను "నేను దాక్కున్నానా? నువ్వు తప్పుకున్నావా!"
ఏదయితేనేం రాణిసాహెబ్ దర్శనం లేదు!"
"ఇప్పుడేమిటి చేయటం!"
పెళ్ళి చేసుకుందామా?"
వేళా కోళంగా వుందా?
నీకలా అనిస్తుందేమో! నేను నిన్ను విడిచి వుండలేను. నువ్వు నాతో జీవితం పంచుకుంటే కానీ నేనుసుఖపళ్ళేను!"
ఆనందంతో నాట్యం చేయాలనీపించింది. ఇన్నాళ్ళు సంశయంతో గడిపిన నాకు అతని మాటలు ఎంతో ఊరట నిచ్చాయి. నాకు డిగ్రీ వచ్చేస్తుంది త్వరలో . ఒకవేళ అమ్మా నాన్న ఒప్పుకోక పోయినా మా బ్రతుకులు మేం బ్రతకగలం.
"మీ నాన్నగారు చౌదరిగారు కాదట కదా?"
"అవును. అయన ప్రెండ్ "!
'వాళ్ళని ఒప్పిస్తావా పెళ్ళికి!"
నేను సమాధానం యివ్వలేదు!
"మా వాళ్ళు ఒప్పుకోరు! మనం ఎటైనా వెళ్ళి పెళ్ళి చేసుకోవాలి!"
"అది నా కిష్టమే!" సంతోషంగా అన్నాను నేను అప్పట్లోనాలో ఆలోచనలు నశించాయి.
"మనం రేపు విజయవాడ వెళదాం! అక్కడ నా ప్రెండ్స్ వున్నారు. ఎలా పెళ్ళి చేసుకోవాలో ఆలోచిద్దాం!"
రేపు ఫస్ట్ బస్ కే వెళదాం!"
అతను నవ్వి వెళ్ళిపోయాడు. నాకు యిప్పటికీ ఆ సంఘటన, ఆ మాటలు అన్నీ బాగాగుర్తున్నాయి. మరుసటి రోజు వుదయం రేకలు విచ్చుకోక ముందే అతను బస్ స్టాపులో వున్నాడు. నేను మా వూరు వెళ్ళొస్తానని చెప్పి లైట్ లగేజ్ తో బయలు దేరాను. ఒక్క సర్టిఫికెట్స్ తప్ప బుక ఏవీ తీసుకోలేదు.
విజయవాడలో ఒక నేల రోజులున్నాం. వెన్నెల ఆకాశం మాదే అన్నట్టుగా తిరిగాం. ఎంత సుఖించానో అప్పుడు. న బ్రతుక్కి అదే సుఖపడిన కాలం. మళ్ళీ సుఖమంటూ ఎరుగను.
లాడ్జీలో అతనో రోజు బయటకి వెళ్ళిన సమయంలో లాన్ లో కూర్చుని చూస్తున్నాను. కళ్యాణ్ కనిపించాడు. అతనింటినించి పారిపోయి వచ్చాడు. అతనిదో చరిత్ర __ ఓ ప్రత్యెక కథ. పిలిచి మాటాడుతూ కూర్చున్నాను. అత్తా కొడుకాయే! ఆత్మీయడాయే! పుట్టింటి విషయాలు ఎన్నో రోజులుగా తెలియదాయే.
