Previous Page Next Page 
నింగిలోని సిరిమల్లి పేజి 38

    "మీకో విషయం చెప్పాలి యిక్కడ. సుధాకర్ కి ఓ అమ్మాయి యీ సరికే బలిఅయిపోయింది. అయితే ఆమె అన్యాయమై పోలేదు. ధైర్యంగా చదువుకుని వుద్యోగంచేస్తూ వర్కింగ్ వుమెన్ హాస్టల్లో వుంటున్నది. ఆమెతో పాప! వాళ్ళీద్దరికీ అన్యాయం జరగకూదంటే యీ పెళ్ళి ఆగిపోవాలి. పీతల మీది పెళ్ళి అవటం పాపమే కానీ పీకలమీది పెళ్ళి ఆపటం పాపమే పీకలమీది వురిఆపటం పుణ్యమే!"
    ఆశ్చర్యంతో కళ్ళు విశాలం చేసుకుని చూసింది అతని మాటల్లో అణుమాత్రమైనా అఆబ్ద్ధం లేదనిపించింది. ఆమె అతన్ని విశ్వసించింది. "ఏం చేద్దామంటారు?" అని అడిగింది.
    "మీరు రేపు డాక్టర్ గారింటికి రాగాలికితే ఆవిడకి యీ విషయాలన్నీ చెబుదాం. ఆ తల్లినీ పిల్లనే కళ్ళారా చూసినా ఆమె విశ్వసించింది. తన బావకి బుద్ధి చెబుతుంది. ఆ యిద్దర్నీ తప్పక ఏకం చేస్తుంది. ఆమె చదువుకున్నది. సంఘంలో బాధ్యతా యుతమైన మహొన్నతమైనా డాక్టర్ వృత్తి చేపట్టి సమాజసేవ చేస్తోంది. ఆమె ఈ అన్యాయాన్ని సహించదు. అతన్ని దారికి తేగల సమర్ధురాలు ఆమె ఒక్కతే!"
    అతను చెప్పింది నిజమేననిపించింది. "మంచి ఊహా, అలాగే చేద్దాం!" అంది.
    "థాంక్స్ ! మీరు సరిగా అర్ధం చేసుకున్నారు నన్ను" అన్నాడు కృతజ్ఞతా పూర్వకంగా.
    బదులుగా నవ్వేస్తూ "నన్నాట్టే పొగిడేయకండి!" అంది సీటుకేసి నడుస్తూ.
    ఆ రోజంతా సుధాకర్ ని పరిహరించింది. అతను సంతకం చేయవలసిన పేపరుంటే శాస్త్రీ ద్వారా పంపింది ఫైలు . పళ్ళు కొరుక్కున్నడతాను. అతన్ని గ్రీట్ చేయలేదు. ముఖం తప్పించింది. అ రోజల్లా.
    మరుసటి రోజు శనివారం వుదయమే తయారైంది సుజాత.
    "గుడికా?" అడిగింది ఉత్తర. ఆ అమ్మాయి కాన్వెంటు స్కూల్లో టీచరు. ప్రయువేతుగా ఎమ్మే చేస్తోంది. అందుకే ముందుగా వెళ్ళి మదర్ తో పాఠాలు చెప్పించుకుంటుంది. అదో తరహా మనిషి. ఎవరినీ విమర్శించదు ఆమెకి ప్రెండ్స్ లేరు. అలాగే శత్రువులూలేరు.
    "అలాటి చోటుకే!"
    "బడికా?" మళ్ళీ అడిగింది.
    "ఉహూ నీ ఊహ అంతమాత్రమేనా! ఆలోచించు చూద్దాం?" కొంటెగా అంది.
    కళ్ళద్దాల గుండా ఉత్తర కళ్ళు టపటప లాడించటం కనిపించింది. పెదాలు బిగపెట్టినా ఆమెకి స్పురించలేదు.
    "ఎక్కడికి!"
    "హాస్పిటల్ కి!"
    ఓహే! డాక్టరు దగ్గరికా? హాస్పిటల్ గుదిలాటిచోటే అయినా అక్కడ దేవుళ్ళ కంటె పూజర్లె ఎక్కువగా వున్నారు!"
    నవ్వేసింది సుజాత బస్సు ఎక్కేస్తూ. ఆమె హాస్పిటల్ ముందు దిగేసరికి గేట్లో రెడీగా నుంచుని వున్నాడు నాగరాజు
    "వెళదాం రండి! అని నేరుగా డాక్టర్ మృదులగారి గాడికి తీసికెళ్ళాడు.
    వీళ్ళని చూడగానే ఆమె పేషెంట్స్ ని అసిస్టెంట్ కి అప్పగించేసి "రండి!" అంది తన పర్సనల్ రూంకి దారితీస్తూ. ఇద్దరూ అనుసరించారు. గదిలోకి వెళ్ళగానే కప్పులోకి కాఫీ వంచి యిచ్చింది. ముగ్గురూ తాగేశారు.
    "చెప్పండి!" అంది నవ్వుతూ.
    "ఇక్కడి కెవరూ రారా?"
    "ఊహూం ఇది నా పర్సనల్ రూం! రిలాక్స్ అయ్యేందుకు మాకు ఎలాట్ చేస్తారు..  తలుపేస్తే యింటర్ కంలో అత్యవసరమైన కేసు వస్తే తప్ప ఎవరూ డిస్టర్బ్ చేయరు. మీకేం అనుమానం అక్కర్లేదు చెప్పండి!" అంది నవ్వుతూ.
    నాగరాజు తలుపులు వేసి వచ్చాడు.
    "డాక్టర్ మీరు సుధాకర్ పెళ్ళి చేసుకోబోతున్నారా?" సూటిగా ప్రశ్నించింది సుజాత. అ ప్రశ్నకి తెల్లబోయిందామె. వీళ్ళేదో పర్సేనల్ ప్రాబ్లం కోసం వచ్చారనుకుందే తప్ప తన పర్సనల్ విషయంగా వచ్చారనుకోలేదు.
    "అవును! ఏం?" అ కంఠంలో కొద్దిగా చికాకు, కోపం ద్వనించాయి.
    "మమ్మల్ని అపార్దం చేసుకోనంటే ఓ విషయం చెబుతాం!" అన్నాడు నాగరాజు.
    "అలాగే చెప్పండి! ఏమిటది?"
    "సుధాకర్ యీవరకే ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమెతో తిరిగాడు. ఆమెను అనుమానించి విడిచేశాడు!"
    "అవును, నాతో చెప్పాడు!"
    "మీతో చెప్పాడా?" డాక్టర్ మృదుల నింపాదిగా యిచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూ ప్రశ్నించింది సుజాత.
    "అవును ! మిమ్మల్నే ప్రేమించాడత కదా! అహం మీరు ప్రేమించారట కదా! అయినా మీరు అతన్ని విశ్వసించి నిజం చెప్పలేదట! మీపై అనుమానం రుజువు కావటంతో మీ నుంచి తప్పుకున్నాడట కదా!" నిశ్చలమైన గొంతుతో ఎ మాత్రం వుద్వేగం లేకుండా అడిగింది.
    ఫక్కున నవ్వింది సుజాత.
    "నవ్వుతారేం
    "అవును. అతన్ని నేను అభిమానించి, ఆరాధించి అతన్ని పెళ్ళిచేసుకోవాలనిఆశించింది నిజమే! అతనూ అందుకనుకూలంగానే ప్రవర్తించేడు. కానీ ఎప్పుడైతే నా శీలాన్ని శంకించి, నా మాటల్ని విశ్వసించలేదో అప్పుడే అతనేంత అల్పుడో గ్రహించుకుని నా మనస్సుని నిర్దాక్షిణ్యంగా చంపెసుకున్నాను. కనీ తర్వాత అతనెంత నీచుడో, నికృష్టుడో, తెలిసివచ్చింది!"
    "ఎలా తెలిసింది?" సుజాత అంత నిర్భయంగా చెప్పేసరికి ఆమె గొంతు వణికింది అడగటానికి.
    అతను కాలేజీలో చదివే రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించాడు. రెండు సంవత్సరాలు కలసి మెలసి తిరిగేడు. ఓ రోజు ఆమె తన ఆత్మ బంధువుతో మాటడుతూ వుంటే అనుమానించాడు. నిజం చెప్పిన నమ్మలేదు. ఆమె శీలాన్నే శంకించి ద్రుష్పచారం చేశాడు. ఆ అమ్మాయి అవమానాన్ని భరించలేక ఎటో పారిపోయింది. ఆమె తలిదండ్రులకి ముఖం చూపించలేకపోయింది!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS