Previous Page Next Page 
నింగిలోని సిరిమల్లి పేజి 37

    ఓ రోజు మధ్యాహ్నం జనికమ్మగారు యింట్లో ఒక్కటే వ్బున్న సమయంలో కవిత వచ్చింది. ప్రతిరిజులాగే ఆమె అందర్నీ ఆఫీసుకి పంపేసి మల్లేశ్వరిని ప్రక్కలో పడుకోబెట్టుకుని వారపత్రికలో సీరియల్ గా వచ్చిన ఓ నవలని పుస్తక రూపంలో చదువుతోంది. ఆమె ప్రక్కనే రేడియోలో సంగేతం మెల్లిగా వినిపిస్తోంది.
    కౌంపౌండ్ అంతా నిశ్సబ్దంగా వుంది. ఆఖరింటిలో లత ననమ్మగారు లోపలగదిలో లక్షవత్తులు చేసుకుంటూ పాడుకుంటున్న గోవిందనామాలు అప్పుడప్పుడూ వినిపిస్తున్నాయి. ఆ చివరింటిలో లెక్చరర్ సునంద అత్తగారు వింటున్న టఫ్ రికార్డర్ లోని పాటలు లీలగా వినిపిస్తున్నాయి.
    ఎండలో వెచ్చదనంలేదు. అలాగని చల్లదనమూ లేదు. గాలి వుండు౦డి వీస్తోంది.
    చదువుతోన్న నవలని ప్రక్కన పేట్టి తల తిప్పిన జానికమ్మగారుకి ఎవరో యిరవయ్యేళ్ళు దాటిన యువతి తలనిండా పైటకొంగు కప్పుకుని కూర్చుని కనిపించింది.
    దిగ్గున లేచి కూర్చుంది ఆమె. "ఎవరమ్మా నువ్వు" అంది ఆశ్చర్యంగా ఆ యువతి తలెత్తి చూసింది కన్నీటి పొరల గుండా ఆమెని చప్పున పోల్చుకుందామే "కవితా!" అంది. ఆ పిలుపులో అనందం, సంభ్రమం ఒడ్డు లోరుసుకుని ప్రవహించేయి.
    "అమ్మా!"
    ఆ రెండక్షరాలలోనూ ఇన్నేళ్ళు వియోగమూ, ఇన్నేళ్ళ బాధ, దుఃఖం అన్నీ తొంగిచూశాయి. గుండె లోతుల్లోకి భక్తీభావనతో పరమేశ్వరుడి గురించి పిలిచినా పిలుపులా ద్వనించింది.
    చప్పున కుఉతుర్ని కౌగిల్లోకి తీసుకుందామె. ఎన్నేళ్ళ వియోగమయినా తల్లీ కూతుళ్ళని క్షణికంలో కలిపెసింది.
    "లోపలి వెళదాం పదమ్మా!"
    "అమ్మా! నువ్వు నీ కూతుర్ని చూసుకున్నావు. అంతే చాలా?" అంది కవిత. ఆ మాటల్లో ఏదో ద్వనించింది. కానీ జనికమ్మగారికి అది స్పష్టం కాలేదు.
    "ఏమిటమ్మా! ఇన్నేళ్ళూ ఎక్కడున్నావ్, ఎలా గడిపేవ్ ? ఏం చేస్తున్నావ్? ఎవరెవరున్నారు పదమ్మా చాలా చాలా తెలుసుకోవాలి. మొన్న మీ బావ కళ్యాన్ వచ్చి అన్నప్పుడే నాలో ఆశ మొలకెత్తింది. మళ్ళీ ఈ జన్మలో నిన్ను చూస్తాననుకోలేదు. న తల్లీ! ఎన్ని బాధలు పడ్డావ్! ఎన్ని నిందలు మోశావ్! మాటతోడు, మనిషి సాయం లేకుండా ఎలా నెగ్గుకొచ్చావమ్మా!" కన్నీళ్ళతో అడిగింది.
    కవిత సమాధానం యివ్వలేదు. దీక్షగా చాపపై మెత్తని పొత్తిళ్ళలో నిదురపోతున్న పాపకేసి చూస్తోంది. ఆమె చెక్కిళ్ళపై సంతతధారగా వర్షిస్తున్నాయ్ కన్నీళ్ళు. తన జీవిత సర్వస్వప్నలమన్నట్టుగా చూస్తోంది. అ పాప వైపు.
    "ఏమిటమ్మా? అలా చూస్తున్నావ్?"
    తల్లి ప్రశ్నకి జావాబువ్వకుండా చప్పున ఆ పసిపాపని ఎత్తుకుంది. ఎన్నో నెలలు వియోగం తర్వాత, తిరునాళ్ళలో తప్పిపోయిన కూతురు దొరికిన తల్లిలా గుండెకు హత్తుకుంది.
    పాప కేవ్వుమంది. కళ్ళు తెరచి కవిత వైపు చూసింది. ఏడ్పు మానేసి ఆమె ముఖంల్లోకి చూసి కేరింతలు కొడుతూ చేతులు చాచింది. పిడికిళ్ళువిప్పి పిలిచినట్టుగా చెక్కిళ్ళు తాకింది.
    జానికమ్మగారు తెల్లబోయి చూస్తున్నారు.
    కవిత ఎద బరువుని మోయలేకపోయింది. పాపని పైట చాటుకి తీసుకుంది.
    ఆ పాప ఎవరో విడమరచి చెప్పనక్కలేకపోయింది జానికమ్మగారికి, "భగవంతుడా ! శ్రీనివాసా! ఎంత దయామయులు మీరు!" అనుకుని మనసారా మేక్కుకుంది.
    కవిత చెక్కిళ్ళపై కన్నీరు ప్రవహిస్తోనే వుంది.
                                                                         16
    పార్టీ జరిగిన మరుసటి రోజు బాగా తలంటి పోసుకుని, చక్కగా గుగ్గిలం పొగతో అరబెట్టుకుంది. వెన్న రాసుకుని పోసుకుందేమో ఆరిన తలకట్టు చమరీమరుగ వాలం లాగా వుంది. పిరుదులు దాకే జడపొడుగు తలకట్టు వీపునిమ్డా పరుచుకుని వుంది.   
    భుజాల చివర క్లిఫ్ పెట్టేసింది. జడ అల్లుకోకుమ్డా, తలకట్టు కుచ్చుగా కుదురుగా వింజామరలాగా వుంది.
    "నిన్న మీరు రాలేదు పార్టీకి!"
    "అవునండీ ! ఒంట్లో బాగాలేక రాలేదు!" క్లుప్తంగా అంది.
    "ఇప్పుడెలా వున్నారు?"
    "చూస్తున్నారుగా!"
    "చెప్పమంటారా?"
    "అడిగి చెబుతారా ఎవరయినా?"
    "షికారుకి భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవిలా వున్నారు!" ఆరాధనా భావం గొంతులో పరవళ్ళుతొక్కి ఆ మాటల రూపంలో వచ్చింది.
    సుజాత పెదాల చివర్లు కదిలేయి. "థాంక్స్ నాగరాజు గారూ!" అంది తన సెక్షను వేపు నడవబోతూ వుంటే పిలిచాడు మళ్ళీ.
    "మీరు వినవలసిన న్యూస్ వుంది. మృదుల శ్రీమతి మృదులా సుధాకర్ కాబోతుంది. ఓ వారం రోజుల్లో తాంబులాలు పుచ్చుకుంటరేమో!"
    "నేను ఎప్పుడో అనుకున్నారు!" నిర్లిప్తంగా అంది. ఆ న్యూస్ ఆమె కేమీ వింతగా అనిపించలేదు.
    "సుజాతగారూ! ఓ నిండు జీవితం శాశ్వతంగా అన్యాయం కాకుండా చూడాలంటే ఈ పెళ్ళి జరక్కూడదు."
    "అదేం?" అంది వింతగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS