"చెప్పండి! అ పాప ఎవరు? ఆమె తల్లి ఎక్కడ? ఆమె మీకేమవుతుంది? అలా ఎందుకు వదిలేసి వెళ్ళారు?
"నేనంటూ బ్రతికి వుంటే తప్పక ఏదో ఒకనాడు వచ్చి పాపని తీసుకేళతానన్నారే? ఏమిటి మీ విశ్వాసం? ఎ ధైర్యంతో అలా అన్నారు? నేనెవరో ఎలా తెలుసుకోగలుగుదురు? ఎక్కడని వెదికే వాళ్ళు! మీరు యిప్పుడే కనిపించారు.
"పాపం! నేనీ యింట్లో వుంటానని మీకు తెలసివుండదు! అందుకే ధైర్యంగా యీ కౌంపౌండ్ లోకి ఆడుగేట్టారు! లేకపోతె కోపందీసి నేనిక్కడ వుమ్తున్నానని నా చహారా తెలుసుకునే అప్పుడు పాపని వదిలేసి వెళ్ళారా! చెప్పండి!"
గబగబా ఆవేశంగా ఆశుకవిత్వంలా మాటాడి౦ది.
"సుజాతగారూ! నన్ను క్షమించండి! మిమ్మల్ని చాలా క్షోభ పెట్టాను. అవమానం అనుమానాలకి గురయ్యేట్టు చేశాను. అది నా తప్పే! అ పాప ఎవరో __ ఆ పాపా తల్లిదండ్రులెవరో మీకు త్వరలో చెబుతాను!"
"కోపందీసి పాపని తీసికెళ్ళాలనుకుంటున్నారెమో! ఆ పిల్ల తల్లి స్వయంగా వస్తే తప్ప అప్పగించే ప్రసక్తిలేదు. అసలు యిఇపుడే పాపని వదిలి వుండలేని స్థితికి వచ్చాను నేను!" అంది నవ్వుతూ.
"మీరు నిజంగా అమృత మూర్తులు!"
"అగండాగండి" నన్ను పొగడకండి! నేను మరీ అంత మంచిదాన్ని కాదు.
ఆ విశేషణ మీ మాత్రు మూర్తులందరికీ చెల్లుతుంది సుజాతగారూ! మీరు అంతగా ఆ పిల్ల తల్లిని చూడాలనికుంటే రేపు ఆదివారం సాయంకాలం అయిదింటికి ప్రకాశం పార్కుకి రండి! చూపిస్తాను, మాటాడిస్తాను"
సుజాత కళ్ళు మిలమిల మేరిసేయి కనురెప్పలు తపటపా కొట్టుకున్నయ్. "నిజమా!": అంది.
"ఆ నింగిలోని సిరిమల్లి అంత నిజం!"
"థాంక్స్! తప్పక వస్తాను!"
"అయితేపాపను మటుకు తేకండి. ఈ మధ్యలో నేను కనిపించినా గుర్తుంచినట్లు చూడకండి! వస్తాను!" గబగబా అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు. "మిస్టరీ!" అనుకుంటూ వెనుదిరిగింది సుజాత! ఆమె మనస్సు యిప్పుడు ప్రశాంతంగా నిండుగా వుంది.
* * * *
సుధాకర్ ట్రెయినింగ్ పూర్తీచేసుకుని వచ్చాడు. ఆఫీసరుగారు టీపార్టీ ఆరెంజ్ చేశారు. అ రోజు వుదయం నుంచీ అతని ఒక్కసారయినా ఆమె వైపు చూళ్ళేదు. మామూలుగా, ఒక సెక్షన్ ఆఫీసరు తన క్రింది వుధ్యఒగినిఉ పలుకరించేటంత మాత్రమయినా పలుకరించలేదు. ముభావంగా, గంభేరంగా మెలిగాడు దర్పంగా ప్రవర్తించాడు.
సుజాతకి మంది పోయింది "ఏమటీతని గొప్ప!" అనుకుంది. "తనని చాలా తక్కువగా అంచనా వేశాడు. రేపో మాపో అసలు వ్యక్తి ఆ పాప తల్లి వచ్చి తన బిడ్డని తని తీసి కెళ్ళిన రోజున వీళ్ళంతా తన ముఖం ఎలా చూడగలరు సిగ్గుతో వాళ్ళతలలు నెలకి వాలిపోవూ?" అనుకుంది.
గర్వానికి ముందు ఉదాసీనత. సుజాత అదే చేయాలనుకుంది. టీపార్టీ ఎరేంజ్ చేస్తున్నట్టుగా సర్కులర్ రాకముందే రామలింగయ్యగారి వద్దకి వెళ్ళింది.
"నాకు ఇంట్లో బావుండలెదండీ! ఓ అరగంట ముందుగా వెళ్ళిపోతున్నాను. నా సీట్లో యీ పూటకి అర్జంట్ ఫైల్స్ ఏమీలేవు!" అంది.
"అలాగే వెళ్ళిరామ్మా! నీలాగా సిన్సియర్ గా పనిచేసే వాళ్ళు ఓ గంట ముందు వెళ్ళినా కొంప ముంచుకపోదు!" అన్నాడాయన.
"బ్రతికించారు!" అనుకుని కృతఙ్ఞతలు చెప్పి వెళ్ళిపోయింది. ఆఫీసు గెట్ దాటుతొండగా డాక్టర్ మృదుల ఎదురు పడింది.
"గుడీవీనింగ్" అంది నవ్వుతూ.
"గుడీవినింగ్ డాక్టర్!" అంది చిరునవ్వుతో.
"బావున్నారా!"
"ఫైన్! మీ జాబ్ ఎలా వుంది.
"మాజాబ్ కేమిటి? వార్డు నిండా పేషెంట్లు, వాళ్ళనిండా రోగాలు, రోజూ పుట్టే పుటుకలకి, చచ్చే చావులకి మేం సాక్షులం అంతే"
ఆ మాటలకి నవ్వేసింది సుజాత "వస్తాను!" అంది.
"ఓ.కే! ఎప్పుడైనా మా యింటికి రారాదూ! విశ్వనాద నగర్ లో వుంటున్నాను. నా పేరడిగితే రిక్షా అయినా తీసుకోస్తారు!"
"చెప్పారుగా అయన! మీవద్దకి వచ్చేరోజు యింకా రాలేదు లేండి?" నవ్వుతూ అంది.
ఫక్కున నవ్విందామె." అది హాస్పిటల్ లో, మా యింటికి రమ్మంటున్నాను నేను!"
"వస్తాలెండి! భై!" అంది కదులుతూ. ఆలస్యమైపొతే ఎక్కడ పట్టేస్తారోనని గాబరాగా వుంది లోలోపల. అతని దార్పాన్ని అణచాలంటేఇదే మార్గం.
"ఒకే! చెయ్యూపుతూ మేట్లేక్కింది మృదుల.
పార్టీలో డాక్టర్ మృదుల తో అతని పెళ్ళి త్వరలో నిశ్చయం కాబోతున్నట్టు ప్రకటించాడు ఆఫీసరుగారు అంతా చప్పట్లు చరిచారు. నాగారాజుకి ఆశ్చర్యం వేసింది. అతనిపై అసహ్యం కలిగింది. ఎంత ఘటికుడు అనుకున్నా పైకి మాత్రం అందరిలాగే అభినందించేడు, సుధాకర్ అందరికీ కృతఙ్ఞతలు చెప్పేడు.
పార్టీలో సుజాత లేని లోటు గుర్తించింది ముగ్గురే! సుధాకర్! ఆఫీసర్! నాగరాజు. ఆఫీసరుగారురామలింగయ్యని అడిగారు. ఆమె ఎక్కడంటూ! వంట్లో బావుండలేదని పర్మిషన్ తీసికెళ్ళి పోయిందన్నారు అయన పార్టీ విషయం తెలియదా అని అడిగితె తెలియదు అని రెండు రకాలుగా బావబిచ్చారు రామలింగయ్యగారు, ఆఫీసరుగారు రెట్టించలేదు.
నాగారాజుకి సుజాత అంతర్యం అర్ధమైంపోయింది. ఆమె దృఢ చిత్తానికి వ్యక్తిత్వంపై దెబ్బతీయగల నేర్పుకి సంతోషించాడు. మనసులోనే అభినందనలు చెప్పుకున్నాడు.
సుధాకర్ లోలోపల మంటగా వుంది. తనని, తన హొదాని కాదని తన పార్టీని నిర్లక్ష్యం చేస్తూ వెళ్ళిపోయినా ఆమెని క్షమించ లేకపోయాడు. దెబ్బతీయాలని నిర్ణయించుకున్నాడు.
* * * *
